08-11-2020 ఆదివారం రోజు (1) "మహా సౌర యోగమనే" విశేష శుభయోగం. (2)"సర్వార్థ సిద్ధి యోగం" అనే విశేష శుభయోగం (3) "రవి పుష్య యోగం" అనే విశేష శుభయోగం కలవు. ఉదయం 06.11 - 08.46 నిముషాలు వరకు అంటే రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నిడివిలో ఈ మూడు యోగములు కలిసి ఉన్నాయి. ధార్మిక సాధకులు [1] అరుణ పారాయణములు, లేదా [2] శ్రీ సూర్యనారాయణ స్తోత్రములు లేదా [3] శ్రీ ఆదిత్యహృదయ పారాయణములు లేదా [4] సవిత్రు మండలావర్తి సంబంధ హవనములు ఇత్యాదివి తమ శక్తి కొలది నియమనిష్ఠలతో సదాచారయుతముగా ఆచరించటంవలన జన్మాంతరముగా ప్రాప్తించిన పాప ఫలితములు క్షీణించును, ఆయురారోగ్యవృద్ధి కలుగును. సంకల్పములకు అనుకూలతలు పెరుగును.(అవకాశం ఉన్నవారు గోధుమ రవ్వ+దేశవాళి ఆవు నెయ్యి+బెల్లం+కొద్దిగా పచ్చకర్పూరం+యాలకులు+ జీడిపప్పు+ బాదంపప్పు+ కుంకుమపువ్వు + కొద్దిగా గులాబీ రేకులు, ఉపయోగించి మడి కట్టుకుని శుచిగా తీపిపొంగలి తయారు చేసి, పొంగలి బాగా చల్లారిన తర్వాత దాని పైన తేనె వేసి నివేదన సమర్పించాలి ) నేటి ఉదయం 6 గంటల 12 నిమిషాలకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె తో తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి . 🌹శ్రీ భాస్కరాయ నమోనమః🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి