_*శ్రీరమణీయం* *-(129)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"కోరికలు, అవసరాలు తీర్చుకోవటం జీవన ప్రక్రియలో భాగం కదా ! మరి ఇవి సాధనకు ఎలా అడ్డవుతున్నాయి ?"*_
_*అవసరాలు శరీరానివి అయితే వాటికి సంబంధించిన కోరికలు మనసువి. మనస్సును బాధించని కోరికలు ఎన్ని ఉన్నా ప్రమాదం లేదు. ఫలితాన్ని ఆశించని కోరిక మాత్రమే మనసును బాధించకుండా ఉంటుంది. ఒకసారి మాడిన వంటకాన్ని తిరిగి మార్చలేనట్లే, కోరికవల్ల ఏర్పడ్డ కర్తృత్వం, కర్తృత్వంవల్ల ఏర్పడ్డ కర్మలను ఎవరూ మార్చలేరు. ఈకర్తృత్వం చేతనే మనసు తన పవిత్రతను కోల్పోతోంది. వాస్తవానికి ఏ అవసరాలు లేని మనసు, శరీరం కోసం ఆ కర్తృత్వాన్ని వహిస్తూ కోర్కెల పుట్టగా మారుతోంది ! పోలిక వల్ల ఏర్పడే భావ దారిద్ర్యం నేడు చాలామందిని అశాంతికి గురిచేస్తుంది. అవసరానికి తగినట్లు కాకుండా, అభిరుచులకు తగినట్లుగా ఉండాలన్న అత్యాశ, మనసుని సహజత్వం నుండి దూరం చేస్తుంది. అవసరాలను గుర్తించి, అంతకు మించిన కోరికలను తగ్గించుకుంటే, మనసు తన సహజస్థితిలోనే ఉంటుంది !*_
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'అనవసరమైన ఆలోచనలే ఆటంకం !'*-
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి