1, ఏప్రిల్ 2021, గురువారం

ఇన్ఫెక్షన్

 ఇన్ఫెక్షన్ అనే పదాన్ని తెలుగులో సంక్రమణ అని అనువదించవచ్చు . ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సోకడం .  డిసీజ్  అంటే వ్యాధి . వైరస్ సోకడం వేరు . వ్యాధి బారిన పడడం వేరు 


వైరస్ సోకడం అనేదాన్ని పెద్దగా ఆపడం కుదరదు . జలుబు చేసే వైరస్ లు సోకుతూనే వున్నాయి . అమెరికా లాంటి దేశాల్లో కామన్ ఫ్లూ కు టీకా లు వున్నాయి . అయినా ఆ వైరస్ సోకుతూనే ఉంటుంది . మరో మూడు నెలలకో ఆరు నెలలలకో దేశం మొత్తానికి కరోనా టీకా ఇచ్చినా వైరస్ సోకడం అనేదాన్ని పూర్తిగా ఆపలేరు . ఇదో నిరంతర ప్రక్రియ గా సాగుతూ ఉంటుంది . టెస్ట్ లు చేసి కేసు లు కేసులు లు అంటూ  ఇప్పటిలా హైరానా పడితే ఇక జీవితాలు ఎప్పటికీ అంతే ! 


వైరస్ సోకడం , వ్యాధి బారిన పడడం    అనేదాని మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి . వైరస్ సోకినప్పుడు మనలో ఇమ్మ్యూనిటి బలంగా ఉంటే అది వైరస్ ను మూడు రోజుల్లో చంపేస్తుంది . అలాంటి వ్యక్తులకు కనీసం జలుబు దగ్గు లాంటివి రావు . ఇన్ని రోజులు వారిని asymptomatic అంటూ పిలుస్తూ  వచ్చారు . పిల్లలు  అందరూ ఇదే క్యాటగిరీకి వస్తారు . లక్ష మంది పిల్లలకు కరోనా సోకితే ఒక్కరే వ్యాధి బారిన పాడుతారు అనేది నిరూపితమైన సత్యం . 


ఇన్నాళ్లు అసిమ్పటోమాటిక్ వ్యక్తుల నుంచి మిగతా వారికి సోకుతుందేమో అనే భయం ఉండేది . ఇప్పుడు టీకా వచ్చింది . టీకా వేసుకొన్న వారికి కరోనా సోకడం అనేదాన్ని ఆపలేము . కానీ టీకా ప్రభావం వల్ల వారు అసిమ్పటోమాటిక్ గా మారిపోతారు . అంటే వారికి వైరస్  సోకుతుంది కానీ వారు వ్యాధిగ్రస్తులు కారు . అంటే వారికి వ్యాధి లక్షణాలు పెద్దగా వుండవు . మహా ఉంటే ఒకటి రెండు రోజులు జలుబు దగ్గు .. అంతే . 


ఇప్పటికే మన దేశం లో వంద మందికి వైరస్ సోకితే 95 మంది అసిమ్పటోమాటికిగా వుంటున్నారు . మరో నలుగురు కూడా కేవలం మైల్డ్ గానే వ్యాధి బారిన పడుతున్నారు . తీవ్రంగా వ్యాధి  బారిన పడేది వందలో ఒక్కరే లేదా ఇంకా తక్కువ అంటే వెయ్యి లో ఒక్కరే ! ఇది నిరూపితమైన సత్యం . 


ఇన్ఫెక్షన్ { వైరస్ సోకడం } డిసీస్ { వ్యాధి బారిన పడడం } అనేదాని మధ్య తేడా గుర్తించనంత కాలం మన బతుకులు ఇలాగే   కునారిల్లు తాయి . అమాయకులైన ప్రజలు ఈ తేడా ను అర్థం చేసుకోలేక భయబ్రాంతులకు గురవుతారు . ఇది మారాలి . ఈ తేడా ను గుర్తించాలి . 


టీకా లు ఎంతో కొంత మేర కరోనా నుండి రక్షణ నిస్తాయి . అంటే డీసీసీ బారిన పడకుండా కాపాడుతాయి . అంటే టీకా వేసుకొన్న వారికి కరోనా సోకినా వారు పెద్దగా వ్యాధి గ్రస్తులు కారు . అంతకంటే మించి మన శరీరం లో డి విటమిన్ { రోజూ ఇరవై నిముషాలు ఎండలో కూర్చోవడం } సి విటమిన్ { కర్రీ లో నిమ్మకాయ పిండుకోవడం లేదా నారింజ పండు తినడం ; బి 12 విటమిన్ కోసం శాఖాహారులు టాబ్లెట్ తీసుకోవడం , ఐరన్ { ఆకుకూరలు } జింక్ { రోజుకు రెండు ఎండు ద్రాక్షలు } glycene { నువ్వులు } మాంసకృత్తులు { మాంసాహారులకు చికెన్ , మటన్ ఎగ్ { శాఖాహారులకు జామ కాయ, సొయా , పుట్టగొడుగులు , పనీర్ } ఉండేలా ఆహారం తీసుకోవడం జరగాలి . మన ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి వైరస్ అయినా మనల్ని ఏమీ చెయ్యలేవు . 1 . డైట్ .. అంటే పైన చెప్పినట్టు సమతుల ఆహారం } 2 . భయాందోళనలకు గురికాకుండా సంతోషంగా ఉండడం .. పాజిటివ్ ఫీలింగ్స్ ఇమ్మ్యూనిటి ను వంద రేట్లు బలోపేతం చేస్తాయి .  భయం లాంటి నెగటివ్ ఫీలింగ్ ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది . ౩. వర్కౌట్ .. అంటే కనీసం నడక . 4 . మంచి నిద్ర .. ఈ నాలుగు సూత్రాల దారంగా ఎనభై ఏళ్ళ వ్యక్తి కూడా వరం పది రోజుల్లో ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేసుకోవచ్చు . ఇలా చేసుకోకపోతే ఇక పై ప్రపంచం లో వైరస్ లాబరేటరీ లు సృష్టించనున్న కొత్త వైరస్ ను ఎదుర్కోలేము . భయం నేడు ఒక వ్యాపార  వస్తువు . ప్రజల్లో భయాన్ని వ్యాపింప చేయడాన్ని ప్రపంచ వ్యాపితంగా అనేక శక్తులు తమకు లాభాలు కురిపించే వస్తువుగా మార్చుకొంటున్నారు . అప్రమత్తత అవసరం . బయన్దోళనలు అనవసరం . జాగరూకత అవసరం . లేక పొతే బతుకు సాగదు.✍🏾

🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: