22, ఆగస్టు 2021, ఆదివారం

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 26    

                           SLOKAM : 26   

                                                

श्रीमन्नाम प्रोच्य नारायणाख्यं

केन प्रापुर्वाञ्छितं पापिनोऽपि ।   

हा नः पूर्वं वाक्प्रवृत्ता न तस्मिं -

स्तेन प्राप्तं गर्भवासादिदुःखम् ॥ २६॥  


శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం

కేన ప్రాపుర్వాంఛితం పాపినోఽపి I    

హా న: పూర్వం వాక్ప్రవృత్తా 

                                   న తస్మిన్  

తేన ప్రాప్తం గర్భవాసాదిదు:ఖం ॥ 26


    ఎంత పాపం చేసిన వారైనప్పటికీ ‘నారాయణ’అనే పవిత్రనామాన్ని స్మరిస్తే సకల శుభాలు పొందుతారు.    

అయ్యో! 

    నేను పూర్వం నా నోట ఆ నారాయణ మంత్రాన్ని ఉచ్ఛరించకపోయినందువల్లనే నాకీ జన్మము మరియు ఈ గర్భవాస దుఃఖం ప్రాప్తించింది.  


    What person, even if most sinful, has ever said aloud the blessed name Nārāyaṇa and failed to fulfill his desires? 

    But we, alas! never used our power of speech in that way, and 

    so we had to suffer such miseries as living in a womb.


ఉదాహరణ  


నారదుని పూర్వ జన్మ వృత్తాంతం  


    మహాభాగవతం మొదటి స్కంధంలో వారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. 

     తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.


    పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. 

    ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. 

    వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు.    

    ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడౌతానని గ్రహించాడు.


    అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. 

    ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. 

    చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది -  

"ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. 

    ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు" 

     - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.


    అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. 

    వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు, 

    బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. 

    అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. 

    తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.


    ఇలా తన కథ చెప్పి, హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.

    

https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: