6, డిసెంబర్ 2024, శుక్రవారం

వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి.

 

 వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి. 

నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు.  కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా  లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం. 

కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు. 

అదే విధంగా అనేక షాపులు కిరాణా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 

ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు , కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంతే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. 

పూజా సామానులు. 

అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉదుబత్తులు , ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతల పేర్లు  కాకుండా దేవుళ్ళ బొమ్మలు  ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్న అట్ట డబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు నచ్చిన  వస్తువో  జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు. 

మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడటం లో మీ వంతు  కృషి  చేయగలరు.

తిరుమల దర్శనంపై ఆర్టీసీ ప్రకటన:

తిరుమల దర్శనంపై ఆర్టీసీ ప్రకటన:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఎక్స్‌ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు.


  ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.

  తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.

  కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.   APSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది.   ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.   బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


 *చివరి అభ్యర్థన:*

  మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻🙏🏻💐☺️☺️

S.ఫణికుమార్- నందిగామ

అష్ట భైరవ హోమం*

 *కాశికాపురాధినాథ కాలభైరవం భజే* 


 *అష్ట భైరవ హోమం* 

డిసెంబర్ 09 మరియు 23వ తేది అష్టమి సందర్భంగా...


కాలుడు అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమ గల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం.


అష్టమి నాడు ఎనిమిది భైరవ రూపాలను ప్రసన్నం చేసుకోవడం వల్ల మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి, రుణ భారం నుండి ఉపశమనం పొందడానికి, బహువిధి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు శ్రేయస్సు సాధించడానికి దేవతల అరుదైన ఆశీర్వాదాలు పుష్కలంగా లభిస్తాయి. 


 *హోమం మీ జీవితంలోని వివిధ అంశాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది...* 


🔥 చెడు కర్మలను, పాపాలను తొలగిస్తుంది. 

🔥 శాపాలు, బద్ధకం మరియు ఉత్పాదకతను తొలగిస్తుంది.

🔥 అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

🔥 మీ శత్రువులను మరియు మీ చుట్టూ ఉన్న అన్ని ప్రతికూలతను నాశనం చేస్తుంది.

🔥 మంచి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది, మీరు విజయం సాధించడంలో సహాయపడుతుంది.


పవిత్రమైన వారణాసిలోని ఒక యాగశాలలో తైలాభిషేకంతో పాటు పవిత్రమైన సిద్ధ స్వర్ణ ఆకర్షణ భైరవ హోమాన్ని వేద పండితులచే డిసెంబర్ 09వ తేది సోమవారం నాడు నిర్వహించబడును, మరియు ప్రధాన కాలభైరవ మందిరంలో నీలకంఠ పుష్పసమర్పణ సేవ జరుగును.


 *భక్తులు పరోక్ష సేవల్లో భాగంగా కాల భైరవ హోమంలో పాల్గొనండి.* 


పరోక్ష సేవలు జరిపించుకొనదలచిన వారు క్రింది లింక్ పై క్లిక్ చేసి రుసుము చెల్లించండి లేదా పైన పంపినటువంటి QR కోడ్ స్కాన్ చేసి 1,116/- రూపాయలు చెలించి సేవలు బుక్ చేసుకొనవచు. 


https://pay.upilink.in/pay/9700722711@ybl?am=1116


ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి.


పరోక్ష సేవకై ఫోన్ పే, గూగుల్ పే, పే.టి.ఎమ్ ద్వారా చెల్లించినటువంటి రుసుము స్క్రీన్ షాట్ తీసి, సేవ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం, పూర్తి చిరునామా మరియు మీ సంకల్పం వివరంగా రాసి డైలీ విష్ వాట్సాప్ నెంబర్ 9700722711కు పంపవలసిందిగా కోరుచున్నాము.


హోమం నిర్వహించదల్చిన వారు ఈ కింది లింక్ ద్వారా వివరాలను నమోదు చేసుకోండి...


https://form.jotform.com/243391154407454


📌 *గమనిక :*  _శ్రీ కాలభైరవ హోమం_

1) డిసెంబర్ 09వ తేది సోమవారం శుక్లపక్ష అష్టమి నాడు

మరియు

2) డిసెంబర్ 23వ తేది సోమవారం కృష్ణపక్ష అష్టమి నాడు... నిర్వహించనున్నారు భక్తులు తమకు ఏ తేదీలో నిర్వహించుకోదల్చుకున్నారు నిర్ణయించుకొని వివరాలను నమోదు చేయండి.


*సనాతన సంస్కృతి సేవా సమితి*

వారణాసి ఉత్తర ప్రదేశ్

అజీర్ణవ్యాధి నివారణ

 అజీర్ణవ్యాధి నివారణా యోగాలు  -


 *  వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.


 *  ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.


 *  సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.


 *  శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.


 *  ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.


 *  చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.


        అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పోగొట్టే  ఔషధాలను మొదలుపెట్టవలెను.


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

శుక్రవారం*🌹 🪷 *06, డిసెంబర్, 2024.*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌹 *శుక్రవారం*🌹

🪷 *06, డిసెంబర్, 2024.*🪷

       *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*


*తిథి : పంచమి* మ 12.07 వరకు ఉపరి *షష్ఠి*

*వారం   : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం : శ్రవణం* సా 05.18 వరకు ఉపరి *ధనిష్ట*


*యోగం  : ధృవ* ఉ 10.43 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం : బాలువ* మ 12.07 *కౌలువ* రా 11.39 ఉపరి *తైతుల* 


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 06.00 - 08.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 06.58 - 08.33*

అభిజిత్ కాలం  : *ప 11.36 - 12.21*


*వర్జ్యం : రా 09.13 - 10.48*

*దుర్ముహూర్తం : ఉ 08.37 - 09.22 మ 12.21 - 01.06*

*రాహు కాలం : ఉ 10.35 - 11.59*

గుళికకాళం : *ఉ 07.47 - 09.11*

యమగండం : *మ 02.46 - 04.10*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.23* 

సూర్యాస్తమయం :*సా 05.34*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం    :  *ఉ 06.23 - 08.37*

సంగవ కాలం    :    *08.37 - 10.51*

మధ్యాహ్న కాలం  :*10.51 - 01.06*

అపరాహ్న కాలం : *మ 01.06 - 03.20*


*ఆబ్ధికం తిధి   : మార్గశిర శుద్ధ షష్ఠి*

సాయంకాలం  :  *సా 03.20 - 05.34*

ప్రదోష కాలం   :  *సా 05.34 - 08.08*

రాత్రి కాలం : *రా 08.08 - 11.33*

నిశీధి కాలం       :*రా 11.33 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.41 - 05.32*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷              

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷


*న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /*

*దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ //*

                 

🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🍃🌿🪷🪷🌿🍃🌹

పాదాభివందనం

 ** *పాదాభివందనం ఎందుకు చేయాలి....!!*


🌹🙏పాదాభివందనం వలన…

          ప్రయోజనం ఏమిటి🌹🙏


🌸🌿🌸🌿🌸 


🌿శుభ కార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.


🌸కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. 


🌷అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!🌷


🌿భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. 


🌸అయితే కొందరు, 

అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.


🌿పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.


🌸పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి. 

అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.


🌿సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయి!


🌸పెద్దవారి పాదాలను తాకడానికి 

మన నడుము వంచి,  

మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.  


🌿అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి. 

అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. 


🌸ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. 

ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతాయి.


🌿ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.


🌸పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 


🌿"మేము కూడా మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి", 

అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా, 

చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.


🌸మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,

ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి

పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.


🌿అలాగే  ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,

వారికి పాదాభివందనం  చేసి,

పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.


🌹🙌 సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి! 🙌🌹


🌸పెళ్లయిన జంటని :

అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.


🌿పెళ్లి అయిన ఆడవారిని :

దీర్ఘసుమంగళీభవ


🌸చిన్న పిల్లల్ని :

🙌చిరంజీవ - చిరంజీవ


🌿చదువుకుంటున్నవారిని :

🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.


🌸పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :

🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.


🌿పెళ్లికావసలసిన వాళ్ళని :

🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.


🌸ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :

🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.


🌿ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు 

ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే 


🌸🙌"మనోవాంఛా ఫలసిద్దిరస్తు"🙌


🌿(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)

ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!


🌸(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)

మన సంస్కృతిని మర్చిపోకూడదు.. *ఇలాంటి మరిన్ని దైవీక విషయాలు  తెలుసుకోవాలంటే ఆథ్యాత్మిక కుటుంబం గ్రూప్ లో జాయిన్ అవండి.* link 👇https://chat.whatsapp.com/H0zyZWXVQLr6ol6cJ25uR0    ;

5, డిసెంబర్ 2024, గురువారం

తేయాకు గురించి

 తేయాకు గురించి సంపూర్ణ వివరణ - లాభనష్టాలు .


    తేయాకులో రెండు జాతులు కలవు. ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది. దీనిని ఆంగ్లము నందు  Viridis అంటారు. రెండొవది నలుపురంగులో ఉండును. దీనిని Bohea అని పిలుస్తారు . నల్లని తేయాకు చైనా , జపాన్ దేశముల పంట .ఈ మధ్యకాలంలో జావా దీవి యందు బ్రెజిల్ దేశము నందు కూడా ఈ రకము సాగుచేస్తున్నారు.


              200 సంవత్సరాల వరకు కూడా తేయాకు గురించి యూరపు ఖండములో తెలీదు .1664 వ సంవత్సరములో ఈస్టిండియా కంపెనీ వారు తేయాకును యూరపు ఖండంనకు పరిచయం చేసి దిగుమతి చేసినారు. మొట్టమొదట బ్రిటిష్ రాజుగారికి బహుమానంగా రెండు పౌనుల రెండు ఔన్సుల తేయాకును తెచ్చి ఇచ్చారు.  ఫ్రెంచ్ దేశములో తేయాకు వాడకం తక్కువ కాని కాఫీ , పొగాకు , వైన్ వాడకం ఎక్కువ. నిద్రమత్తు వదలడానికి , శరీరంలో నూతన ఉత్తేజం నింపడానికి తేయాకు పానీయం వాడుతారు. తేయాకు పానియం లో ఎటువంటి పోషకవిలువలు లేవు కాకుంటే దంతబాధతో ఉన్నప్పుడు తేనీరు పాలు కలపకుండా తీసుకోవడం వలన దంత బాధ నుంచి కొంతమేర ఉపశమనం కలుగును.


             తేనీరు వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువ కలవు. అలసట , బలహీనత, రక్తహీనత కలిగిన రోగులు తేనీరు సేవించినచో ఎక్కువ నష్టం జరుగును. తేనీరు ఉదయాన్నే ముఖప్రక్షాళన పిదప సేవించినచొ కొంతకాలం పిదప ఉదరము నందు వాయువును పుట్టించును మరియు మంట కలిగించును. సర్వరోగములకు మూలకారణం అగును. ఆకలిని చంపును.  నల్లని తేయాకు మరియు కాఫీ ఇంకా ఎక్కువ దుష్పరిణామాలు కలుగచేయును.  నాడి ఎక్కువ కొట్టుకొనును. గుండెవేగం పెరుగును . మూత్రపిండాలపైన ప్రభావం ఎక్కువ చూపడం వలన మూత్రము ఎక్కువ వచ్చును. ఎక్కువ కాలం తేనీరు అధిక మోతాదులో సేవించిన చర్మం శీఘ్రముగా పాలిపోవును. శరీరం నందు అమితమైన వేడిని పెంచును. కన్నులు లోతుకు పోవును . నాడి బలహీనం అగును.


           శరీరం నందు ఏదైనా వ్యాధి వృద్ది చెందే సమయంలో తేనీరు అధికంగా సేవించుచున్న కాళ్లు , చేతులు చల్లబడి చెమట పుట్టును . జీర్ణాశయం పైన అత్యధిక ప్రభావం చూపును. కొన్ని ప్రాంతాలలో ఈ తేయాకును కూడా కల్తి చేయుచున్నారు. నల్లని ముతక తేయాకును ఇనప పెనం పైన కొంచం వేడి చేసి ఆకుపచ్చని రంగుకు మార్చి దానికి నీలిమందు , తెల్లసీసం మిశ్రమమును చేర్చి తద్వారా రేగుపండు రంగు వలే నవనవలాడే కోమలమైన ఆకుపచ్చని తేయాకు వలే ఉంగరములుగా చుట్టుకొని ఉండునట్లు సిద్ధము చేయుచున్నారు ఇది అత్యంత ప్రమాదకరం . ఈ విధానములో ఎక్కువుగా కల్తి చైనాలోని కాంటస్ అనే ప్రదేశములో ఎక్కువుగా తయారుచేయుచున్నారు.


                  తేయాకు దంతములకు కానరాని హాని చేయును . అకాల దంతక్షయం కలుగచేయును . తేనీరు తీక్షణ తత్వం ఎక్కువ. వేడిగా ఉండగా తేనీరు సేవించుతాం అందువలన చిగుళ్లకు కూడా తీవ్రమైన నష్టం కలుగును. చిగుళ్లకు రోగం పుట్టించి దంతముల లోపల పుచ్చు వ్యాధిని కలుగచేయును . ఒక సన్నటిపొర నోటిలోపల ఉండును. అదే పొర పొట్టవరకు వ్యాపించి ఉండును. పొట్టలోపల కూడా అదే పొర ఉండును. పొట్టకు కీడుచేయు పదార్దాలు అన్నియు దంతములకు కీడు చేయును . వేడివేడి పానీయాలు మరియు అతి చల్లటి పదార్దాలు పొట్ట మరియు దంతములు రెండింటికి కీడు చేయును . తేనీటిని ప్రతినిత్యం సేవించువారి సంతానం వంశపారంపర్యంగా "గండమాల" అను వ్యాధి సంప్రాప్తిచ్చును . స్త్రీ అధికంగా తేనీరు సేవించుట వలన నాడీదౌర్భల్యం సంభవించును. ముఖ్యంగా గర్భనాడులను దుర్భలపరుచును. దీనివలన ఆ స్త్రీకి కలుగు సంతానముకు వంశపారంపర్య వ్యాధులు సంక్రమించును. ముఖ్యంగా క్షయ , గండమాల వంటి వ్యాధులు  సంభంవించును. 


          పైన చెప్పిన విధముగా టీ మరియు కాఫీలను పూర్తిగా నిషేధించి ఆరోగ్యాన్ని కాపాడుకొనగలరు. 


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


              ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

దత్త ప్రసాదం - పద్దెనిమిదివ భాగము

 ఓం శ్రీ గురుభ్యోనమః


శ్రీ దత్త ప్రసాదం - పద్దెనిమిదివ భాగము


మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కృపాకటాక్ష సాక్షాలను, శ్రీ దత్త ప్రసాదం పేరిట ధారావాహిక రూపములో ప్రతి గురువారము ఆడియో రూపంలో యూట్యూబ్లో అలానే, ఇతర సామాజిక మాధ్యమాల(spotify, amazon music) ద్వారా అందజేసే ప్రయత్నం ఇది. మా ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యులు అవుతారని ఆశిస్తూ.....



సర్వం,

శ్రీ దత్త కృప.


Youtube : 


https://youtu.be/nAh9BWqnvX8


Spotify : 


https://open.spotify.com/show/180mOvorIe6I4wBVECQEzj


Amazon Music : 


https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_BPSZHjKoqpUd0aAE2Gob29jXV


దయచేసి like చెయ్యండి, share చెయ్యండి మరియు subscribe చేసుకొన ప్రార్ధన.


గమనిక : ఈసరికే subscribe చేసుకున్న వారు, దయచేసి *notification లను activate చేయ ప్రార్ధన.


సర్వం శ్రీ దత్త కృప 🙏


పవని శ్రీ విష్ణు కౌశిక్

(@sridattaprasaram)


మందిర వివరముల కొరకు సంప్రదించవలసిన వారి వివరాలు: 


శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్, 

వ్యవస్థాపక ధర్మకర్త, 

శ్రీ దత్తత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల

సెల్ no:9908973699

ధన్యోస్మి 🙏


-----


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము, పూజా పటాలు మరియు ఇతర శ్రీ దత్త ప్రసాదముల కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు :🙏




--

గమ్మత్తును

 *ఇప్పటి వరకు గణితంలో చూసిన గమ్మత్తును తెలుగు భాషలో చూడండి.* 


మూడింటిని #నిలువుగాను, #అడ్డంగాను చదివి చూడండి. ఎటు చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!


స మ త

మ జ్జి గ

త గ ము


కం చ ము

చ క్కె ర

ము ర ళి


క్షీ ర ము

ర వ్వ లు

ము లు కు


కా ను పు

ను వ్వు లు

పు లు లు


కా ర ము

ర గ డ

ము డ త


స మ త

మ ర ల

త ల పు


త మ కం

మ ర్యా ద

కం ద కం


పొ ల ము

ల లి త

ము త క


ధ న ము

న వ్య త

ము త క


వ ర స

ర వి క

స క లం


హి మ జ

మ న ము

జ ము న


క వి త

వి న ల

త ల క


కో వె ల

వె న్నె ల

ల ల న


మ న సు

న య నం

సు నం ద


ది న ము

న గ రి

ము రి కి


టో క రా

క వ్వ ము

రా ము డు


చ దు వు

దు ర ద

వు ద కం


ప్ర వే శం

వే ది క

శం క రం 

*అందమైన మన మాతృభాషను ఆస్వాదిద్దాం.*🙏


ఇది ఓక కారణమే కదా!

దేశ భాష లందు తెలుగే లెస్స  అని అన్నారు 

సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు 🕉️☪️✝️🙏🌹❤️🙌😁👌

#HOFE KSR 

జయహో తెలుగు 

జై అమరావతి 🕉️🌴🌵

పంచాక్షరీ రహస్యం*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

        *పంచాక్షరీ రహస్యం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పంచాక్షరి మంత్రాలు:~*


*స్థూలపంచాక్షరి (నమశ్శివాయ),*

*సూక్ష్మ పంచాక్షరి (శివాయ నమః),*

*కారణ పంచాక్షరి (శివాయ శివ),*

*మహాకారణ పంచాక్షరి (శివాయ),*

మహామను లేదా ముక్తి పంచాక్షరి (శి).*


*నమః అంటే నమస్కారము.*


*శివాయ నమః అంటే శివభగవానునకు నమస్కారములు..*


*దేహదృష్టితో చూసినప్పుడు జీవుడు శివుడికి సేవకుడు..*


*'నమః' జీవాత్మను సూచిస్తుంది.*

*'శివ' అనేది పరమాత్మను సూచిస్తుంది.*

*'ఆయ' అనేది ఐక్యాన్ని లేదా జీవాత్మ, పరమాత్మల ఉనికిని సూచిస్తుంది.*


*అందుకే శివాయ నమః అనేది..

జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచించే 'తత్త్వమసి' లాంటి మహావాక్యం.*


*ఓం...*


*ప్రణవం అనేది భగవంతుని (వడ్లగింజ)*

*బాహ్యరూపం (పొట్టు) మరియు*

*పంచాక్షరి అనేది అంతఃస్వరూపం (బియ్యపు గింజ).*


*ప్రణవము మరియు పంచాక్షరి ఒక్కటే.*


*ఐదు అక్షరాలు..భగవానుని ఐదు కర్మలను సూచిస్తాయి.,అవి ఏమిటంటే.*

*సృష్టి,  స్థితి,  సంహారం, తిరోధానం,  అనుగ్రహం.*


*అవి పంచభూతాలను మరియు వాటి కలయికతో ఏర్పడిన సమస్త సృష్టిని/ జీవాలను సూచిస్తాయి.*


*ఓం నమః శివాయ.*

*లోకా సమస్తా సుఖినోభవంతు.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

నటరాజ స్వామి

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శివుడి ఆనందతాండవము*

          *నటరాజ స్వామి*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*"నట" అనే ధాతువుకు స్పందించడమని అర్ధం. తన భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తేందుకు స్వామి అనేక సంధర్బాలలో నాట్యం చేసినట్టు పురాణవచనం. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో, హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటారు అనేది విదితం. గజాసురుణ్ణి సంహరించినప్పుడు,అంధకాసుర సంహరించినప్పుడు శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.*


*స్వామి నాలుగు చేతులలో నెమలి ఈకలు కట్టిన జడలతో, ఆ జడలలో ఒక సర్పం, ఒక కపాలం, గంగ, దానిపై చంద్ర రేఖ, కుడి చెవికి కుండలం, ఎడమ చెవికి తాటంకం , కంఠహారాలతో, నూపురాలతో, కేయూరాంగదాలతో, యఙ్ఞోపవీతంతో, కుడి చేతిలో ఢమరుకం ,మరొక కుడిచేయి అభయ ముద్రను ప్రకటించడం, ఒక ఎడమ చేతిలో అగ్ని,మరొక చేయి సర్పాన్ని , చేతిలో పెట్టుకున్న మూలయకుణ్ణి చూపిస్తూ, ఎడమకాలు ఎత్తి పెట్టబడినట్లుగా, విగ్రహానికి చుట్టూ ఓ కాంతి వలయం, పద్మాకారంగ చెక్కబడిన పీఠంపై నృత్యం అద్భుతం.*


*చెవి కుండలములు – అర్ధనారీశ్వరతత్వము*


*వెనుక కుడి చేతిలో డమరుకం – శబ్దబ్రహ్మయొక్క ఉత్పత్తి*


*వెనుక ఎడమ చేతిలో అగ్ని – చరాచరముల శుద్ధి*


*ముందు కుడి చేయి – భక్తులకు అభయము*


*ముందు ఎడమ చేయి – జీవులకు ముక్తి హేతువయిన పైకి ఎత్తిన పాదమును సూచించును.*


*కుడి కాలుకింద ఉన్న అపస్మార పురుషుడు (ములయక రాక్షసుడు) – అఙ్ఞాన నాశనము*


*చక్రము – మాయ*


*చక్రమును స్పృశించిన చేయి – మాయను పవిత్రము చేయ్తుట*


*చక్రమునుండి లేచు 5 జ్వాలలు – సూక్ష్మమైన పంచతత్వములు.*


*నాట్యం చేస్తున్నప్పుడు నటరాజుకు నాలుగు భుజాలు ఉంటాయి.ఆయన చేసే నృత్యాలు ఏడు రకాలుగా ఉంటాయి.*


*1) ఆనంద తాండవం*

*2) ప్రదోష నృత్యం ( సంధ్యా తాండవం)*

*3) కాళితాండవం*

*4) త్రిపురతాండవం*

*5) గౌరి తాండవం*

*6) సంహార తాండవం*

*7) ఉమా తాండవం*


*గౌరి ,ఉమా తాండవాలలో శివుని రూపం భైరవముగా ఉంటుంది. ఆయన సాత్విక నృత్యం ప్రదోషకాల నృత్యమే. అందుకే ప్రదోషకాలంలో శివపూజ ప్రశస్తమైనది.*


*అసలు భూలోకంలో ఉన్న నృత్యరూపాలు అన్ని ఆయన నృత్యంలో నుండి ఉద్భవించినవే!ఆయన తన నృత్యమును, పార్వతి ద్వారా అభినయింప జేసి, తమ నాట్యాన్ని భరతమునికి చూపించగా, భరత ముని ద్వారా నాట్య వేదం రూపుదిద్దుకుందంటారు.*


*సంహారకరమైన శివుని ఉగ్రనృత్యములందు జగత్తును ప్రళయం గావించి,జీవుల కర్మబంధమును కూడా నశింపచేయును.*

*ఆనంద తాండవమునందు శివుని ముద్రల అంతార్ధము ఇదే. ఆయన తాండవము లోకరక్షాకరం.*


*ఓం శ్రీ చిదంబరేశ్వరాయ నమః।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

శ్రీచక్ర వైభవం🙏 మొదటి భాగం

 🙏 శ్రీచక్ర వైభవం🙏

                        మొదటి భాగం 

""ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా 

శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా "


మహా మహిమాన్వితమైన శ్రీచక్రము గురించి ఈ వ్యాసంలో వివరిస్తాను.ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం చెబుతున్నాను.


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేకపని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, ప్రత్యేకమైన పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.

ఈ జగత్తు లోని సకల తత్వాలు , సకల భువనాలు ,పరమశివుడు , పరాశక్తి మానవునియందు కలవు .. మానవుని శరీరాన్ని రెండు భాగాలుగా చూస్తే …. నాభి నుండి పైకి ఊర్థ్వ లోకమని , క్రిందకి అధోలోకమని ….. ఈ రెంటిని కలిపే వెన్నెముక ను మేరు దండమని అంటారు .. శ్రీ చక్రమును “మేరువు” అంటారు … మేరు పర్వతము కూడా భూమి కి ఇరుసు వంటిది . ఏ రకంగా పరాశక్తి దివ్య స్వరూప కాంతులచే … ఈ జగత్తంతా ప్రకాశవంతమై ఉందో , మన మేరుదండంలో గల ”కుండలినీ శక్తి"" చేత శరీరము చైతన్యవంతము గా అవుతుంది … మనలో ఆత్మా ఉన్నదని అంగీకరించినట్లే .. మన శరీర నిర్మాణం యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి .. నవావరణాత్మకమైన శ్రీ చక్రానికి , మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రాలు చెబుతున్నాయి … శ్రీ చక్రమును ఆరాదిస్తే సకల దేవతా మూర్తులను ఆరాదించినట్లే … అని తంత్ర శాస్త్రం తెలియజేస్తుంది …

శ్రీ చక్రమును మన శరీరము తో పోల్చి చూస్తే … మనము ఆ జగన్మాతను దర్శించుట యెంత దుర్లభమో అవగతమవుతుంది … మనలోని కర్మ , జ్ఞానేంద్రియాల వెంటపడి పరుగెత్తే మనస్సు , బుద్ధి , అహంకారం , మమకారములు , కామోద్రేకాలు , శృంగారాది నవరసాలు , జాగ్రద స్వప్న సుషుప్తాది అవస్థలు .. వీటిని నడిపే సత్వ రజ తమో గుణాలు .. వీటన్నింటిని ఆ “శ్రీదేవి” విభూతులుగా గ్రహించి , వీటన్నింటిని దాటి ‘బిందు’ స్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన , సచ్చిదానంద రూపమైన , సత్స్వరూపానుభవము కలుగుతుంది అనేది సత్యము … కానీ … ఎన్ని జన్మలకు సాధ్యమో ….

మనలోని ప్రాపంచికమైన ముప్పది ఆరు తత్వములు , త్రిపుటలు , నవావరణములను … నిర్లిప్తతో , నిష్కామంగా , నిస్వార్థంగా అనుభవిస్తూ ….. గమ్యాన్ని చేరుకోవటానికి నిరంతర సాధన చెయ్యాలె తప్ప వేరొక మార్గం ఉండదు.


యంత్రమంటే ఏమిటి:- యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క శక్తి స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.


అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయిక వల్లనే సాధ్యం.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రంలోని త్రికోణములో మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.


విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులన్నింటినీ ఆ జగన్మాత అయిన పరాశక్తి, వారికి అందిస్తోంది.


శ్రీ చక్ర ఆవిర్భావం:- ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.


కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. ఋషులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.


దీనినే “పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి."" మూల ప్రకృతిరావ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ ""అంటోంది లలితా సహస్రం. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు బద్దలు ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.

(ఇక్కడ చెప్పిన విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోండి )


శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు

అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.


1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’.

ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.


మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుచున్నది.

పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా

శ్రీషోడాశాక్షరీ విద్యా త్రికూట కామకోటికా .. 


శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.


శ్రీచక్రానికి, పంచదశీ మంత్రానికి , అమ్మవారికి భేదం లేదు. మూడు ఒకటే. ఈ విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. శ్రీచక్రాన్ని దర్శించడానికే పూర్వ జన్మ సుకృతం కావాలి కాబట్టి శ్రీచక్ర దర్శనమే జన్మ రాహిత్యం కలిగిస్తుంది. ఇంక అర్చనచేస్తే వచ్చే ఫలితం చెప్పనలవి కాదు కదా. ""చరమే జన్మని శ్రీవిద్యోపాసకో భవేత్ "" అనేది అక్షర సత్యం.సాధకుడు నమ్మితీరాలి "" సత్యం సత్యం పునః సత్యం "" కాబట్టి ఈ శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రమే ఈ శ్రీచక్రరాజము . శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభ సాధ్యం కాదు. అయినా పట్టుదలతో చేస్తే ఈలోకములో సాధించలేనిది అంటు ఏమి లేదు కాస్త కష్టమే అయినా అసాధ్యము మాత్రము కాదు.

                   సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మహాభారతం - శాంతి పర్వం 🙏

 మహాభారతం - శాంతి పర్వం 🙏

             రెండవ భాగం 

మహాభారతం అంటేనే పంచమ వేదం అన్నారు. వేదార్థం తెలియకపోయినా భారతాన్ని చదివి అర్ధం చేసుకోవాలి. అందులోనూ శాంతి పర్వం అంతా ధర్మ శాస్త్ర విషయాలే, ఉపనిషత్తుల సారాంశమే. కాబట్టి ఇది ఒక కథా విషయం అనుకోని ప్రక్కన పెట్టకండి. ఇది కథ మాత్రమే కాదు. వేదసారం అని గ్రహించండి . ఎన్నో ధర్మాలు తెలియజేసేది శాంతి పర్వం అందుకే ఈ ఉపోద్ఘాతం వ్రాస్తున్నాను. 

  మన వేదవ్యాస గురువు మహానుభావుడు. వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటె , కలియుగం లో ఉండేటటువంటి ఆయుర్థయన్ని దృష్టిలో పెట్టుకుని వేదములను చదవ గలిగిన వాళ్ళు ఉండరని , వేదమును విభాగం చేసి "రుక్" "యజుర్" "సామ" "అథర్వణ" వేదము అని నాలుగు విభాగములు చేసి 18 పురాణములు వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేసారు, అందులో లేనటువంటి ధర్మ సుక్ష్మం లేదు , భారతం అంతా కూడా రచన చేసిన తరువాత వేదవ్యసుడే అన్నాడు నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా , ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం ఇంత కన్నా ఇంకోటి ఏది ఉందొ నాకు చెప్పు అన్నాడు , కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతం లో అన్ని ఉన్నాయ్. నీకు వెతుక్కోవటం రావాలి, తెలుసు కోవటం రావాలి , ఇది కాకుండా వేరొకటి కొత్తగా తెలుసుకోవటానికి వేరేది ఉండదు, అన్ని భారతం లోనే ఉన్నాయి.

అన్ని ఆఖ్యానములతో అన్ని ఉపాఖ్యానములతో అన్ని విశేషాలతో భారత రచన చేశానని మన గురువైన వేద వ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతమును


"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబనియు ఆధ్యాత్మ వేదులు వేదంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవివృ ష భులు మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని అయితి హసకులు ఇతిహసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు అని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యసుడాది ముని పరశారత్మజుండు, విష్ణు సన్నిభుoడు , విశ్వ జానీనమై పరగుచుoచేసే భారతంబు అని నన్నయ పేర్కొన్నారు 

ఇక విషయంలోకి వెడదాము.


కళింగ దేశపు రాజు చిత్రాంగదుడు తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి సుయోధనుడు, కర్ణుడితో కలిసి వెళ్ళాడు. ఆ స్వయం వరానికి శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులు హాజరయ్యారు. స్వయంవరంలో శుభాంగికి ఆమె చెలికత్తె ఒక్కొక్క రాజును పరిచయం చేస్తుండగా శుభాంగి ఎవరి మెడలోను వర మాల వేయక సుయోధనుడిని కూడా దాటి పోయింది. అది చూసి సుయోధనుడు కోపించి ఆమెను తన రథం మీద పెట్టమని ఆజ్ఞాపించాడు. అది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులంతా సుయోధనుడి మీద విరుచుకు పడ్డారు. సుయోధనుడు వారితో ఘోరంగా పోరాడాడు. కర్ణుడు తన అస్త్ర విద్యా నైపుణ్యంతో రాజులందరితో యుద్ధం చేసాడు. కర్ణుడి ధాటికి తాళ లేక రాజులందరూ పారి పోయారు. సుయోధనుడు శుభాంగిని తీసుకుని హస్థినా పురానికి వెళ్ళాడు. ఆ సమయంలో తనకు జరిగిన పరాభవాన్ని తలచుకుని జరాసంధుడు కర్ణుడిని తనతో యుద్ధం చెయ్యమని కోరాడు. అందుకు అంగీకరించిన కర్ణుడు జరాసంధునితో యుద్ధంచేసాడు. ముందు అస్త్ర శస్త్రములతో యుద్ధంచేసాడు. తరువాత జరిగిన బాహాబాహీ యుద్ధంలో కర్ణుడు జరాసంధుని ఓడించాడు. క ర్ణుడి పరాక్రమానికి మెచ్చిన జరాసంధుడు అతనికి మాలినీ నగరాన్ని బహూకరించాడు.

కర్ణుడి గొప్పతనానికి కలత చెందిన ఇంద్రుడు కపట బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుడి కవచ కుండలాలను దానంగా అడిగి పట్టుకు వెళ్ళాడు. అర్జునుడు కర్ణుడిని వధించ గలగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కనుక ధర్మజా ! నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. మొదట బ్రాహ్మణ శాపం, తరువాత పరశురాముడి శాపం, తరువాత ఇంద్రుడు కవచకుండలాలను పట్టుకు పోవడం, ఆ పై కుంతీదేవికి ఇచ్చిన వరం కారణంగా మీ నలుగురు అన్నదమ్ములను విడుచుట, భీష్ముడు కర్ణుడిని అర్ధ రథుడిగా ప్రకటించుట, తరువాత శల్యుడు తన ములుకుల వంటి మాటలతో కర్ణుడిని హింసించుట ఇన్ని తోడయ్యాయి కనుకనే అర్జునుడు కర్ణుడి ఓడించ గలిగాడు. ధర్మజా ! అది కాక అర్జునుడికి వరుణుడు, పరమశివుడు, ఇంద్రుడు, యముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీరంతా దివ్యాస్త్రాలను ప్రీతితో ఇచ్చారు. అందువలన అర్జునుడు కర్ణుడిని వధించాడు కాని, లేకున్న కర్ణుడిని జయించడం అర్జునికి వీలు కాని పని " అని నారదుడు పలికాడు.


నారదుడి మాటలను విని ధర్మరాజు తీవ్రమైన శోకంతో మరింత కలత చెందాడు. పక్కనే ఉన్న కుంతీదేవి ధర్మరాజును ఓదారుస్తూ " నేను కర్ణుడిని కలిసి అతడి జన్మ రహస్యం చెప్పి అతడిని మీ వైపు రమ్మని ఆహ్వానించినప్పుడు సూర్యభగవానుడు వచ్చి " కర్ణా కుంతి చెప్పింది నిజం " అని పలికాడు. అయినా కర్ణుడు సుయోధనుడిని వదిలి రావడానికి ఇచ్చగించ లేదు. అటువంటి కర్ణుడిని తలచుకుని ఇప్పుడు ఎందుకు బాధ పడుతున్నావు " అని పలకగా ధర్మరాజు తల్లిని ఏహ్యభావంతో చూసి " అమ్మా ! నీవు ఈ రహస్యాన్ని మా నుండి దాచినందు వలనే ఈ అనర్ధం జరిగింది కనుక నేటి నుండి స్త్రీలకు రహస్యం దాచే శక్తి క్షీణించును గాక " అని స్త్రీ జాతినంతా ధర్మరాజు శపించాడు. అయినా ధర్మరాజు మనసు కుదుట పడలేదు.


యుద్ధ పరణామాలకు విరక్తి చెందిన ధర్మరాజు " ఎవ్వరూ లేని ఈ రాజ్యం మనకెందుకు ఎక్కడికైనా వెళ్ళి భిక్షుక వృత్తి స్వీకరించి బ్రతుకు వెళ్ళబుచ్చుదాము. అప్పుడే నా మనస్సుకు శాంతి లభిస్తుంది. అర్జునా ! మనమంతా దాయాదులను చంపాము. అది మనలను మనం చంపుకోవడంతో సమానం కాదా ! ఎందుకీ క్షత్రియ ధర్మం, కాల్చనా ! వనములలో ఉండి అహింసావ్రతమును పాటిస్తూ బ్రతకడం ధర్మం కాదా ! అందుకని మనం తిరిగి వనములకు వెడదాము. రాజ్యం అనే ఈ మాంసం ముక్క కొరకు పశువుల మాదిరి కొట్టుకున్నాము, చంపుకున్నాము, వంశనాశనం చేసుకున్నాము. ఇప్పుడు ఇంతటి కుత్సిత బ్రతుకు బ్రతుకుతున్నాము. అర్జునా ! ఈ కురు సామ్రాజ్యమే కాదు. ముల్లోకాధిపత్యం ఇచ్చినా నా మనస్సు శాంతించదు. నాకీ రాజ్యం వద్దు మీరే ఏలుకొండి. మన పెద నాన్న పుత్రవ్యామోహంతో తన కుమారుడైన సుయోధనుడిని కట్టడి చేయ లేక పోయాడు. ఆ నీచుడి వలన వంశనాశనం అయింది. సుయోధనుడిని చంపి మనం మన కోపం తీర్చుకున్నాము కాని, నా మనసంతా శోకపరితప్తమైంది. నేను మాత్రం ఏమి చేశాను? రాజ్యకాంక్షతో యుద్ధానికి సిద్ధపడి పాపం చేసాను. ఈ హేయమైన యుద్ధం వలన లభించిన రాజ్యమును వదిలితే గాని నాకు మనశ్శాంతి లభించి మనసు పరిశుద్ధం కాదు. అందుకని నేను తపోవనానికి వెళ్ళి మునివృత్తి స్వీకరించి శేషజీవితం ఆనందంగా గడుపుతాను " అని ధర్మరాజు అన్నాడు.


ఆ మాటలకు అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది. అయినా తమాయించుకుని దానిని మనసులో దాచుకుని పైకి చిరునవ్వు నవ్వుతూ " అన్నయ్యా ! ఇలాంటి మాటలు ఎక్కడన్నా ఉన్నాయా ! ఎప్పుడైనా విన్నామా ! అరివీర భయంకరులమై శత్రువులను ఓడించి రాజ్యలక్ష్మిని చేపట్టాము. అది అంతా మరచి పోయి ఇప్పుడు ముని వృత్తి స్వీకరిస్తానని చెప్పుట తగునా ! మనం సుయోధనుడి మాదిరి అధర్మంగా రాజ్యం పొందలేదు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పొందాం. ధర్మబద్ధమైన రాజ్యమును పాలించకుండా వదలడం ధర్మమా ! అలాంటి వాడివి యుద్ధం చేసి ఇందరు రాజులను చంపడం ఎందుకు. ఇంత చేసి ఇప్పుడు రాజ్యాన్ని వదిలి ముని వృత్తిని స్వీకరిస్తానని చెప్పిన నిన్ను లోకం పిరికి వాడని నిందించదా ! మనం యుద్ధం వలన పొందిన పాపమును అశ్వమేధ యాగం చేసి పోగొట్టుకోవచ్చు. అంతే కాని క్షత్రియ ధర్మాన్ని వదిలి మునివృత్తి స్వీకరించుట అధర్మం కాదా ! అన్నీ ధర్మాలకు మూలమైన సంపద లేని నాడు చచ్చినవాడితో సమానం కాదా ! సంపదలు ఉంటే బంధువులు వారంతట వారే మన దగ్గరకు వస్తారు. సంపదలే మిత్రులను మనకు దరిచేరుస్తుంది. సంపద శౌర్యమూ, ధైర్యమూ, సద్బుద్ధీ కలుగజేస్తుంది. రాజ్యసంపద పురుషార్ధాలలో మేటి, అలాంటి రాజ్యసంపద మనకు ధర్మబద్ధంగా ప్రాప్తించింది. ఆ సంపదను అనుభవించడం మనధర్మం కాదా ! దేవతలు కూడా దాయాదులను చంపే అభివృద్ధిని సాధించారు. దాయాదులను, శత్రువులను చంపకుండా రాజ్య సంపద లభిస్తుందా ! వేదములు కూడా శత్రుసంహారం చేసి రాజ్యసంపద పొంది యజ్ఞ యాగాదులతో దేవతలను సంతోషపెట్టి చని పోయిన తరువాత ఉత్తమగతులు పొందడమే క్షత్రియ ధర్మం. మన పూర్వీకులైన దిలీపుడు, నృగుడు', అంబరీషుడు, సగరుడు, నహుషుడు, మాంధాత మొదలగు రాజులు ఈ ధర్మాన్నే అనుసరించి ఉత్తమగతులు పొందారు. ప్రస్తుతం నిన్ను వరించిన చక్రవర్తిపదవిని త్యజించుట న్యాయమా ! నీవు కూడా నీ పూర్వీకుల వలె యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి కాకపోతే నీకు పుణ్యం ఎలా లభిస్తుంది. అశ్వమేధయాగం చేసిన రాజులంతా పునీతులైయ్యారు " అని అర్జునుడు పలికాడు.


అర్జుడి మాటలు ధర్మరాజు ను స్వస్థుడిని చేయలేక పోయాయి. అతడు తన దుఃఖాన్ని వీడక " అర్జునా ! ఎందుకో నా మనసు రాజ్యపాలనకు అంగీకరించడం లేదు. ఈ లోకంలో తృప్తిని మించిన సంతోషం వేరొకటి లేదు. ఈ నిస్సారమైన సంసారం వీడి ఒంటరిగా అడవులకు వెళ్ళి అక్కడ ఉన్న తాపసుల పలుకులు వీనులవిందుగా వింటూ కాలం గడపడం ఎంత బాగుంటుంది. నిందను పొగడ్తను సమంగా స్వీకరిస్తూ కత్తితో పొడిచిన వాడిని మేనికి చందమును అలదిన వాడిని ఒకటిగా చూస్తూ మూగవాడిలా మౌనవ్రతం ఆచరిస్తూ పర్ణశాల నిర్మించుకుని ఎవరు ఏమిచ్చినా భగవత్ప్రసాదంగా స్వీకరించి తృప్తి చెందడం కంటే ఆనందం మరొకటి కలదా ! అలా కాకుండా కర్మమార్గంలో ప్రయాణిస్తే పాపం మూట కట్టుకోవడం తప్ప మనకు ఒరిగేది ఏముంది? కనుక నేను మోక్షమార్గముకు దూరం కాలేను. దేవుడి కృప వలన అమృత తుల్యమైన జ్ఞానం లభించింది. అదే శాశ్వతం, అదే మోక్షమార్గం, నేను దానిని వదులుకోలేను " అన్నాడు.


ఆ మాటలు విన్న భీమసేనుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! నీవు కర్మయోగివి. శృతి విహితమైన కర్మలు ఆచరించకుండా జ్ఞానమార్గం అవలంబించడం న్యాయమా ! యుద్ధంలో అనేక మంది మరణాన్ని చూసి బంధుమిత్రులను పోగొట్టుకుని నీకీ విరక్తి, అసూయ వచ్చాయి. కాని ఈ వైరాగ్యం, ఈ కోపం, ఈ అసూయ యుద్ధానికి ముందు వచ్చి ఉంటే ఎంతో మంది రాజులు, బంధువులు, స్నేహితులూ ప్రాణాలు విడువక ఉండే వారు కదా. మేమూ రాజ్యం మీద ఆశ వదిలి మునివృత్తి స్వీకరించి ఉండేవాళ్ళం. ఈ మహాభారత యుద్ధం జరిగేదీ కాదు, ఇంత ప్రాణ నష్టం జరిగి వుండేదీ కాదు. ఆనాడు భీకర ప్రతిజ్ఞ చేసి యుద్ధంలో పాల్గొని అందరినీ చంపి ఇప్పుడు అడవులకు పోతాను అంటే విన్న వారు ఏమనుకుంటారు. నిన్ను హేళన చేయరా ! వెనుకటికి నీ లాంటి వాడొకడు కష్టపడి బావి తవ్వి చివరకు నీళ్ళు త్రాగ కుండా ఊరుకున్నాడట. ఎత్తైన చెట్టెక్కి శ్రమ పడి తేనెపట్టును కొట్టి తేనెను త్రాగక ఊరుకున్నాడట, విస్తరి నిండా మృష్టాన్నం వడ్డించే వరకు ఉండి తరువాత తినకుండా విడిచి వెళ్ళాడట. కోరి వచ్చిన వనితను విడిచి వెళ్ళాడట, నీ భుజ బలంతో పరాక్రమంతో శక్తియుక్తులతో రాజ్యలక్ష్మిని కైవశం చేసుకుని రాజ్యపాలన చేయకుండా అడవులకు పోతాను అనడం కూడా అటువంటిదే కదా ! అయినా నీకు అన్నీ తెలుసు. నీకు నేను చెప్పగలిగినది ఏమున్నది. నీవు అడవులకు పోతుంటే నీ వెనుక మేము నడుస్తుంటే లోకులు నవ్వుతూ " ఈ వెర్రి వాళ్ళు అడవులకు పోతాననే ధర్మరాజు ను ఆపకుండా ఆయన వెనుక వీళ్ళూ వెడుతున్నారు " అని హేళన చేయ్యరా ! నీవు అడవులకు పోయి నీ తమ్ములందరినీ రాజ్యభోగాలకు దూరం చేస్తావా ! ప్రజలను శోకసాగరంలో ముంచుతావా ! ధర్మరాజా ! కర్మ రాహిత్యమే మోక్షమార్గం అయితే అరణ్యంలోని చెట్లు కర్మలు చెయ్యవు కదా ! వాటికి మోక్షం రాలేదు కదా ! అన్నయ్యా కర్మలను త్యాగం చెయ్యడం కాదు కర్మలు ఆచరిస్తూ కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి, తాను చేసే కర్మలన్ని బ్రహ్మార్పణం అంటూ నిష్కామకర్మలో మునిగి తేలాలి. అప్పుడు తత్వజ్ఞానం కలిగి కర్మరాహిత్యమై మోక్షం లభిస్తుంది " అన్నాడు.

                  సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

దత్తపది


కీర్తి - ఆర్తి - మూర్తి - స్ఫూర్తి. (దత్తపది) 

*సజ్జన స్వభావము (స్వేచ్ఛా ఛందము*) 


కీర్తినెప్పుడు గోరకుండును కీడు సేయడు నెప్పుడున్


ఆర్తిబాపునె నన్ని వేళల నాదుకొంటయె దీక్షయౌ


మూర్తిమత్వము ధర్మదేవత ముందునుండుట జూడమే


స్ఫూర్తి నిచ్చును తోటివారికి సోముడే దిగివచ్చెనో


పూర్తి సజ్జన విగ్రహంబును పోల్చ రాదుగ యేరికిన్.



అల్వాల లక్ష్మణ మూర్తి


: *అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే*

*ఆంగ్లేయుడు*

ఈ సమస్యకు నాపూరణ. 



రవియే గ్రుంకని సార్వభౌమతను మీరారాధనల్ సేయరే


వ్యవసాయంబును వృద్ధి జేసితి మిటన్ వ్యక్తంబుగాన్ జూడవే


అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే


*తెలుగు భారతీయుడు*

అవకాశంబులు నన్ని హక్కులును మావై యుండగా ప్రేలుటా!


భువిలో ముందుగ నాగరీకులములే పూర్వమ్ము మా గొప్పలే.



అల్వాల లక్ష్మణ మూర్తి.

ఉగాది

 *꧁❀❀❀━❀ 🌞 ❀━❀❀❀꧂*

★ *ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.


★ *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.


★ *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని  కూడబెట్టుకోమని.


★ *వ్యాస (గురు) పౌర్ణమి:-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.


★ *నాగుల చవితి:-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.


★ *వరలక్ష్మి వ్రతం:-*  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.


★ *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.


★ *వినాయక చవితి (నవరాత్రులు):-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.


★ *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.


★ *దసరా (ఆయుధ పూజ):-* ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.


★ *దీపావళి:-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.


★ *కార్తీక పౌర్ణమి:-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.


★ *సంక్రాంతి:-*  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.


★ *మహాశివరాత్రి:-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.


★ *హోలీ:-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.


*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌹🌹🌹 🪷🕉️🪷 🌹🌹🌹

*꧁❀❀❀━❀ 🌞 ❀━❀❀❀꧂*