5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

బ్రాహ్మణ సభ

 శ్రీమహగణాధిపతయేనమః శ్రీ గురుభ్యోనమః 


జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశానుసారం  ఏడున్నర సంవత్సరాల క్రితం 2012 శంకర జయంతి నాడు  బ్రాహ్మణ సభ (పంచ ద్రావిడ)  అనే సంస్థ  ప్రారంభించబడింది.  


పంచ ద్రావిడ ప్రాంతాలు అంటే వింధ్య పర్వతాలకు దక్షిణ దిక్కున ఉన్న తెలుగు తమిళ కన్నడ మళయాళ మరాఠీ,  గుజరాతీ భాషలు మాట్లాడే ప్రాంతాలు. ఇందులో తమిళ మళయాళాలని ఒకే భాషగా లెఖ్ఖ వేస్తారు .  బ్రాహ్మణ కనీస ఆచారాలని ఆచరణ ద్వారా కాపాడుకోవడం , బ్రాహ్మణ యువతకి సకాలంలో వివాహాలు జరిగేలా చూడటం , ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవడం లాంటి ఆశయాలతో ఈ సభ ఆరంభించ బడినది . 


బ్రాహ్మణ శ్రేయస్సు, లోక కల్యాణం కోసం ప్రతి నెల చండీహోమం , యువత కోసం మార్గ దర్శనం , సమస్యల చర్చ,  పరిష్కారం కోసం గోష్టి , పిల్లల్లో, బ్రాహ్మణ యువతలో  నాయకత్వ ధోరణి , సేవా ధోరణి పెంచడానికి కార్యక్రమాలు, సకాలంలో వివాహం జరగడానికి జాతక పరివర్తన కార్యక్రమం ఇలాంటి మరెన్నో కార్య క్రమాలు బ్రాహ్మణ సభ నిర్వహిస్తోంది. 


గృహస్తులకున్న బాధ్యతల్లో బ్రహ్మచర్యాశ్రమం లో ఉన్న బ్రహ్మచారుల, సన్యాసాశ్రమం లో ఉన్న సన్యాసుల  పోషణ ఉన్నాయి . 


వేదం చదువుకుంటున్న విద్యార్థులకోసం  వంటకి ముందు ప్రతి బ్రాహ్మణ గృహిణి ఒక గుప్పెడు బియ్యం ఒక సంచీలో వేసి , చండీ హోమం నాడు, వేదికకి తీసుకు వస్తారు. అక్కడ ఆ బియ్యాన్ని అందరూ పెద్ద సంచులలో నింపుతారు. ఈ సమీకరించిన బియ్యం వేద పాఠశాల విద్యార్థులు భిక్షగా స్వీకరించి  , సభ్యులకి ఆశీర్వచనం చదువుతారు.     ఈ విధంగా పరమాచార్యులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి  వారి గుప్పెడు బియ్యం పధకం, గత నాలుగు సంవత్సరాలుగా బ్రాహ్మణ సభ విజయవంతంగా నిర్వహిస్తోంది.  కుక్షౌ తిష్టతి యస్యాన్నమ్, వేదాభ్యాసేన జీర్యతే కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్.  విద్యార్ధులు వేదాభ్యాసం ద్వారా మనం సమర్పించిన అన్నాన్ని జీర్ణం చేస్తే మన ముందు పది తరాలు తరవాత పది తరాలు కూడా తరిస్తాయని పెద్దలు చెప్పారు .  


బ్రాహ్మణ సభ తరఫున సభ్యులందరం కలిసి ప్రతి నిత్యం కంచి శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారికి భిక్షావందనం చెయ్యాలని సంకల్పించాము. ఒక రోజు కంచి కామకోటి పీఠాధిపతికి భిక్ష చెయ్యడం అంటే ఆయన పరివారానికి  ఆయన చేసే త్రికాల పూజలకి, గోశాలకి, వేదపాఠశాలకి, బ్రాహ్మణ సంతర్పణకి  ఏర్పాట్లు చెయ్యడం. ఒక సామాన్య గృహస్తుకి అంత ఖర్చు పెట్టుకోవడం కష్టం కాబట్టి , మఠం వారు మూడువేల రూపాయల్ని భిక్షావందన కనీస శుల్కంగా ఏర్పాటు చేశారు.  కానీ కొద్ది మందికి అది కూడా కష్టం కావచ్చు . ఒకవేళ కష్టం కాకపోయినా ప్రతి రోజూ చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు. కానీ మనం అందరం కలిస్తే ప్రతి నిత్యం యతిభిక్ష చేసే అవకాశాన్ని పొందవచ్చు. అలా చెయ్యలనే కోరికే ఇప్పుడు బ్రాహ్మణ సభ సభ్యులు ప్రస్తావిస్తున్న నిత్య భిక్షావందనంగా మారింది. 


క్రితం సంవత్సరం ఇలా నిత్య భిక్షావందనం ఆరువేల మంది కలిసి చెయ్యలని సంకల్పించి సమీకరణ పూర్తి చేశాము. ఆ భిక్షా వందనం మార్చి 2021 వరకూ ప్రతిరోజూ జరుగుతుంది. ఈ సంవత్సరం ( 29 మార్చి 2021 నుంచి 28 మార్చి 2022 వరకూ ) మళ్ళీ ఒక్కొక్కరూ  365 రూపాయలు ఒక నిధిలోకి ఇస్తాము పన్నెండు వేల మంది కలిసి. అవి రోజుకి పన్నెండువేల లెఖ్ఖన ఒక ఏడాది పాటు కంచిలో శంకరాచార్యులకి భిక్షావందనం చెయ్యడానికి సరిపోతాయి.


ఇన్ని మఠం  కార్య క్రమాలలోకి మనదొక రూపాయ / చంద్ర మౌళీశ్వర పూజోపహారాలలో ఒక్కపువ్వు  , మఠం చేసే బ్రాహ్మణ సంతర్పణలో ఒక మెతుకు మనద్రవ్యంతో,  ప్రతి రోజూ, ఏడాది పాటు జరిగితే వచ్చే ఫలితం అనంతం. కైలాసం నుంచి ఆదిశంకరులు తెచ్చిన యోగ లింగానికి నిత్యంచేసే త్రికాల పూజలో మన ద్రవ్యం ఉపయోగపడటం మన కుటుంబాలని తరింపజేస్తుంది. ఈ అవకాశం పన్నెండు వేల మంది బ్రాహ్మణ సభ సభ్యులకు మాత్రమే. 


ఆసక్తి ఉన్న వాళ్ళు బ్రాహ్మణ సభ కార్యకర్తలని సంప్రదించి ముందుగా బ్రాహ్మణ సభ సభ్యత్వ సంఖ్య పొందాలి. ఇదివరకూ ఎప్పుడైనా మీరు చండీ హోమానికి ద్రవ్యం సమర్పించి ఉంటే ఈపాటికే మీకు సభ్యత్వ సంఖ్య ఉండి ఉంటుంది. 


డబ్బు రూపంలో కానీ, చెక్కుల ద్వారా కానీ బాంకు ట్రాన్స్ఫరు ద్వారా కానీ ఈ సమర్పణ చెయ్య వచ్చు.  రసీదులు ఈమెయిలు  లో పంప బడతాయి. మీకు లేకపోతే ఇంట్లో  పిల్లలదో ,పెద్దలదో ఈమెయిలు ఇవ్వవచ్చు. అలాగే ఫోను నంబరు కూడా.  నెలకొక్క సారి కంచి నుంచి వచ్చే వాళ్ళు భిక్షావందన ప్రసాదం చండీహోమం వేదిక దగ్గర భాగ్యనగరంలో ఏర్పాటు చేస్తారు .   వచ్చిన వాళ్ళు స్వీకరించ వచ్చు . 

ఇతర వివరాలకు సంప్రదించండి 

మంగిపూడి సత్య నారాయణ మూర్తి 9866368486

జయ జయ శంకర హర హర శంకర

కామెంట్‌లు లేవు: