6, ఫిబ్రవరి 2021, శనివారం

దర్శనం

 🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻

🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁




*🙏🏻దైవ దర్శనం తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా ?🙏🏻*




దైవదర్శనం మనసును పవిత్రం చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కష్టాలు  నష్టాలు బాధలు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దైవదర్శనం వలన మనసుకి ఉపశమనం లభిస్తుంది. దైవం మనకి అండగా ఉందనే భరోసా కలుగుతుంది. దైవం అనుగ్రహం కన్నా మనకు కావలసిందేముందనే సంతృప్తి మిగులుతుంది.


అందుకే చాలా మంది ఉదయాన్నే ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు.కరుణాకటాక్ష వీక్షణాలను తమపై ప్రసరింపజేయవలసిందిగా దైవాన్ని ప్రార్ధిస్తుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనసు కుదుటపడేవరకూ ఆలయ ముఖమంటపంలో కూర్చుంటారు. ఇక సమస్యలు పెద్దగా లేనివారు సైతం నిత్యం దైవదర్శనం చేసుకుంటూవుంటారు. వీరిలో ఒకరకమైన తేజస్సు చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంటాయి.


ఇక ఇలా ఆలయానికి వచ్చే భక్తులను ఓ సందేహం సతమతం చేస్తుంటుంది. ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా? లేదంటే అక్కడి నుంచి నేరుగా ఎక్కడికైనా వెళ్లవచ్చా? అని అనుకుంటూ వుంటారు. ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది. పండితుల ప్రసంగాల్లోనూ వినిపిస్తుంటుంది.


విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఆలయానికి వెళ్లినప్పుడు, పూజ పూర్తి అయిన తరువాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాతే దైనందిన వ్యవహారాల నిమిత్తం బయటికి వెళ్లాలని అంటూ వుంటారు.


ఇక సాధారణ రోజుల్లో కూడా దైవదర్శనం తరువాత, అపవిత్రమైన ప్రదేశాలకు, మైలలో వున్న ఇళ్లకు వెళ్లకూడదని చెబుతుంటారు. అందువలన దైవ దర్శనం తరువాత ఆ పవిత్రత చెడని ప్రదేశాలకు ప్రశాంతత చెదరని ప్రదేశాలకు వెళ్ల వచ్చని సూచిస్తుంటారు.


*ఓం నమో నారాయణాయ🙏*

కామెంట్‌లు లేవు: