23, సెప్టెంబర్ 2021, గురువారం

వినాయకుని నామాలు,*

 వినాయకుని నామాలు,*

                 *వాటి అర్ధాలు:*

                 ➖➖➖✍️

1. *వాతాపి గణపతి:*

గాలిని పానం చేయడం అని అర్థం. అంటే ప్రాణాయామాది సాధనల వల్ల వాయువుని నియంత్రించడం. అదే వాతాపి లక్షణం. వినాయకుడు మూలాధార అధిష్టాన దేవత. కుండలినీ జాగరణ అక్కడే ప్రారంభమౌతుంది. అటువంటి యోగంలో ముఖ్యమైనది వాయునియంత్రణ. ఏనుగు నీటిని లోనికి, పైకి పీల్చిన్నట్లు మూలాధారములోని కుండలినిని పైకి తీసుకువెళ్తేనే సిద్ధి. కనుక ప్రాణవాయువును నియంత్రించి ఆ ఊర్ధ్వ దిశలో పయనింపచేసే చైతన్యమే వాతాపి అలా యోగశక్తిగా ఉన్న గణపతినే *వాతాపి గణపతి.* అంటారు.


2. *ఉచ్చిష్ట గణపతి:*

అక్షరములకు ప్రభువు ఓంకారం. గణపతి ఓంకార స్వరూపుడు. అక్షరములు అన్ని వెలువడేది నోటినుండే. నోటి నుండి వచ్చినది ఉచ్చిష్టo. కనక అక్షరపతే ఉచ్చిష్ట గణపతి.


3. *మహాగణపతి/వరసిద్ధి వినాయకుడు:*

మహా అనేది పరబ్రహ్మ వాచకము. గణపతి సర్వదేవతాత్మకడు. 11 చేతుల(10 చేతులు,1తొండం) తో వుంటాడు. ఆయా చేతులలో వివిధ దేవత సంకేతాలుగా, వారి వారి ఆయుధాలను ధరిస్తాడు.

అవి:

*ఒక చేతిలో చక్రం-పద్మం--విష్ణులక్ష్మీ తత్వం.

*ఒక చేతిలో త్రిశూలం-పాశం--శివ పార్వతి తత్వం.

*చెఱుకువిల్లు,నల్లకలువ- మన్మధుడు, రతీదేవి తత్వం.

*వరికంకి, గద- భూదేవి వరాహస్వామి తత్వం.

*బీజాపూరం(దానిమ్మ పండు), ఏకదంతం -- పుష్టి, పుష్టి పతి తత్వం.

*ఇక తొండంలో రత్న ఖచిత కలశం- మోక్షానికి సంకేతం.


4. *లక్ష్మీ గణపతి:*

ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం! అదే లక్ష్మీ అంటే. (గాయకుడికి- పాడగలడమే శక్తి)

గణపతి యొక్కశక్తి యే లక్ష్మీ అంటే.( *విష్ణుపత్ని లక్ష్మి అని ఇక్కడ కాదు.)*


5. *నాట్య గణపతి:*

ఆనందంగా ఉన్నప్పుడే నాట్యం చేస్తారు.ఆనంద గణపతే నాట్య గణపతి అన్నా తాండవ గణపతిఅన్నా కూడా.

కాలం లయాత్మకo, ఊపిరీ లయాత్మకo అలా లయాత్మకంగా గమనం చేసే చైతన్యమే నాట్య గణపతి.


6. *హేరంబ గణపతి:*

శుభమైన శబ్ద స్వరూపుడు అంటే ఓంకార స్వరూపుడు.

హే=దీనులు, రంభ=పాలించువాడు దీనులను పాలించువాడు.


7. *వినాయకుడు:*

విగతనాయకుడే వినాయకుడు . అంటే ఆయనకు పై ఇక వేరే నాయకుడు లేరు.

వినయమును ఇచ్చువాడు వినాయకుడు.


8. *మూషిక వాహనుడు:*

గుండె గుహలోని జీవుడనే ఎలుక, ప్రపంచం చుట్టూ తిరిగి, విషయవాంఛలన్నీ ఆ హృదయ గృహలో అనుభవిస్తూ ఉంటాడు. ఆ జీవాత్మని అధిష్టించిన పరమాత్మ మూషిక వాహనుడు.


నోరుఅనే కలుగులో తిరిగే నాలుకే ఎలుక. దాన్ని అధిష్టించి వచ్చే అక్షరపతే గణపతి- మూషిక వాహనుడు.


09. *గణపతి:*

మనుషులు, ఇంద్రియములు, పంచప్రాణాలు. ఇలా ఏమి చూసినా గణములే. ఆ గణములన్నిటికీ పతియే - గణపతి.✍️

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!

కామెంట్‌లు లేవు: