1, ఏప్రిల్ 2021, గురువారం

పిల్లలు~దేవుడు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

  *  

                🌷🌷🌷

🛑 *పిల్లలు~దేవుడు!*


*"అనగా అనగా ఒక ఊరిలో,"* అంటూ కథ ప్రాంభించబోయాడు శ్రీపతి. 


మనుమడు మారాము చేస్తుంటే, నన్ను కథ చెప్పమని వాళ్ళ నాయనమ్మ నాకు పురమాయించింది.


"నువ్వు చెప్పొచ్చు కదా? నువ్వయితే వాళ్లకు కావలసినట్టు చెప్తావు"


"నాకు వీలవకే మీకు చెప్పాను ఈ రోజు"


"ఎవరో ఒకరు చెప్పండి, తొందరగా" మనుమడి మారం!


"ఏమిటో ఆ తొందర?"

అనుకుంటూ పునః ప్రాంభించేను కథను.


" ఆ అనగా అనగా తీసెయ్యి . తరువాత చెప్పు" కొంచెం చిరాకు ధ్వనించింది స్వరంలో,

నిద్ర వస్తున్నట్టు వుంది. మళ్ళీ ప్రొద్దునే లేవాలి -స్కూల్ కూడా ఉంది.


"అలాగే చెప్తున్నాను, ఒక్కసారి బాత్రూం కెళ్ళి వచ్చేస్తాను.

మా బంగారం కదూ?"


"బంగారం కాను, కథ చెప్పూ"


జవాబు చెప్పకుండా నేను బాత్రూంకి వడిగా అడుగులు వెసుకుంటూ వెళ్ళాను.


తాపీగా నేను బయటికి వచ్చి- కథ ఎటు తిప్పి ఎటుచెప్పాలి, అని ఆలోచిస్తూ వచ్చేసరికి పిల్లవాడు నిదురపోయాడు.


" అరే -కథ చెప్పమన్నాడు, పాపం నిద్రపోయాడు" 

అనుకుంటూ నేనూ నిద్రలోకి జారుకున్నాను.


మర్నాడు శ్రీపతి నిద్ర లేచేసరికి - మనుమడు స్కూల్ కి వెళ్ళిపోయాడు. 

కొడుకు -కోడలు ఆఫీస్ కి వెళ్ళాలి కదా ! వాళ్ళ పనుల్లో వారు బిజీ గా ఉన్నారు.


శ్రీపతి భార్య పూజ అపుడే 

ముగుంచుకుని కనపడింది.

" రాత్రి కథ బాగానే చెప్పారు." 

నా మీద ఒక కామెంట్ పారేసింది. 


"నేనూ"

"సరే ముందు కాఫీ త్రాగండి!"


శ్రీపతి ఆలోచిస్తున్నాడు. శ్రీమతి గారి ఈ వ్యంగ్య బాణం ఏమిటో అని.

తరువాత తాపీగా అడిగాను,

"మనుమడు స్కూలు కి వెళ్లేముందు లేచావా? "


"అవును .. లేకుంటే నా పూజా పునస్కారం ఇంత వేగరం 

అయ్యేదా?


ఆ వ్యంగ్యాస్త్రం గురుంచి ప్రస్తావిద్దామని చూస్తున్నాను .


"ఇంతకీ మనుమడు ఏమి చెప్పేడేమిటి?


"ఏమంటాడు వాడు స్కూలు కెళ్లే తొందర. నేనే అడిగాను. 

ఏరా ! తాత కథ ఎలా ఉంది అని"


" బాగుంది మామ్మా, కొత్త రకంగా, మా స్కూల్లో విషయాలూ అన్ని కలిపి చెప్పారు" అన్నాడు.


నేను అవాక్కయ్యాను. 

ఏ కథ-నేను చెప్పలేదు. 

అలా అన్నాడేమిటి అని అలోచిస్తున్నాను .


" ఏమిటీ అలా ఉండిపోయారు. ఇంతోటి కథ మీరే చెప్పానని 

సంబడమా !"


"అదే తమాషాగా వుంది. నేను కథ చెప్పే లోపలే నిద్రయేయాడు. మరి నేను కథ చెప్పేనంటున్నాడేమిటి?"


"అవుతే మీరు కథ చెప్పలేదూ ? విడ్డురంగా వుందే"


పసి వాడు అసత్యం చెప్పడు. మరి ఈ తమాషా ఎమిటో అనుకుంటూ చతికిల పడిపోయాము.


అనుకోకుండా ఎదురుగా

వున్న పూజా గది వైపు ఇద్దరి చూపులు వెళ్లాయి. 


కొంటె కృష్ణుడు నవ్వుతున్నట్టు అనిపించింది. అంటే ? నా బదులు ఆ కృష్ణుడు వచ్చి పసివాని కోరిక తీర్చాడా?" 

మతి పోతున్నట్టు అనిపిస్తుండగా-


 -ఎక్కడో దూరంనుండి 


పాత సినిమాలో పాట వినిపిస్తోంది- 


" పిల్లలూ దేవుడూ చల్లని వారే--

కల్లకపటమెరుగని కరుణామయులే"

●●

లక్ష్మీనాథ్

🥀🌻🥀

కామెంట్‌లు లేవు: