3, ఆగస్టు 2020, సోమవారం

*#ధర్మసందేహం*

*ఎవరు #బ్రాహ్మణులు - ఏది #బ్రాహ్మణవాదం*
ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మ��
************************

కామెంట్‌లు లేవు: