15, సెప్టెంబర్ 2020, మంగళవారం

బుధ గ్రహం - దోష నివారణ



తారాచంద్రులకు జన్మించిన వాడు బుధుడు. బ్రహ్మ దేవుడి అనుగ్రహంతో గ్రహంగా మారాడు. బుధుడికి అధి దేవత శ్రీ మహా విష్ణువు. గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కలిగిన వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ.. పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య 5, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో 15 డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో 15 డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో 15, 20 డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులా రాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ 17 ఏళ్లు. బుధుడు 7వ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.

బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగా పాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహ పీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు.

పరమేశ్వరునికి అభిషేకం చాలా ప్రీతిపాత్రమైనది. అంతేకాకుండా అభిషేకం చేయుట వలన త్వరితగతిన దేవుని సక్షాత్కారం లభిస్తుంది. కలియుగమందు సులభరీతిలో తమ పాప ప్రక్షాళనకు అభిషేకం చేసుకొనుట తప్పనిసరి. విశేషించి శివ, సుబ్రహ్మణ్య, గణపతి, ఆంజనేయ, సాయిబాబా వంటి దైవముల అభిషేకములు చేయుటవలన కోర్కెలు తీరును. బలం, ఆరోగ్యం, యశస్సు, సకల సంపద, సకల ఐశ్వర్యం, భూలాభం, ధాన్యం, గృహ, గోవృద్దిని పొందుటకు ఈ కలియుగమున తప్పక అభిషేకములను ఆచరించవలెను.

బుధ గ్రహ దోషానికి శాంతులు
బుధునికి 17 వేలు జపం + 17 వందల క్షీరతర్పణం+170 హోమం+17 మందికి అన్నదానం చేసేది.
బుధవారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.
బుధవారం రోజున విష్ణు మూర్తి (ఉదా: రాముడు, కృష్ణుడు, రంగనాధ స్వామి, నరసింహస్వామి) ఆలయాలను దర్శించవచ్చు. పెసలు, అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి.

గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు. ఒక రాగి ముక్కకి పెద్ద రంధ్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను. బుధ గ్రహం బాగా లేనపుడు నపుంసకులకు లేదు అనకుండా ధర్మం చేయాలి. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం 5 సార్లు పారాయణ చేయగలరు. బుధవారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి. తులసి మాలను 17 బుధవారములు శ్రీవెంకటేశ్వరస్వామికి అలంకరించండి

బుధ గ్రహ దోష నివారణకు మహా విష్ణు పూజ చేయాలి. బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడుతాయని శాస్త్రం చెబుతోంది.

బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని శాస్త్రం చెబుతోంది.

కాబట్టి బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని శాస్త్రం చెబుతోంది....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: