శు భో ద యం🙏
శు భో ద యం🙏
! కవితా సౌందర్యం
భాషకు అందాన్ని పెంచేది కవిత్వం. నెమలికిపింఛంలా! కోయిలకు స్వరంలా! ఒక్కొకికదానికి ఒక్కొక దానివల్ల అందం యేర్పడుతుంది. భాష అంటే యేమిటి శబ్దార్ధముల కలయికచేనేర్పడు భావసూచిక! దానిని అందగింప జేసేది కవిత్వం. అదికాస్త ముదిరితే కావ్యం. ఆకావ్య సముదాయమే సాహిత్యం. మనసాహిత్యంలో యెన్నిసొగసులున్నాయి? అబ్బో! చెప్పలేం?
ఆణి ముత్యాలవంటి కవులు ,మణిహారాల లాంటికావ్యాలు, పంచదార బిళ్ళలవంటి పద్యాలు.ఇలా భాషాసౌందర్యం, కవితాసౌందర్యం, అనేక ముఖాలుగా విస్తరించింది.
అలాంటి విచిత్రాలలో మంచి శబ్ద చిత్ర మొకటి మీకు పరిచయం చేస్తాను. వినండి! యీపద్యంలో పైకి నిందిస్తున్నట్లు ఉండటం విశేషం.కానీ అదినిందకానేకాదు. పొగడటమే! దానినే స్తుతి నిందాలంకార మంటారు.యిదిగో పద్యమిది.
సీ: ఆలు నిర్వాహకురాాలు భూదేవియై
అఖిల భారకుడన్న ఖ్యాతిఁదెచ్చె;
ఇష్ట సంపన్నరా లిందిర భార్య యై
కామితార్ధకుడన్న ఖ్యాతిఁ దెచ్చె;
కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై
బహు కుటుంబికుడన్న బలిమిఁ దెచ్చె;
కలుష విధ్వంసిని గంగ కుమారియై
పతిత పావనుడన్న ప్రతిభఁ దెచ్చె;
గీ: ఆండ్రు బిడ్డలు దెచ్చు ప్ర ఖ్యాతిగాని
మొదటినుండియు నీవు దామోదరుడవె,
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ
హత విమత జీవ- శ్రీ కాకు ళాంధ్ర దేవ!
భూదేవి నీభార్య కాబట్టి అన్నీ భరించే వాడవనే పేరొచ్చింది. లక్ష్మీదేవి నీయిల్లాలు కాబట్టి కోరినవన్నీ యిచ్చేవాడవనే ఖ్యాతి దెచ్చింది. బ్రహ్మ నీ కొడుకు కాబట్టి సృష్టి మొత్తం నీకుటుంబమేనన్న ఖ్యాతి దెచ్చాడు. పాపాల నన్నింటినీ ప్రక్షాళణ చేసే గంగా దేవి నీకూతురై పతిత పావనుడనే పేరు దెచ్చింది. ఇదంతా భార్యలూ పిల్లలూ నీకు తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులేగానీ నీకు విజంగా యేమున్నదయ్యా! మొదటినుండీ నీవు దరిద్ర దామోదరుడవే! అంటాడుకవి.
భూదేవి, శ్రీదేవి నీభార్యలు. సృష్టికర్త బ్రహ్మ నీకుకొడుకు. పాపహారి గంగాదేవి నీకుమార్తె, శ్రీహరీ నీవెంత గొప్పవాడివయ్యా! అనిపొగడ్త. చూశారావింత. తిట్టినట్టు జేసి పొగడటం!
స్వస్తి!
🙏👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి