ఒక సాయంత్రం, భర్త తలుపు దగ్గర నుండి అలా ఎప్పటిలాగే పిలిచాడు:
“ పండూ , నేను కొంచెం సేపు ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళొస్తా .”
బట్టలు మడుస్తూ ఉన్న భార్య అతని వైపు ఒక్కసారి చూసి,
“సరే. ఎంజాయ్ చేయండి,” అనింది.
అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది.
సాధారణంగా ఆమె అతనికి — త్వరగా రావాలని, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, ఎక్కువసేపు బయట ఉండొద్దని — ఏదో ఒకటి చెప్పేది.
కానీ ఆ రోజు రాత్రి అదేమీ లేదు. ఉపన్యాసం లేదు, నిట్టూర్పు లేదు, ఎందుకు అన్న ప్రశ్న లేదు. కేవలం ఒక శాంతమైన “సరే.”తో ఒప్పుకొంది.
కొన్ని గంటల తర్వాత, వారి టీనేజ్ కొడుకు చేతిలో ఒక పేపర్ పట్టుకుని కిచెన్‌లోకి వచ్చాడు. ముఖం స్పష్టంగా పసుపురంగులోకి మారింది.
“అమ్మ,” అని నెమ్మదిగా అన్నాడు, “నా మాక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి… చాలా తక్కువ వచ్చాయి.”
అతను నిలబడి, అమ్మ తిడుతారని ముందే ఊహించుకున్నాడు.
అతనికి తెలుసు — అమ్మ చదువుపై ఎంత శ్రద్ధ పెడుతుందో.
సాధారణంగా వచ్చే ఉపన్యాసం, టైమ్ వృథా చేశావు, నీ టాలెంట్ సరిగా వాడుకోవడం లేదు…అంటుందని ఎదురుచూశాడు.
కానీ ఆమె తల ఊపి,“సరే,” అనింది.
అతను ఆశ్చర్యపోయాడు.
“కేవలం… సరే?”
“అవును,” అంది ఆమె మృదువుగా. “నువ్వు కష్టపడితే. వచ్చే సారి బాగా వస్తాయి. లేకపోతే సెమిస్టర్ రిపీట్ చేయాలి. అది నీ నిర్ణయం. ఏది ఎంచుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను.”
అతను కన్ఫ్యూషన్తో వెళ్లిపోయాడు. అమ్మ ఇంత శాంతంగా ఎప్పుడు మారిపోయింది ? అని ఆశ్చర్యపడ్డాడు.
మరో రోజు మధ్యాహ్నం, వారి కూతురు భయంతో ఇంట్లోకి వచ్చింది. హాలులో కాసేపు ఆగి, లివింగ్ రూమ్‌లోకి అడుగు పెట్టింది.
“అమ్మ,” అంది తడబడి, “నేను… కారు ఢీకొట్టేశాను. పెద్దది కాదు కానీ డెంట్ వచ్చింది.”
అమ్మ కోపపడలేదు, అరవలేదు, కనుబొమ్మలు ఎత్తలేదు కూడా. కేవలం,
“సరే. రేపు రిపేర్ షాప్‌కి తీసుకెళ్లి సరిచేయించు,” అంది.
అమ్మకు కోపం రాకపోవడంతో కూతురు షాక్ అయ్యింది.
“మీకు… కోపం లేదా?” తల్లి చిరునవ్వు నవ్వింది.
“లేదు. కోపపడితే కారు మళ్లీ బాగవుదు కదా. ఇక నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి అంతే.”
ఇప్పటికే ఇంట్లో అందరూ ఆందోళన పడడం మొదలుపెట్టారు. ఇలా ఉండే మహిళ కాదు ఆమె. ఆందోళన, ఒత్తిడి, ఉపన్యాసాలు — ఇవన్నీ సాధారణం.
కానీ ఇప్పుడు? శాంతి, సమతుల్యత, ప్రశాంతత.
వాళ్లు తమలోనే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఏం జరిగింది? ఆరోగ్యం బాగోలేదా? ఏదైనా బాధ ఉందా?
ఆ సాయంత్రం, వాళ్లు ముగ్గురూ ఆమెను కిచెన్ టేబుల్ వద్ద కూర్చోబెట్టారు.
భర్త అడిగాడు,
“ పండూ … నువ్వు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నావు. ఏమైంది? బాగున్నావా?”
ఆమె తన కుటుంబాన్ని — ఎన్నేళ్లుగా తెలియకుండానే తన సహనాన్ని పరీక్షించిన ఈ మనుషులను — స్నేహంగా చూసి చిరునవ్వు నవ్వింది.
“ఏమీ కాలేదు. ప్రతిదీ బాగానే ఉంది. నేను కేవలం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను.”
వాళ్లు ఆగి ఆమె మాట కోసం ఎదురుచూశారు.
“ప్రతి మనిషి తన జీవితం గురించి పూర్తిగా తానే బాధ్యత వహించాలి అని తెలుసుకొనేందుకు నాకు చాలా కాలం పట్టింది,” అని ఆమె చెప్పింది.
భర్త కాస్త అయోమయంగా,
“అంటే?” అని అడిగాడు.
ఆమె చేతులను టేబుల్‌పై ఉంచి చెప్పింది:
“ఇంతకాలం నేను అన్నింటికీ భయపడేదాన్ని. నువ్వు రావడం ఆలస్యమైతే భయం. పిల్లలకు మార్కులు తక్కువైతే నిందించేదాన్ని. ఏదైనా పాడైతే కోపపడేదాన్ని. ఎవరు బాధలో ఉన్నా, నేను సరి చెయ్యాలని చూసేదాన్ని. అందరి సమస్యలను నా భుజాలపై మోశాను.
కానీ ఇంతకాలం తరువాత తెలుసుకున్నాను — *నా ఆందోళన వాళ్ల సమస్యలను పరిష్కరించదు. అది నా మనసుకే నష్టం.”*
ఆమె కూతురు నిశ్శబ్దంగా వింటోంది.
ఆమె మరింత మృదువుగా కొనసాగించింది.:
“నా టెన్షన్ ఎవరికీ లాభం లేదు ?. నా ఒత్తిడి మీ జీవితాలను సరి చేయదు — కేవలం నన్నే అలసటకు గురి చేస్తుంది. నేను మీరు చేయాల్సిందేమిటో చెప్పగలను, *ప్రేమించగలను, తోడుగా నిలబడగలను. కానీ మీ జీవితాలను నేను జీవించలేను. నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఫలితాలను మీరు ఎదుర్కోవాలి — మంచైనా, చెడైనా.”*
కాసేపు ఆగి, మళ్ళీ నవ్వింది.
“అందుకే, *నా నియంత్రణలో లేని విషయాలను వదిలేశాను.”*
కొడుకు అడిగాడు:
“అంటే… మాకు ఏమయినా మీకు పట్టదా?”
ఆమె తల ఊపి,
“ ఎందుకు పట్టదు, చాలా పట్టింది. ప్రేమించడం. నియంత్రించడం — ఇవి ఒక్కటి కాదు.
నేను శాంతిని కోల్పోకుండా ప్రేమించగలను .
మీ సమస్యలను నా భారం కాకుండా మీకు తోడుగా ఉండగలను.”
గది నిశ్శబ్దమైంది.
వాళ్లందరిని ఒక్కొక్కరిని చూసి ఆమె చెప్పింది:
“నా పని మిమ్మల్ని ప్రేమించడం, దారి చూపించడం, మీకు అవసరం ఉన్నప్పుడు ఉన్నాను అని చూపించడం .
కానీ *మీ పని — మీ జీవితాన్ని మీరు జీవించాలి . మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి.. ఫలితాలను మీరు ఎదుర్కోవాలి*. అని తెలుసుకొన్నా”
ఆమె కుర్చీలో అలా వెనక్కి వాలి, కళ్లలో మృదువైన కాంతితో అంది:
“ఏదైనా తప్పు జరిగితే, ‘ఇది నా పని కాదు’ అని నేను గుర్తు చేసుకుంటాను. నేను ప్రశాంతముగా ఉంటాను. మీరు నేర్చుకుంటారని నమ్ముతాను. ఎందుకంటే జీవితం అంటే — పాఠాల వరుస.”
కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు.
కానీ ఇంట్లో ఏదో మారిపోయింది.
భర్త ఆమె చెయ్యిని పట్టుకుని,
“నువ్వు మాకు కూడా చాలా నేర్పావు అనిపిస్తోంది,” అన్నాడు.
ఆమె నవ్వింది.
“కానీ నేను దీన్ని నేర్చుకోవడానికి చాలాకాలం పట్టింది.”
ఆ రాత్రి అందరూ ఆమె మాటలు బాగా గుర్తుతెచ్చుకొన్నారు .
కొడుకు పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు — అమ్మ అరవకపోయినా, అది తన బాధ్యత అని గ్రహించి.
కూతురు కారు రిపేర్ షాప్‌కి అపాయింట్‌మెంట్ పెట్టి, ఇన్సూరెన్స్ ప్రాసెస్ నేర్చుకుంది.
భర్త ఇకపై బయటకు వెళ్తూ తప్పకుండా ఫోన్ చేసేవాడు — ఆమె అడిగినందుకు కాదు , కానీ అతనికి చేయాలని అనిపించినందుకు.
మెల్లగా… ఆ ఇల్లు నెమ్మదిగా ప్రశాంతముగా కనిపించడం మొదలైంది.
ఎవరూ భయంతో లేరు .
ఎవరూ కోపానికి ఎదురుచూడలేదు.
*ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తామే ఎదుర్కోవడం మొదలుపెట్టారు —* భయంతో కాదు, *బాధ్యతతో . .*
ఎందుకంటే ఒకరు శాంతిని ఎంచుకున్నప్పుడు. ఆ శాంతి ఇల్లంతా అల్లుకుంటుంది..
*ఒకరు నియంత్రించడం ఆపినప్పుడు…*
మిగతావాళ్లు *తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు.*
*అలా ఒక ఇంట్లో ప్రశాంతత వ్యాపిస్తుంది.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి