ఒత్తిడికి విరుగుడుగా దానిమ్మ:
ఆకర్షణీయమైన రంగుతో నిగనిగ లాడుతూ కనిపించే దానిమ్మ పండు ఆరోగ్యానికి కొండంత అండ. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.
- దానిమ్మ వినియోగంతో రక్తనాళాలు, గుండె గదుల పనితీరు మెరుగుపడుతుంది. దానిమ్మలోని సహజ యాస్పిరిన్ గుణాలు రక్త సరఫరాను వేగవంతం చేస్తాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది.
- దానిమ్మ లైంగిక సామర్థ్యాన్ని, సంతాన సాఫల్యతను పెంచుతుంది. గర్భస్థ శిశువుల ఎదుగుదలకు దోహదం చేసే ఫోలిక్ యాసిడ్ దానిమ్మ లో పుష్కలంగా లభిస్తుంది. అందుకే తరచూ గర్భిణులు దానిమ్మ తీసుకోవాలి.
- దానిమ్మలో లభించే విటమిన్ ఎ, సి, ఈ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు హానికారక ప్రీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్, అల్జీమర్స్ రాకుండా చేస్తాయి.
- వయసు పెరిగిన కొద్దీ ఏర్పడే ముడతలను దానిమ్మ రసం నివారిస్తుంది.
రుతు సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడికి దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది.
- అలర్జీలు, కీటకాలు కుట్టినచోట దానిమ్మరసం రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి.
నీళ్ల విరేచనాలతో బాధపడేవారికి ఇది మంచి మందు. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
- వయసుతోబాటు తగ్గే కీళ్ల మధ్య జిగురు నశించకుండా చేస్తుంది. ఆస్టియో ఆర్ధరైటీస్ వంటి వ్యాధులనూ నియంత్రిస్తుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి