23, సెప్టెంబర్ 2021, గురువారం

బ్రహ్మాండం

 నాసా అంతరిక్ష కేంద్రం విడుదల చేసిన గెలాక్సి ఫొటో మన భాషలొ అయితే పాలపుంత అని, మన శాస్త్రాల ప్రకారం అయితే "#బ్రహ్మాండం" అని అంటాం..!! 

ఫొటోలో కుడి వైపు వున్నది లింగాకార శివ లింగం..!!


బ్రహ్మాండం ఆకారం, శివలింగం ఆకారం రెండు ఒకేలా ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు..!!


పూర్వం మునులు , తపస్విలు, ఋషులు మన శాస్త్రాలలో ఈ విషయాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలియ చెప్పారు..!!


ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళీ విలసత్పూర్ణేందు వాంతామృతైః

అస్తోకాప్లుత మేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధమే ధ్రువపదం విప్రో$భిషించేచ్ఛివమ్


బ్రహ్మాండవ్యాప్తదేహభసితహిమరుచాభాసమానా భుజంగైః

కంఠేకాలాః కపర్దాకళిత శశికళాశ్చండ కోదండ హస్తాః త్ర్యక్షా

రుద్రాక్ష మాలా సులలిత వపుష శ్శాంభవా మూర్తి భేదా

రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్


  💥బ్రహ్మాండమే శివలింగం... 

  సమస్త బ్రహ్మాండమే శివస్వరూపం ...

  శివ లింగానికి ప్రదక్షిణ చేయడం సమస్త లోకాలను ప్రదక్షించడంతో సమానం 

  శివ లింగాన్ని అభిషేకం చేయడం సమస్త బ్రహ్మాండాన్ని సేవించడంతో సమానం..!!


విఘ్నేశ్వరుడూ కూడా శివ పార్వతులను ముమ్మారు ప్రదక్షిణ చేయడం వల్లనే గణాధిపతి/విఘ్నాధిపతి అయ్యాడు..!!


అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహా అని అమ్మవారిని

పిలుస్తారు.!! ఒక బ్రహ్మండం కాదు ఇలాంటివి అనేక కోట్ల 

బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ విశ్వంలో...


వేదాంతంలో ఏమి చెబుతారంటే అండం_పిండం_బ్రహ్మాండం.!!

అండంలో ఉన్నదే పిండంలో ఉంటుంది..!!

పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంటుంది..!!


అందుకే ఏడుకొండలవానిని అండపిండబ్రహ్మాండనాయకుడు అని, అఖిలాండకోటి 

బ్రహ్మాండనాయకుడు అని అంటారు..!!


'లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది..!! అందుకే అది లింగమైంది..!!

     ఈ సృష్టి సమస్తం #శివమయం.! #లింగస్వరూపం..!!


-🚩ఓం నమ: శివాయ🚩

కామెంట్‌లు లేవు: