6, ఫిబ్రవరి 2021, శనివారం

శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం

 🔥🔥 *శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం - మణ్డలాదివర్ణనం* 🔥🔥


*నారదుడు చెప్పెను :*


*భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతా సహిత బ్రహ్మను పూజింప వలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను , నైరృతిదిక్కున నిరృతిని , పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని , వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును , ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని , ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేద యజుర్వేదములను పూజింపవలెను. రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశ దల కమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.*


*పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవ అవుసరము లేదు. ఇరువది యైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధ ప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగ సపరివార దేవతాపూజ చేయవలెను.*


*పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధి పతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను. ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను. ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింప వలెను. వీథిని లతల తోడను, పత్రాదుల తోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణముల తోడను నింపవలెను. ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతర మండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింప వలెను. ద్వికోణమును ఎరుపు పసుపు రంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.*


*చక్ర కమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింప వలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు* *రంగులు వేయవలెను. వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపు రంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీ* *పత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. బీజ మంత్రములను ఒక లక్ష జపించుట చేతను, ఇతర మంత్రములను అక్షరలక్షలు జపించుట చేతను, విద్యలను ఒక లక్షజపించుట చేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపము చేయుట చేతను స్తోత్రములను వేయి* *పర్యాయములు జపించుట చేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును. రెండవ పర్యాయము ఒక లక్ష* *జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజ మంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతర మంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు* *చేయవలెను. మంత్ర పునః శ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతo ఆవలంబింప వలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు మూడురెట్లు జపము చేసిననే మధ్యమ ఉత్తమ శ్రేణికి చెందిన ఫలముల లభించును*


*ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్ర ధ్యానమును చెప్పెదను - మంత్రము యొక్క స్థూల రూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రముయొక్క సూక్ష్మ రూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రము యొక్క పర రూపము. వరాహ నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.*


*ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయ స్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయ కమలము నందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతి స్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహత రూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయము నందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయ బీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మక దేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియము వరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్ర భాగమునందుడును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాది సిద్ధులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయ స్వరూపముతో నుండి, భరూత మాత్రల నుండియు, ఇంద్రియము లనెడు గ్రహముల నుండి సర్వదా విముక్తుడగును.*


*శ్రీ మదగ్ని మహాపురాణము నందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.*

       🔥🔥🔥🔥🔥

పూజగదిలో

 ⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️

🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻




*⚱️పూజగదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు వుంచాలి..??⚱️*




⚱️పూజగదిలో చెంబు పాత్రలో తీర్థం వుంచడం చేస్తుంటాం. సాధారణంగా పూజగదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని వుంచడం చేయొచ్చు. ఇలా నీటిని వుంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహా నైవేద్యం కంటే నీటిని వుంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.


⚱️రాగి చెంబులో మంచినీటిని వుంచి మంత్ర పఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. ప్రతిరోజు పూజ సమయంలో నీటిని వుంచి.. తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలుండవు. ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి.


⚱️ఇలా చేస్తే ఆ ఇంట వున్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే పూజ సమయంలో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులుండవు.🌸

🌷శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు🌷*_

 _*🌷శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు🌷*_




త్యాగరాజ ఆరాధన ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. 

*ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి  నాడు జరుగుతుంది.*  ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు.  సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు.


*చరిత్ర*

ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజు స్వామి పరమపదించిన *రోజైన పుష్య బహుళ పంచమి* రోజున శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడు లోని , తంజావూరు జిల్లా , తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది.


ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సంప్రదాయానికి వంద సంవత్సరాలకన్నా తక్కువ వయసే ఉంటుంది. త్యాగరాజు 1847లో మరణించాడు. మరణానికి కొద్దిరోజుల ముందుగా ఆయన సాంప్రదాయ బద్ధంగా అన్నీ త్యజించి సన్యాసిగా మారాడు. ఆయన మరణించిన తరువాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్ళలోనే జరుపుకునే వారు. 1903 సంవత్సరం వచ్చేసరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుపడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడే , ఆయన దగ్గర విద్యనభ్యసించిన ఇద్దరు విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్ , సుందర భాగవతార్లు. వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగడం చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతిసంవత్సరం ఆయన వర్థంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు.


మరుసటి సంవత్సరం నుంచి సంగీత ప్రపంచంలోని  ఉద్ధండులంతా ఆయన వర్ధంతి రోజు తిరువయ్యూరులోనే జరపాలనీ , వారందరూ కలుసుకుని తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికగా ఎంచుకోవాలనుకున్నారు. 1905లో ఈ ఉత్సవాలు పేదవాళ్ళకి పెద్దఎత్తున అన్నదానం , వేద సంప్రదాయాల ప్రకారం పూజలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్ , సుందర భాగవతార్ ఈ ఉత్సవాలకు ప్రేరణగా నిలిస్తే , తిలైస్థానం నరసింహ భాగవతార్ , తిలైస్థానం పంజు భాగవతార్లు నిర్వాహకులుగా ఆర్థిక సహాయకులుగా ఉన్నారు. అయితే మరుసటి సంవత్సరానికి ఆ ఇద్దరూ అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరూ సమాంతరంగా ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. మిగతా వారు కూడా చెరో పక్క చేరి రెండు వైరి వర్గాలుగా విడిపోయారు. పెద్దవాడైన నరసింహ భాగవతార్ నిర్వహించే ఆరాధన పెరియ కచ్చి (పెద్ద బృందం) చిన్నవాడైన పంజు భాగవతార్ నిర్వహించే ఆరాధన చిన్న కచ్చి (చిన్న బృందం) గా పేరు పెట్టుకున్నారు. వారిద్దరి మరణానంతరం పెరియ కచ్చి ప్రముఖ వాయులీన విద్వాంసుడు మలైకోట్టై గోవిందసామి పిళ్ళై ఆధీనంలోకి , చిన్న కచ్చి ప్రముఖ హరికథా కళాకారుడు శూలమంగళం వైద్యనాథ భాగవతార్ ఆధీనంలోకి వచ్చింది. నెమ్మదిగా చిన్న కచ్చి ఆరాధనకు ఐదు రోజుల ముందు ప్రారంభమై , ఆరాధన రోజున ముగిసే లాగా , పెద్ద కచ్చి ఆరాధనరోజు ప్రారంభమై తరువాత నాలుగు రోజలపాటు సాగే సాంప్రదాయం మొదలైంది. రెండు వర్గాలు సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. పేదలకు అన్నదానం చేసేవారు. ఆ తొమ్మిది రోజులు సాధారణ ప్రజలకు మంచి వేడుకగా ఉండేదు. కొద్ది రోజులకు రెండు వర్గాలకు మధ్య సయోధ్య కుదిరింది. అప్పట్లో ఆడవాళ్ళను సంగీత ప్రదర్శన చేయనిచ్చేవారు కాదు. దేవదాసీలు తప్ప సాధారణ గృహస్థులెవరూ బహిరంగంగా పాడటానికి , నృత్యం చేయడానికి ఒప్పుకునే వారు కాదు. రెండు వర్గాలు నాదస్వరాన్ని కూడా ప్రదర్శనలలోకి అనుమతించేవారు కాదు.


అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ అలాంటి దేవదాసీగా ఉండేది. అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. త్యాగరాజుకు , సంగీతానికి వీరాభిమాని అయిన ఆమె అప్పట్లో మద్రాసులో నివసించేది. ఆమె ప్రదర్శనల్లో చాలావరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. 1921లో , ఆమెకు వయసు మీరింది. పిల్లలు కూడా లేరు. ఆమె తన యావదాస్తినీ త్యాగరాజు యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి రాసిచ్చేసింది. 1925 లో ఆయన స్మారకానికి ఆలయ నిర్మాణం ప్రారంభించింది. కొంతమంది ఆమె ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా సమాధి ఉన్న స్థలాన్ని కొన్నదనీ , మరికొంతమంది ఆ స్థలం గ్రామ పంచాయితీకి సంబంధించినదనీ , ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైనదనీ , కానీ ఆమె ఉద్దేశం మంచిదవడంతో గ్రామపెద్దలు అందుకు అడ్డు చెప్పలేదనీ భావించారు. ఆ సమాధి దగ్గరే త్యాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. 1926 మొదట్లో ఆ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. రెండు వైరి వర్గాలు ఈ నిర్మాణంలో జోక్యం కలుగజేసుకోలేదు కానీ నాగరత్నమ్మను అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి , కనీసం హరికథ చెప్పడానికి ఒప్పుకోలేదు. త్యాగరాజు తన పాటలలో అక్కడక్కడా మహిళపై చేసిన ఆరోపణలను అందుకు కారణంగా చూపించారు.


కానీ నాగరత్నమ్మ వాటన్నింటికీ బెదరక మూడో వర్గాన్ని ప్రారంభించి ఆ ఆలయం వెనుకలే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఇక్కడ చాలామంది మహిళా సంగీత విద్వాంసులు ఆలపించేవారు. దాంతో మిగతా వర్గాల పాపులారిటీ కొంచెం తగ్గింది. ఆమె అంతటితో ఆగకుండా ఆ రెండు వర్గాలను ఆలయంలోకి నిషేధించాలనీ ఆమె నిర్మించింది కాబట్టి ఆ హక్కు తనకే ఉండాలని కోర్టుకు ఎక్కింది. ఆమె కేసు ఓడిపోయింది. కానీ కోర్టు మూడు వర్గాలు ఆరాధనను మూడు సమాన భాగాలుగా విభజించుకుని నిర్వహించుకోమని తెలిపింది.


ఈ సాంప్రదాయం 1940 వరకు అలాగే కొనసాగింది. 1941 యస్.వై కృష్ణస్వామి అన్ని వర్గాలవారిని ఏకం చేశాడు. అప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఆరాధన సంప్రదాయం మొదలైంది. హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ పంచరత్నకీర్తనలను బృంద గానానికి బాగా సరిపోతాయని వాటిని ఎన్నుకున్నాడు. అప్పటి నుంచి అందరూ కలిసి పంచరత్నకీర్తనలను ఆలపించడం సాంప్రదాయంగా మారింది. 1941 కు మందు మూడు వేర్వేరు ప్రదర్శనలు జరపడం వల్ల ఎవరికిష్టం వచ్చిన కీర్తనలు వారు పాడుకునేవారు.


నాగరత్నమ్మ తన మిగతా రోజులు కూడా తిరువయ్యూరు లోనే గడపాలనీ , తన సంపదనంతా త్యాగరాజు స్వామి సేవకే అంకితం చేసింది. అంతే కాకుండా మహిళలు కూడా ఆరాధనల్లో పాల్గొనేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసింది. 1952 లో ఆమె చనిపోయినపుడు ఆమెను త్యాగరాజు సమాధికి సమీపంలోనే ఖననం చేసి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం త్యాగరాజు సమాధిని చూస్తూ ఉన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం తిరువయ్యూరులో  ఏటేటా పెరుగుతున్న ప్రేక్షకులకు అనుగుణంగా అతి పెద్ద మండపం నిర్మాణంలో ఉంది.🌷

ఉమా

 *🌷ఉమా🌷*



ఉకారము శివుడు. మా అంటే పార్వతి. ఉమ అంటే శివశక్తులు అని అర్ధం. తారకాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు ఆమె వారికి ప్రత్యక్షమై నా అంశతో హిమవంతునికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమెను శివునకిచ్చి

వివాహం చెయ్యండి. వారిద్దరికీ పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు అని చెబుతుంది. కొంతకాలానికి హిమవంతుని భార్య మేనక గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించింది.

ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమైంది. సర్వకాల సర్వావస్థలయందు శివనామాన్నే జపిస్తుండేది. రానురాను తాను శివుణ్ణి తప్ప వేరెవరినీ వివాహమాడను అని తేల్చి చెప్పింది.

ఆ సమయంలో శివుడు విరాగియై తపోదీక్షలో ఉన్నాడు. అతణ్ణి భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని తపస్సు చెయ్యటానికి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పుడు తల్లి అయిన మేనక కుమార్తెను వారిస్తూ ఉ - ఓయమ్మా, మా - వద్దు అన్నది. అప్పటి నుండీ ఆమెకు 'ఉమా' అనే పేరు సార్ధకమై పోయింది.


ఉత్తమమైన చిత్తవృత్తి గలది. సూతసంహితలో పరానుభూతియు,  సంసార పాపములను నశింపచేయునదియు, సదాశివుని కన్న మించిన శోభనసంపద గల ఉమ అను పేరు గల అనేక విధాలయిన వైభవముగల ఉత్తమ చిత్తవృత్తికి మ్రొక్కెదను అని చెప్పబడింది. 


విష్ణు శివ బ్రహ్మ వాచకములైన అకార ఉకార మకారములతో కూడిన త్రిమూర్త్యాత్మకమైన ప్రణవస్వరూపిణి. అందుచేతనే ఉమా అంటే - దేవీ ప్రణవము అని చెప్పబడినది.


లింగపురాణంలో శివుడు దేవితో “అకార ఉకార మకారములు నా ప్రణవము. ఉకార మకార అకారములు నీ ప్రణవమందు గలవు' అంటాడు.


మహావాసిష్టంలో “ఓంకార సారశక్తి గలదగుటచే ఉమ అని కీర్తించబడింది" అని చెప్పబడింది. 


ఉమ అంటే చంద్రకళ. ఇది ముల్లోకాలలోను నిద్రించువారి మేల్కొనువారి హృదయాలను ప్రేరేపిస్తుంది.


శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి ఉమాకుమారి అని చెప్పబడింది. యోగుల యొక్క ఇచ్ఛకు ఉమ అని పేరు, సింధువనమున ఉండే దేవత. ఉమా అంటే - కాంతి అని అర్ధం.


యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా

అన్ని జీవులయందు కాంతిరూపంలో ఉంటుంది.


కేనోపనిషత్తులో “ఒకసారి దేవదానవులకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఆ తరువాత వారందరూ ఒకచోట చేరి యుద్ధం రకంగా జరిగింది. తాము ఏ విధంగా విజయం సాధించాము అనే విషయాలను గాధలుగా

చెబుతున్నారు.  ఆ విజయానికి కారణం నేనే అని ప్రతివారూ చెబుతున్నారు. 


అగ్నిదేవుడు అంటున్నాడు. “ఆ యుద్ధంలో నేను నిప్పులు కురిపిస్తుంటే రాక్షసులంతా మాడిమసి అయిపోయారు"


వాయుదేవుడు అంటున్నాడు " ఆయుద్ధంలో నేను చండప్రచండగా గాలులు వీస్తుంటే రాక్షసులు ఆ గాలులకు కొట్టుకుపోయారు"


పరబ్రహ్మతత్త్వం ఈ మాటలు విన్నది. దేవతలంతా గర్వించి ఉన్నారు. వారికి జ్ఞానోదయం చెయ్యాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా వారి ఎదుట పెద్ద భూతాకారంగా ప్రత్యక్షమైంది. దాన్ని చూసి భయపడ్డారు దేవతలు. ఆ భూతం ఏమిటో వారికి అర్ధం కాలేదు. అప్పుడు వారు అగ్నిదేవుని దగ్గరకు వచ్చి, “ఓ దేవా ! నీ పరాక్రమం

వల్లనే రాక్షసులను జయించగలిగాము. ఇప్పుడు ఆ భూతం ఏమిటో కనుక్కోవలసినది అన్నారు. సరేనన్నాడు అగ్నిదేవుడు. ఆ భూతాన్ని సమీపించాడు. అప్పుడు ఆ భూతం

అగ్నిని చూసి ఎవరు నువ్వు ? అన్నది.


అగ్ని: నేను అగ్నిదేవుడను. జాతవేదుడు అంటారు నన్ను.

భూతం : నీ శక్తి ఏమిటి ?

అగ్ని: ఎటువంటి వస్తువునైనా క్షణాల్లో దహించివేస్తాను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను దహించు. అంటూ ఒక గడ్డిపరకను చూపించింది. అగ్నిదేవుడు శతవిధాల ప్రయత్నించాడు. గడ్డిపరక కసికందలేదు. అవమానంతో వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోవటం తనవల్ల కాలేదన్నాడు. దేవతలంతా ఈ సారి వాయువును ప్రార్ధించారు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోమని అర్ధించారు. సరేనన్నాడు వాయువు. ఆ తత్త్వం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు

ఆ భూతం వాయువుతో అన్నది.


భూతం : ఎవరు నువ్వు ?

వాయువు : నేను వాయుదేవుడను. ఆకాశంలో చరిస్తుంటాను. అందుచేత నన్ను మాతరిశ్వుడంటారు.

భూతం : నీ గొప్పతనం ఏమిటి ?

వాయువు : ఏ వస్తువునైనా క్షణాల్లో ఎగరగొట్టగలను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు.

వాయుదేవుడు తన శక్తి అంతా కూడదీసుకుని గాలులు వీచాడు. గడ్డిపరక కదలను కూడా లేదు. అవమానంతో వెళ్ళిపోయాడు వాయువు, దేవతల దగ్గరకు వెళ్ళి ఆ తత్త్వం ఏమిటో తనకు తెలియలేదు అన్నాడు. ఈ సారి దేవతలు ఇంద్రుణ్ణి వెళ్ళమన్నారు.ఇంద్రుడు బయలుదేరి ఆ తత్త్వాన్ని సమీపించాడు.


ఆ తత్త్వం మాయమైపోయింది. ఆ స్థానంలో ఉమాదేవి ఉన్నది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో అమ్మా ! ఇప్పటి దాకా ఇక్కడ ఉన్న తత్త్వం ఏమిటి ? అన్నాడు అందుకు ఉమాదేవి.


దేవేంద్రా ! అదే పరబ్రహ్మతత్త్వము. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆ తత్వానికి నాకూ తేడా లేదు. మేమిద్దరమూ ఒకటే అని చెబుతుంది. ఈ రకంగా పరబ్రహ్మను

ముందుగా దర్శించినవాడు కాబట్టే ఇంద్రుడు దేవతలకు రాజయినాడు. అగ్ని వాయువులు దిక్పాలకులయినారు అని చెప్పబడింది.


కాబట్టి ఉమ అంటే ఆ పరబ్రహ్మమే. ఆరు సంవత్సరాల బాలికను కూడా ఉమ అంటారు.


శ్రీమాత్రే నమః🌷

దర్శనం

 🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻

🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁




*🙏🏻దైవ దర్శనం తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా ?🙏🏻*




దైవదర్శనం మనసును పవిత్రం చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కష్టాలు  నష్టాలు బాధలు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దైవదర్శనం వలన మనసుకి ఉపశమనం లభిస్తుంది. దైవం మనకి అండగా ఉందనే భరోసా కలుగుతుంది. దైవం అనుగ్రహం కన్నా మనకు కావలసిందేముందనే సంతృప్తి మిగులుతుంది.


అందుకే చాలా మంది ఉదయాన్నే ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు.కరుణాకటాక్ష వీక్షణాలను తమపై ప్రసరింపజేయవలసిందిగా దైవాన్ని ప్రార్ధిస్తుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనసు కుదుటపడేవరకూ ఆలయ ముఖమంటపంలో కూర్చుంటారు. ఇక సమస్యలు పెద్దగా లేనివారు సైతం నిత్యం దైవదర్శనం చేసుకుంటూవుంటారు. వీరిలో ఒకరకమైన తేజస్సు చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంటాయి.


ఇక ఇలా ఆలయానికి వచ్చే భక్తులను ఓ సందేహం సతమతం చేస్తుంటుంది. ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా? లేదంటే అక్కడి నుంచి నేరుగా ఎక్కడికైనా వెళ్లవచ్చా? అని అనుకుంటూ వుంటారు. ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది. పండితుల ప్రసంగాల్లోనూ వినిపిస్తుంటుంది.


విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఆలయానికి వెళ్లినప్పుడు, పూజ పూర్తి అయిన తరువాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాతే దైనందిన వ్యవహారాల నిమిత్తం బయటికి వెళ్లాలని అంటూ వుంటారు.


ఇక సాధారణ రోజుల్లో కూడా దైవదర్శనం తరువాత, అపవిత్రమైన ప్రదేశాలకు, మైలలో వున్న ఇళ్లకు వెళ్లకూడదని చెబుతుంటారు. అందువలన దైవ దర్శనం తరువాత ఆ పవిత్రత చెడని ప్రదేశాలకు ప్రశాంతత చెదరని ప్రదేశాలకు వెళ్ల వచ్చని సూచిస్తుంటారు.


*ఓం నమో నారాయణాయ🙏*

గోరంతదీపం

 🪔🙏🏻🪔🙏🏻🪔🙏🏻🪔

🙏🏻🪔🙏🏻🪔🙏🏻🪔🙏🏻




*🪔గోరంతదీపం కొండంత వెలుగు🪔*


           


దీపాలను వెలిగించడమనేది తెలుసుకున్న నాటినుండే మానవాళి నాగరికత  అభివృద్ధి చెందిందని భావించవచ్చును. ఆదిలో రాళ్ళ రాపిడితో, కట్టెలతోను, జంతువుల కొవ్వుతోను  ఆదిమానవుడు దీపం వెలిగించడం నేర్చుకున్నాడు. తరువాత గవ్వలతో , శంఖులతో దీప ప్రమిదలు తయారు చేయడం మొదలయింది. 

ఆ తరువాత తయారు చేయబడిన  మట్టి ప్రమిదలు ఈనాటికి వాడుకలోవున్నవి.


ఆషాఢ మాసం నుండి ఆశ్వీయుజ మాసంవరకు  విశేషంగా వర్షాలు కురుస్తాయి.  దీనితో అనారోగ్యకారకాలైన క్రిములు వాతావరణంలో వ్యాపిస్తాయి.  కలరా వంటి అంటు వ్యాధులని వ్యాపింప చేస్తాయి. అలాటి అంటువ్యాధుల నిర్మూలనకు  కార్తిక దీపోత్సవాలలో వందలాది మంచి నూనె  దీపాలు  మన గృహాలలో వెలిగించడం ఒక సంప్రదాయంగా మారింది.

ఇది మన సనాతనులు కనిపెట్టి మనకు అందించిన వైజ్ఞానిక సంపద.  


ప్రతీదినమూ  మన ఆలయాలలో వేలకి వేలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలకాంతుల శక్తికి  రోగ క్రిములు నశిస్తాయి. 



*🪔కామాక్షి దీపం*


దీపాలలోనే ఇది పవిత్రమైన దీపం.అందరి గృహాలలో వుండవలసిన దీపం. 

పూజకి ముందు  పువ్వులతో  అలంకరించి, బొట్టు పెట్టి మంగళకరంగా దీపం వెలిగించి, నిత్యం పూజించవలసిన దీపం కామాక్షి దీపం. దక్షిణాదిన వంశపారంపర్యంగా యీ కామాక్షి దీపాన్ని  బంగారంలా కాపాడుకోవడం ఒక ఆచారంగా పాటిస్తారు.

కొంతమంది తమ గృహాలలో, వారి పెద్దవారు వెలిగిస్తూ వచ్చిన కామాక్షి  దీపం ఆరిపోకుండా కాపాడుకుంటూ

వస్తారు. 


గృహ ప్రవేశ సమయాలలో,  వధూవరులు  పెళ్ళి పందిరికి ప్రదక్షిణం చేసినప్పుడు , అంధకారాన్ని తొలగించే విధంగా , అనుగ్రహకాంతులు అందరికీ లభించేలాగ దీపాన్ని పట్టుకుని  భయభక్తులతో తీసుకుని వెళ్ళే దీపం కామాక్షి దీపం. తమ కుమార్తె అత్తవారింటికి వెళ్ళేటప్పుడు రెండు  పెద్ద దీప స్ధంభాలవంటి కుందులు, కామాక్షి దీపాన్ని 

సారెగా తప్పకుండా యిచ్చి సాగనంపుతారు.🙏

ఆంజనేయుడు శనీశ్వరుడిని

 ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై 

ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా ?🙏


పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. 


''రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి. నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు. 


కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు'' అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు. 


అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ''రామ రామ రామ'' అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు. 


''ఓం ఆంజనేయాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి

తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 


మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.🙏

5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఆలయాలు

 ⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా.

⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి * 

⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం.

⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్.


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)

బ్రహ్మదేవుడు (సృష్టి)

నరసింహుడు, (స్థితి)

శివుడు, (లయం)

యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 

సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 


🙏 ఇంతటి ఘన కీర్తి గల తెలుగు నేల *మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం* 🙏

శిల్ప సంపద













 

బ్రాహ్మణ సభ

 శ్రీమహగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః 


జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశానుసారం  ఏడున్నర సంవత్సరాల క్రితం 2012 శంకర జయంతి నాడు  బ్రాహ్మణ సభ (పంచ ద్రావిడ)  అనే సంస్థ  ప్రారంభించబడింది.  


పంచ ద్రావిడ ప్రాంతాలు అంటే వింధ్య పర్వతాలకు దక్షిణ దిక్కున ఉన్న తెలుగు తమిళ కన్నడ మళయాళ మరాఠీ,  గుజరాతీ భాషలు మాట్లాడే ప్రాంతాలు. ఇందులో తమిళ మళయాళాలని ఒకే భాషగా లెఖ్ఖ వేస్తారు .  బ్రాహ్మణ కనీస ఆచారాలని ఆచరణ ద్వారా కాపాడుకోవడం , బ్రాహ్మణ యువతకి సకాలంలో వివాహాలు జరిగేలా చూడటం , ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవడం లాంటి ఆశయాలతో ఈ సభ ఆరంభించ బడినది . 


బ్రాహ్మణ శ్రేయస్సు, లోక కల్యాణం కోసం ప్రతి నెల చండీహోమం , యువత కోసం మార్గ దర్శనం , సమస్యల చర్చ,  పరిష్కారం కోసం గోష్టి , పిల్లల్లో, బ్రాహ్మణ యువతలో  నాయకత్వ ధోరణి , సేవా ధోరణి పెంచడానికి కార్యక్రమాలు, సకాలంలో వివాహం జరగడానికి జాతక పరివర్తన కార్యక్రమం ఇలాంటి మరెన్నో కార్య క్రమాలు బ్రాహ్మణ సభ నిర్వహిస్తోంది. 


గృహస్తులకున్న బాధ్యతల్లో బ్రహ్మచర్యాశ్రమం లో ఉన్న బ్రహ్మచారుల, సన్యాసాశ్రమం లో ఉన్న సన్యాసుల  పోషణ ఉన్నాయి . 


వేదం చదువుకుంటున్న విద్యార్థులకోసం  వంటకి ముందు ప్రతి బ్రాహ్మణ గృహిణి ఒక గుప్పెడు బియ్యం ఒక సంచీలో వేసి , చండీ హోమం నాడు, వేదికకి తీసుకు వస్తారు. అక్కడ ఆ బియ్యాన్ని అందరూ పెద్ద సంచులలో నింపుతారు. ఈ సమీకరించిన బియ్యం వేద పాఠశాల విద్యార్థులు భిక్షగా స్వీకరించి  , సభ్యులకి ఆశీర్వచనం చదువుతారు.     ఈ విధంగా పరమాచార్యులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి  వారి గుప్పెడు బియ్యం పధకం, గత నాలుగు సంవత్సరాలుగా బ్రాహ్మణ సభ విజయవంతంగా నిర్వహిస్తోంది.  కుక్షౌ తిష్టతి యస్యాన్నమ్, వేదాభ్యాసేన జీర్యతే కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్.  విద్యార్ధులు వేదాభ్యాసం ద్వారా మనం సమర్పించిన అన్నాన్ని జీర్ణం చేస్తే మన ముందు పది తరాలు తరవాత పది తరాలు కూడా తరిస్తాయని పెద్దలు చెప్పారు .  


బ్రాహ్మణ సభ తరఫున సభ్యులందరం కలిసి ప్రతి నిత్యం కంచి శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారికి భిక్షావందనం చెయ్యాలని సంకల్పించాము. ఒక రోజు కంచి కామకోటి పీఠాధిపతికి భిక్ష చెయ్యడం అంటే ఆయన పరివారానికి  ఆయన చేసే త్రికాల పూజలకి, గోశాలకి, వేదపాఠశాలకి, బ్రాహ్మణ సంతర్పణకి  ఏర్పాట్లు చెయ్యడం. ఒక సామాన్య గృహస్తుకి అంత ఖర్చు పెట్టుకోవడం కష్టం కాబట్టి , మఠం వారు మూడువేల రూపాయల్ని భిక్షావందన కనీస శుల్కంగా ఏర్పాటు చేశారు.  కానీ కొద్ది మందికి అది కూడా కష్టం కావచ్చు . ఒకవేళ కష్టం కాకపోయినా ప్రతి రోజూ చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు. కానీ మనం అందరం కలిస్తే ప్రతి నిత్యం యతిభిక్ష చేసే అవకాశాన్ని పొందవచ్చు. అలా చెయ్యలనే కోరికే ఇప్పుడు బ్రాహ్మణ సభ సభ్యులు ప్రస్తావిస్తున్న నిత్య భిక్షావందనంగా మారింది. 


క్రితం సంవత్సరం ఇలా నిత్య భిక్షావందనం ఆరువేల మంది కలిసి చెయ్యలని సంకల్పించి సమీకరణ పూర్తి చేశాము. ఆ భిక్షా వందనం మార్చి 2021 వరకూ ప్రతిరోజూ జరుగుతుంది. ఈ సంవత్సరం ( 29 మార్చి 2021 నుంచి 28 మార్చి 2022 వరకూ ) మళ్ళీ ఒక్కొక్కరూ  365 రూపాయలు ఒక నిధిలోకి ఇస్తాము పన్నెండు వేల మంది కలిసి. అవి రోజుకి పన్నెండువేల లెఖ్ఖన ఒక ఏడాది పాటు కంచిలో శంకరాచార్యులకి భిక్షావందనం చెయ్యడానికి సరిపోతాయి.


ఇన్ని మఠం  కార్య క్రమాలలోకి మనదొక రూపాయ / చంద్ర మౌళీశ్వర పూజోపహారాలలో ఒక్కపువ్వు  , మఠం చేసే బ్రాహ్మణ సంతర్పణలో ఒక మెతుకు మనద్రవ్యంతో,  ప్రతి రోజూ, ఏడాది పాటు జరిగితే వచ్చే ఫలితం అనంతం. కైలాసం నుంచి ఆదిశంకరులు తెచ్చిన యోగ లింగానికి నిత్యంచేసే త్రికాల పూజలో మన ద్రవ్యం ఉపయోగపడటం మన కుటుంబాలని తరింపజేస్తుంది. ఈ అవకాశం పన్నెండు వేల మంది బ్రాహ్మణ సభ సభ్యులకు మాత్రమే. 


ఆసక్తి ఉన్న వాళ్ళు బ్రాహ్మణ సభ కార్యకర్తలని సంప్రదించి ముందుగా బ్రాహ్మణ సభ సభ్యత్వ సంఖ్య పొందాలి. ఇదివరకూ ఎప్పుడైనా మీరు చండీ హోమానికి ద్రవ్యం సమర్పించి ఉంటే ఈపాటికే మీకు సభ్యత్వ సంఖ్య ఉండి ఉంటుంది. 


డబ్బు రూపంలో కానీ, చెక్కుల ద్వారా కానీ బాంకు ట్రాన్స్ఫరు ద్వారా కానీ ఈ సమర్పణ చెయ్య వచ్చు.  రసీదులు ఈమెయిలు  లో పంప బడతాయి. మీకు లేకపోతే ఇంట్లో  పిల్లలదో ,పెద్దలదో ఈమెయిలు ఇవ్వవచ్చు. అలాగే ఫోను నంబరు కూడా.  నెలకొక్క సారి కంచి నుంచి వచ్చే వాళ్ళు భిక్షావందన ప్రసాదం చండీహోమం వేదిక దగ్గర భాగ్యనగరంలో ఏర్పాటు చేస్తారు .   వచ్చిన వాళ్ళు స్వీకరించ వచ్చు . 

ఇతర వివరాలకు సంప్రదించండి 

మంగిపూడి సత్య నారాయణ మూర్తి 9866368486

జయ జయ శంకర హర హర శంకర

మొగలిచెర్ల

 *వృద్ధ దంపతులు..*


"మీరు ప్రత్యేకించి మా కోసం రూము ఇవ్వకపోయినా పర్వాలేదు..మేమిద్దరం సర్దుకుపోతాము..మంటపం లో పడుకుంటాము..ఎంతవరకు మనకు ప్రాప్తమో అంతవరకే అనుభవించాలి..దేవుడు కేటాయించిన దానినే సంతోషంగా స్వీకరించాలి..మనది కానీ వస్తువు మన దగ్గర నిలువదు..దానికోసం నువ్వు ఎంత కాపలా కాసినా..చివరకు అది చేరవలిసిన చోటుకే చేరుతుంది..ఈ సత్యం అవగతం కావడానికి మా ఇద్దరికీ యాభై ఏళ్ళు పట్టింది.." అని ఆ వృద్ధ దంపతులలో ఉన్న భర్త చెప్పారు..డెబ్బై ఏళ్ల వయసులో ఆ ఇద్దరూ ఎంతో ఉషారుగా వున్నారు..ముఖం లో సంతోషమే తప్ప, మచ్చుకు కూడా నైరాశ్యం లేదు..ఆ దంపతులది బెర్హంపూర్..బరంపురం అని మనం పిలుస్తాము..తెలుగు వాళ్లే..కానీ అక్కడే స్థిరపడ్డ తెలుగు కుటుంబాలలో వీళ్లదీ ఒకటి..


"మీరు శ్రమ పడవద్దు..ఒక రూము కేటాయిస్తాను..అందులో వుండండి..ఈ క్షేత్రం గురించి మీకెలా తెలుసు..అందులోనూ మీరుండేది ఒరిస్సాలో.." అన్నాను కుతూహలం పట్టలేక..ఆయన నా వైపు నవ్వుతూ చూసి.."మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామి..ఆ స్వామివారి క్షేత్రాలను ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాము..పోయిన సంవత్సరం పెంచలకోన లో వెలసిన లక్ష్మీ నారసింహుడిని దర్శనం చేసుకున్నాము..అక్కడ మాల్యాద్రి గురించి అదే మాలకొండ గురించి విన్నాము..అప్పుడు మాకు కుదరలేదు..ఈ సంవత్సరం వీలుచూసుకొని..అందులోనూ శనివారం నాడు మాత్రమే మాలకొండలో దర్శనం కనుక అలా ఏర్పాటు చేసుకొని వచ్చాము..అక్కడ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం చేసుకున్నాక..మా కారు లో కూర్చోబోతుండగా..ఎవరో ఒక సాధువు లాగా వున్నాడు..అతను మా దగ్గరకు వచ్చి.."ఇక్కడ దగ్గరలోనే అవధూత దత్తాత్రేయుడి గుడి ఉంది..అక్కడికి వెళ్ళండి..మీకు శుభం జరుగుతుంది.." అన్నాడు..అతనిని విచారిస్తే..ఈ స్వామివారి గురించి చెప్పాడు..దగ్గరే కదా అని ఇటు వచ్చాము.." అన్నారు..


"ఈరోజు స్వామివారి పల్లకీసేవ ఉన్నది..అందులో పూజ చేయించుకోండి..రేప్పొద్దున్నే స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్ళొచ్చు.." అన్నాను.."బాబూ..ఇక్కడ సమాధి చెందిన అవధూత చాలా సిద్ధపురుషుడని విన్నాను..మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే..ఆ కోరిక తీరుతుందని అందరూ చెపుతున్నారు..నిజమేనా..?" అని అడిగారు.."అదొక విశ్వాసం..సర్వస్య శరణాగతి చెందితే..స్వామివారు తప్పక కరుణిస్తారు..నా కళ్లారా చాలామంది బాగుపడటం చూసాను.." అన్నాను.."ఓహో..అలాగా.." అన్నారు..ఆ తరువాత పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఇద్దరూ పెద్దవాళ్లే అయినా..పల్లకీ తో పాటు మందిరం చుట్టూ..ఇతర భక్తుల తో కలిసి ప్రదక్షిణాలు చేశారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని నాతో వెళ్ళొస్తామని చెప్పి..వాళ్ళ ఊరు వెళ్లిపోయారు..


మరో పది నెలల తరువాత..ఆ దంపతులు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి..అదీ శనివారం నాడే వచ్చారు..ఈసారి తమ కుమారుడిని కోడలిని వెంటపెట్టుకొని వచ్చారు..మధ్యాహ్నం మూడు గంటల వేళ, నా దగ్గర కూర్చుని.."బాబూ..పోయినసారి మేమొచ్చినప్పుడు నువ్వు..సర్వస్య శరణాగతి చెందితే..స్వామివారు కరుణిస్తారు.." అని చెప్పావు గుర్తుందా?..మేమిద్దరమూ ఆ మాట నమ్మి..మా మనుమరాలి పెళ్లి గురించి మొక్కుకున్నాము..ఆ అమ్మాయికి ముప్పై ఏళ్ళు నిండాయి..వివాహం కాలేదు..నా కుమారుడు, కోడలు బాగా వ్యధ చెందుతున్నారు..ఈ స్వామివారి వద్ద మేము మొక్కుకొని వెళ్లిన నెలన్నర కు అమ్మాయికి కేరళ నుంచి సంబంధం వచ్చింది..వాళ్ళూ తెలుగు వాళ్లే..మాట్రీమోనీ ద్వారా చూసారట..సంప్రదించారు..ఆ అబ్బాయికి ముప్పై రెండేళ్లు..వాడికి వివాహం కాలేదని వాళ్ళూ మథన పడుతున్నారు..మొత్తం మీద పిల్లలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చారు..నెల తిరక్కుండానే పెళ్లి చేసాము..ఇప్పుడు ఇద్దరూ కాపురం చేసుకుంటున్నారు..పైగా అమ్మాయి గర్భవతి కూడా..స్వామివారి మహిమే అని మా ఇద్దరికీ అర్ధం అయింది..మా కుమారుడికి చెప్పాము..వాళ్ళూ వస్తామని చెపితే..అందరం కలిసే వచ్చాము.." అన్నారు.."నా కళ్ళముందే..ఫలానా బరంపురం వాళ్లకు కూడా..స్వామివారి సమాధి దర్శనం తరువాత వాళ్ళ కోరిక నెరవేరింది..అని నువ్వు గట్టిగా..మాకు చెప్పినట్టే..అందరికీ చెప్పొచ్చు.." అని నవ్వుతూ చెప్పారు..ఆ వృద్దాప్యం లో ఆ దంపతుల ఓపిక కు నాకు ముచ్చటేసింది..పైగా ఇద్దరూ ఎంతో సంతోషంగా వున్నారు..


సంవత్సరం క్రితం వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేసి.."అమ్మా నాన్న మొగలిచెర్ల రావాలని ఒకటే పట్టుబడుతున్నారు..నాకు వీలు కావడం లేదు..ఇంతకుముందు లాగా వాళ్ళను ఒంటరిగా పంపలేము..బాగా పెద్దవాళ్ళై పోయారు..స్వామివారి విభూతి పంపండి..త్వరలోనే అందరమూ వస్తాము.." అన్నాడు..విభూతి పోస్ట్ లో పంపాము..మరో మూడు నెలలకు ఆ దంపతులను తీసుకొని అతను వచ్చాడు..స్వామివారి సమాధి దర్శనం చేసుకున్న తరువాత.."బాబూ..ఈసారి స్వామివారిని మేమిద్దరమూ ఒకే కోరిక కోరాము..ఇప్పటి వరకూ మంచి జీవితాన్ని గడిపాము..మంచి మరణాన్ని ప్రసాదించమని వేడుకున్నాము..ఇక స్వామి దయ..మా ప్రాప్తం.." అని చెప్పారు..ఆ దంపతుల ముఖం లో అదే చిరునవ్వు..అదే ప్రశాంతత..ఆరోజు సాయంత్రం తిరిగి వెళ్లిపోయారు..


మరో మూడు నెలలకు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి....."నాన్నగారు నెల క్రితం మరణించారండీ..ఏ ఇబ్బందీ పడకుండా ఒక్కరోజు కూడా అనారోగ్యం పాలు కాకుండా..నిద్రలోనే తుది శ్వాస విడిచారు..ఆయన కోరుకున్నట్టే అనాయాస మరణం లభించింది.."అని చెప్పాడు..వార్త విన్నప్పుడు బాధ వేసినా..ఆయన కోరుకున్నది అదే కదా..అని అనిపించింది..చివరి వరకూ స్వామివారినే నమ్మి వున్నారు..స్వామివారూ వాళ్ళు కోరుకున్నది ప్రసాదించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

దేవాలయ దర్శనం

 _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!__*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_💐🙏🙏🙏💐

కల్పాలు

 కల్పాలు


🍁🍁🍁🍁🍁 

 


కల్పాలు పద్దెనిమిది ఉన్నాయని భవిష్య పురాణం చెబుతోంది. 

ఈ కల్పాలు కాల విభజనలో సుదీర్ఘమైన కాలావధులు. ఒక్కో కల్పంలో నాలుగు పాదాలు ఉంటాయి. అవన్నీ సమానమైన కాలావధి లో ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం లోని వైవస్వత మన్వంతరం. అందుకే సంకల్పం చెప్పుకునే టప్పుడు తిధి చెబుతూ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అంటూ చెప్పుకుంటాం. ఇక ఈ కల్పాల పేర్లు విషయానికి వస్తే అవి 

కూర్మ కల్పం 

మత్స్య కల్పం 

శ్వేతవరాహ కల్పం 

నృసింహ కల్పం 

వామన కల్పం 

స్కంద కల్పం 

రామ కల్పం 

భాగవత కల్పం 

మార్కండేయ కల్పం 

భవిష్య కల్పం 

లింగ కల్పం 

బ్రహ్మాండ కల్పం 

అగ్ని కల్పం 

వాయు కల్పం 

పద్మ కల్పం 

శివ కల్పం 

విష్ణు కల్పం 

బ్రహ్మి కల్పం

ప్రస్తుతం నడుస్తున్నది శ్వేతవరాహ కల్పం. 

అంటే భవిష్య పురాణం ప్రకారం వరుసలో మూడో కల్పం 

దీని తరువాత 15 కల్పాలు ఉన్నాయి అందులోని ప్రతి దానిలో మన్వంతరాలు ఉన్నాయి. 

ప్రతి మన్వంతరం లోనూ నాలుగు యుగాలు ఉంటాయి. 

ఈ చక్రం అంతా పూర్తయిన తర్వాతనే సంపూర్తి లయం.

 ఈలోగా ప్రతి కలియుగాంతంలో జల ప్రళయం వచ్చి లో దుష్ట ప్రకృతి కి చెందిన వారినందరిని అంతం చేస్తుంది.

 మిగిలిన కొద్ది మంది మంచివాళ్ళతో మరో మన్వంతరంలోని సత్య యుగం ఆరంభం అవుతుంది.


🍁🍁🍁🍁

సత్యనారాయణ స్వామి వారి వ్రతం

 *సత్యనారాయణ స్వామి వారి వ్రతం లో చేసే పొరపాట్లు..* 


---చాగంటి వారి ప్రవచనం నుండి....

       సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. సత్యనాాయణస్వామి వ్రతంలో ప్రధానమైన అంగం మంటపదానం చేయడం. మొట్టమొదట స్కాందం లో ఒక షరతు ఉంది. మీ శక్తికి లోటు చేయకుండా మీరు సువర్ణమూర్తిని గానీ, రాగిమూర్తిని కానీ ఏదో ఒకటి పెట్టాలి. మనం ఎప్పుడూ ఏమి చేస్తామంటే .... ఒక కలశ పాత్ర పెట్టీ సత్యనారాయణ స్వామివారి ఫోటో తీసుకువచ్చి అక్కడపెట్టి వ్రతం చేసేసిన తరువాత చివరలో మంటపదానం చెయ్యమని మంటపమున్న తువ్వాలును కొద్దిగా ఎత్తమంటారు. ఎత్తిన తరువాత అందులో ఉన్న బియ్యము, తువ్వాలు పురోహితుని కి ఇచేస్తాము. ఇంకా కొంతమంది ఐతే ఇంటికి వచ్చినవాళ్ళు చూడాలని మంటపంలో ఒక వెండి అష్టలక్ష్మీ చెంబు పెడతారు. .... అష్టలక్ష్మీ చెంబును, మంటపంలో పెట్టీ పూజ చేసిన స్వామివారి మూర్తిని వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటా రు. నీవు మంటపంలో మూర్తిని పెట్టీ పూజ చేసిన తరువాత మంటపాంతర్గతంగా ఉన్న మూర్తిని కూడా నీవు దానం చేసెయ్యాలి. నువ్వు దానం చేశానని చెప్పి దానిని మరల ఇంట్లో పెట్టుకుంటే వెంటనే పొరపాటు చేసినట్లే. 

          అలాగే సత్యనారాయణ స్వామీ వ్రతంలో గ్రహములను పిలుస్తాము. పిలిచినప్పుడు ఆయన ఒక రంగు బట్టలు కట్టుకుంటారు. ఒక వాహనం ఎక్కుతాడు. కొన్ని ఆభరణములు వేసుకుంటాడు. ఆయనతో బాటుగా ఆయన పరివారం వస్తుంది. వాళ్ళు వస్తున్నప్పుడు ధ్యాన శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకములలో ఉన్న శబ్దశక్తికి ఆ గ్రహములు వచ్చి కూర్చుం టాయి. అపుడు మంటపంలో సత్యన్నారాయనుడు వచ్చి కూర్చుంటాడు


. ఆఖరున కథ చెపుతారు. కథ మార్చడానికి వీల్లేదు. 


కథలో ప్రారంభంలో ముందు వ్రతమును బ్రాహ్మణుడు చేస్తాడు. అక్కడికి మంచినీళ్ళ కోసమని ఒక శూద్రుడు కట్టెలు కొట్టుకునేవాడు వస్తాడు. దాహం కోసమని వచ్చినవాడు ఆ వ్రతం జరుగుతున్న విధానము చూసి మంచినీళ్ళు అడగడం మర్చిపోయాడు. మరిచిపోయి వ్రతం ఎలా చేస్తారని అడిగి కట్టెలు అమ్మిన డబ్బుతో వ్రతం చేస్తాడు. ఇద్దరికీ ఫలసిద్ధి కలుగుతుంది. చాతుర్వర్ణ ములవారు ఎలా ఈశ్వరుని పాదములు చేరుకో వాలో కథలో రహస్య మంతా అంతర్భాగం గా ఉంటుంది. 


🍁🍁🍁🍁

గ్రహణ సమయంలో

 🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹

గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు?

⚫⚫⚫⚫⚫

దర్భలు ఎందుకు వాడాలి?

గర్భిణీ స్త్రీలు ఎందుకు చూడకూడదు?

⚫⚫⚫⚫⚫

దర్భల మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి  నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.

అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుంది. అని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది

సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారనేది తెలుసుకోవాలంటే ఈ *వివరణ* చదవాల్సిందే. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలన్నీ... గృహాలన్నీ సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి.

ఈ క్రమంలో దర్భలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. *గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగివున్నది*. అందుకే గ్రహణం సమయంలో  మన ఇంట్లోని అన్ని పాత్రలపై, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది.

గ్రహణ సమయంలో జాగ్రత్తలు

వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీస్త్రీలపైఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది.  కాని సృష్టితీరులో ప్రతిచర్యకు ప్రతిచర్యకు ఉంటుంది.

ఏది జరిగినాదాని ప్రభావం ఏదో ఒకరూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్యపూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసి శాంత్యోపచరాలు చేసుకోవలసినదని జపతపాదులు చేసుకొమ్మని, సముద్రపు ఆటు పోటులు జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని చెప్పడం జరిగింది.

*ముఖ్యంగాగర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరములో అధిక వేదనలు పడతాయనిదానికోసమే గ్రహణములు చూడరాదని కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞలు పరిశోధన ఫలితాలు తెలియచేస్తున్నాయి*.ఇంటిలో గ్రహణం పడుతున్నదని తెలిసినప్పడు ముందుగా దర్భలు ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద దర్భలను వేయవలయును. సాధారణంగా గ్రహణానికి రెండుగంటల ముందే భోజనము పూర్తి చేయవలెను. గ్రహణం పట్టు, తర్వాత స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను.

ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితముల నొసగుననిశాస్త వచనము. భూమి ఎన్నో మార్పులకు లోనౌతుంది. ఎప్పడైనా మార్పులువస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనుమార్పులు చేసుకోవాలి. అప్పడే ఆరోగ్యం బాగుంటుంది .సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తిగా చెప్పకోవాలి. గ్రహణ సమయాలలో మనం వాటి కనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

గ్రహణ సమయంలో దర్భలను ఆహారపదార్థలపైనే వేయవలసిన అవసరం

ఉన్నది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటు గా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడుకొయ్యాలి.

ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తిఅయ్యే ఫలితాన్ని అల్త్రావైలెట్ కిరణాల ప్రభావాన్నిఅవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో గాని పచ్చళ్ళపైగాని వేసినటైతేఅవి బూజు పటతీరికుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగంవారు పరిశోధించి తెలిపిన విషయం.

అందువల్ల దర్భలను పచ్చళ్ళవీుదనీళ్ళలో దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం.ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని వారంటున్నారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరించారు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏