15, సెప్టెంబర్ 2020, మంగళవారం

పంచవటి అంటే

పంచవటి అంటే 5 రకములైన దివ్య వృక్షముల సముదాయము. సాధారణముగా ఋషులు, మునులు తమ ఆశ్రమములలో, పర్ణశాలల చుట్టూ ఈ దేవత వృక్షములను నాటి పెంచేవారు. రామాయణము ఆధారముగా మనకు తెలియవచ్చే చారిత్రక విషయం ఏమిటంటే శ్రీ రామచంద్రుడు, సీతా, లక్ష్మణ సమేతముగా అరణ్యవాసము చేస్తున్నప్పుడు, తమ పర్ణశాలను పంచవటి యందు ఏర్పరచుకున్నట్లు తెలుస్తుంది. వారి వనవాస కాలములో, వారు దర్శించిన భరద్వాజ మహర్షి, అగస్త్య మహర్షి ఆశ్రమములు పంచవటి పర్ణశాలలుగా ఉన్నట్లు రామాయణ ఇతిహాసమును బట్టి తెలుస్తుంది. ఈ పంచవటి వృక్షములు, 1 .వట ( మఱ్ఱి - Banyan - Ficus bengalensis) 2 .అశ్వర్ధ ( రావి - Peepal - Ficus religiosa ) 3 .ఔధుంబర (మేడి - Cluster Fig - Ficus racemosa ) 4. ఆమ్ల (ఉసిరిగ - Phyllanthus Emblica) 5 .భిల్వ (మారేడు - Aegle marmelos ). కొందరు అశోక వృక్షమును కూడా పంచవటి వృక్షముగానే భావిస్తారు.

ఈ దివ్య దేవత వృక్షములు కర్బన వాయువులను స్వీకరించి, ప్రాణవాయువును విడుదల చేస్తాయనడములో అతిశయోక్తి లేదు. పర్యావరణము లోని కాలుష్య నివారణకు ఏంతో ఉపయుక్తమైన వృక్ష సంపద ఈ పంచవటి వృక్షములు. ఆయుర్వేద, పురాణ గ్రంథములలో ఈ వృక్షముల మహత్యమును ఎంతగానో ప్రశంసించబడినవి.

*సేకరణ*

కామెంట్‌లు లేవు: