20, సెప్టెంబర్ 2023, బుధవారం

🪷 శ్రీ మద్భగవద్గీత

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 31వ శ్లోకం* 


 *స్వధర్మమపి చావేక్ష్య న వికంపితు మర్హసి |* 

 *ధర్మాద్ధి యుద్ధా చ్చ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే || 31* 


 *ప్రతి పదార్ధం* 


చ = ఇంకను ;స్వధర్మం = (నీ) స్వధర్మమును;అవేక్ష్య = చూచి; అపి = ఐనను; వికంపితుమ్ = చలించుటకు ( భయపడుటకు );న, అర్హసి = అర్హుడవు కావు ( భయ పడ దగదు );హి = ఏలనన ; క్షత్రి యస్య క్షత్రియునకు; ధర్మ్యాత్ = ధర్మయుక్తమైన ; యుద్ధాత్ = యుద్ధముకంటె ; అన్యత్ = మరి యొకటి; శ్రేయః = శ్రేయస్కరమైన కర్తవ్యము;న విద్యతే = ఉండదు ;


 *తాత్పర్యము* 


అంతే గాక స్వధర్మమును బట్టి యు నీవు భయపడనక్కర లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధ మునకు మించి నట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరియొకటి ఏదియును లేదు.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరః ఓం🙏🙏*

కామెంట్‌లు లేవు: