*1923*
*కం*
అతిగా వెచ్చించగ సిరు
లతిగా మాట్లాడమాటల లల్పములయ్యున్.
మితభాషణభూషణమగు
మితవ్యయము సిరులగాచు మేటిగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! అతి గా వ్యయము(ఖర్చు) చేస్తే సిరులు,అతి గా మాట్లాడగా మాటలు విలువలు కోల్పోవును. మితభాషణము ఒక ఆభరణమవుతుంది, మితముగా వ్యయం చేయుటవలన సిరులు గొప్పగా కాపాడబడును.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి