6, ఫిబ్రవరి 2021, శనివారం

శ్రీ దేవి భాగవతం - 194 వ అధ్యాయము --

 🙏🙏 *శ్రీ దేవి భాగవతం - 194 వ అధ్యాయము --  వరాహమూర్తి భూమిని ఉద్దరించుట*🙏🙏


*నారాయణుడిట్లనెను:* *పరంతాపా ! ఈప్రకారమగ బ్రహ్మ మన్వాదులు మునివరులు మరీచ్యాదులు నగు వారిని గూడి యాలోచింప సాగెను. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మ ముక్కు కొన నుండి వెంటవే బొటన వ్రేలంతటి వరహపోత ముద్బవించెను. ఓ నారదా! బ్రహ్మ చూచుచుండగనే యొక్క క్షణ మాత్రమున నది లోకాద్బుతముగ పెద్ద యేనుగంతగ పెరెగెను. నారాదా! మరీచి ముఖ్య విప్రులతో సనకాది మునులతో గూడి పుటము నుండి యాత్యాశ్చర్యము నుద్బవించినదే! ఇది మొదట బొటన వ్రేలంతగ నుండి పిదప క్షణముననే పర్వతమంత మారినది. ఆహా! ఇతడు భగవానుడో! కాక యజ్ఞమూర్తియో! యని నా మదిలో సంశయము గల్గుచున్నది. అని పరమాత్మరూపుడగు బ్రహ్మ సంశయించుచుండగ వరహ భగవానుడు పర్వతమంత రూపము దాల్చి యెలుగెత్తి గర్జించెను. దిక్కలు పిక్కటిల్లు గర్జా ధ్వనితోనే ద్విజవరులకు బ్రహ్మకు భయముడిపి ధైర్యము గలిగించెను. జన స్తపస్సత్య లోకావాసులగు నమరవరులును దుఃఖములు తొలగించునట్టి ఘర్ఘుర రావమును వినిరి. అంత విప్రులు బుక్‌ సామ ఆధర్వణములందలి ఛంధో మయములగు వచస్సులతో ఆద్య పురుషుని వరాహమును స్తుతించిరి. వారి వేదస్తోత్రము లాలకించి యాద్యుడు భగవానుడు ఈశ్వరుడునగు రాహమూర్తి సంతసించి దయతోడి చూపులతో నీట మునిగెను. అచడు నీచ ప్రవేశించగనే, యతని గట్టి జడల తాకిడికి పీడితుడై ''దేవా! శరణప్రదా! నన్ను గాపాడు మని సాగరుడు మొఱపెట్టకొనెను. సముద్రుడు పల్కిన మాటలు విని యీశ్వరుడగు వరాహవిభుడు జలచరములను చీల్చి చెండాడుచు లోతైన నీటి లోనికి మునింగెను.*


*అట్లు వరాహస్వామి నీటిలోన నిటునటు పరుగెత్తుచు మెల్లమెల్లగ భూమిని వెదకి పట్టుకొని పల్మారు మూర్కొనెను. ఎల్ల భూత కోటుల కాశ్రయ భూతమై నీట మునిగియున్న భూమిని వరాహ దేవదేవుడు తలకోఱలతో పైకెతైను. యజ్ఞ వరాహ పురుషుడట్లు భూమిని తన కోఱల కోనలతో పైకి లేపెను. అది దిగ్గజము పైకి లేపిన కమలమునట్లు శోభ వహించెను. కొనకోఱలతో పుడమినిపైకి లేపిన వరాహదేవుని గని బ్రహ్మ మనువు స్వరాట్టు మున్నగువారు అతని నిట్లు సంస్తుతించిరిః బ్రహ్మ యిట్లనెను. ఓ పుండరీక్షాక్ష! భక్తార్తిభంజనా! సర్వకామ ఫలప్రదా! నీకు విజయమగు గావుత! నీవు సత్య లోకమును సైతము ప్రతాపముచే కురుచ పరచితివి. దేవా! ఏనుగు తొండముపై నలరారు కమలము చందమున నీ కొనకోఱలపై నీ భూదేవి శోభిల్లు చున్నది. తొండముపై కమలమును దాల్చిన గజరాజు శరీరమువలె కోఱలపై భూమిని దాల్తిన నీ వరహ శరీరము సొబగు వహించుచున్నది. దేవేశా! సృష్టిసంహారకారా! నీకు నా నమోవాకములు. దానవ నాశమునకు పెక్కురూపులు దాల్చు భగవానుడు నీవే కదా. ఎల్ల దేవతలకు నిలయమైన తేజోనిధానమా! నీకు మహాశక్తియుక్తుడువు. నీనే ప్రజాసృష్టికి నీచే నియమింప బడితిని. నీ యానతి చోప్పున విశ్వమును పుట్టించి సమయింప చేతును. దేవేశా! మున్ను తగిన కాలము తగిన బలముతో సురవరులు నీ సాహాయ్య సానుభూతులతో నమృతము బొందిరి. ఇంద్రుడు సైతము నీ యానతి ప్రకార మెల్ల సురలచేతపూజితుడై త్రిలోకి సామ్రాజ్యశ్రీ ననుభవించెను. అగ్ని నీ వలన నాయా ప్రాణుల జఠరములందు నెలకొల్పబడి వైశ్వాన రూపమున దేవ - అసుర-నరులను తృప్తి పఱచుచున్నాడు.*


*సమవర్తి సర్వసాక్షి కర్మఫలదాత కర్మసాక్షి పితృపతి ధర్మరాజునగు యముడు నీ నియోగముననే జీవుల కర్మానుసారము ఫలము లొసగు చుండును గాదా! రక్షసాంపతి విఘ్న వినాశకుడు యక్షుడు నగు నైఋతుడు సర్వకర్మ సాక్షియగుట నీ వనలనే కదా! జలాధినాధుడగు వరుణుడును నీ యాజ్ఞ వలననే ప్రాణులకు ప్రాణాధారుడై లోక పాలకుడయ్యెను. గంధవహుడు - జగద్గురువగు వాయువు నీ వలననే సర్వభూతములకు ప్రాణాధారమై లోకపాలకుడు అయ్యెను. యక్షకిన్నరాదుల కధిపతి యగు కుబేరుడు నీ యానతి మేరకు సకల లోకపాలకులలో గౌరవపాత్రుడయ్యెను. ఇక సర్వరుద్రేశుడు - ఈశానుడు అంతకుడు - సకలలోక వంద్యుడగునగు శివుడు సర్వదేవాధి నాయకుడువగు నీ కారణముననే లోకవంద్యుడై విలసిల్లు చున్నాడు. ఇన్ని సర్వ శుభ లక్షణములు గల జగదీశ్వరుడవు భగవానుడవు నగు నీకు నమోవాకములు. నీ యొక్క యంశము వలన నెల్ల దేవతలు లుద్బవించిరి. అట్లు బ్రహ్మచేత నుతింపబడిన యాది పురుషుడగు భగవానుడు తన విలాస వీక్షణ మునులతో బ్రహ్మనము గ్రహించెను. అత్తఱి హిరణ్యాక్షడను ఘోర మహాసురుడు త్రోవకడ్డు నిలువబడగా వరాహ దేవుడు భీమమగు గదతో నతనిని చావమోదెను. అది వరాహ పురుషుడగు భగవానుని శరీరము దానవుని నెత్తుట తడిసెను. అట్లు వరాహదేవుడు భూమిని నీటి నుండి లీలగ తన కోఱలతో పైకి లేపెను. లోకనాథుడగు వరాహమూర్తి భూమిని యథాస్థానమున నుంచి తన స్థానమున కేగెను. ఇట్లు భగవంతుడు భూమి నుద్దరించుట చిత్రము. ఈ వరాహ చరిత్ర ముత్తమము. దీనిని చదివిన - వినిన మానవుడు సర్వపాప విముక్తుడై వైష్ణవ మార్గము బొందును.*


*ఇది శ్రీ దేవి భాగవత మహ పురాణమందలి యష్టమ స్కంధమున ద్వితీయ అధ్యాయము సమాప్తం.*

       🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: