22, ఆగస్టు 2021, ఆదివారం

యదార్ధ దర్శనం

 యదార్ధ దర్శనం 

మనం రోజు మన చర్మ చక్షువులతో (కండ్లతో) అనేక విషయాలను చూస్తూ వాటికి సంబందించిన విషయం పరిజ్ఞానం పొందుతున్నాము. కానీ అదే ఒక అంథుడు ఆలా తెలుసుకోలేరు.  కానీ వారికి మనం తన ముందు వున్న వస్తువు యొక్క వివరాలు చెపితే అంటే నీవు చెప్పేది విని ఆ వస్తువుకు సంబందించిన జ్ఞానాన్ని పొందుతారు. నీవు నీకు తెలిసిన ఒక గ్రుడ్డి వాని వద్దకు వెళ్ళావనుకో అప్పుడు నీవు ఫలానా అంటే గతంలో నీతో వున్న పరిచయ జ్ఞానం వల్ల నిన్ను గుర్తించ గలుగుతాడు. అదే చక్కగా కండ్లు ఉండి చూడగల వాడు నిన్ను దూరం నుంచి చూసి గుర్తుపట్టి నిన్ను పలకరిస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఎవరి ఇంద్రియ జ్ఞానం యెంత వున్నది అన్నది. 

నేను ఇంకో ఉదాహరణతో వివరించేప్రయత్నిస్తాను. నీవు ఒక చీకటి గదిలో వున్నావు అనుకో దానికి ఒకటే ద్వారం వున్నది. ఆ రోజు అమావాస్య పూర్తిగా రాత్రి చీకటిగా వుంది. నేను ఆ గది తలుపు తీసాను.  నాకు నీవు గదిలో వున్నవిషయం తెలియదు.  కానీ ఎవరో తలుపు తీశారన్న విషయం నీకు తెలుస్తుంది.  ఎందుకంటె నీకు నేను కనబడక పోయిన తలుపు తీసినప్పుడు నీకు శబ్దం అయ్యింది, అది నీవు వినటం వలన నీకు గదిలో ఇంకొక మనిషి వచ్చాడని తెలుసుతున్నది. నేను మూడు రకాల టార్చి లైట్లు తీసుకొని వచననుకో ఒకటి యెర్రని కిరణాలను ప్రసారింప చేసేది ఒకటి మాములు కాంతిని ప్రసరించేది మరొకటి ఎక్స్ రేసులను ఉత్పత్తి చేసేది అనుకో. నేను గదిని ఒక టార్చి లైటు వెలిగించి చూసాను నాకు అప్పుడు గదిలోని వస్తువులు కనపడుతున్నాయి. కానీ అవి యెట్లా కనబడుతున్నాయి అన్నది ప్రశ్న. X రేసులను ప్రసరించే టార్చి తో వెతికాననుకో అప్పుడు ఆ కిరణాలను తట్టుకోలేని వస్తువులు నాకు కనిపించవు. అంటే నేను నీ మీద ఆ టార్చి వేస్తె నాకు నీ అస్థిపంజరం మాత్రమే కనపడుతుంది కానీ నీ రూపు రేకలు నాకు తెలియవు. నీవు కదులుతూ ఉండటం వల్ల ఒక సజీవ మనిషి నా ఎదురుగా ఉన్నట్లు నాకు అర్ధం అవుతుంది. అదే యెర్రని కిరణాలను ఉత్పత్తి చేసి టార్చితో నిన్ను చుస్తే నాకు నీవు కనపడతావు.  కానీ నే రంగు నాకు తెలియదు. అంటే నీవు స్త్రీవా లేక పురుషుడివా, నీవు చిన్న పిల్లవా లేక వయస్సులో వున్నా వానివా నేను తెలుసుకో వచ్చు. అదే నేను నీ మీద మాములు కాంతిని ప్రసరింప చేసే టార్చి లైటుతో చుస్తే నేను నీ గూర్చి పూర్తిగా తెలుసుకోగలను. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మన ముందు వున్న వస్తువు నిజ స్వరూపము కేవలము మనం చూసే వెలుతురూ మీద మాత్రమే ఆధారపడి వున్నది. 

గ్రుడ్డి వానికి విషయజ్ఞానము ఇతరులు చెప్పటం వలన తెలుస్తున్నది. అదే కండ్లు ఉన్నవానికి తాను చూసే వస్తువు మీద పడిన కాంతి వలన మాత్రమే యదార్ధం తెలుస్తున్నది. 

శరీరం వున్న ప్రతివారికి అస్థిపంజరం వున్నది. మనం శరీరాన్ని మాత్రమే సాధారణ కాంతిలో చూడగలము. కానీ మనకు ఉన్నఇతర అవగాహన వల్ల మనిషి శరీరంలో అస్థిపంజరం వున్నదని నమ్ముతాము.  అంటే ఆ విషయంలో మనకు ప్రత్యక్ష జ్ఞానం లేదు. అదే చీకటి గదిలో నేను నిన్ను అస్తిపంజరంగా చుస్తే నేను నీ నిజ స్వరూమాన్ని చూడలేను.  కానీ నీవు అస్థిపంజరం కాన్న భిన్నంగా వుండివుండొచ్చని నేను భావించగలను.  దానికి కారణం నాకు వున్న పూర్వ జ్ఞానం అయిన ఇతర మనుషులను చూసిన జ్ఞానం. 

భగవంతుని విషయంలో కూడా ఇదే విధంగా మనకు అనేక విధాల జ్ఞానం కలుగుతున్నది. నిజానికి మనకు భగవంతుని గూర్చిన ప్రత్యక్ష జ్ఞానం లేదు కేవలము మనకన్నా ముందు భగవంతుని దర్శించిన పూర్వ జ్ఞానుల అనుభవాలు వారు పేర్కొన్న విషయ జ్ఞానంతో మనం భగవంతుని గూర్చిన జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తాము.  మనం అనుసరించే జ్ఞాని జ్ఞానాన్ని మనం పరిక్ష జ్ఞానంగా తీసుకొని దానినే మనం నమ్ముతాము. 

మనం ఒక విషయాన్ని స్పష్టవంగా అర్ధం చేసుకోవ ప్రయత్నించాలి. మనం అనుసరించే జ్ఞాని భగవంతుని ఏ టార్చి లోటుతో చూసిన వాడు అన్నది ముఖ్యము. ఎక్స్ రే టార్చి తో చూసే వానిని మనం అనుసరిస్తే భగవంతుడు అస్థిపంజరం అని చెపుతాడు.  అదే ఎర్ర లైటు తో చుసిన వాడు భగవంతుని రూపాన్ని తానూ చూసినట్లు నల్లగా ఉన్నట్లు చెపుతాడు.  కానీ సాధారణ కాంతితో చూసిన వాడు మాత్రమే మనకు భగవంతుని గూర్చిన సవివర మైన విషయాలను తెలుపగలరు. 

ఇంకా వుంది. 

 

కామెంట్‌లు లేవు: