3, ఆగస్టు 2020, సోమవారం

విష్ణువు పంచాక్షరీ మంత్ర జపం

లింగ పురాణం ప్రకారం విష్ణువు పంచాక్షరీ మంత్ర జపం వలన సమస్త విశ్వ రహస్యం తెలిసినా తనను గురించి తాను తెలియలేదు. అలాగే బ్రహ్మ అష్టాక్షరీ మంత్ర ప్రభావంవలననే సమస్త ప్రకృతితో గూడిన విశ్వ రహస్యం తెలిసినది.తననుతాను తెలియలేదు. పరమేశ్వరుని చే వచించబడిన పంచాక్షరి వలన విష్ణువు నారాయణుని వలన వచించిన అష్టాక్షరీ వలన బ్రహ్మ వారు వారి గురించి వారు తెలుసుకొనుటకు వీలు పడలేదు. యప్పటికీ వారు చేయుచూ సృష్టిని నడపుచుంటిరి. మరి పరమేశ్వరుడు జప నామం రామ నామంతో వీటి అన్నింటికి అతీతమైన రమ శక్తి తత్వానికి ధ్యానించుచు సమస్త ప్రకృతిని నడపుచుంటిరి. యిక్కడ శక్తి అనగా యీ మూడింటికి మూల మైన శక్తి తత్వ మని భావన. అందుకే ఏ ఉపాసన అవసరం లేకుండా నీరసంగా నైనా యధాలాపంగానైనా రామ నామజపంతో ముక్తి. దాని విశిష్ట యింతని వర్ణింప లేనిది. అది పెద్దలు చెప్పినట్టు ఎంతో రుచి. చేస్తూనే ఉందాం.
*********************

కామెంట్‌లు లేవు: