ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
21, అక్టోబర్ 2020, బుధవారం
సహస్రనామం
విష్ణు సహస్రనామం. యిది వేదములో వర్ణించిన శక్తి పూర్ణమైన పదార్ధాలు లక్షణము. దీనిని ఎందరో ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో పదే పదే చెప్పవలసి వచ్చింది. అనగా అంత అఙ్ఞానం బలీయంగా ప్రబలి యున్నది. వేదం అది యిది అని సూత్రప్రాయంగా చెప్పి యున్నారు. చెప్పాలంటే తెలియాలి. అనగా దర్శించాలి.సాధనతో తెలియాలి. వకరు ఎంత చెబుతారు చెప్పినది ఎవరికి వారే తెలుసుకోవాలి. మహర్షులు సాధన చేసి తెరిచారు. అందుకే వారు యప్పటికీ వారి ఆత్మ నక్షత్ర మండలంలో యుండి దర్శించు చున్నారు మానవ నడవడి కలను. అధర్మ నడక అయినపుడు వారు భగవంతుని తో కలిసి భూమిపై అవసార్ధం ఉద్భవస్తారు. మనం కూడా ఏదైనా అవసరం వుంటేనే ఎవరినైనా ఆశ్రయిస్తాము. ఏ అవసరం లేకపోతే ఎవరినీ లెక్క చేయండి. అదియే అఙ్ఞానం. యీ స్తోత్రం యుధ్ధం భూమిలో చెప్పబడినది. నీ కర్మ నీవు చేయమని అధర్మానికి నశింపచేయుటకు. భగవంతుడు కారణము అర్జునుడు కారకుడు. రెండూ భగవంతుని అంతలో. నిజంగా కృష్ణుడు ఆత్మ సౌలు. వేరే ఎవ్వరూ కాదు. ఇంత బలవంతుడు కూడా కృష్ణుని ఆశ్రయించాడు. అనగా సూపర్ పర్వ భగవంతుడే తప్ప యింకెవరూ కాదు. అది మనదేశంలోనే ఆత్మ రూపంలో గల శక్తి యే. కొంతమందికి ఙ్ఞానులకు తెలుసు అది భగత్తవత్నమని. కొంతమందికి మానవ రూపంలో యున్న నరుని మాత్రమే. దీనికి శిశుపాలుడు, దంతవక్త్ర, దుర్యోధన, జరాసంధ, కంసాది అజ్ఞానులు. భీష్మ, విదురుడు మెుదలగు భాగవతభక్తులు. యీ నాడు కూడా అదే పరంపర. యీ సంఘర్షణ యిప్పుడు అధికమైనది. అంతమంది మరణానికి కారణం అంత బలమైన అఙ్ఞానం. యీ స్తోత్ర మంతా సృష్టి పరిణామం గురించి అంతా భహవత్తత్వమని చెప్పుటే.ప్రతీ అక్రమ మంత్ర శక్తి యే. ఆదినుండి మంచి చెడు సంఘర్షణ యే శక్తి పరిణామం. ఙ్ఞానం సృష్టి వి నాశనమునకు ప్రయత్నించుటయే అసుర ప్రవృత్తి.' సో అహం' అనే వకే శ్లోకం సమస్తం ఉపనిషత్ సారం. నసంశయః సంశయం లేకుండా స్తుతి చేయుట ఙ్ఞానం. అసలు వుందా లేదా అన్నదే అఙ్ఞానం నీ లోనే గమనం భగవత్ శక్తి. వచ్చి వెళ్ళుటేే భగవత్ శక్తి.
మొగలిచెర్ల అవధూత
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
ఋణానుబంధాలు..
శ్రీ స్వామివారి మందిరాన్ని నాన్నగారు 1987 - 90 ప్రాంతంలోనే దేవాదాయ శాఖ వారికి అప్పచెప్పివున్నారు..అందువల్ల నాన్నగారి స్థానంలో వ్యవస్థాపక ధర్మకర్త గా నేను నియమింపబడటానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి..అందుకు అమ్మా నాన్న గార్లే కాక, మా అన్నయ్య, చెల్లెలు కూడా అనుమతి ఇస్తూ పత్రాలు వ్రాసి ఇవ్వాలి..అన్నయ్య చెల్లెలూ ఇద్దరూ కూడా ఒకేఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ అంగీకారాన్ని ఇచ్చేసారు.."మొదటినుంచీ నువ్వే అక్కడి బాగోగులు చూస్తున్నావు..శ్రీ స్వామివారి మందిరాన్నీ నువ్వు నిర్వహించు!..నాకు అంతగా అలవాటు లేదు కదా!.." అని అన్నయ్య చెప్పాడు..అలా శ్రీ స్వామివారి సన్నిధికి నేను చేరడానికి మార్గం సుగమం అయింది..
మామూలుగా ప్రభుత్వం నుంచి అనుమతి రావడం అంత త్వరగా అయ్యే పనికాదు..కానీ నా విషయం లో అలా కాకుండా కేవలం నెల రోజుల్లోపలే ధ్రువీకరణ పత్రాలు వచ్చేసాయి..ప్రతి చిన్న అడుగులోనూ శ్రీ స్వామివారి ఆశీస్సులు వెంటాడుతూనే ఉన్నాయి..నేనే గ్రహింపలేకపోయాను..
శ్రీ స్వామివారి మందిర నిర్వహణ కు నేను సమాయత్తం కావడానికి ముందు నేను వ్యక్తిగతంగా చాలా సమస్యల్లో చిక్కుకొని వున్నాను..వ్యాపారం లో విపరీతంగా నష్టపోయి..ఆర్ధికంగా చితికి పోయి వున్నాను..పైగా వ్యాపారం తాలూకు ఋణ భారం మోయలేనంతగా ఉన్నది..పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు..ఋణ బాధకు తోడు..ఋణదాతలు వేసిన సుమారు పదకొండు కోర్టు కేసులు..అటువంటి పరిస్థితి లో ఉన్న నాకు..హఠాత్తుగా నాన్నగారు అనారోగ్యం పాలై..శ్రీ స్వామివారి మందిర నిర్వహణ నెత్తికెత్తుకోవడం సాహసం తో కూడుకున్న పనే..
కానీ ఎందుకనో మనసులో ఒక మూల .."ఈ సమయం లో నాకు శ్రీ స్వామివారు తోడుగా వుంటారేమో..ఇక ఆయన పాదాలు పట్టుకొని శరణు వేడుకుందాము.. " అనే ఆలోచన వచ్చింది..ఎప్పుడైతే శ్రీ స్వామివారి మందిర ధర్మకర్త గా బాధ్యత తీసుకున్నానో..ఆరోజే శ్రీ స్వామివారి సమాధి వద్ద ఉన్న శ్రీ స్వామివారి పాదుకులకు శిరస్సు ఆనించి.."స్వామీ!..ప్రస్తుతం వేరే దిక్కు లేదు..నువ్వే కాపాడాలి..పరువూ మర్యాద కాపాడుతూ నన్ను గట్టెక్కించే భారం నీదే తండ్రీ.." అని నేనూ.."మా సంసారాన్ని చల్లగా చూడు తండ్రీ.." అని నా ఆవిడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము..
అలా ప్రార్ధన ముగించుకొని సమాధి మందిరం నుంచి బైటకు రాగానే..కొద్దిక్షణాల్లోనే..ఒక సంఘటన జరిగింది..నా మీద కేసు వేసిన ఒక ఋణదాత నేరుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..నన్ను చూసి..గబ గబా నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..దాదాపు నాలుగైదు ఏళ్ళు ఇద్దరమూ వ్యాపారం లో కలిసేవున్నాము..నా అవసరాలకు మీరు, మీ అవసరాలప్పుడు నేను సర్దుకుంటూ వున్నాము..సరే..కాలం మారి మీరు ఇబ్బందుల్లో పడ్డారు..నాకు రావాల్సిన డబ్బు కోసం నేను కోర్టుకు కూడా వెళ్ళాను.." అని చెప్పుకుపోతున్నాడు..నాకేమీ అర్ధం కావడం లేదు..ఇప్పుడెందుకు ఇలా హఠాత్తుగా వచ్చి ఏ ఉపోద్ఘాతం లేకుండా ఇలా చెపుతున్నాడు.. అయోమయంగా చూస్తూ వున్నాను..
"నిన్న రాత్రి ఎందుకనో ఆలోచించుకుంటూ వుంటే..ఈ కేసుల కన్నా..మీతో నేరుగా మాట్లాడి ఓ పరిష్కారానికి వద్దామనిపించింది..విచారిస్తే మీరిక్కడ ఉన్నారని తెలిసి నేరుగా కారు వేసుకొని వచ్చాను.."అన్నాడు..
నిజానికి నేనింకా తేరుకోలేదు..నోరు పెగల్చుకుని.."మీరింత దూరం రావడం చాలా సంతోషం..ప్రస్తుతం నేను ఇప్పటికిప్పుడు ఏమీ చెల్లించే పరిస్థితి లో లేను..మీరు నాకు ఓ నాలుగైదు నెలలు గడువిస్తే..మీకివ్వాల్సిన మొత్తం లో సుమారు అరవై శాతం కట్టుకుంటాను..ఆ సహాయం చేయగలరా.." అన్నాను..
"మీరు నాలుగు నెలలు అన్నారు ప్రసాద్ గారూ..ఇది ఫిబ్రవరి..అక్టోబర్ నాటికి సగం ఇవ్వండి..మిగిలింది మళ్లీ ఫిబ్రవరిలో ఇవ్వండి..అంతవరకూ ఆ కేసు గురించి మీరు ఆలోచించనక్కరలేదు.." అన్నాడు..నమ్మలేకపోయాను..నేను అడిగిన దానికన్నా ఎక్కువ సమయం ఇచ్చాడు..ఏదో తెలీని ధైర్యం వచ్చింది..ఒక్కసారిగా మనసు తేలిక పడింది..ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుని శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకోమన్నాను..వెళ్లి పూజ చేయించుకొని మళ్లీ నాకు తన వల్ల ఏ ఇబ్బందీ ఉండదని చెప్పి మరీ వెళ్ళిపోయాడు..అంతా గంటలోపలే జరిగిపోయింది..
తీవ్రమైన తుఫాను లో కొట్టుకుపోతున్న వాడికి ఆలంబన దొరికినట్లుగా ఉన్నది..శ్రీ స్వామివారు చిరునవ్వుతో చూస్తున్నట్లుగా భావన కలిగింది...మా దంపతులిద్దరమూ జరిగిన దానిని తలుచుకొని.. శ్రీ స్వామివారి సమాధికి మనసారా సాగిలపడ్డాము..
ఇలాటి అనుభవాలను ఎన్నో పొందాము..ప్రతి విషయం లోనూ ఆ స్వామివారు చూపిన కృపా కటాక్షణాలను మీతో పంచుకుంటూ...రేపటి నుంచి మరిన్ని అనుభవాలతో...
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీదత్తాత్రేయస్వామిమందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
జ్ఞాన సరస్వతి దేవాలయం
*_🚩జ్ఞాన సరస్వతి దేవాలయం , బాసర_🚩*
🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔
ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా , రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి , మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.
*పురాణగాధ*
బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి , తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం , జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా , గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతున్నది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.
*ఆలయ విశేషాలు*
సరస్వతి ఆలయ గోపురము , వెనక సరస్వతి విగ్రహము
బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.
*రవాణా సౌకర్యాలు*
హైదరాబాదు - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి , మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ , భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం , దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము , వ్యాస లింగము ఉన్నాయి.
మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం , సూర్యతీర్థం , వ్యాసతీర్థం , వాల్మీకి తీర్థం , విష్ణుతీర్థం , గణేషతీర్థం , పుత్రతీర్థం , శివతీర్థం.
*పూజా విశేషాలు*
ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర , ఒడిషా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక , బలపము , కాగితము , కలము వంటి కానుకలు సమర్పించే ఆచారము ఉంది. కేశ ఖండనము , ఉపనయనము , వివాహాలు , భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.
*దర్శన వేళలు :-*
ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.30 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.30 గంటల వరకు అభిషేకము , అలంకారము , హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.30 గంటల నుండి 12.30 గంటల వరకు అర్చన , సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.30 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.30 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.30 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3౦ గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.
*నవరాత్రులు*
ఆశ్వియజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము , దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహార్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము , సుందరమైన అలంకారము , సాయంకాలము పల్లకీ సేవ , శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు , ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు , ఉపన్యాసములు , హరికథలు , పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుభాషితం
🙏🌹🌹*నేటి సుభాషితం* 🌹🌹🙏
*అతనికి వార్థి కుల్యయగు, నగ్ని జలంబగు, మేరుశైల మం*
*చిత శిల లీల నుండు, మద సింగము జింక తెఱంగు దాల్చు, గో*
*పిత ఫణి పూల దండయగు, భీష్మ రసంబు సుధా రసంబగున్*
*క్షితిజన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్!*
*శీల నిర్మాణం జరిగిన వ్యక్తి వికసన వల్ల ప్రకృతి గూడా ఆతని వికాసానికి సహకరిస్తుంది. సమాజం చేత ఒప్పుకోబడ్డ సుశీలం ఎవ్వరిలో నైతే కనిపిస్తుందో అతనికి సముద్రం చిన్న పిల్ల కాలువ లాగా మారుతుంది.. అగ్నితన తేజస్సును ఉపసంహరించుకొని నీటిలాగా మారుతుంది. మేరుపర్వతమైనా చిన్న గులక రాయిలాగా కనిపిస్తుంది. మదించి ఉద్రేకంతో వచ్చే సింహము కూడా జింకపిల్ల లాగా మారిపోతుంది. కోపంతో ఊగిపోయే కాలనాగు కూడా పూలహారం విధంగా ఒదిగిపోతుంది. కాలకూట విషం కూడా అమృతం లాగా మారిపోతుంది అంటాడు, ఏనుగు లక్ష్మణ కవి.*
🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏
లలిత కళలు
64 విద్యలు(కళలు)అంటే ఏవి?
మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. వాటినే చతుష్షష్ఠి కళలు అంటారు.అవేమిటో ఇప్పుడు చూద్దాం.
మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం
వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.
అర్థము:
1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)
2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు
(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)
3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు
4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.
5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము
7. నాటకములు
8. గానము (సంగీతం)
9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము
10. కామశాస్త్రము
11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,
12. దేశభాషాజ్ఞానం
13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.
14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు
15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము
16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,
17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము
18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము
19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం
20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము
21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము
22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము
23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము
24. పాకకర్మ= వంటలు
25. దోహళము=వృక్షశాస్త్రము
26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు
27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య
28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .
29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.
30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.
31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.
32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య
33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య
34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య
35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,
36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.
37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,
38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,
39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.
40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.
41. వాణిజ్యము - వ్యాపారాదులు.
42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.
43. కృషి - వ్యవసాయ నేర్పు.
44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి
45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.
46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.
47. మృగయా - వేటాడు నేర్పు
48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.
49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము.
50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.
51. చిత్ర - చిత్రకళ
52. లోహా - పాత్రలు చేయి నేర్పు
53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.
54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు
55. దారు - చెక్కపని
56. వేళు - వెదరుతో చేయు పనులు
57. చర్మ - తోళ్ళపరిశ్రమ.
58. అంబర - వస్త్ర పరిశ్రమ
59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు
60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము
61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము
62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము
63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము
64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజ
ాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య
🌹🌷🌹🌷🌹🌷
శ్రీగణేశ ప్రాతఃస్మరణమ్
శ్రీగణేశ ప్రాతఃస్మరణమ్*
౧. ప్రాతస్స్మరామి - గణనాథబంధుం
సింధూరపూరపరిశోభితగండయుగ్మమ్!
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్!!
౨. ప్రాతర్నమామి చతురానన వందమానం
ఇచ్ఛానుకూల మఖిలం చ వరందదానమ్!
తం తుందిలం ద్విరసనప్రియయజ్ఞసూత్రం
పుత్రం విలాసచతురం శివయోశ్శివాయ!!
౩. ప్రాతర్భజామ్యభయదం ఖలు భక్తశోక
దావానలం గణవిభుం వరకుంజరాస్యమ్!
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహవర్ధన మహం సుత మీశ్వరస్య!!
శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకమ్!
ప్రాతరుత్ధాయ సతతం ప్రపఠేత్ ప్రయతః పుమాన్!
*🕉️ఓం విఘ్నేశ్వరాయ నమః🕉️*
*🌞శుభ శుభోదయం🌞*
శివామృతలహరి
.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు రచించిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||
తలపన్ నిర్గుణ బ్రహ్మమొక్కటియె - విస్తారింప నా బ్రహ్మమే
పొలుపారున్ సగుణంబునన్ వరకృపాంబోరాశియౌ 'తల్లిగా
మెలగున్ ధర్మమురూపుగాంచిన మహామేధావియౌ ' 'తండ్రిగా
శిల 'లింగాకృతి బ్రహ్మమీవె దలపన్ శ్రీ సిద్ధలింగేశ్వరా !
భావం;
అర్థంచేసుకోగలిగితే కనపడని నిర్గుణ బ్రహ్మ ఒకటే అని తెలుస్తుంది.ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకోగలిగితే
సగుణ రూపంలో వరాలిస్తూ అపారమైన కరుణా కటాక్షాలను కురిపించే తల్లి రూపంలోనూ మరియు
ధర్మస్వరూపుడు,అత్యంత మేధావి అయిన తండ్రి రూపంలోనూ కనిపించేది, లింగాకృతిలో ప్రకాశిస్తున్న పరబ్రహ్మ స్వరూపం అయిన నీవే అని తెలుస్తుంది కదా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
రామాయణమ్. 99
రామాయణమ్. 99
..
వశిష్ఠ మహర్షిని అల్లంతదూరములో చూడగనే భరద్వాజమహర్షి ఒక్కుదుటున లేచి శిష్యులను అర్ఘ్యము అర్ఘ్యము అని తొందర పెడుతూ మహర్షికి ఎదురేగినాడు.
.
వశిష్ట మహర్షి భరతుని ఈతడు దశరధకుమారుడు అని పరిచయం చేసిన తరువాత వారందరి క్షేమం భరద్వాజుడు విచారించి భరతునితో ఇలా అన్నాడు...రాజ్యమును పరిపాలించుకొనే నీవు ఇచటికి ఎందుకు వచ్చావు ?
నా కేదో అనుమానముగా ఉన్నది నీ గురించి!
.
తండ్రిమాటకోసమై అడవులుపట్టి వెళ్ళిపోయిన సీతారామలక్ష్మణుల విషయమై నీవేమీ పాపపుతలంపుతో ఇచటకు రాలేదుకదా! .
.
ఆ మాటలు భరతుని హృదయాన్ని ఈటెల్లాగా చీల్చివేయగా హృదయమందు అప్పటికే గంగానదిలా ప్రవహిస్తున్న దుఃఖము మరింతవేగంగా ఉబికి బయటకు వచ్చి కన్నీరుగా ప్రవహించగా ,తడబడేమాటలతో భరద్వాజుని చూసి ...
.
పూజ్యుడవైన నీవుకూడా నన్ను ఇలాగ భావించినచో నన్ను చంపివేసినట్లే! మహాత్మా నావలన ఏ దోషమూలేదు! నన్ను నీవు ఈ విధముగా తలంచకుమయ్యా!
.
నేను లేని సమయములో నా తల్లిపలికిన మాటలన్నీ నాకు ఇష్టములుకావు ,వాటిచే నాకు సంతోషముకలుగలేదు.వాటిని నేను సమ్మతించను.
.
నేను ఇప్పుడు పురుషశ్రేష్ఠుడైన రాముని పాదములకు నమస్కరించి ఆయనను అనుగ్రహింపచేసుకొని మరల అయోధ్యకు తీసుకు వెళ్ళటానికి వచ్చిఉన్నాను. మహర్షీ రాముడెక్కడున్నాడో ఎరుకపరుపుము!.
.
సత్ప్రవర్తన,వినయముతో కూడిన భరతుని ఆ మాటలు విని ప్రసన్నుడై రఘువంశములో పుట్టినవాడు మాట్లాడే విధంగానే మాట్లాడావు అవి నీకు తగి ఉన్నవి.
నీ హృదయం తెలుసుకుందామనే అలా అన్నాను ! అని పలికి నీ సోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు ..
.
రాముడు చిత్రకూటపర్వతమందు నివసిస్తున్నాడు ,నీవు రేపు అచటికి వెళ్ళవచ్చును ఈ రాత్రికి మాఆశ్రమమందే విశ్రమించు అన్న భరద్వాజుని కోరికమేరకు ఆ రాత్రికి అక్కడనే విడిదిచేసినాడు భరతుడు.
.
అప్పుడు భరద్వాజుడు భరతునితో నేనిచ్చే విందు స్వీకరించుము అని అడిగాడు.
.
స్వామీ అరణ్యములో లభించేవాటిని మీరిప్పటికే నాకు అనుగ్రహించారుకదా ఇంక వేరే విందు ఏమివ్వగలరు ? అని బదులు పలికాడు భరతుడు.
.
మహర్షి చిరునవ్వుతో, భరతా !నీవు అల్పసంతోషివి అని నేనెరుగుదును. నీవు అన్నిసత్కారములకు అర్హుడవు ! నీకు నీసేనకు ఏమిచ్చినచో సంతుష్టులగుదురో ఆ విందు ఇవ్వవలెననే కోరిక నాకున్నది .
అవునూ ! నీ సైన్యాన్నంతా దూరంగా వదిలి ఒక్కడవే ఇక్కడికి వచ్చావేమిటి? అని ప్రశ్నించాడు భరద్వాజుడు.
.
స్వామీ మీకు తెలియునుకదా రాజుకానీ ,రాజపుత్రుడు కానీ ఎల్లవేళలా మునివాటికలకు దూరంగా సంచరించవలెను అని కదా నియమము!
.
(( ఇది ఆనాటి ధర్మం! ఈ రోజున విశ్వవిద్యాలయాల గ్రౌండ్సు అన్నీ కూడా రాజకీయ సభలకు ఇవ్వాల్సిందే ,ఇవ్వకపోతే రచ్చరచ్చ ఏ కాలంలో నాగరికత ,మర్యాద ఉన్నదో గమనించండి ?
We are modern but not civilized)).
.
నా సైన్యములో మదించిన ఏనుగులు సంచరిస్తున్నాయి అవి మీ ఆశ్రమప్రాంగణంలోని వనాన్ని ధ్వంసం చేయరాదనే తలంపుతో నేనొక్కడనే వచ్చినాను.అది విని సంతసించారు మహర్షి.
.
అప్పుడు మహర్షి అగ్నిగృహములో ప్రవేశించి దీక్షలో కూర్చొని విశ్వకర్మను ఆహ్వానించాడు ,దేవేంద్ర,యమ,వరుణ,కుబేర అనే లోకపాలకులని కూడా ఆహ్వానించి నేను భరతునకు ఆతిధ్యమివ్వదలుచుకున్నాను కావున మీరు వచ్చి తగు ఏర్పాట్లు గావించండి అని కోరినాడు.
.
మహర్షి సంకల్పానికి అనుగుణంగా అక్కడ క్షణాల్లో ఒక మహానగరం ఏర్పాటయ్యింది.
.
గంధర్వులైన విశ్వావసు,హాహాహూహూలూ దేవజాతికి చెందిన అప్సరసలు .
వారిలో ఘృతాచి,విశ్వాచి,మిశ్రకేశి ,అలంబుస,నాగదంత,హేమ,
హిమ ...అనే స్త్రీలు ఉన్నారు.సకల దేవతా స్త్రీ లను అక్కడకు రావించాడు .
.
మైరేయము అనే మద్యము నదిగా పారింది !
బాగా తయారు చేయబడిన "సుర" మరొక నది అయ్యింది ,
చెరకురసాలు నదులుగా పారాయి.
.
చంద్రుడు చక్కని అన్నము తెచ్చాడు అది పంచభక్ష్యపరమాన్నాలతో కూడినటువంటుది.
.
భరద్వాజుడి సంకల్పానికి తగ్గట్లుగా అప్పటికప్పుడు అక్కడ ఒక సుందరమైన లోకం ఇంద్రభవనాలతో దేవేంద్ర వైభవంతో సృష్టింపబడింది.
ఇదివున్నది, అదిలేదు అనిలేదక్కడ! ఎవరికి ఏది కావలిస్తే అది .
.
మహర్షి అనుమతితో భరతుడు రాజసభలోకి ప్రవేశించాడు..
ఆ సభలో ఒక సమున్నతమైన ఆసనం !
దానికెదురుగా మంత్రిసామంతదండనాధులు కూర్చునుటకు వీలుగా సముచిత సుఖాసనాలు అమర్చారు.
.
అక్కడి దివ్యమైన సమున్నత ఆసనానికి భరతుడు ప్రదక్షిణ చేశాడు అక్కడ రాముడున్నట్లు ఊహించుకొని ఆయనకు నమస్కారము చేసి ఆ ఆసనానికి వింజామరతో వీచి తాను మంత్రికూర్చునే ఆసనం మీద కూర్చున్నాడు.
.
( మనసా వాచా కర్మణా ఆయనకు రాముడే రాజు ఆయన పరోక్షంలో కూడ భరతుడికి సింహాసనం మీద మోహం లేదు!)
.
వూటుకూరు జానకిరామారావు
.
ఆర్యాశతకంశ్లోకం60చంపకమాల
ఆర్యాశతకంశ్లోకం60చంపకమాల::
అధికమునైన సంతసము/ హర్షితమౌస్మరశాసనుండునా//ప్రధితుని శంకరాధిపుని/ రంజిలచేయుచు కాంచికన్ స్వయం//బధివసియించుచున్ జగము నంతయు భాసిలచేయుచున్//స్వధనము శంబరాసనపు సాధ్విచె నామదియుల్లసిల్లెనే//
అన్నంబే జన ప్రాణముల్ నిలుపు నే/ఆతల్లి భిక్షంబుచే//సన్నంబయ్యెను త్రైక్ష పాపములు నూ /స్వాంతమ్ము నొందించెనే//భిన్నంబాయెను క్షుద్భయంకర మహా/భీభత్సమే, సర్వంబుసం//పన్నంబయ్యె యన్నపూర్ణ కరుణన్ ప్రార్ధింపరే నెప్పుడున్////
ధార్మికగీత - 56*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 56*
*****
*శ్లో:- విద్యా దదాతి వినయం ౹*
*వినయా ద్యాతి పాత్రతాం ౹*
*పాత్రత్వా ద్ధన మాప్నోతి ౹*
*ధనా ద్ధర్మం తత స్సుఖమ్ ౹౹*
*****
*భా:- "విద్య" సర్వాభరణము. "విద్య" సర్వధన ప్రధానము."విద్య" మూడవ నేత్రము. "విద్య" నృపాలపూజితము అని వింటుంటాము.అట్టి విద్య వలన వినయము, విధేయత అలవడతాయి. వినయము లేని విద్య విద్యయే కాదు. అవిద్యయే. వినయము వల్ల పాత్రత-అర్హత లభిస్తుంది. ఆ అర్హతతో ఉపాధి, తద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ధనంతో సంసారంలో ఉత్తమ గృహస్థుగా వివిధ దానాలు చేస్తూ, తక్కిన బ్రహ్మచర్య, వృద్ధ,వానప్రస్థాశ్రమా నుయాయులను విధ్యుక్తకర్మగా సేవిస్తూ, ధర్మాచరణ, ధర్మరక్షణకై పూనుకుంటాడు. ఆ ధర్మమే అతనికి సిరిసంపదలు, భోగభాగ్యాలను ప్రసాదించి ఇహ, పరలోక సుఖాలను అనుభవింపజేస్తుంది. జ్ఞాన ప్రదాయినియై ముక్తికి మార్గం సుగమం చేస్తుంది. దీనికంతటికీ మూలము "విద్య"యే యని సారాంశము. కొద్ది జీవితాన్ని విద్యకు అంకితమిస్తే, అది జీవితాంతం మనకు తోడూనీడగా ఉండి, అమేయసుఖాలు అందించి తరింపజేస్తుంది*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
సరస్వతీదేవి ౼౼౼౼౼౼౼౼ శారదా సిత చారు నీర దాదికములే తలవాల్చి నుతిసేయు ధవళదేహ, వేద సూక్తాదులన్ వీణె గానాదులన్ విశ్వరాగము దెల్పు వినుతశీల, అభయముద్రాక్షమాలాదులన్ ధీయజ్ఞ౼ దక్షతన్ జాటు విద్యాధినేత్రి, బ్రహ్మవిష్ణు మహేశ్వరస్తుతార్చిషయౌచు కవిపండితుల బ్రోచు కల్పవల్లి, జ్ఞానహంసా ప్రయాణమ్ము సల్పుచుండి బుద్ధి జాడ్యమ్ములన్ బాపు పుణ్యదీప్తి చదువులిడు తల్లియౌ సరస్వతిగ పొల్చు కనకదుర్గాంబ! వందన వనజశతము. రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.
సరస్వతీదేవి
౼౼౼౼౼౼౼౼
శారదా సిత చారు నీర దాదికములే
తలవాల్చి నుతిసేయు ధవళదేహ,
వేద సూక్తాదులన్ వీణె గానాదులన్
విశ్వరాగము దెల్పు వినుతశీల,
అభయముద్రాక్షమాలాదులన్ ధీయజ్ఞ౼
దక్షతన్ జాటు విద్యాధినేత్రి,
బ్రహ్మవిష్ణు మహేశ్వరస్తుతార్చిషయౌచు
కవిపండితుల బ్రోచు కల్పవల్లి,
జ్ఞానహంసా ప్రయాణమ్ము సల్పుచుండి
బుద్ధి జాడ్యమ్ములన్ బాపు పుణ్యదీప్తి
చదువులిడు తల్లియౌ సరస్వతిగ పొల్చు
కనకదుర్గాంబ! వందన వనజశతము.
రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.
నవదుర్గలు
నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-
1. శైలపుత్రి:- ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే ''శైలపుత్రి''.
2. బ్రహ్మచారిణి:- నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో), మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.
3. చంద్రఘంట:- ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి 'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే "చంద్రఘంట".
4. కూష్మాండ:- విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే "కూష్మాండ".
5. స్కంద మాత:- సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".
6. కాత్యాయని:- తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే "కాత్యాయని".
7. కాళరాత్రి:- ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే "కాళరాత్రి".
8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే "మహాగౌరీ".
9. సిద్దిధాత్రి:- ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే "సిద్ధిధాత్రి".
శ్రీ శారదాంబా నమోస్తుతే...
Padmini Devi:
శ్రీ శారదాంబా నమోస్తుతే...
శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు.
శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది.
త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
శ్రీ శారదాంబా నమోస్తుతే...
శ్రీ శారదాంబా నమోస్తుతే...
సంగీత సాహిత్య మూలాకృతే..
సిద్ది ప్రదాయని బుద్ది ప్రసాదిని
గీర్వాణి వీణాపాణి శ్రీ శారదాంబా...
మధుర భక్తిరస గానం :
శ్రీమతి ఎస్.జానకి గారు
🙏 శుభోదయం 🙏
🌹🌼🌻🌼🕉🌼🌻🌼🌹
Vijaya Laxmi . V:
*నా ఆత్మీయ బంధువులకు*
*☘️🙏బుధవారం🙏☘️*
*శుభోదయ శుభాకాంక్షలు*