20, సెప్టెంబర్ 2023, బుధవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* *🚩జీవిత గాథ🚩* *భాగం 44*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹


*🌹చారిత్రాత్మకకథాస్రవంతి🌹*

*ఓం నమో భగవతే రామకృష్ణాయ*


*🚩శ్రీ వివేకానందస్వామి🚩*

       *🚩జీవిత గాథ🚩*   


*భాగం 44*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


గురుసేవ :   ఆధ్యాత్మిక జీవితంలో గురువును సేవించడం ఎంతో ప్రధానమైనది. గురువును సేవించే ఏ అవకాశాన్నీ శిష్యుడు కోల్పోవడానికి ఇష్టపడడు. గురువును సేవించడం ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ముఖ్య నియమంగా మన శాస్త్రాలు

వచిస్తున్నాయి. కాని శ్రీరామకృష్ణులు తమకు ఎలాంటి సేవ చేయడానికి నరేంద్రుణ్ణి అనుమతించేవారు కారు. ఆయనకు వీచడం, కాళ్లు ఒత్తడం, నీళ్లు తీసుకొని వెళ్లడం లాంటి పనులను తక్కిన యువకులు చేస్తున్నప్పుడు తానూ చేయ గోరాడు నరేంద్రుడు. కాని అతడు ఏ పనినైనా చేయడానికి ఉపక్రమించినప్పుడు శ్రీరామకృష్ణులు ఠక్కున ఆపి, "నీ దారి వేరు" అనేవారు.


"సేవించడం మనస్సు పావనమవడానికే. కాని నరేంద్రుడు ఇప్పటికే పావన మనస్కుడు. కనుక అతడు సేవించనవసరం లేదు" అన్నదే శ్రీరామకృష్ణుల అభిప్రాయం. ఇందుకు మరో కారణం కూడా ఉండవచ్చు. "నేను నిన్ను సాక్షాత్తూ నారాయణునిగానే చూస్తున్నాను" అని శ్రీరామకృష్ణులు నరేంద్రునితో చెప్పేవారు. ఆ నారాయణుడు తమకు సేవచేయడమా అనే ఆలోచన కూడా ఆయనకు కలిగి ఉండవచ్చు. "నన్ను ఇంతగా అభిమానిస్తూ, అదేసమయంలో నా పట్ల గౌరవభావం వ్యక్తం చేసిన అలాంటి వ్యక్తి మరొకరు ఉండరు” అని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు.


అలాగని నరేంద్రుడు ఏం చేసినప్పటికీ శ్రీరామకృష్ణులు దానికి ఆమోద ముద్ర వేసేవారని అనుకోకూడదు. "నా పట్ల ఆయనకు ఎంత అభిమానం! అదేసమయంలో నాలో ఏదైనా చెడు తలంపు తలెత్తిన క్షణంలోనే ఆయనకు స్ఫురించేది. ఉద్యోగాన్వేషణలో దిక్కుతోచక రోజుల్లో దుష్ట బృందంలో చిక్కుకొన్నాను. శ్రీరామకృష్ణుల దృష్టిలో ఉద్యోగాన్వేషణ ఒక లౌకిక చర్య. కనుక ఆ రోజుల్లో నేను ఇచ్చే ఏ ఆహారాన్ని ఆయన తినేవారు కారు. తినడానికి చేతులు ఎత్తబోయేవారు, కానీ చెయ్యి పైకి లేచేది కాదు. పిదప నాతో, 'ఇంకా నువ్వు తయారవలేదు' అనేవారు" అంటూ కాలాంతరంలో నరేంద్రుడు చెప్పేవాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: