23, సెప్టెంబర్ 2021, గురువారం

నాటి ఇంద్రపురమే

 నాటి ఇంద్రపురమే నేటి నిజమాబాదు.

.......................................................


రాష్ట్రకూటరాజైన ఇంద్ర వల్లభునకు బోదనపట్టణం రాజధానిగా వుండేది. తెలంగాణాలోని ఇప్పటి బోదన్ పట్టణనానికి గల నిజమైన పేరు బొదన. ఆంగ్లమోజులోపడి మనం ఇలా తయారయ్యాం. ఈ రాజు బోదన పట్టణాన్ని రాజధానిగా పాలించాడు. 1086 కాలంనాటి శాసనమొకటి ఇక్కడే లభించింది. వేయించినవాడు త్ర్యలోక్యమల్ల ప్రథమసోమేశ్వరుడు. 


" రాష్ట్రకూటాయ చక్రేశ్వరం ఇందరవల్లభం

రాజధాని బోదనదోళ్ మాడిసిద

ఇంద్రనారాయణదేవర దేవాయతనం "


పై కన్నడశాసనం ప్రకారం ఇంద్రవల్లభుడు బోదనపట్టణంలో ఇంద్రనారాయణదేవర దేవస్ధానాన్ని నిర్మించాడు.


ఇప్పటి నిజమాబాదుకు మొన్నటి వరకు ఇందూరు అని పేరు. ఇందూరు అనేపేరు ఇంద్రపురం నుండి వచ్చిందని, ఇంద్రపుర నిర్మాత ఇంద్రవల్లభుడేనని అతని పేరు మీదుగానే ఇంద్రపురాన్ని నిర్మించడం జరిగిందని చరిత్రకారుల నిర్ణయం.


॥సేకరణ॥

______________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: