🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత -73*
*****
*శ్లో:-ఉత్తమం స్వార్జితం విత్తం౹*
*మధ్యమం పితు రార్జితం ౹*
*అథమం భ్రాతృవిత్తం చ ౹*
*స్త్రీ విత్త మథమాథమమ్ ౹౹*
*****
*భా:- సాధారణ, సాంకేతిక, శ్రామిక విద్యలలో ఏదో ఒకదానిని గడించి, లేదా కూలీ నాలీ చేసైనా, నిరంతర కృషితో నీతి నిజాయితీలకు కట్టుబడి, కష్టపడి సంపాదించిన స్వీయ సంపాదన ఉత్తమము. తాతముత్తాతలు, తండ్రి తిని - తినక కాయకష్టంతో సంపాదించి కూడబెట్టడం వలన వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిపాస్తులు తీరికగా కూర్చుని, తేరగా అనుభవించడం మధ్యమం. పేదరికము,కుటుంబభారము, అలసత్వము, అనారోగ్యములతో, బ్రతుకుతెరువు లేక ఉదారుడైన సోదరుని సంపాదనపై ఆధారపడి భార్యాబిడ్డలతో సహా జీవించడం అథమము. శక్తియుక్తులు, దీక్షాదక్షతలు,జవసత్త్వాలు,ఆయురారోగ్యాలు పుష్కలంగా ఉన్నా, సిరిసంపదలతో తులతూగుతూ కూడా సంపాదనా పరురాలైన మహాలక్మి వంటి భార్య కష్టార్జితంపై ఆధారపడి, ఉదాసీనంగా జీవించే పురుషుని జీవితం అథమాథమమే. "శ్రమ ఏవ జయతే" ; "ఉద్యోగం పురుష లక్షణం" ; "కష్టే ఫలీ" అంటూ మన భారతీయత పదే పదే చాటుతోంది. కాన ప్రతి ఒక్కరు బుద్ధి బలం, వాగ్బలం , కండబలం మేళవింపుతో క్షణ క్షణం కష్టపడుతూ, కణం కణం గా విత్తం ఆర్జించాలని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెడుతూ, సంసారాన్ని సుఖమయం చేసికోవాలని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి