6, ఫిబ్రవరి 2021, శనివారం

మనిషి సంపాదన

 *"మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట!!*     

                *ఎందుకని?*

...

..కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్య. 


....లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి. 


....ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.


....".లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే ప్రింటింగ్ ప్రెస్సువచ్చిన తరువాత. లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు ".


.....పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికిసరిపడేదివారు వస్తువినిమయంతో సంపాదించుకొనితినేవారు. ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు. ఎంత తిండికి అవసరమో అంత సంపాదించుకునే వారు. మహా దాచుకున్న రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి. 


... ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో. ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది.


....ప్రింటిగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు. 


.....వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది.


  (బ్రహ్మశ్రీ చాగంటి.కోటేశ్వరరావు గారి ప్రవచనములు నుండి సేకరణ)

కామెంట్‌లు లేవు: