22, ఆగస్టు 2021, ఆదివారం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *22.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2238(౨౨౩౮)*


*10.1-1346-వ.*

*10.1-1347-*


*సీ. రోషాగ్నిధూమప్రరోహంబు కైవడి*

  *శిరమున సన్నపు శిఖ వెలుంగ*

*నాశామదేభేంద్ర హస్తసన్నిభములై*

  *బాహుదండంబులు భయదములుగ*

*లయసమయాంతకోల్లసిత దంష్ట్రల భంగిఁ*

  *జాఁగిన కోఱ మీసములు మెఱయ*

*నల్లని తెగఁగల నడకొండ చాడ్పున*

  *నాభీల నీలదేహంబు వెలయఁ*

*ఆ. జరణహతుల ధరణి సంచలింపఁగ నభో*

*మండలంబు నిండ మల్ల చఱచి*

*శౌరి దెసకు నడచెఁ జాణూర మల్లుండు*

*పౌరలోకహృదయభల్లుఁ డగుచు.* 🌺



*_భావము: శ్రీకృష్ణునితో ఇలా మాట్లాడిన చాణూరుడు- రగిలిన క్రోధాగ్ని వలన తలపై ఏర్పడిన దీపశిఖయా అన్నట్లున్న ఆ పిలకతో, దిగ్గజముల యొక్క బలిష్టమైన తొండములతో సమానమైన భయంకర భుజదండములతో, ప్రళయ కాల యముని యొక్క పదునైన కోరల వలె సాగియున్న కోఱ మీసాలు మెరుస్తుండగా, నడిచే కొండా యన్నట్లున్న నల్లటి శరీరంతో భయం పుట్టిస్తూ, అడుగు తీసి అడుగేస్తున్నప్పుడు భూమి కంపిస్తోందా యన్నట్లు, భుజములపై చరుచుకున్నప్పుడు చేసే చప్పుడు ఆకాశమంతా నిండిపోతుండగా, ఆ మల్లయోధుడు పురజనుల మనస్సుల్లో బల్లెమై, శ్రీకృష్ణుని మీదికి లంఘించాడు._* 🙏



*_Meaning: Daunting Sri Krishna thus, Chanura appeared- like flame of fire on his head caused by extreme fury, with powerful shoulders like the trunk of wild elephant, shining of moustaches like the fangs of Yama at the time of Pralayam, creating fear and fright in the minds with his mountain like body in full black colour. It sounded like earthquake as he walked towards Sri Krishna and the huge noise created by slaps on his own shoulders spreading across the sky. Generating a feeling of spear piercing the hearts of the onlookers, that wrestler Chanura sprang upon Sri Krishna._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: