3, మార్చి 2021, బుధవారం

కరోనా హెచ్చరిక:

 *కరోనా హెచ్చరిక:

ప్రజా ప్రయోజనాల రీత్యా జారీ చేయబడింది. 

కరోనా వైరస్ వ్యాప్తి  ఇప్పుడు  2 వ దశలో  ఉందని, సోకిన 3 రోజులలోనే   తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

*దయచేసి మీ పనులు అన్ని పక్కన పెట్టి 2 నిముషాలు ఈ అత్యవసర కరోనా మెసేజ్ చదవండి..*

ఇంతకు ముందు కరోనా వైరస్ వేరు. ఇప్పుడు అది మారిన తీరు వేరు.. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది..

మరియు 60 ఏళ్ళు దాటిన వారికి తీవ్రం గాను, యుక్త మధ్య వయస్సు వారికి స్వల్పం గాను ప్రభావాన్ని చూపేది.కానీ world హెల్త్ organisation (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితి లోకి చేరుకుంది.ఏ మాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ వారినైనా సరే మూడే మూడు రోజుల్లో  మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ  మరలి రాని లోకాలకు తీసుకెళ్లి పోతూ ఉంది..

రోజూ కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు అయిన వాళ్ళని, అందర్నీ  దిగ్భ్రాంతికి గురి చేసి మూడే మూడు రోజుల్లో మృత్యు ఒడి లోకి జరుకుని  తీవ్ర దుఃఖాన్ని మిగుల్చు తున్నారు.. 

కరోనా వెరీ డేంజర్ స్టేజ్ లో ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వెల్లడించిందంటే..  కరోనా సోకిన 1,2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే  ట్రీట్మెంట్ చేసినా బతకలేని స్థితిలో మనిషి ఊపిరి ఆపి ఉసురు తీసుకుంటూ ఉంది.. 

*ఏముంది కరోనా పోయింది లే.. ఎక్కువ కేసులు లేవు లే.. సి-విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాం లే.. మన వరకూ రాదులే.. దేవుడున్నాడు లే అని మాస్క్ లు లేకుండా, సామజిక దూరం పాటించకుండా, sanitisation చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మూడే రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్లి పోవడం గ్యారంటీ..* 

ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకుని నిలబడి తనని తాను మరింత ప్రమాదకర వైరస్ గా రూపు దిద్దుకుంది. 

కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ లు అన్ని పక్కన పెట్టి   C, D, జింక్ లాంటి మల్టీ విటమిన్ లు తీసుకుంటూ, *మాస్క్ లు, హ్యాండ్ sanitisation లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ..*  అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగ వలెను..లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడ లేడు..


కావున ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వీడి,14 రోజుల కరోనా నుండి అత్యంత ప్రమాద కారిగా మారిన ఈ 3 రోజుల కరోనా వైరస్ ని నిశితంగా గమనిస్తూ పై సూచనలు జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకో వలసిందిగా కోరుచున్నాము. 


ఈ మెసేజ్ ని 10 మందికి పంపి మీ పక్క వారు కూడా పాటించేలా జాగ్రత్త పడండి.. 


ఎందుకంటే, ఈ కరోనా వ్యాపించేది పక్క మనిషి నుండే అనే విషయాన్ని మర్చి పోవద్దు.. ఒక్కోసారి పనికి రాని చెత్త విషయాలను షేర్ చేస్తూ సమయం వృధా చేస్తూ ఉంటాం.

ఈ ఒక్కసారికి  ఈ విలువైన msg ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చెయ్యండి.. 


*గుర్తుంచుకోండి.. ఇప్పుడు ఉన్నది 14 రోజుల కరోనా కాదు.. 3 రోజుల కరోనా అనే విషయాన్ని మర్చిపోవద్దు..*🙏

ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

             *నేటి కధ:*


*ఆత్మహత్య నుంచి ఆత్మ విశ్వాసం వరకు* 

        🌷🌷🌷

ఒక స్త్రీ కొండపైనుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని చాల ఎత్తయిన కొండ పైకి ఎక్కింది.  మరో పది అడుగులు వేస్తే దూకుతుందనగా కాలికి ఏదో తగిలింది.  క్రిందికి చూస్తే ఏదో మెరుస్తూ కనిపించింది.  ఆమె ఒక కొయ్య సహాయంతో ఆ మెరిసే వస్తువును భూమిలోంచి బయటకు తీసింది.


అది ఒక దీపం.  దానికి అంటుకున్న దుమ్ము దులుపుతున్నపుడు ఒక చిన్న మెరుపు వచ్చి అందులోంచి ఒక భూతం బయటకు వచ్చింది.


ఆమె  ఆ భూతాన్ని చూసి మొదట భయపడింది.   కానీ, ఆ భూతం కొంచెం మనిషిలాగే ఉండడం అదీగాక చావాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ దయ్యాలకూ, భూతలకూ భయపడడమేమిటని ధైర్యంగా ఆ భూతాన్ని "ఎవరు నువ్వు?"  అని అడిగింది.


"నేనొక భూతాన్ని!  బహుశా నీకు కాబోయే స్నేహితురాలిని కూడా కావచ్చు!  నా వివరాలు తర్వాత చెబుతాను.  ముందు నీ విషయం చెప్పు!  నువ్వు ఎందుకు చావాలని నిర్ణయించుకున్నావు?  నీ సమస్య ఏమిటో చెబితే నాకు వీలైతే పరిష్కారం చెబుతాను" అన్నదా భూతం.


"చెబితే నష్టమేమిటి?  దొరికితే పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే 'చావు' పరిష్కారం ఉండనే ఉంది" అని ఆలోచించి తన కష్టాలు చెప్పసాగింది. 


"నా మనస్సు కు సుఖమనేదే లేదు.  నా తల్లిదండ్రులు నన్నర్థం చేసుకోలేదు.  ఇష్టం లేనివాడికిచ్చి పెళ్లి చేశారు. సరే పోనీలే!  అని అడ్జెస్ట్ అయ్యాను.  కానీ, చేసుకున్న మొగుడు కూడా నన్నర్థం చేసుకోవట్లేదు.  నా మాట లెక్క చేయడు.  నేను కన్న పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు.  నాకు విలువ ఇవ్వడం లేదు.  ఆఫీస్ లో నేనెంత కష్టపడి పనిచేసినా మా బాస్ నన్ను గుర్తించట్లేదు. చివరకు పొరుగింటివారు, కొలీగ్స్ ఎవరి వద్ద నాకు విలువ లేదు.  దీంతో నా మనస్సులో భరించలేని ఒంటరితనం ఏర్పడి విలువ లేని ఈ బ్రతుకు వద్దనుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను.  నిజానికి ఇది ఆవేశంతోనో, దుఃఖంతోనో తీసుకున్న నిర్ణయం కాదు.  నిరాశా, నిర్లిప్తితతో తీసుకున్న నిర్ణయం .


ఆమె మాటలు విన్న భూతం ఇలా అంది.

"నిజమే! మీరంతా సామాజిక జీవులు.  మీరు ఏం చెయ్యాలన్నా చుట్టూ ఉన్న వారి ప్రమేయం ఉండాలి. ఆమోదం ఉండాలి.  సహకారం ఉండాలి.  ఎంత ధీమాగా ఒంటరి పయనానికి తెగించినా కొన్ని అడుగుల తర్వాత మరి కొన్ని అడుగులు జత కలవాల్సిందే. అందుకే ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకోవడం చాలా సహజం. 


*మరి అలా జరగనప్పుడు ఏం చెయ్యాలి?* 


ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. 


అసలు నిన్ను  అర్థం చేసుకోవలసిన అవసరం అవతలి వాళ్ళకేముంది?


నిజమే! నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి ఆలోచించడం సహజం కదా! నిన్ను  అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేయాలంటే, నీ అవసరం వాళ్లకు ఉందా?  అని ఆలోచించు!  వాళ్లకు కావలసిన అర్హతలు నీ దగ్గర ఏమున్నాయో చెక్ చేసుకో!


 ఎందుకంటే అవసరం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరు! ఎంత సొంత వారైనా నిన్ను అర్థం చేసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. 


సరే! వాళ్ళకు నీ అవసరం లేదని తేలిపోయింది. 


మరిప్పుడు ఎలా?  నీ కర్మ ఇంతే  అనుకుందామా?  కానేకాదు.  ఇప్పుడిలా ప్రశ్నించుకో! 


నీకు వాళ్ళ అవసరం నిజంగా ఉందా?

ఇది కూడా నిజమే! 


ఒక్కోసారి మనం అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 'అవతలి వారికి  వారి అర్హతలకు మించిన స్థానాన్ని ఇచ్చి బాధపడిపోతుంటాం'. 


ఉదాహరణకు ఒక సంస్థలో నీకు గుర్తింపు లేకపోతే మరో సంస్థను వెదుక్కోవచ్చు. ఒకరు నిన్ను తిరస్కరిస్తే మరొకరు నిన్ను ఆదరించవచ్చు.  అయితే అన్ని సందర్భాలలోనూ అందరినీ ఒదులుకోలేము కదా! కూతురినో, భర్తనో  అలా వదిలేసుకుంటామా? ఒక్కోసారి ప్రేమించిన వాళ్ళను కూడా ఒదులుకో లేకపోవచ్చు! అప్పుడేం చేద్దాం?   


ఇంకేం చేస్తాం?  మన ఫిర్యాదును వెనక్కి తీసుకుందాం! వెనక్కి అంటే వ్యాకరణం మార్చి చదువుదాము. 


"నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు"


దీన్నే మరోలా చదువుదాం 


"నేను ఎవరికీ అర్థం కావట్లేదు "

ఎలా ఉంది? రెండింటి లో తేడా ఉంది కదా! 

మొదటి దాంట్లో నిన్ను అర్థం చేసుకోలేక పోవడం ఎదుటివారి తప్పు అన్నట్టుగా ఉంది.  రెండో దాంట్లో తప్పు నీలోనే ఉంది.  అవును!  మనకు సంబంధించిన ప్రతి సమస్యకూ చాలావరకు మన దగ్గరే పరిష్కారాలు ఉంటాయి.  ఇదీ అంతే!


నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అంటే దానర్థం నువ్వు ఎవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నావని. 


ఇప్పుడు రెండే దారులు. 


ఒకటి నువ్వు మారాలి. అంటే ... నీ వైపు నుంచి కాకుండా అవతలి వైపు నుంచి ఆలోచించాలి.  నీలో లోపాలున్నాయి అనిపిస్తే సరిదిద్దుకోవాలి. 


*ఇక రెండోది.* 


నిన్ను నువ్వు సరిగా చూపించుకోవాలి.  నువ్వేంటన్నది కొత్తగా నిరూపించుకోవాలి.  నీ అభిప్రాయాన్ని సరిగా కమ్యూనికేట్ చేయాలి.  సరిగా అంటే ఎలా అనేది సందర్భాన్ని బట్టి నువ్వే ఆలోచించుకోవాలి.  వీటినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు.  ఈ నైపుణ్యాలు ఉంటేనే  లోకానికి కనబడతావు.  సమాజం నిన్ను గుర్తిస్తుంది.


నీ ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక ఆరు నెలలు వాయిదావేసుకో! 

ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలను మరో ఆరు నెలలు అనుభవించడానికి సిద్ధపడు. అంతేకాదు వీలైతే మరింత ఎక్కువగా అనుభవించు!

నేను చెప్పిన విషయాలను ఈ ఆరు నెలలు సాధన చెయ్యి! తర్వాత వచ్చి నీ అనుభవాలు చెప్పు!  ఫలితమేమీ లేకుంటే చచ్చి పోయే నిర్ణయం నీ చేతిలోనే ఉంది.


*చివరగా మరొక్క మాట!* 


ఇతరుల విలువనూ, గౌరవాన్ని కోరుతున్న నువ్వు, స్వయంగా నీకు నువ్వు ఇచ్చుకునే విలువా, గౌరవం ఎంతో ఒక పెన్ను పేపర్ పెట్టుకుని విశ్లేషించుకో! 


అంటూ సుదీర్ఘమైన పరిష్కారాన్ని సూచించింది ఆ భూతం.


భూతమిచ్చిన ఈ సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని విన్న ఆ స్త్రీ " ఇదేదో చచ్చేవరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఇచ్చిన భూతములాగుంది.

అయినా మనుషుల కన్న ఈ భూతమే నయం. నా గోడు విని పరిష్కారాన్ని సూచించిన మనిషి ఒక్కడూ లేడు. ఒకసారి దీని మాట కూడా విని చూద్దాం !అనుకుని, "సరే! ఆరు నెలల తర్వాత వచ్చి కలుస్తాను." అంటూ ఆ దీపాన్ని యథా స్థానం లో వుంచి వెళ్ళిపోయింది ఆ స్త్రీ.


ఆరు నెలలు గడిచిపోయాయి.


ఆ స్త్రీ వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది.  అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి, "ఏం జరిగింది?" అని అడిగింది.


"ఏం చెప్పాలి?  ఒకటా? రెండా? అన్నీ మార్పులే!" అంది నవ్వుతూ.


ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది.


ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటు ను అరగంట కు కుదించాను.

అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ, నా పనులు తెమిలేవి కావు.

ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం  మిగులుతుంది కూడా!


డైరీ రాయడం ప్రారంభించాను. నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.


మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిల్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని.


ఆలస్యంగా నిద్ర లేచిన నేను పిల్లలకు స్కూల్‌ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్షన్ పడుతూ పిల్లలను కూడా టెన్షన్ పెడుతూ గట్టిగా అరుస్తూ  నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.


నాకు తెలియకుండానే పిల్లలకు కూడా "టెన్షన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను." అన్న విషయాన్ని గమనించలేకపోయాను.


"నీకు తెలుసా!  గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు."


ఇప్పుడు  నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.


ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను.  రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను.  వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక పదినిమిషాలు హృదయ పూర్వకంగా నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తా, పిల్లలను నిద్ర లేపుతున్నాను.


నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపోసాగాయి.


అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని.


రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను, నా భర్తా, పిల్లలలో దర్శించలేనా?


కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో, నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా?


అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.


నా భర్త కు "రాధ"నయ్యాను.


అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను. అంతకు ముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు, మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు.


ఆ ప్రభాతసమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరితనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.


నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక.  కానీ, చాలా భయపడేదాన్ని.  ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషు లో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను.  మా ఆఫీసుమీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు.


నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరికగా ఉండేది.  కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆ కోరికా తీర్చుకున్నాను.


చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను.  ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను.  ఇది విని ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నానని అనిపించవచ్చు!  కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది.


నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు.  అతనొక జర్నలిస్టు.  తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు.  ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది.  అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు.  నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను ఆవేశంతో రగిలిపోయేదాన్ని.


గతంలో "నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే  విషయం గొడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి " గుర్తుకువస్తుంది.


ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల? అని ఆలోచించేదాన్ని.  కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తితకు గుర్తని ఇప్పుడు నాకర్థమౌతుంది. ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు.  క్రమంగా అతడు అర్థమౌతున్నాకొద్దీ, అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.


అతను  నాపట్ల ఆసక్తి చూపాలంటే, అతనికిష్టమైన విషయాల్లో నేనూ  ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను. పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ, వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సహించడం ప్రారంభించాను.


నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నా మీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు.  నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి, అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను.


ఇప్పుడు నాకు కుటుంబ సభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే!


నీకో విషయం చెప్పనా?  మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.


ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఉసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమంది వచ్చేవారు.  మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని.  వాళ్ళవల్ల నా సమయమూ, మనస్సూ రెండూ చెడిపోయేవి.  అలా వచ్చేవారికి "కొంచం కూరగాయలు తరిగి పెట్టవా? బోళ్ళు కడగడంలో హెల్ప్ చెయ్యవా?" అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు.  నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు.


ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది.  నేనే అందరిని అర్థం చేసుకోగలను.


మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? 


ప్రధానమంత్రి  స్త్రీ సమస్యలపై మాట్లాడడానికి దేశం లోని కొంత మంది మహిళలతో ఒకమీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ కు నేనూ ఎంపికయ్యాను.  ఆ రోజు నేను మాట్లాడిన విషయాలను మీడియా హైలెట్ చేసింది. ప్రధానమంత్రిగారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు.

ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు.  నన్ను చూసి మా బాస్ నిలుచుండి విష్ చేయడం మొదలు పెట్టాడు.


ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను.  నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.


"ఉద్ధరేదాత్మనాత్మానం" అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి ....ఎవరో టీ.వి లో 'గురువారం మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యు !' అంటే వెళ్లి పోశాను. ' శుక్రవారం రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో! " అంటే వెళ్లి పెట్టుకున్నాను.

నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను.మార్పు బయటనుంచి వస్తుందని ఎదిరిచూశాను. 

మార్పు లోపలినుంచే వస్తుందని ..మారాల్సింది నేనేనని నాకిప్పుడర్థమైంది.


ఇదంతా నీవల్లే! 


నా ఆత్మహత్య ను తప్పించావు.

నాకో కొత్తజీవితాన్ని ప్రసాదించావు.

నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా,గౌరవం రావడానికి కారణమయ్యావు. 

ముఖ్యంగా "నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు."

ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.


నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తుంది.


సరే!  "నా సంగతి అలా ఉండనీ!  నీ వివరాలు చెప్పు" అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ.


ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో  ఇలా చెప్పసాగింది.


" నేను గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను.  చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది.


నేనున్న స్థితి ఎలాంటిదంటే,


ఆకలౌతుంది కానీ, తినలేను.

నిద్రొస్తుంది కానీ, విశ్రాంతి తీసుకోలేను.  అన్ని రకాల కోరికలు కలుగుతాయి కానీ, తీర్చుకోలేను.  దుర్భరంగా, పరమ యాతనగా ఉంటుంది.


ఈ ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేెళ్ళా పడి విముక్తి కలిగించుమని పార్థించాను.


నా ప్రార్థన విన్న అతడు ...

 

" ఆత్మహత్య మహా పాపం." 


నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు.  నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.


1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )


2. నీ మాటలు ఒక వ్యక్తి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి. ( జ్ఞానదానం)


3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ( పై రెండింటి దాన సిద్ధి )


అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపం లో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.


ఎవరైనా నీతులు చెప్పగలరు.కానీ ఆచరించడం లోనే ఉంది గొప్పంతా!

నీ శక్తిసామార్థ్యాలవల్లనే ఇదంతా నువ్వు సాధించావు.  నేను చేసిందేమీ లేదు.

నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది.నీకే నా  హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం "సూర్య నటించిన రాక్షసుడు సినిమాలోని ఆత్మలా" బంగారు రేణువులుగా విడిపోతూ శూన్యంలో కలిసి పోయింది.


"ఒకరికి సహాయం చేయడం లోనే మన మేలు కూడా ఉందన్న" క్రొత్త సత్యాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ కొంగ్రొత్త ఉత్సాహంతో తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆచరణ లో పెట్టడానికి  బయలుదేరింది.

          ** స్వస్తి **

(ఓపికగా చదివిన వారికి ధన్యవాదములతో)


 *సమస్త లోకా సుఖినోభవంతు!* 


(రసజ్ఙభారతి సౌజన్యంతో-

శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.)

*Distinction between Cheque and Bill of exchange*

 1. A Bill of exchange may be drawn on any person. A cheque is always drawn on a banker.



2. A Bill of exchange may be payable on demand, or on the expiry of a certain period or at sight. 

Cheque is always payable on demand. 

3. A grace of three days is allowed in case of time bills. No grace is allowed on cheques.

4. A cheque doesn't require any stamp. Bill of exchange l is ordinarily

stamped.

5. A cheque may be crossed. Bill may not be crossed.

మొగలిచెర్ల

 *ధన్యజీవి..*


"దిగంబరిగా ఉంటూ..కఠోర తపస్సు ఆచరిస్తూ..తనను మనస్ఫూర్తిగా విశ్వసించిన వాళ్లకు జ్ఞాన బోధ చేస్తూ..తన మరణాన్ని ముందుగానే తెలుసుకొని..మోక్షప్రాప్తికి కపాలమోక్షమే మార్గమని తలచి..వైశాఖ శుద్ధ సప్తమి నాటి రాత్రి ఆ పరమాత్మలో ఐక్యం చెందిన అవధూత మందిరం వద్ద ఉన్నాము..మరి కొద్దిసేపటిలో ఆ దిగంబర అవధూత సమాధిని దర్శించబోతున్నాము..మీయొక్క మనసులోని కోరికలను స్వామివారి సమాధి వద్ద కోరుకోండి..పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఈ స్వామిని నమ్మిన వారి కోర్కెలు నెరవేరుతాయని తెలుసుకోండి.." అంటూ తనతో పాటు వచ్చిన భక్తులకు చెపుతున్నారు ఆవిడ..ఆవిడను ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదు..మొగిలిచెర్ల లాంటి మారుమూల పల్లెటూరులో ఉన్న ఈ క్షేత్రం గురించి..ఇక్కడ సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడి గురించి అన్ని విషయాలు వర్ణించి మరీ తన తోటి వచ్చిన వారికి చెపుతోంది..ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా నాలో కలిగింది..


ఆ వచ్చిన యాత్రీకులు సుమారు యాభై మంది దాకా వున్నారు..కృష్ణాజిల్లా నుంచి ఒక ప్రత్యేక బస్సు మాట్లాడుకుని..ఒంగోలు, నెల్లూరు పరిసర ప్రాంతాలలో ఉన్న ఆలయాలు అవధూతల మందిరాలు దర్శిస్తూ..మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆ యాభై మందితో కలిసి వచ్చిన ఆవిడ..మిగిలిన వారికి ఈ క్షేత్రం గురించి విడమరిచి చెపుతున్నది..ఆవిడ వయసు దాదాపు డెబ్భై ఏళ్ళు వుంటాయేమో..ఏమాత్రం తడబాటు లేకుండా..స్వామివారి గురించి చక్కగా చెపుతున్నది..


అందరూ స్వామివారి సమాధిని దర్శించుకున్న తరువాత..మంటపం లో ఒక ప్రక్కగా కూర్చున్నారు..అప్పటికి సమయం ఉదయం పది గంటలు..అంతవరకూ స్వామివారి గురించి మాట్లాడుతున్న ఆవిడ వద్దకు వెళ్లి..నన్ను నేను పరిచయం చేసుకొని.."అమ్మా..మీరు ఈ స్వామివారి గురించి మీతోటి వాళ్ళతో చెప్పడం నేను విన్నాను..మీరెప్పుడైనా ఈ క్షేత్రానికి వచ్చారా?..మీకు ఇంత వివరంగా ఎలా తెలుసు?..మీరు ఈ ప్రాంతం వారేనా?..మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసి ఉండలేదు..మీరేమీ అనుకోకుండా నా సందేహాలు తీరుస్తారా?.." అని అడిగాను..


"మీరు శ్రీధరరావు, ప్రభావతి గార్ల కుమారుడా?..చాలా సంతోషంగా ఉంది నాయనా..నా పేరు సుభద్ర..మీ తల్లిదండ్రులు నాకు పరిచయం..శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి అనుయాయులం..మాస్టారు గారు 1980 లోనో..82 లోనో ఈ మందిరాన్ని దర్శించుకున్నారు..వారు మాకు ఈ స్వామివారి గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు..అప్పట్లో నేను మా తల్లిదండ్రులతో కలిసి ఇక్కడకు రెండు మూడు సార్లు వచ్చాను..మీ అమ్మా నాన్న గార్లతో కూడా అప్పుడే పరిచయం కలిగింది..మేము ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ..మీ అమ్మగారు మాకు భోజనం వండి వడ్డించే వారు..మీ అమ్మా నాన్న గార్ల ద్వారా ఈ స్వామివారి గురించి  పూర్తిగా తెలుసుకున్నాను..నన్ను నోరారా సుభద్రా అని పిలిచేవారు..నాకు వివాహం జరిగి ఐదేళ్ల కు కూడా సంతానం కలుగక పోతే..అమ్మా నువ్వొక్కసారి నీ భర్త తో కలిసి మొగిలిచెర్ల లోని స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయమ్మా..ఫలితం ఉంటుంది..అని మీ అమ్మగారు ఒంగోలు వచ్చినప్పుడు చెప్పారు..ఆమె మాట విని..మా ఆయనను ఒప్పించి ఇక్కడికి వచ్చి మూడు రాత్రులు నిద్ర చేసాము..సంవత్సరం కల్లా అమ్మాయి పుట్టింది..మరో రెండేళ్లకు అబ్బాయి పుట్టాడు..నన్ను సాక్షాత్తూ ఈ స్వామివారు ఆశీర్వదించారు..అప్పుడప్పుడూ వస్తున్నాను గానీ..ఏదో నా పాటికి నేను వచ్చి దర్శనం చేసుకొని వెళుతూ ఉండేదాన్ని..మీ అమ్మా నాన్న అనారోగ్యం తో వున్నప్పుడు కూడా నేను వచ్చి వెళ్ళాను..వాళ్ళను చూసి వెళ్ళాను..ఎటొచ్చీ..నీతో నాకు పరిచయం కలుగలేదు..ఇన్నాళ్లకు నువ్వే పలకరించుకున్నావు..అదే చాలు నాయనా.." అన్నారు..


మా సిబ్బందికి చెప్పి..అందరికీ భోజన ఏర్పాటు చేయమని చెప్పాను..(అప్పటికి మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద అన్నదానం మొదలు కాలేదు..ఇలా ఎవరన్నా వస్తే..అప్పటికప్పుడు వండించే వాళ్ళం..) సుభద్ర గారూ..మిగిలిన యాత్రీకులు అందరూ భోజనాలు చేసి మళ్లీ వచ్చి మంటపం లో కూర్చున్నారు.."స్వామివారి జీవిత చరిత్రను మీ అమ్మగారు వ్రాసారు నాయనా..మాస్టారు గారి ఆధ్వర్యంలో సాయిబాబా అనే పత్రిక ఉండేది..అందులో మొదటిసారి ప్రచురించారు..మాస్టారు గారే దానిని పుస్తకరూపం లో కూడా తీసుకొచ్చారు..ఆ పుస్తకం తాలూకు రెండు కాపీలు నా వద్ద భద్రంగా ఉన్నాయి..ఇప్పటికీ పారాయణం చేస్తూ వున్నాను..నా ఊపిరి ఉన్నంత వరకూ ఓపిక చేసుకొని అప్పుడప్పుడూ వస్తుంటాను నాయనా..ఈరోజు నేనెవరో తెలియక పోయినా..ఆప్యాయంగా పలకరించావు..చాలా సంతోషం గా ఉంది.." అని చెప్పారు..ఆరోజు మధ్యాహ్నం అందరితో పాటు బస్సెక్కి వెళ్లిపోయారు..ఆ తరువాత కూడా మూడు సార్లు సుభద్ర గారు స్వామివారి మందిరానికి వచ్చారు..అత్యంత భక్తితో స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..మూడేళ్ల క్రితం సుభద్ర గారు పరమపదించారని వాళ్ళ కుమారుడు తెలిపారు..ఆఖరి రోజు కూడా ఆవిడ స్వామివారి చరిత్రను పారాయణం చేశారని అతను చెప్పాడు..


పరిపూర్ణ జీవితాన్ని పొందిన సుభద్ర గారు ధన్యజీవి!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

2, మార్చి 2021, మంగళవారం

కొవిడ్‌పై రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్రం*

 *మహమ్మారి మళ్లీ వస్తోంది!*


*కొవిడ్‌పై రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్రం*


*ఆస్పత్రులు, పరికరాలు సిద్ధంచేస్తున్న ఆరోగ్య శాఖ*


*ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్లకు ఆదేశాలు*


*కొవిడ్‌-19 నిపుణుల కమిటీ అత్యవసర సమావేశం*


*ఎపిడిమాలజీ కమిటీతోనూ ఆరోగ్య శాఖ చర్చలు*


*సెకండ్‌ వేవ్‌ వచ్చే చాన్స్‌ ఉందని సభ్యుల సూచన*


*మార్చి మొదటి వారం నుంచే కేసులు పెరిగే అవకాశం*


*మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సూచన*


మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? సెకండ్‌ వేవ్‌తోపాటు కొత్త స్ట్రెయిన్‌ కూడా కలిసొస్తే.. పరిస్థితి ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్‌.. కఠిన ఆంక్షలు.. అమ్మో తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాదిలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో.. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి. కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కొవిడ్‌-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు. 


కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు. వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత  కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే సెకండ్‌ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఆ సూచలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడంలేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రోజుకు వంద లోపు కేసులు నమోదవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు పాజిటివ్‌ వచ్చినా సమాచారం ఇవ్వడం లేదు. ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరిగిపోతున్నాయి. ఇవేవీ ఆరోగ్యశాఖ లెక్కల్లోకి రావడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా బులెటిన్‌లో తక్కువ కేసులు చూపిస్తూ.. ఏపీలో కరోనా తీవ్రత లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


*మూడు నెలల వ్యత్యాసంతో మళ్లీ..*


తొలి విడతలో ఉత్తర భారతంలో మొదలైన కరోనా వైరస్‌ దక్షిణ భారతానికి వ్యాపించడానికి 3-4 నెలల సమయం పట్టింది. సెకండ్‌ వేవ్‌ కూడా ఇదే తరహాలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి రావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలు దాదాపు నిజం కాబోతున్నాయి. ఏపీలో నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. నిపుణుల కమిటీ అంచనా వేసినట్టే.. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఆ ప్రకారం చూస్తే మార్చి నెలలో ఏపీలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 


 *కొత్త స్ట్రెయిన్‌ వస్తే మరిన్నికష్టాలు* 


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైర్‌సను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణుల కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ కూడా బయటపడితే మాత్రం ప్రభుత్వానికి భారం తప్పదు. వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ తలకు మించిన భారంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా కరోనాను గుర్తిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించాలంటే ఈ టెస్టు సరిపోదు. దానికోసం శాంపిల్స్‌ను హైదరాబాద్‌, పుణెకు పంపించాల్సిందే. లేదంటే కొత్త స్ట్రెయిన్‌ గుర్తించే కిట్లు కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణ, మందుల కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన ప్రభుత్వానికి ఇది తలకుమించిన భారమే. కొవిడ్‌కు సంబంధించిన బిల్లులే ఇంతవరకు చెల్లించకుండా రూ.400 కోట్లు బకాయిలు పెట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ వస్తే మాత్రం మళ్లీ ఆర్థిక కష్టాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు.

🤷🏻‍♂️

1, మార్చి 2021, సోమవారం

మన మహర్షులు- 35

 మన మహర్షులు- 35


లోమశ మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹 


ఒకనాడు లోమశ మహర్షి 

అరణ్యక మహర్షి  వద్దకు రావడం జరిగింది.

అరణ్యకుడు ఆయనకి సాష్టాంగ నమస్కారంచేసి మహాత్మా! సంసార సాగరం నుంచి తరించే వుపాయం చెప్పండన్నాడు.


లోమశ మహర్షి 'వత్సా! 'రామ'మంత్రం కంటే సంసారం నుంచి దాటించే మంత్రం ఇంకొకటి లేదు. ఇది వేదశాస్త్ర పరమ రహస్యం ఇంతకంటే వేరు మంత్రాలు, ప్రతాలు, క్రతవులు, యోగాలు, యాగాలు, దానాలు, మౌనాలు ఏమీలేవు 'అని చెప్పాడు.

ఇంకా  శ్రీరామచంద్రమూర్తిని ఇలా వర్ణించాడు..


అయోధ్యలో చిత్రమండపంలో వున్న కల్పవృక్షం క్రింద వున్న నవరత్నాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని, పూర్ణిమనాటి చంద్రుడిలా ఉండే మొహంతో నీలిరంగులో వుండే శరీరంతో, మణులు పొదిగిన కిరీటంతో, నల్లటి జుట్టుతో, మకర కుండలాల్తో, వైఢూర్యమణుల్లాంటి పలువరుసతో, పువ్వులావుండే నాలుకతో, శంఖంలాంటి మెడతో, ఎత్తైన భుజాల్లో, శుభలక్షణాలు కలిగిన ముక్కుతో, రకరకాలయిన ఆభరణాల్లో వున్న ఆజానుబాహువులయిన చేతుల్లో, లక్ష్మీనివాసము విశాలము అయిన వక్షస్థలంతో,

గంభీరమైన నాభి, మృదువైన పాదాలు కలిగి దేదీప్యమానంగా వెలిగే శ్రీరామచంద్రుణ్ణి మనసారా ధ్యానించి, చేతులారా పూజించి, నోరార భజించి చాలా సులభంగా మోక్షాన్ని పొందవచ్చు. ఇంతకన్న సులభమయిన మార్గం లేదని చెప్పాడు లోమశ మహర్షి.


 లోమశ మహర్షి ఇంకా రామకథంతా చెప్తున్నాడు. అరణ్యక మహర్షి వింటూ

వున్నాడు.


వత్సా! త్రేతాయుగంలో సూర్యకులంలో విష్ణుమూర్తి నాలుగు రకాల ఆకృతుల్లో పుట్టాడు. లక్ష్మణుడితో కలిసి కౌశికుడి యజ్ఞం పాడుచేస్తున్న మారీచ సుబాహుల్ని చంపి అహల్యాశాపవిమోచనంచేసి, మిథిలకి వెళ్ళి శివధనుస్సు విరిచి సీతని వివాహం చేసుకున్నాడు. అప్పటికి రాముడికి పదిహేనో సంవత్సరం.


అరణ్యవాసానికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు చిత్రకూట పర్వతం మీద వుండి తర్వాత పంచవటి వెళ్ళాడు. అక్కడే రావణుడు సీతనెత్తుకుపోయాడు. మార్గశిర శుద్ధ  ఏకాదశినాడు రాత్రి హనుమంతుడు సీతని చూశాడు. ద్వాదశినాడు సీతని పలకరించి త్రయోదశినాడు లంకను కాల్చి పూర్ణిమనాడు తిరిగి వెళ్ళి ఏడోరోజు కి రాముణ్ణి కలిశాడు శ్రీరాముడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం అష్టమినాడు బయలుదేరి ఏడురోజులకి

సముద్రతీరం చేరుకుని దశమినాడు సేతువు మొదలుపెట్టి, త్రయోదశికి పూర్తి చేసి సైన్యాన్ని దాటించి శుక్ల ద్వాదశి నుంచి కృష్ణచతుర్ధి వరకు యుద్ధంచేసి రావణుణ్ణి చంపాడు.


మొత్తం డబ్బయి రెండు రోజులు పట్టింది యుద్ధానికి, పద్నాలుగు సంవత్సరాలు పూర్తవగానే రాముడు అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేయించుకున్నాడు అప్పటికి రాముడికి నలభై రెండు, సీతకి ముఫ్ఫైయి మూడు సంవత్సరాలు. సీత

రావణుడి చెరలో పదకొండు నెలల పద్నాలుగు రోజులుంది. 


రాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు రధం నీ దగ్గరకి వస్తుంది. నువ్వు రాముని

చూసి ఆయన పాదాల దగ్గరే మోక్షం పొందుతావని లోమశ మహర్షి, అరణ్యక మహర్షికి చెప్పాడు.


 ఈ విధంగా  జరగబోయేది కచ్చితం గా తెలియజేశాడు లోమశ మహర్షి .


ఒకనాడు ఉత్కచుడు లోమశ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అనేక వృక్షాలను కూకటి వేళ్లతో పెకలించి వేశాడు. ఉత్కచుడి చర్యలకు లోమశ మహర్షి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. పాము కుబుశాన్ని విడిచినట్లు నీవు శరీరాన్ని వదలిపెడతావని శపించాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఉత్కచుడు ఆ మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అతడిలో కలిగిన పశ్చాత్తాపానికి లోమశుడు సంతోషించి నా శాపానికి తిరుగులేదు... కాబట్టి నీవు మరు జన్మలో శకటాసురునిగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వల్ల మోక్షం పొందుతావని తెలిపాడు.


లోమశ మహర్షి ధర్మరాజు తదితరులను తీర్ధయాత్రలకు తీసుకువెళ్లి  భృగు తీర్థము, పుష్కరము, గయ మొదలైన 

తీర్ధమల  ప్రాశస్థ్యము తెలియజేస్తాడు.వారికి ధర్మసూత్రాలను బోధిస్తాడు.


లోమశమహర్షి ప్రణీతమైన 'లోమశసంహిత' ఆయుర్దాయాన్ని గురించీ, వివిధ రకాలైన మరణాలలోని తేడాలను గురించీ, తనదైన పంధాలో వివరించింది.


మన ప్రాచీన గ్రంధాలలో మానవులకు రాబోయే అరిష్టాలను ఎలా గుర్తించాలి, వాటినుంచి ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలు ఎన్నో చోట్ల మహర్షులచేత చర్చించబడ్డాయి.


వాటిని స్వీకరించి ఆచరించి మేలు పొందటం విజ్ఞుల లక్షణం. 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

ఆత్మ పరమాత్మ

 నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే, సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. మంగళాశాసనం ఎవరికి భగవంతునికా లేక ఆ రూపంలో గల ప్రకృతి పరంగా గల జీవులకా . ఆత్మ పరమాత్మ ఆటమ్ సూపర్ ఆటమ్. పరాశక్తి సూపర్ ఆటమ్. ఆ శక్తి వేంకటాద్రి కొండ .వేంకట అద్రి. కొండలను నాశనం చేయుట మన లక్షణం. సృష్టి కారణం మనమా లేక వేరొకరెరైనానా. మన విలాసాలాసాలకు ప్రకృతిని నాశనం. కొండ గుట్ట లేకపోయిన మన వునికి? నిత్యముగా వుండాలి శరీరంతో దర్శించుటకు యనే సాధనకు. నిరవద్యాయ ఎల్లవేళల చూచుట కష్టం. రాత్రి పగలు తేడా వుంది. రాత్రి నిద్రలో కూడా జాగృదావస్థ చూచుట  కష్టం. స్వప్నం లోనే భగవత్సాత్సాక్షాత్కారం. 

లేనియెడల మానవ నేత్రములుకు అంత అనంతమైన శక్తిని దర్శించుటకు వీలుకాదు. సత్యానంద చిత్ ఆత్మనే. చిత్తం ఆత్మ స్వరూపం. ఆత్మ మనస్సు ఆధారం. మనస్సు పంచభూతాత్మకమైన దేహం ఆధారం. యీ రోజు వున్నది రేపు లేదు. నిత్యాయ ప్రతీ నిత్యం భగవత్ తత్వం నిండియున్నది. మనం వుండుటలేదు. కాంతి రూపంలో. కిరణ లక్షణము భగవంతుడు. సత్యమే ఆనందం. సర్వ ఆత్మయందు పరమేశ్వర స్వరూపమే. అమ్మ కూడా అయ్యవెంటే ఎందుకంటే అయ్యపోషణ కనుక ఆ అమ్మకు కూడా.పోషణ జీవోధ్ధరణకే. జీవవుధ్ధరణ సంపాదన కాదు ఆత్మ తత్వం తెలియుటకే. సత్యం ఎలా సూక్మమెూ భగవత్ శక్తి కూడా అనగా వేంకటాద్రి కూడా అంత సత్యమే. వేం జీవులు యనగా  క జీవతత్త్వం. క అనగా జీవుడు యని బాల మంత్ర వుపాసన ద్వారా. క జీవ తత్వం తెలియుటకే వుపాసన సమీపంలో యున్న తత్వాన్ని దర్శించి ఉప మనలో గల అమ్మ స్వరూపం చూచుట. అమ్మ స్రీ పురుష క్షేత్ర రక్షణ అనగా ప్రకృతి రక్షణ. జీవ రక్షణ. ప్రత్యక్షంగా చూచిన సూర్య శక్తి. పరోక్షంగా చంద్ర శక్తి యీ రెండింటి చలనమే అమ్మ రూపం. వేంకటాద్రి రూపంలో గల శక్తి తత్వం. దానిని నిరంతరం ధ్యానించుటే భగవంతుని తత్వం. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *గుణపాఠం..*


ఆదివారం ఉదయం ఐదు గంటలకు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో స్వామివారి ప్రభాతసేవ కార్యక్రమాలు మొదలవుతాయి..అప్పటినుంచి మరో గంటా నలభై ఐదు నిమిషాలపాటు ఆ కార్యక్రమం అలా సాగిపోతూనే ఉంటుంది..ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆఖరి హారతి ఇచ్చిన తరువాత..భక్తులను స్వామివారి మందిరం లోకి దర్శనానికి అనుమతి ఇస్తాము..సహజంగానే ఆ సమయం లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది..మేమందరమూ ఆ హడావిడి లో ఉంటాము..


ఆరోజు ఉదయం ఏడున్నర గంటలకు కందుకూరు నుంచి వచ్చే మొదటి బస్సులో ఒక యువతి స్వామివారి మందిరానికి వచ్చింది..మందిరం లోపలికి వచ్చి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?" అని నన్నే అడిగింది.."నేనే" అని జవాబు చెప్పి.."మీ రెవరు..?" అని అడిగాను.."ఇక్కడ సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని వచ్చాను..ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి.." అన్నది.."అమ్మా..చూస్తున్నారు కదా..ఇప్పుడు మీతో మాట్లాడే వ్యవధి లేదు..అన్యధాభావించవద్దు..ఇంకొక రెండు గంటల తరువాత..భక్తులు రావడం తగ్గుతుంది..ఈలోపల మీరు వెళ్లి స్నానం చేసి..స్వామివారి దర్శనానికి రండి..ముందు స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ తరువాత సమయం చూసుకొని..నాతో మాట్లాడవచ్చు.." అని చెప్పాను.."సరే.." అని వెళ్ళిపోయింది..మరో అరగంటకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చింది కానీ..లోపలికి వెళ్ళలేదు..నా టేబుల్ వద్దనే ఒక ప్రక్కగా నేలమీద కూర్చుని.."ప్రసాద్ గారూ.మీకు తీరిక దొరికిన తరువాత..మీతో మాట్లాడి..ఆపై స్వామివారి సమాధి వద్దకు వెళతాను..అక్కడ నా మనసులోని మాట చెప్పుకుంటాను.." అన్నది..


మరో గంట తరువాత..నా వద్దకు రమ్మని చెప్పి..ప్రక్కనే కుర్చీలో కూర్చోమని చెప్పి.."అమ్మా..ఇప్పుడు చెప్పండి.." అన్నాను..అంతవరకూ ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఆమె..తన రెండు చేతులతో ముఖం కప్పుకొని..ఏడ్చేసింది..అలా ఒక ఐదు నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నది..ప్రక్కనే ఉన్న మా ఆవిడ..ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి..ఓదారుస్తూ.."అమ్మా..నీ కొచ్చిన కష్టం చెప్పు..ఇప్పుడు నువ్వు స్వామివారి సన్నిధిలో ఉన్నావు..భయపడకు..వ్యధ చెందకు.." అని చెప్పింది..కొద్దిసేపటికి తేరుకొని.."నా పేరు సుశీల..పెళ్లై పదేళ్లు అవుతున్నది..మాకొక బాబు..వాడికి ఎనిమిదేళ్ల వయసు..థర్డ్ క్లాస్ చదువుతున్నాడు..మావారు సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం చేస్తున్నారు..నేనూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసాను..బాబు పుట్టిన తరువాత మానేసాను..ఖాళీగా ఉన్న సమయం లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని మావారితో చెప్పాను..నిజానికి ఆయన చెవిలో పోరు పెట్టాను..నేను ఖాళీగా వున్నాను..నేను నిర్వహిస్తాను..అని రోజూ మా వారితో చెప్పాను..ముందు ఆయన ఒప్పుకోలేదు..చివరకు ఒప్పుకున్నారు..ఇద్దరమూ బాగా చర్చించుకుని..చిట్ ఫండ్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకొని..మొదలుపెట్టాము..మొత్తం నేనే నిర్వహించేదాన్ని..మొదటి మూడేళ్ళూ చాలాబాగా నడిచింది..ఆ తరువాతే మా కష్టాలు మొదలయ్యాయి..చిట్ పాడుకున్న వాళ్ళు కొన్నాళ్ళు డబ్బు కట్టారు..ఆ తరువాత మెల్లిగా ఆలస్యం చేయసాగారు..మాకు రావాలసింది ఎప్పుడైతే ఆలస్యం అయిందో..మేము కట్టాల్సిన వాళ్లకు సకాలం లో చెల్లించలేకపోయాము..కొందరికి చెక్ లు ఇచ్చాము..అవి కూడా నేను సంతకాలు చేసి ఇచ్చాను..నాలుగేళ్లు తిరిగే సరికి..బాగా ఇరుక్కుపోయాము..ఇద్దరు ముగ్గురు నేనిచ్చిన చెక్ లు అడ్డం పెట్టుకొని కోర్టులో కేస్ వేశారు..ఇంకొక పదిహేను రోజుల్లో కోర్టుకు హాజరు కావాలి..మావారు నేను నలిగిపోతున్నాము..ఏ దిక్కూ తోచలేదు.. ఈ మాధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..మా వారితో చెప్పి..చివరి ఆశగా ఇక్కడికి వచ్చాను.." అని మళ్లీ ఏడ్చేసింది..


కొద్దిసేపటి తరువాత..స్వామివారి సమాధి ని దర్శించుకొని..స్వామివారి పాదుకులకు నమస్కారం చేసుకొని..ఇవతలకు వచ్చి.."స్వామివారిని వేడుకున్నాను..నా సమస్యకు పరిష్కారం దొరికితే..మావారితో సహా ఇక్కడకు వచ్చి..మూడు రాత్రుళ్ళు నిద్ర చేసి..అన్నదానం చేసి వెళతాను.." అని మొక్కుకున్నాను..అన్నది.."చూద్దాం తల్లీ..స్వామివారిని త్రికరణ శుద్ధిగా నమ్ముకో..మంచి జరుగుతుంది.." అని మేమిద్దరం చెప్పాము..మధ్యాహ్నం వెళ్లిపోయింది..మూడు నాలుగు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం నాటి సాయంత్రం ఐదు గంటల వేళ..సుశీల తన భర్త, కుమారుడితో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది..నేరుగా మా దంపతుల వద్దకు వచ్చి..మాకు తన భర్తను పరిచయం చేసి.."మా సమస్య ఒక రకంగా తీరిపోయింది..ఇక్కడి నుండి వెళ్లిన తరువాత..అమెరికా లో ఉన్న మా అన్నయ్య కు విషయం తెలిసి..నా అప్పులు తీర్చడానికి అవసరమైన నగదు సర్దుబాటు చేసాడు..ముందు కేసుల్లోంచి బైటపడ్డాను.. మాకు వెసులుబాటు కలిగింది..కానీ..గుణపాఠం కూడా నేర్పింది..స్వామివారు సకాలం లో దారి చూపారు..మా అన్నయ్య రూపం లో స్వామివారే మమ్మల్ని కరుణించారు..ఇంకెప్పుడు అత్యాశకు పోను..స్వామివారి వద్ద ప్రమాణం చేయడానికి వచ్చాను..ఇప్పుడిప్పుడే మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు..త్వరలో వచ్చి నా మొక్కు చెల్లించుకుంటాను.." అని చెప్పింది..


సుశీల సమస్యకు పరిష్కారం చూపడమేకాక..జీవితం లో అత్యాశకు పోకుండా..చక్కటి పాఠం కూడా నేర్పారు స్వామివారు.


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

రాముడు అక్కడ ఉంటాడు. 🥀🪴

 🪴🥀భక్తులు ఎక్కడ ఉంటే 

రాముడు అక్కడ ఉంటాడు. 🥀🪴


ఈశ్వరుడు ఎక్కడో ఉండడు. గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట యదార్థమే. కానీ నిజంగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? బాగా గుర్తు పెట్టుకోండి. హృదయంలో ప్రతి ఊపిరిలో ఆయన ఆరాదిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నిలుచుంటాడో, ఎక్కడ తిరుగుతాడో ఆయన వెంటనే తిరుగుతూంటాడు ఈశ్వరుడెప్పుడూ. రాముడు ఎక్కడుంటాడు అని చెప్తారో తెలుసా శాస్త్రంలో. రామచంద్రమూర్తిని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు. ప్రక్కనే ఉంటాడుట ధనుర్ధరుడై. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, నిలుచుంటే నిల్చుంటాడు, ఆయన వెడుతూంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్ళను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారామలక్ష్మణులు, హనుమ కూడా ఉంటారు. ఇది తులసీదాసు గారి జీవితంలో నిజమైంది. ఆయన రామదర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే దొంగ వచ్చి లోపలికి వెళ్ళి దొరికినవి మూట కట్టుకొని బయటకు వద్దాం అనుకున్నాడు. తల బైట పెట్టాడు. రామలక్ష్మణులిద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు. నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకు పోతావా నువ్వు అని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బైట పెడుతున్నాడు, లోపల పెడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీ దాసు గారు నిద్రలేచారు. దొంగ మూటకట్టుకొని కూర్చుని ఉన్నాడు. నువ్వు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అని అడిగారు. బుద్ధి గడ్డితిని దొంగతనానికి వచ్చాం. అన్నాడు. పట్టుకెళ్ళపోయావా? అన్నారు. తీసుకు వెళదామని బయటికి వెళ్తే ఎవరో ఇద్దరు ఉన్నారు. ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడు. ఒకాయన ఎర్రగా ఉన్నాడు. కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం. అన్నారు. ఆయన అప్పుడు బయటికి వెళ్ళి చూశారు. ఆయన ఏడ్చారు అప్పుడు. నిద్రపోకుండా స్వామీ నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా..ఇన్నిమార్లు దర్శనం పొందారు, నాకు అవలేదు అని ఏడ్చారు. ఎవడు రాముణ్ణి నమ్మాడో వాడున్నచోట రాముడు ఉంటాడు తప్ప ఇంకొక చోట రాముడు ఉంటాడు అనుకోకండి. రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారాములుంటారు. ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనిపిస్తోంది. త్యాగరాజ స్వామి విషయంలో, రామదాసు గారి విషయంలో. గంజి గుంటలో పడిపోయిన పిల్లవాడి శవాన్ని ఉడికిపోయిన దానిని తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టి నువ్వు ఇచ్చిన కొడుకు, ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే నీలో కలిపేసుకో. అంతరాలయంలో పెట్టి తలుపులు వేసి రామనామ భజన చేశాడాయన. పిల్లవాడు పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఈమధ్యనే కదా రామదాసు గారు. ఆయన వాడిన మంగళసూత్రంలో శతమానం కూడా మనం కల్యాణంలో చూస్తూనే ఉన్నాం కదా! రాముడు ఉన్నాడు. మీరు నమ్మండి. ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్నచోట మీవెంట రాముడున్నాడు. మీరు పడుకుంటే మీరు పడుకున్నచోట ఉన్న కుర్చీలో ఆయన ఉంటాడు. ఎక్కడ రాముణ్ణి నమ్మిన వాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు. అందుకే శాస్త్రంలో ఒక మాటుంది. రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడం. రామభక్తుడొస్తే సీతారాములొస్తారు.


శ్రీరామ జయరామ జయజయ రామ🙏


🔱 *ఓం నమః శివాయ* 🔱


      

27, ఫిబ్రవరి 2021, శనివారం

సంస్కారం

 🌷🌹*సంస్కారం*🌹🌷


 నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు, అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది. నమస్కారానికి ఆశీర్వాదం పొందేశక్తి వుంది.


 మార్కండేయుడు పదహారేళ్ళకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు నారదుడ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్ళు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్ధించాడు. అందుకు ఆయన "కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడుతో పాదాభివందనం చేయించా"లన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతడ్ని వారందరూ "దీర్ఘాయుష్మాన్ భవ" అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీశ్శులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనట్లు పురాణగాథలు చెబుతున్నాయి.


      ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ బిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి "ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?" అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు. 


తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు.

      వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషితలను తీసుకెళ్ళేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు "మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?" అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.


 యోగశాస్త్రంలో "నమస్కారాసనం" ప్రసక్తి వుంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.


  రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్ళబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెకు స్మరించి నమస్కరించాడు.


 "ఎదిగేకొద్దీ ఒదగాలి" అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు.



      ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్ళు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.


 శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలచాడు.  వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. 


ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని పాదాభివందనంలోని పరమార్ధాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు. అందుకే అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్య రహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, పకృతిలో శాంతి వర్ధిల్లాలి. ఇలా ప్రార్ధించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!🙏


(ఫేస్ బుక్ నుండి సేకరణ)

రామాయణం

 *ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.* 


 *"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య.... "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు* 


 *ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే* *నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.* 


 *"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. .  బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో* *నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు... భార్య మళ్ళీ తెమ్మంది.... మళ్ళీ వెళ్ళాడు.... అలా పది సార్లు తిప్పింది.* 

 *"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు..... అలాగే పది రోజులు* *రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు.* 

 *నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.* 


 *అప్పుడు బండోడు అన్నాడు, ".గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.....*  *అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు.* 


 *భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది !* 


 **నవ విధ భక్తి మార్గాల్లో #శ్రవణం ఒకటి... విన్నా చాలు!* 


🎊💦🌹🦚🌈💥🦜

మాసానాం మార్గశీర్షోహం..

 మాసానాం మార్గశీర్షోహం.... కాలము ప్రకృతి పరంగా నడచుట. యిది జీవ చైతన్యలక్షణమునకు  సంబంధమైనది. దీనికి భూమి కారణం. భూచలనమునకు రాహు కేతు మాగ్నెట్ లక్షణం. రాహుకేతు శక్తి లక్షణము పార్వతీ పరమేశ్వర తత్వం. క్షీర సాగరమధనం మాఘ మాసంలో జరుపబడిన మూలంగా మాఘమాసము సృష్టికి జీవజాలమునకు పూర్ణ లక్షణము. ప్రకృతికి సంబంధించిన దంతయు సముద్రమధనం నుండే ఆవిర్భవించి సకల కళలు అనగా షోడశ కళల రూపము మరియు దానిని నాలుగు సంఖ్యతో విశ్లేషణ అనగా 16xనాలుగు 64 కళల పూర్ణమైన లలితమ్మగా రూపుదాల్చింది. చతుషష్ట్యపరాధ్యై చతుషష్టి కళామయి. యివి అన్ని మాఘా నక్షత్ర కేతు తత్వమని మహా మాఘియని సంభోధన. మాఘమాసము నకే మహా మాఘియని వేరే మాసమునకు మహా సంబోధన లేదు. యిది కేతు తత్వం సింహరాశి ప్రారంభంలో కలదు. దీని కేతు తత్వం సింహ వాహినీ యైన అమ్మ సంబంధం. కేతు తత్వం అమ్మ యని రాహు తత్వం శతభిషం శివ తత్వ సంబంధమని దీని ని సమ సప్తకమే జ్యోతి ఉష శాస్త్ర కళత్ర స్థాన ఫలము తెలుపు స్త్రీ పురుష తత్వం తెలియును. సృష్టి కి సంబంధించిన సమస్తం యీ మాసము నుండే ప్రారంభం. సప్తమి శక్తి రూపమైన సూర్యజయంతి ప్రారంభం లయకారకత్వమైన శివరాత్రితో  లయమని తెలియుచున్నది. గ్రహచలనమే సృష్టి మానవ గమనము సృష్టికి మూలం. మఘలో పుట్టి పుబ్బ లో పోవుట యనగా కేతువు నుండి జీవశక్తి మనుగడ ప్రారంభమై పుబ్బానక్షత్రముతో శుక్రునితో పరిపూర్ణమై 120 పూర్తి గ్రహ దశలు సంచరించు కకాలముతో అనగా 120 సంవత్సరములు పూర్తిగా జీవించి ముక్తిని పొందుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *దంపతుల పై దయ..*


"ఈరోజు బుధవారం కదండీ..ఈరోజు నుంచీ వచ్చే సోమవారం ఉదయం వరకూ స్వామివారి సన్నిధి లో ఉండాలని వచ్చామండీ..ఇద్దరమూ పెద్దవాళ్ళం..మా కొఱకు వసతి చూపించండి..మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడి వద్దకు వెళ్లి నిద్ర చేసి వద్దాము..అని ఈవిడ ఐదారు నెలల నుంచీ నాతో చెపుతోంది..ఈరోజుకు మాకు కుదిరింది..ఇక్కడకు వచ్చాము..ఏదైనా ఒక రూమ్ ఇప్పించండి.." అని ఆ దంపతులు ప్రాధేయపూర్వకంగా మా సిబ్బందిని అడిగారు..మా సిబ్బంది కూడా వెంటనే వాళ్లకు ఒక గది కేటాయిస్తూ.."మీకు కేటాయించిన గది ని శనివారం నాటికి వేరేవాళ్లకోసం అట్టే పెట్టాము..ప్రస్తుతానికి మీరు అందులో వుండండి..శనివారం రోజు మీకు మరో చోట వసతి చూపిస్తాము.." అని చెప్పారు.."అలాగే..సర్దుకుంటాము.." అని చెప్పారు..


ఆరోజు సాయంత్రం నేను మందిరానికి వచ్చేసరికి..ఈ దంపతులు వచ్చిన వైనం మా వాళ్ళు నాకు తెలిపారు..ఈలోపల ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."మీరేనా ఈ మందిరానికి ధర్మకర్త? మీ పేరు ప్రసాద్ కదా? " అని అడిగారు..అవును అని సమాధానం ఇచ్చి.."మీరెక్కడినుండి వస్తున్నారు..?" అని అడిగాను.."మాది కడప జిల్లా..నాపేరు ఈశ్వర రావు..ఈమె సరస్వతి..గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాము..నేను రెవెన్యు లో ఈమె టీచర్ గా పనిచేసేవాళ్ళము..కొన్ని సమస్యలతో బాగా మనస్తాపం చెందాము..మా జీవనానికి ఏలోటూ లేదు..జరిగిపోతుంది..ఇద్దరికీ పెన్షన్ వస్తుంది..సమస్య ఆర్ధికంగా కాదు..మాకు ఇద్దరు బిడ్డలు..ఇద్దరూ అబ్బాయిలే..పెద్దవాడికి ఇప్పుడు ముప్పై రెండేళ్లు..రెండో వాడికి ఇరవై తొమ్మిది..రెండోవాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు..మంచి సాఫ్ట్ వేర్ కంపెనీ లో వాడికి ఉద్యోగం..మంచి జీతం వస్తుంది..మా దిగులంతా పెద్దవాడి గురించే..డిగ్రీ చదివే నాటి నుంచే చెడు అలవాట్లకు లోనయ్యాడు..సిగరెట్లు..తాగుడు..వాడితో నరకం పడుతున్నాము..చదువు అబ్బలేదు..నాకున్న పలుకుబడితో రెండు మూడు చోట్ల..ఏవో చిన్న ఉద్యోగాలలో చేర్పించాను..ఆరు నెలలు తిరక్కముందే..అక్కడి అధికారులతో గొడవపడి ఆ ఉద్యోగం మానేసి వచ్చేవాడు..వీడి ప్రవర్తన తో విసిగి పోయాము..అందరి దేవుళ్లకూ మొక్కుకున్నాము..మేమూ రిటైర్మెంట్ అయిన తరువాత..చిన్నవాడి వద్ద కొన్నాళ్ళు ఉన్నాము..వాడికి వివాహం చేసుకోవాలని ఉన్నది..కానీ పెద్దవాడి పరిస్థితి చూస్తే..ఇలా ఉన్నది..పెద్దవాడి గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ వాడికి అమ్మాయిని ఇవ్వరు..రెండోవాడికి వివాహం చేయడానికి సిద్ధపడ్డాము..ఈలోపల ఈ స్వామివారి గురించి విని ఒక్కసారి ఈ స్వామికి కూడా మొక్కుకొని వెళదామని వచ్చాము.." అన్నారు..అలా చెప్పేటప్పుడు ఆ దంపతుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి..నిజమే..పెద్దకొడుకు ఎందుకూ పనికిరాని అప్రయోజకుడు అయితే..ఆ తల్లిదండ్రులకు మనస్తాపం సహజమే కదా..


ఆ దంపతులిద్దరూ మొత్తం ఐదు రోజులు వున్నారు..రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు..శనివారం పల్లకీసేవ లో తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..శని, ఆదివారాల్లో మందిరం వద్ద జరుగుతున్న కార్యక్రమాలు, అన్నదానం అన్నీ శ్రద్ధగా చూసారు..స్వామివారి వద్ద తమ సమస్యలు తీరిపోయిన కొందరు భక్తుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు..సోమవారం ఉదయం తిరిగి తమ ఊరు వెళ్ళిపోతూ.."ప్రసాద్ గారూ..ఇక్కడ చాలా ప్రశాంతంగా వుందండీ..మా అబ్బాయి సమస్య అంతా స్వామివారి మీదే పెట్టాము..ఇక నీటముంచినా..పాలముంచినా..ఆయనదే భారం..మా మనసులో ఏదో ఆశ పుట్టింది..చూద్దాం..మా ప్రాప్తం యెట్లున్నదో.." అని చెప్పారు..


ఆరేడు నెలల తరువాత..ఆ దంపతులు మళ్లీ వచ్చారు..ఈసారి వాళ్ళతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు, కోడలు ను కూడా వెంటబెట్టుకు వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని నావద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..వీడు మా రెండో అబ్బాయి..వీడికి రెండు నెలల క్రితం వివాహం చేసాము..మేము ఇక్కడినుంచి వెళ్లిన నెల తరువాత..మా పెద్దవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు..ఒక నెల వాడి జాడ తెలియలేదు..బాగా బాధపడ్డాము..ఒక రకంగా మేము పడుతున్న వేదనకు దేవుడు ఇలా పరిష్కారం చూపించాడేమో అని సమాధాన పడ్డాము..ఈలోపల వీడికి సంబంధాలు వచ్చాయి..ఇక ఆలస్యం చేయకుండా వివాహం చేసాము..చిత్రంగా మా పెద్దవాడు పోయిన నెలలో వచ్చాడు..ఎవరో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడట..తాగుడు మానేసాడట..ముందు మేము నమ్మలేదు..ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడించాడు..తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు..ప్రస్తుతం మాతో రోజు మార్చి రోజు మాట్లాడుతున్నాడు..వాడు బాగుపడ్డాడనే నమ్మకం కుదిరింది..స్వామిదయవల్ల వాడి బతుకు వాడు బతికితే అదే చాలు..మాకు పెద్ద కోరికలు లేవు..ఆరోజు స్వామిని వాడి గురించే మొక్కుకున్నాము..స్వామివారు దయ చూపారు..కాబట్టే..ఈనాడు వాడి స్థితి కి తగ్గ జీవనోపాధి దొరికింది..ముఖ్యంగా తాగుడు మానేశాడు..స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము.." అని చెప్పారు..చెప్పేటప్పుడు ఇద్దరి కళ్ళలో నీళ్లు ఉన్నాయి..కానీ అవి వేదనతో వచ్చినవి కాదు..సంతృప్తి తో వచ్చిన కన్నీళ్లు..


జీవిత చరమాంకం లో ఆ దంపతులకు మనోవేదన దూరం చేసి..తృప్తిని ఇచ్చారు స్వామివారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

వాస్తవం

 వాస్తవం

                                 ***

ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   

వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో..ప్రభావతి..  

అవునా...నీకెలా తెలుసు..నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..

.                              

ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె'.

"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, 

కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు...సేఫ్టీ కూడా...

అన్నారు"  ముకుందం గారు...

:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...

"చూడు..నువ్వు అలా మాట్లాడటం తప్పు...

ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం...ఆ రూల్ ఎంత సహేతుకమైనా...

మనం విమర్శించడం మానేస్తే మంచిది"...అన్నారు ముకుందం గారు...

"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?

సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లు గా పైకే..

ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు...ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి....

కోడలు చిన్న సాయం కూడా చేయదు...మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....

ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...

'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ...

పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...

కొన్ని రోజులకే అందరికీ తెలిసింది...

కరుణాకర్ గారి విషయం...

ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...

ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు...చాలా మంది మాట్లాడారు...

కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి...వాళ్ళు ఎంత మంచి వాళ్ళో...ఎంత హుందాగా ఉండేవారో...అని..

కొంతమంది సానుభూతి గా మాట్లాడారు...

పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..

ఇలాంటి తల్లి తండ్రుల ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...

ఇలా అనేక రకాలుగా...

కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...

అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...

చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...

ఆయన మాట్లాడేస్తే..అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...

ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...

మాట్లాడటం ప్రారంభించారు...అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..

మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది...

నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను...దయచేసి వినండి...

మాకు ఇద్దరు అబ్బాయిలు...ఇద్దరికీ రెండేళ్ల తేడా...

మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...

పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం...

ఆ రోజుల్లో అందరూ నడిచిన  దారిలోనే నడిచాం...

పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి. సి గ్రూప్ లో జాయిన్ చేయడం...

దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం...

డబ్బుకు చూసుకోలేదు...

పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...

ఒకటే ధ్యేయం...

ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...

మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..

ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం....

ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి...

మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు...

అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ...

వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం...

ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు...

అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...

ఇద్దరం ఉద్యోగస్థులం కదా...డబ్బుకి వెనకాడలేదు...

బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...

అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది...

మా ఆనందానికి అవధులు లేవు..గర్వంగా ఫీల్ అయ్యాము..

రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము...

రెండో వాడు వెళ్లనన్నాడు..."ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...

మేము ఒప్పుకోలేదు...ఇండియా లో ఏముందిరా...డెవలప్మెంట్ ఉండదు...ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....

మాకు ఎంత గర్వం గా ఉండేదో...మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని...

దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే...నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...

మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...

అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే...

అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం...

ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి...

ఇంకా పండగ మాకు...

కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...

మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం...స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...

మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం...మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు...

వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...

మేమిద్దరమనుకున్నాం..మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని...మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం...

వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...

వాళ్ళ హోదా, అలవాట్లు కి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్...అన్నట్లు మధ్యలో

మేము రిటైర్ అయిపోయాం....

మాకు మనవలు కలిగారు...

మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం...

రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి లా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...

అప్పటికే అన్నీ చూసేసి ఉండటం...చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...

అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలు లా, నరకం గా ఉండేది...

ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...

తరువాత ఇండియా లో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది....స్వేచ్ఛ విలువ తెలిసింది...

కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...

ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్...

చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...

కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం....

అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....

కాలం ఆగదు కదా...సాగిపోతూనే ఉంటుంది...

మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...

మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...

మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టం గా ఉండేది...

పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...

అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...

మా పిల్లలు కూడా ఆలోచించి...రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం...

ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...

ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం...ఇక్కడికి వచ్చాం...

నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...

వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి...సహజం కదా....

ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి...

నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి...

మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు...

మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా...

వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే...రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...

వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు...

అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం..

ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....

ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా,వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం....

మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...

వంటమనిషిని పెట్టుకుందామంటే భయం...

కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...

మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...

ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడు.అని విన్నాం...

సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...

మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...

కానీ ఎంత మాత్రం కాదు...

మా పిల్లలు చాలా మంచి వాళ్ళు...మేము చెప్పిందల్లా చేశారు...!

మమ్మల్ని ఆనంద పెట్టారు...!

వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు...మేమే పంపాము...!

మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...

మేము కొట్టి పారేసామ్...వినలేదు వాడి మాట...

ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి...మా ప్రతిష్ట పెరగాలి...

అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...

అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...

అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...

ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు...కనీసం ఒక్కళ్ళయినా...

మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...

ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...

ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు...

మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...

మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...

మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...

ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...

మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...

మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...

మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...

ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...

మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...

అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...

మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...

అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...

మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...

అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, 

ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....

మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....

పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు.....

వాకింగ్ సౌకర్యం...అందరికీ ఇంట్లో టీవీ...

కామన్ హాల్ లో పెద్ద టీవీ....

ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....

ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....

అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...

ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...

వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...

మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...

మేము ఒక విధంగా అదృష్టవంతులమే...

పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...

కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...

కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...

ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...

US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...

అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు...వాళ్ళకి వేరే దారి లేక...

కనీసం అక్కడ ఉంచితే, 

రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...

వైద్య సదుపాయం ఉంటుందని....

మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...

వాళ్ళని విమర్శించకండి...

దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...

మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...

మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....

మా మీద జాలి పడకండి...

నమస్తే....

అని ఆయన ఆపేశారు...

కొన్ని సెకండ్స్ నిశ్శబ్దం గా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..

.

వసుంధర గారు చెంగుతో కళ్ళు వొత్తుకున్నారు....

                          ***

(రచన: ఉమాబాల

మాఘ పౌర్ణమి*

 *_నేడు మాఘ పూర్ణిమ ,  మాఘ పూర్ణిమ ప్రత్యేకత_* 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మాఘ పౌర్ణమి*


హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 27న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.


*మాఘ పౌర్ణమికి శుభసమయం..*


ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46 నిమిషాలకు ముగుస్తుంది.


ఉదయ తిథి ఫిబ్రవరి 27న ఉంది పూర్ణిమ తిథి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున , నదులలో స్నానం చేయడం మెరిట్ ఇస్తుంది. పౌర్ణమిని ఉపవాసం పాటించేవారు. 2021 ఫిబ్రవరి 26న సత్య నారాయణ వత్రం చేయించాలి. అయితే పౌర్ణమి రోజు ఫిబ్రవరి 27న స్నానం చేయాలి.


చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.

కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.

మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.

*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.


*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*


*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*


*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము  నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''*  అని అర్థం.


అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.


*☘మాఘం అమోఘం :☘*


మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధనుడు''* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.


*"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే*


*శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*


మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.


త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .

 

*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*


మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం. 


*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*


మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. 


*☘సముద్ర స్నానం ఎందుకు చేయాలి?☘*


 *"నదీనాం సాగరో గతి:''*


సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. 

అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.

సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.


సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.


సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం. 


*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘*


1 . *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*


2 . *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*


3 . *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*


4 . *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


5 . *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


6 . *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


7 . *గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


8 . *ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.*


9 . *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.*


ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

 


*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*

    *"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*


*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*


*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*


*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''* 


అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *"దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''* అని అర్థం. 

ఆ తరువాత ...

*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*   


*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*


అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.

 

*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*


నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.

శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.

తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి  శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.

మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -


*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*


*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -


*"దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*


*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*


అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. 


*☘చివరగా ఓ మాట☘*


మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. 

జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.


*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.


*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️*


పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని  16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికా దేవి వారికి కనిపించింది. తల్లి కాళీక దేవి బ్రాహ్మణ భార్యకు  గర్భం పొందటానికి  వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.


ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్ల , పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికా దేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను  కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.