15, సెప్టెంబర్ 2020, మంగళవారం

మత్స్యావతార చరితము



శ్రీభాగవతమును చెవులార వినుచు
యాధ్యాత్మికానంద మనుభవించేటి
శౌనికాదిగగల్గు సంయమివరులు
పలికిరీరీతిగా ప్రార్థించిసూతు

"విమలాత్మ ! వినమాకు వేడుకయయ్యె
వింతగా పరమాత్మవిష్ణుండు దొల్లి
మత్స్యరూపము దాల్చె మహిమాన్వితముగ
కర్మబద్ధునిభంగి ఘనుడీశ్వరుండు
నిఖిలనిందిత తమోనిలయమైనట్టి
మీనరూపమునేల మేలనిదాల్చె ?
ఎక్కడ వర్తించె ? యేమియున్ జేసె ?
ఆద్యమై వెలయు నయ్యవతారమునకు
కారణంబెయ్యది ? కార్యంశమేమి ?
నీవేను కర్తవు నిఖిలంబుదెలుప
దేవాదిదేవుడా దివ్యుని చరిత
విస్తరించియుదెల్పు వీనులుపండ "

ఆరీతి మునులంత యభ్యర్ధనమున
యడుగగాసూతుని యాలకించతడు
ననియె నీరీతిగా యతిప్రసన్నతతొ
" ఇపుడు మీరడిగిన యీప్రశ్నదొల్లి
నర్జున ప్రియ పౌత్రు డడుగగా శుకుని 
నాతండు వివరించె నరయనీరీతి ;

విభుడీశ్వరుండైన విష్ణుదేవుండు
వేద బ్రాహ్మణ సుర విమలసాధువుల
ధర్మార్థ గోవుల ధరయందు గావ
ఘనరూపములయందు , గాలిచందమున
తనురూపములయందు తగిలితానుండు ;
ఎక్కువతక్కువ యెన్నడొందకను
నిర్గుణత్వంబున నెఱయు ఘనుండు
గురుతయు దొరతయు గుణముల నొందు .
అట్టి యాపరమాత్మ యవనిని బ్రోవ
మనుజేశ ! చోద్యమే మత్స్యంబుయగుట !
విష్ణుని మహిమలు విభవోన్నతములు
వినుము దెల్పెదనీకు వివరంబుగాను
యాలకింపు మికను యానందముగను "

బాదరాయుణుడిట్లు పలికియునృపుతొ
మత్స్యావతారపు మహిమాన్వితమును
వీనులవిందుగా వివరించెనిట్లు

కామెంట్‌లు లేవు: