31, జులై 2021, శనివారం

ఆలోచించండి

 ఆలోచించండి!!!


అఖండ భారతాన్ని ఏలిన ఈ రాజవంశాలలో కనీసం ఒక్క రాజుపేరు చెప్పగలరా?


మౌర్యులు

శాతవాహనులు

గుప్తులు

పాండ్యులు

చోలులు

కాకతీయుల

పల్లవులు

చాలుక్యులు

విజయనగర రాజులు

రెడ్డి రాజులు


ఈ రాజ్యాల రాజధానుల పేర్లు చెప్పగలరా? ఒక్కొక్క రాజ్యం ఎన్ని సంవత్సరాలు వున్నదో చెప్పగలరా? వీరి సామ్రాజ్య విస్తీర్ణం ఎంతో తెలుసా? ఈ వంశాల గురించి కనీసం వినియున్నారా?


పై ప్రశ్నలకు సమాధానాలు NCERT పుస్తకాలల్లో కూడ దొరకవు. కానీ కోట్లాది భారతీయులను ఊచకోత కోసిన మొఘలు సామ్రాజ్యం గురించి అడగండి ...ఠక్కుమని సమాధానం చెబుతారు. బాబరు నుండి ఔరంగజేబు వరకు ప్రతి ఒక్కరి పేరు అందరికి తెలుస్తుంది. బాబరు, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. 

రాజ్యలు ఏలిన సమయాలు చూడండి


మొఘల్ 250 years

మౌర్యులు 550 years

శాతవాహనులు 500 years

గుప్తులు 400 years

పాండ్యులు 800 years

చోలులు 1000 years

పల్లవులు 600 years

చాలుక్యులు 600 years

అహోం 650 years(ఈశాన్యభారతం)


చాలామందికి ఈసామ్రాజ్యాలో కనీసం ఒక్క రాజు పేరు కూడ తెలవదు. అసలు భారతమంతా మొఘలుల క్రిందనే వున్నట్టు చరిత్ర పాఠ్యపుస్తకాలు చెబుతాయి. ఇంత ఘోరంగా మనపుస్తకాలు రాయబడ్డాయి 


ఒకడేమో హిందువులే కులాన్ని సృష్టించారు అంటడు. ఒకడేమో బ్రిటీషు వాడి వళ్ళనే మనకు నాగరికత, సైన్సు తెలిసిందంపాడు. ఇంకొకడేమో మనకసలు శాస్త్రీయ దృక్పథమే లేదంటడు. మరొకడేమో ఎప్పుడో మనం ధనికదేశం కావచ్చు కానీ వేయి సంవత్సరాల దరిద్రం వుంది అంటాడు.


నా చిన్నప్పుడు చరిత్రలో, మిగతా సామ్రాజ్యాలన్ళింటిని ఒక చాప్టర్లో చదివితే...మొఘల్ రాజులకేమో..ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క చాప్టర్... 32000 మంది లొంగిపోయిన రాజపుత్రవీరులను ఒకేరోజు తలలు నరికి గుట్టలుగా పోసిన అక్బర్ ను ధర్మాత్ముడుగా చదవాలిసిన ఖర్మ నాకెందుకు పట్టింది. కోట్లాది మంది వున్న హిందూమతం గురించి చదవటం మత మౌఢ్యమైతే, కేవలం పదిమంది మాత్రమే వున్న దీన్-ఇ-లాహి అనే మత సూత్రాలను నేర్పించిన కుక్కలకొడుకులనేం చేయాలి?


మన దేశంగురించి చరిత్ర తెలవకుండా చేసింది ఎవరు? మన దేశ చరిత్ర తెలియకుండా జాగ్రత్తపడేవారెవ్వరు? 

ఈదేశంలో పుట్టిన హిందూత్వం కానీ బౌద్దంకానీ జైనంకానీ చదివితే మతమౌఢ్యం...కోట్లమందిని చంపి మనదేశ చరిత్రను, సంస్కృతును, సాంప్రదాయాలను రూపుమాపిన ఎడారి మతాలను ప్రోత్సహిస్తే సెక్యులరిజం ఎలా అయింది?. అమ్మా నాన్నలను, గురువునూ, దేశాన్నీ, గౌరవించమనీ,ప్రేమించమనీ చెప్పే సదాచారం మతమౌఢ్యం ఎలా అవుతుంది?


ప్రతి దేశంలో దేశభక్తి అనేది గొప్ప తత్వం. మరి మన దేశంలో దేశభక్తి అంటే హిందూ మత దురహంకారం ఎలా అయింది.


మెకాలె నుంచి మొదలు నేటి సెక్యులరిస్టుల వరకు మన సంస్కృతిమీద‌, విలువలమీద, మతంమీద, ఆచారాలమీద, మనం బ్రతికే విధానంమీద జరిపే దాడులను చూస్తూ, వింటూ భరించాలిసిందేనా?. మనం ప్రశ్నించలేమా? వేయి సంవత్సరాల పరాయిపాలనకింద బానిసత్వం అలవాటయి పోయిందా?


ఆలోచించండి!!!

30, జులై 2021, శుక్రవారం

కాశీ-- పర్యాటకులకు

 కాశీకి వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పిలిగ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్రకటించింది. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి వారణాసికి టూరిస్ట్ రైలును నడపనుంది. ఈ టూరిస్ట్ రైలు దారిలో కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్ల మీదుగా వారణాసికి వెళ్తుంది. ఆయా ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ టూరిస్ట్ ట్రైన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ టూరిస్ట్ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, గయ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను కవర్ చేస్తుంది.

మహాలయ పిండ దాన్ తర్పణ్' పేరుతో ఈ రైలును ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 2021 సెప్టెంబర్ 25న ఈ రైలు బయల్దేరుతుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.


ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర రూ.6,620 కాగా, కంఫర్ట్ ధర రూ.11,030. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, హాల్, డార్మిటరీల్లో వసతి ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, హోటల్‌లో వసతి ఉంటుంది. దీంతో పాటు రోజూ టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ 1 లీటర్ వాటర్ బాటిల్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లాండ్రీ, ఎంట్రెన్స్ ఫీజులు లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ కావు. ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.


Day 1: మొదటి రోజు అంటే సెప్టెంబర్ 25న సికింద్రాబాద్, కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో పర్యాటకులు రైలు ఎక్కాలి.


Day 2: రెండో రోజు అర్ధరాత్రి వారణాసి చేరుకుంటారు. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.


Day 3: మూడో రోజు మొత్తం సైట్ సీయింగ్ ఉంటుంది. గంగా నదిలో పుణ్య స్నానం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి ఆళయం, అన్నపూర్ణ దేవి ఆలయం, కాల భైరవ ఆలయాన్ని సందర్శించొచ్చు. సాయంత్రం సంధ్యా హారతి దర్శనం ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.


Day 4: నాలుగో రోజు ఉదయం వారణాసిలో రైలు ఎక్కి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దర్శించుకోవాలి. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తిపీఠ్ దర్శించుకోవాలి. ఆ తర్వాత శృంగవేర్పూర్ వెళ్లాలి. అక్కడ రామాయణంలో అరణ్యకాండానికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత గయ వెళ్లడానికి ప్రయాగ్‌రాజ్‌లో రైలు ఎక్కాలి.


Day 5: ఐదో రోజు గయలో విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. అక్కడే పిండప్రదానం చేయొచ్చు. ఆ తర్వాత బోధ్‌గయ సందర్శించాలి. రాత్రికి బోధ్‌గయలో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.


Day 6: ఆరో రోజు ప్రయాణికులు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం తునిలో దిగొచ్చు.


Day 7: ఏడో రోజు ప్రయాణికులు సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజిపేట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో దిగాలి. దీంతో టూర్ ముగుస్తుంది.




భగవంతుడిని సాక్షి భూతంగా పేర్కొంటారు.

 భగవంతుడిని మనం ఒక బ్యాంకు మేనేజరుగా ఒక్క సారి అనుకుందాము. నేను ఒక లక్ష రూపాయల చెక్కు బ్యంకులో ద్రవ్య విడుదలకు ఉంచాననుకోండి అది చూసి మేనేజరుగారు నా అకౌంటులో బ్యాలన్సు లక్ష కన్నా ఎక్కువ ఉంటే వెంటనే దానిని ఆమోదించి నాకు లక్ష రూపాయలు విడుదల చేస్తారు. నాలాగా నీవు కూడా లక్ష రూపాయల చెక్కు బ్యాంకులో వేశావనుకో నీకు అకౌంటులో యాబై వేలే వున్నాయనుకో నీ చెక్కుకు నీవు కోరిన లక్ష రూపాయలు ఇవ్వకుండా నీ చెక్కు నీకు వాపసు చేయటం కద్దు. ఈ ఉపమానాన్ని మనం భగవంతుని విషయంలో అనుసరిద్దాము. నీవు చేసిన పూజ, జపము, నోము అనునవి భగవంతుడైన బ్యాంకు మేనేజరుగారికి అందచేసిన చెక్కు లాంటిది. నీ అకౌంటులో పుణ్య ఫలము నీవు కోరుకున్న కోరికకు సరిపడా ఉంటే నీ చెక్కు ఆమోదించబడింది అంటే నీ నోము ఫలిస్తుంది తద్వారా నీ కోరిక ఇదేరుతుంది. కానీ నీ అకౌంటులో పుణ్యఫలం తక్కువగా వున్న నీ చెక్కు రిటర్న్ అవుంతుంది అంటే నీ కోరిక తీరదు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది భావవంతుడు ఎవరి కోరికలు తీర్చాడు లేక తీర్చ నిరాకరించడు కేవలము నీ పాప పుణ్య ఫలితాలను మాత్రమే నీకు అందచేస్తాడు. అందుకే భగవంతుడిని సాక్షి భూతంగా పేర్కొంటారు. 

గాయత్రి మంత్రము

 గాయత్రి మంత్రము గురించి మహాత్ములు చెప్పినవి

వేదవ్యాస మహర్షి – గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.

శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో ‘ బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ ‘ అని చెప్పబడింది.

విశ్వామిత్రుడు – ” బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.

దేవీభాగవతము – గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది.’ తత్ సవితుర్వరేణ్యం భర్గః ‘

కూర్మపురాణము – ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు

యాజ్ఞవల్క్యుడు – ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును.

ఆర్షసూక్తి – ‘న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం’

భీష్మాచార్యులు – ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు

అత్రి మహర్షి భవిష్య పురాణం – సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు

లఘు అత్రి సంహితా – గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించాలి

పద్మపురాణం పరాశర మహర్షి – గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి

అగ్నిపురాణం – ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు

శంఖ స్మృతి – నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు

సూత సంహితా యజ్ఞవైభవ ఖండం – అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు

నారద మహర్షి – గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు ఇందు సందేహము లేదు

వశిష్ట మహర్షి – మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును.వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు.

మహాత్మాగాంధీ – నిత్యం గాయత్రిని జపించు వారికి ఆత్మోన్నతి మరియూ రోగనాశనం ఆపద నాశనం‌ జరుగును.

ఆదిశంకరులు – గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు ఇదియే ఆది మంత్రంము.

అందుకే నిత్యం ఉదయం సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది…

దైవం మానుష రూపేణ'*

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

    *దైవం మానుషరూపేణ* 

    (కథా రచయిత సింగరాజు 

                శ్రీనివాసరావుగారు)

                 🌷🌷🌷

"సామీ ఇంద పూలు, ఆ సామి పాదాల కాడ బెట్టు" అని తెచ్చి పళ్ళెంలో పెట్టింది పున్నమ్మ. 


"నువ్వు చాలా పుణ్యాత్మురాలివి తల్లీ. నీకొచ్చిన దానిలోనే కొంత పెట్టి కొని ఆ దేవుడి పాదాలను పువ్వులతో సేవిస్తున్నావు",


ఆయనకు నేనిచ్చేదేముంది సామీ. ఆయన ఇచ్చిందే ఆయనకు ఇస్తున్నా. ఆ తండ్రి గుడి ముంగల గుడ్డపరుసుకున్నదాన్ని. ఆయన ఋణాన బతుకున్నదాన్ని. నేనాయనకు ఇచ్చేదికాదు సామీ. ఆయనే నాకీ బతుకిచ్చాడు. ఆయన పాదాల కాడ పడుండమని చెప్పాడు" దేవుడికి నమస్కరిస్తూ చెప్పింది. 


మధ్యాహ్నం దేవుడికి నైవేద్యం పెట్టేముందు పూజారికి, బిచ్చగత్తె పున్నమ్మకు మధ్య జరిగే సంభాషణ ఇది. ఆమె మాటలలో ఎంతో లోతైన భావన కనిపిస్తుంది పూజారి సాయికి. ఏ ప్రవచనకారుడి నోట వినని మాటలు ఆమె అమాయకంగా పలికే పలుకులలో వినిపిస్తాయి సాయికి. 


అందులో సాయికి నచ్చే మాట. "మనమెవరము సామీ ఆ భగమంతునికి ఇయ్యడానికి. ఈ బతుకు, ఈ పైసలు, ఈ బువ్వ అంతా ఆయనిచ్చినదే కదా. ఆయనిచ్చినదే ఆయనకిత్తున్నాం. మనం కొత్తగా ఇచ్చేదేంది. 


బతికినంత కాలం ఆయన్ను మనసులో ఉంచుకోగలిగితే సాలు ఈ జన్మలకి". ఎంతో పరిణతి చెందితే తప్ప ఆ భావన ఎవరికీ రాదు. ఆమె మాటలలో నిజాయితీ అతనికి నచ్చుతుంది. ఆమె భక్తి నచ్చుతుంది. చూడడానికి మంచి కుటుంబం నుంచి వచ్చినామెలాగే ఉంటుంది. 


ఆమె యాసగా మాట్లాడుతున్నా, అది ఆమె కావాలని అలా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది సాయికి. రాములవారి గుడిలో పూజారి సాయి. వయసు సుమారు నలభై సంవత్సరాలు ఉంటాయి. పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు దేవాలయంలో. 


అతను వచ్చిన సంవత్సరం తరువాత కాబోలు ఒకరోజు పున్నమ్మ అక్కడికి వచ్చి సాయి అనుమతితో ఆ గుడి ముందు బిచ్చగత్తెగా మారింది. అంతకుముందు అక్కడ వుండే ముసలమ్మ కాలం చేయడంతో, అక్కడ వుండే మిగిలిన బిక్షగాళ్ళు కూడ అభ్యంతరం చెప్పలేదు ఆమెకు. 


ఆమెకు ఒక కన్ను పువ్వు పూసినట్లుగా ఉంటుంది. ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. తగాదాలు పెట్టుకోదు. అంతకుముందున్న ముసలమ్మ నోటిదురుసు మనిషి. ఎవరితో ఒకరితో రోజూ గొడవ పెట్టుకునేది. అది ఆలయానికి వచ్చేవారికి, పూజారులకు కూడ ఇబ్బందిగా అనిపించేది. ఇక తోటి బిచ్చగాళ్ళకు సరేసరి. 


ఆమె స్థానంలో పున్నమ్మ వచ్చిన తరువాత ఎంతో ప్రశాంతంగా ఉంది వాళ్ళకు. అంతేకాకుండా తనతోటి బిచ్చగాళ్ళకు ఏరోజైనా తిండికి సరిపడ డబ్బులు రాకపోతే తన సొమ్ములోనుంచి కొంత వారికి ఇచ్చేది. 


ఆమెకంటూ ఇల్లు లేదు. పగలంతా గుడిలోనే ఉండేది. అందరితోపాటు తనకు పుజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకునేది. 


'అదెలా సరిపోతుంది నీకు' అని అడిగితే 'బ్రతకడానికి ఆ మెతుకులు చాలవా' అనేది. 


ఆమె మాటలలో వేదాంతధోరణి అధికంగా ఉండేది. ఆమె పరిస్థితి గమనించిన సాయి, ఆమెకు తనకు తెలిసిన ఆశ్రమంలో తలదాచుకోను చోటు ఇప్పించాడు. అప్పటినుంచి ఆమె రాత్రివేళల అక్కడే ఉండేది. మితాహారమే ఆమె ఆరోగ్య రహస్యమేమో మరి. ఎప్పుడూ నలతపడగా చూడలేదు ఎవరు. ప్రతిరోజూ మధ్యాహ్నమయేసరికి నాలుగు మూరలు పూలు తెచ్చి సాయికిచ్చి దేవుడి పాదాల వద్ద పెట్టమని, ఆయనిచ్చిన ప్రసాదం పట్టుకెళ్ళి తిని, ఆ దేవాలయం నీడలోనే విశ్రాంతి తీసుకునేది. 


ఆమె అంటే ఏదో తెలియని అభిమానం పెరిగింది సాయికి. ఒకవేళ తనకు తల్లి ఉండి వుంటే ఆమె ఇదే వయసులో ఉండి ఉండేది అనుకునేవాడు. ********* 


"ఏం పంతులువయ్యా నువ్వు. తీర్థమివ్వడం, శఠగోపం పెట్టడం తప్ప, సంపాదించుకోవడమే చేతకాదు. పళ్ళెంలో వేసిన డబ్బులు ఎవడైనా ధర్మకర్తలకు లెక్కచెబుతారా. దొరికింది చాలని జేబులో వేసుకోక. అలా చేయకపోతే వీళ్ళిచ్చే అత్తెసరు అయిదువేలతో ఎలా నెట్టుకొస్తావు కాపురాన్ని" అని తోటి పూజారులు దెప్పి పొడిచేవారు. 


"నాకు దేవుడిచ్చినది చాలు. నాకేమైనా పిల్లాజెల్లా. దానికి నేను, నాకు అది అంతేగా. ఏనాడు ఏ పాపం చేశామో, ఈ జన్మలో సంతానయోగం లేకుండా పోయింది. మరల ఈజన్మలోను పాపం చేయడం దేనికి" అని చెప్పేవాడు సాయి." 


రోజులన్నీ ఇలాగే ఉంటాయా చెప్పండి. ఏ రోగమో, రొప్పో వస్తే నాలుగు రూకలు ఉండాలగదయ్యా చేతిలో. మరీ అంత మడికట్టుకుంటే బ్రతకడం చాలా కష్టం" అని సలహాలిచ్చేవారు. " అన్నింటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయనకొచ్చిన కష్టాలకంటే పెద్ద కష్టాలు మనకు రావుగా. ఏదయినా ఆయనదే భారం. 


ఆయన సేవచేస్తూ అవినీతి పనులు నేను చేయలేను. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. అయినా మన పిచ్చి కాకపోతే గుడి బయట బిచ్చమెత్తుకునే వారికి, మనకు తేడా ఏముందయ్యా. వారు ఆలయం బయట, మనం లోపల అంతేతేడా. అందరమూ బిచ్చగాళ్ళమే. ఆయన నీడలో బ్రతికేవారిమే. ఆయన ఇచ్చిన జీవితమిది. ఆయనకే అంకితం. అంతే తప్ప. నేనుగా ధర్మం తప్పను" అని ఖరాఖండిగా చెప్పేవాడు. 


ఇతనికి చెప్పినా ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే యని వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఏ దిక్కూలేని వారికి దేవుడే దిక్కు అని బ్రతుకును సాగించేవారిలో ప్రథముడని చెప్పవచ్చు పూజారి సాయిని. 


అటువంటి సాయిని భగవంతుడు పరీక్షించదలచాడేమో ఒకనాటి అర్థరాత్రి ఛాతి పట్టినట్టుగా అనిపించింది. అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అది గుండెపోటని, రక్తనాళాలలో బ్లాకులు ఏర్పడ్డాయని, వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. చేతిలో వున్న ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకోవడానికి ఆ ఊరిలో వున్న ఏ ఆసుపత్రి ముందుకురాలేదు. 


ఆలయ ధర్మకర్తల మండలి వారు వాళ్ళకు తెలిసిన డాక్టరు ద్వారా ప్రయత్నించి ఆపరేషనుకు లక్ష రూపాయలు చెల్లించడానికి ఒప్పించారు. " చూడమ్మా. 


మీరొక లక్ష రూపాయలు మీ బంధువుల ద్వారా సమీకరించుకుని ఆసుపత్రిలో కట్టండి. ఆయనకు పూర్తిగా నయమయేటంత వరకు అయన మందులకు, మీ భోజనానికి తగిన ఆర్థికసహాయం మేము చేస్తాము. ఆపరేషను ఖర్చు మీరు భరిస్తే చాలు. ఇక మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. నాలుగురోజులలో ఆపరేషను చేస్తారు " అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక ధర్మకర్త, సాయి భార్య సునందకు. 


సునంద కుప్పలా కూలబడిపోయింది. లక్ష రూపాయలంటే మాటలా. ఎవరిని అడగాలి. ఎక్కడ తేవాలి. తమ బంధువులంతా అంతంత మాత్రపు వాళ్ళే. కనీసం పదివేలు కూడ సర్దగలిగే స్తోమతు లేని వారే. పోనీ ఆలయానికి వెళ్ళి అక్కడికి రోజూ వచ్చేవారికి విషయం చెప్పి సహాయమడిగినా, ఇస్తారో, ఇవ్వరో. ఏంచెయ్యాలో పాలుపోవడం లేదు. అయినా ప్రయత్నిస్తే తప్పేముందని, బంధువులందరికీ ఫోను చేయాలని, తెలిసిన వారిని సహాయమడగాలని నిర్ణయించుకుంది సునంద. 

****** 


ఆపరేషను చేసే రోజు వచ్చింది. ఎంత ప్రయత్నించినా పట్టుమని ఇరవై వేలు కూడ వసూలు చేయలేకపోయింది సునంద. వాళ్ళ నాన్న గారు కూడ అక్కడ ఇక్కడ దేబిరిస్తే ఒక పదివేలు తేగలిగాడు. తండ్రి తెచ్చిన సొమ్ముతో కలిపి ముప్ఫై వేలు తీసుకుని డాక్టరు దగ్గరికి వెళ్ళింది, తన అసహాయతను తెలియజేసి, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎలాగోలా ఆపరేషనుకు ప్రయత్నించమని చెబుదామని. 


"ఏవండీ. డాక్టరు గారిని కలవాలి. కొంచెం అనుమతి ఇప్పిస్తారా" కౌంటరు దగ్గరికి వెళ్ళి అడిగింది. 


"దేనికమ్మా" అడిగాడతను. " మావారు పూజారి సాయి. ఆయనకు ఈ రోజు గుండె ఆపరేషను అన్నారు. దానికిగాను లక్ష రూపాయలు చెల్లించమని చెప్పారు. కానీ నా దగ్గర ముప్ఫైవేలు మాత్రమే ఉన్నాయి. అవి డాక్టరు గారికిచ్చి, ఆయన పాదాలు పట్టుకుని ఎలాగైనా ఆపరేషన్ చెయ్యమని వేడుకుందామని" చెప్పింది సునంద. " అదేమిటమ్మా, మీకు తెలియదా. ఆపరేషనుకు అవసరమయిన లక్ష రూపాయలు రాత్రే వచ్చి కట్టిపోయారు. మీ వారి ఆపరేషనుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో గంటలో ఆపరేషను మొదలవుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి" అని చెప్పాడతను. " ఎవరు కట్టారు " ఆశ్చర్యంగా అడిగింది సునంద. 


"ధర్మకర్తల మండలి వారే అనుకుంటాను" అన్నాడతను. ఆ రాముల వారే పంపారేమో వారి మనసును మార్చి అని ఆ భగవంతుడిని స్మరిస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు తండ్రీకూతుళ్ళు. ******** 


రెండు నెలలకల్లా మామూలు మనిషయ్యాడు సాయి. ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఒక్కక్షణం ఇంట్లో కాలు నిలువలేదు అతనికి. ఆసుపత్రిలో ఉన్నప్పుడే వచ్చి చూసివెళ్ళారు ధర్మకర్తల మండలి వాళ్ళు. ఆలయం ముందు బిచ్చగత్తె పున్నమ్మ రోజూ వచ్చి స్వామి వారి పాదాల వద్ద కుంకుమ, ఆంజనేయస్వామి వారి సింధూరాన్ని తెచ్చి సామికి పెట్టమని సునందకు ఇచ్చి సాయిని చూచి వెళ్ళేది. ఆస్తులు లేకపోయినా, అందరి అభిమానాన్ని పొందిన సాయికి వారి పలకరింపే రామయ్య దీవెనగా అనిపించేది. వారి ఆశీస్సులు, ధర్మకర్తల విశాలహృదయమే తనకు పునర్జన్మనిచ్చిందని అనుకునేవాడు. దీనికంతటికీ కారణం ఆ రామయ్య చల్లనిచూపేనని సంతోషపడేవాడు. 


ఎప్పుడెప్పుడు రాముని సేవకు పోదామా అనే తొందరను ఆపుకోలేక ఆలయానికి వస్తానని ధర్మకర్తకు ఫోను చేశాడు. అతను అంగీకరించి రేపు ఒకటవ తేదినుంచి రమ్మని చెప్పాడు. ఆనందంతో మనసు గంతులువేసింది సాయికి. 


తిరిగి ఆరోగ్యవంతుడై వచ్చిన సాయిని సాదరంగా ఆహ్వానించి గుడి బాధ్యతలు తిరిగి అప్పగించాడు, అప్పటిదాకా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్న హనుమంతుని గుడిలో పూజారి. 


అంతలో సాయిని పలకరిద్దామని వచ్చారు ధర్మకర్త మండలి వారు. " అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మీ సహాయసహకారాలు లేకుంటే నేను ఈరోజు ఈ రామయ్య చెంత ఉండగలిగేవాడిని కాదు. లక్ష రూపాయలు ఇచ్చి, మందులకు, ఇప్పటిదాకా మా కాపురానికి కావలసిన భోజనాది ఖర్చులు ఇచ్చి మా జీవితాలను నిలబెట్టారు. నేను మీకు జీవితాంతం ఋణపడివుంటాను. 


"ఈ పూజారి పోతే మరో పూజారి వస్తాడులే" అని వదిలేయకుండా, నాకు పునర్జన్మనిచ్చిన దేవతలు మీరు. ఆ రాముడే మీ మనసులో చేరి నాకు మరల బ్రతికే అవకాశాన్ని ఇప్పించాడు. ఇక నేను బ్రతికినంతకాలం ఈ దేవాలయాన్ని విడిచిపెట్టను" అని కృతజ్ఞత నిండిన మనసుతో వారికి నమస్కరించాడు సాయి. 


"మాదేమున్నది పంతులు గారు ఇందులో. అంతా ఆ శ్రీరామచంద్రుని దయ. ధర్మకర్తలుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తించాము. 


కానీ మీకు ఆర్థికసాయం చేసి, మీరు కట్టవలసిన లక్ష రూపాయలను తను చెల్లించి, మిమ్మల్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించినది, అదిగో ఆ పున్నమ్మ. ఈ గుడిలోని రామయ్యను నమ్ముకుని ఆలయం ముందు బిచ్చమెత్తుకునే ఆ పున్నమ్మే, మీరే ఆ రామయ్య ప్రతిరూపమని నమ్మి మిమ్ముల కాపాడాలనుకుని తపనబడింది. 


మీరు కట్టవలసిన లక్ష రూపాయలను మేమే గుడికి వచ్చే వారి దగ్గర నుంచి చందారూపంలో వసూలు చేయాలనుకుని ఆలోచిస్తుంటే, తనే మా దగ్గరకు వచ్చింది. తను యాచన ద్వారా సంపాదించిన సొమ్మును తన గదిలోని పెట్టెలో దాచుకుంటూ వచ్చిందట. మీరేనటగా ఆమె తలదాచుకోను, ఆ ఆశ్రమంలో గది ఇప్పించింది. ఆ కృతజ్ఞతతో తన వద్దనున్న సొమ్మును మూటగట్టి తెచ్చి మాకిచ్చింది. అంతా లెక్కవేస్తే తొంభైవేలు తేలింది. దానికి మేము పదివేలు జోడించి, లక్షరూపాయలను ఆసుపత్రిలో కట్టివచ్చాము. 


ఆమె దొడ్డ మనసు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచింది. ఏ ఊరో, ఏ తల్లి కన్నబిడ్డో, మన ఆలయానికి వచ్చి చేరింది. ఈరోజు మీరు మరల మా మధ్య తిరుగుతున్నారంటే కారణం ఆమే. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దన్నది. కానీ నిజం చెప్పకపోతే ఆ రామయ్య మమ్మల్ని నిలదీస్తాడేమోనని భయపడి చెబుతున్నాము పూజారిగారు. 


మీకు ఆ రామయ్య రూపంలో వచ్చి ప్రాణభిక్ష పెట్టినది ఆ పున్నమ్మే " అని అసలు విషయాన్ని చెప్పాడు ప్రధాన ధర్మకర్త. 


ఆ మాటలు విన్న సాయి మనసు చలించిపోయింది. ధర్మకర్తలకు నమస్కరించి, వారి పేరున అర్చన చేసి, తీర్థమిచ్చి వారిని పంపివేశాడు. పూజకూడ పరధ్యానంగానే చేశాడు. వెంటనే వెళ్ళి పున్నమ్మకు సాగిలబడాలని మనసు తొందరపెట్టసాగింది. అంతలో పున్నమ్మ పూలు తీసుకుని లోపలికి రానే వచ్చింది. ఆమెను చూస్తూనే అతని కన్నులు అశృపూరితాలయినాయి. 


పూలు చేతిలోకి తీసుకుని పళ్ళెంలో పెట్టి, ఆమెకు చేతులు జోడించాడు. అతని బుగ్గల మీదుగా కన్నీరు జాలువారుతున్నాయి. " అమ్మా నేను మీకు ఏమవుతానని నాకోసం ఇంత త్యాగం చేశారు. మీరు సంపాదించుకున్న సొమ్మంతా నాకోసం వెచ్చించారు. ఎంత మంచి మనసమ్మా మీది. మీ ఋణం ఎలా తీర్చుకోను. 


ఏ బంధమూ లేని నన్ను ఆదుకున్న మీ దాతృత్వాన్ని ఎలా కొలువగలనమ్మా" సాయి మనసు ఆర్ద్రమయింది. 


"అంతమాటనకండి సామీ. మీరు మాకు ఆ రామయ్యతో సమానం. మీకు నేను చేసిన సాయం, ఆ రామయ్యకు వారధి కట్టడంలో ఉడత చేసిన సాయం లాంటిదేనయ్యా. 


కడుపునబుట్టిన వాళ్ళు నా ఇల్లు, వాకిలి లాగేసుకుని నన్ను వీధిలోకి నెడితే, ఊరుగాని ఊరొచ్చిన నాకు ప్రతిరోజు ప్రసాదమెట్టి కడుపునింపి, తలదాచుకోను గది చూపించి, నా బిడ్డలాగ నను చేరదీశావయ్యా. 


నీ అంతటి దేవుడిలాంటి మనిషికి ఆపద వస్తే, అక్కరకురాని సొమ్ము దేనికయ్యా. అందుకే నా దగ్గరవున్న సొమ్మంతా ఇచ్చేసినా. నాబిడ్డలాంటోడివయ్యా. ఆ రామయ్య తండ్రి నిను చల్లగ చూడాల." చేతులెత్తి రామయ్యను వేడుకుంది పున్నమ్మ." 


ఆ రామచంద్రుడే నాకోసం నిన్ను పంపాడమ్మా. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న నాకు నిన్ను పంపి నాకు తల్లిలేని లోటు తీర్చాడు. అమ్మా, నీ బిడ్డలు నిన్ను కాదన్నా, నీకు నేనున్నానమ్మా. నీవు ఎవరివైనా ఇకనుంచి నా తల్లివి. మీ మాట తీరు చూస్తే, బాగా బతికిన దానిలానే ఉన్నారు. అయినా మీ గతంతో నాకు పనిలేదు. నా ప్రాణాన్ని కాపాడిన మీ ఋణం నన్ను తీర్చుకోనివ్వండి. 


ఇకనుంచి మా ఇంట్లోనే ఒక గది మీకు ఇస్తాను. మాతో పాటే తిని, మాతో పాటే ఉండండి" అంటూ పున్నమ్మ చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. " నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలయ్యా. నాకు ఈ గుడి ముందు కూర్చుని రామయ్యను చూస్తూ, భక్తులు వేసిన కాసులతో, తమరు పెట్టే ప్రసాదంతో బ్రతకడమే సంతోషాన్నిస్తున్నది. 


శబరిలాగా ఆ రాముడి దర్శనం కోసం, ఆయన పిలుపు కోసం ఎదురుచూడడంలోనే నాకు తృప్తి సామీ. నేను చేసింది సాయం కాదు సామి, మనిషికి, మనిషి చేయవలసిన కనీస ధర్మం. అంతే. పదిమంది చేసిన దానం ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడింది. 


అది చాలు. మనమందరం ఋణపడింది ఆ రామయ్య తండ్రికి. అంతే" అంటూ ప్రసాదం వేయించుకోను పళ్ళెం తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళింది పున్నమ్మ. ఆమె వెళ్ళిన వైపే తదేకంగా చూస్తున్నాడు సాయి. 


'ఎదుటి మనిషికి సాయం చేయడానికి కావలసినది చేతినిండా డబ్బు కాదు, సాయం చేయగలిగే మనసు' అని చెప్పడం ఇన్నాళ్ళూ విన్నాడు. కానీ మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తున్నాడు. 


"అమ్మా, నీకు నేనే కొడుకును. నువ్వు కాదన్నా సరే నీ బాధ్యత నాదే. నీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈ బిడ్డ నీకు తోడుగా నిలుస్తాడు. ఇది నేను పాదాలంటి సేవించే ఈ రామచంద్రమూర్తి మీద ఆన" అని మనసులో అనుకున్నాడు సాయి. 


దైవ ప్రేరణ చిత్రమైనది. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు కలుపుతుందో తెలియదు. అందుకే దేవుడంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని గుండెనిండా నింపుకుని, ఆ రాతిబొమ్మను కొలిస్తే, ఆ రాయే కరిగి నవనీతమై మన గాయాలను మాన్పుతుంది. 


ఆ నమ్మకమే పూజారి సాయికి పునర్జన్మను ఇచ్చింది. దిక్కులేదనుకున్న పున్నమ్మకు, సాయిని దిక్కుగా చూపింది. 


అందుకేనేమో *'దైవం మానుష రూపేణ'*


అంటారు పెద్దలు. ****** 


(సమాప్తం) 


మానవ సేవే మాధవ సేవ అని తెలిపే అత్యధ్బుతమైన కథను అందించిన శ్రీ సింగరాజు శ్రీనివాసరావు గారికి నమస్సులు.

ప్రశ్న పత్రం సంఖ్య: 16

  ప్రశ్న పత్రం సంఖ్య: 16                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

నేను కూర్పు చేసి సమర్పిస్తున్న ప్రశ్న పాత్రలకు విశేష ఆదరణ లభిస్తున్నదని  నేను బొంకలేను కానీ కొద్దీ మంది సభ్యులు స్పందిస్తున్నారన్నది యదార్ధం.  వారిని స్ఫూర్తిగా  దృష్టిలో ఉంచుకొని ఈ పరంపరను కొనసాగిద్దామనుకుంటున్నాను  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) "చందమామ రావే జాబిల్లి రావే" పాట పాడని తెలుగు అమ్మ లేదు.  ఇది ఎవరు వ్రాసారో తెలుసా.  

2) "ప్రస్థాన త్రయం" అని ఏ గ్రంధాలని అంటారు.  

3) "ఉరక రారు మహాత్ములు" అనేది ఒక పద్య పాదం ఇది మనం నిత్యం వాడుతూ ఉంటాము కానీ ఈ వాక్యం ఎక్కడిదో, ఎవరు వ్రాసారో తెలుసా. 

4)  సాధారణంగా ఒక పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి. 

5) ఉపమాలంకారం అంటే ఏమిటి. 

6) " పరి పరి విధముల  వరమొసంగెడి " పాదము ఎందులోది దీనిని వ్రాసిన వాగేయకారుడు ఎవరు. 

7) "హరి హరి సిరి యురమున గల హరి"  పద్యపాదం  ఏ గ్రంధము లోనిది. కవి ఎవరు. 

8) ”పోగాలము దాపురించినవారు దీపనిర్వాణగంధమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు”  ఏ పుస్తకములోది రచయిత ఎవరు.  ఇందులో వున్న అలంకారాన్ని చెప్పగలరా 

9) నంది తిమ్మన కవికి ఇంకోపేరు ఏమిటి. 

10) "కృష్ణం వందే జగద్గురు" అని ఎందుకు అంటారు. 

11) "పరివ్రాజకుడు"  అని ఎవరిని అంటారు. 

12) కంచుకాగడా వెలిగించి చూచినా 

13) భావగర్భితము అనగా నేమి 

14) రమణ మహర్షి ప్రకారము "ముక్తి" అనగా నేమి. 

15) పోతన తన శ్రీ భాగవతంలో " మధుపం" అనే పదం ఏ పద్యంలో వాడారు. 

16) "వరూధిని" పాత్ర ఏ గ్రంధములోనిది, దాని కవి ఎవరు. 

17) "వావి వరుస" అనే ద్వంద పదాల  అర్ధము తెలుపండి. 

18) "విద్యుత్లతలు" అంటే వృక్ష విశేషమా కాదా ఏమిటి తెలుపండి 

19) "కొంపలు మునిగినట్లు" పద ప్రయోగం ఎప్పుడు చేస్తారు.   

20) మిత్ర లాభము అనే కధ ఏ గ్రంధములోనిది దాని రచయిత ఎవరు. 

 

మనోనిగ్రహం

 *శ్రీగాయత్రీమాత్రే నమః*


*మనోనిగ్రహం*


పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు, అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు, అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి...

*"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."*

శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు..._

*"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది, జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేము..."* ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే...


*"కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."*


*నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా మనలోపల ఎల్లప్పుడూ కోరికలు అనేటివి దాగి ఉంటాయి...*

ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది, పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు, అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా అని చెప్పాడు, ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది...

ఆ విధంగానే కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి...  వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి...


*"కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొ౦టే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి."*

ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి...


రామకృష్ణ పరమహంస వారు వారి సాధనలో ని అనుభవం గూర్చి ఇలా వివరించారు


"ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు.. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను... నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు... అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు, భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."


ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు, ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు...


రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు...

"ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి.._ హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడుగు...

'ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటాడు అంతరాత్మగా .

🙏       🙏         🙏

భక్త తుకారాం

 *🧘‍♂️భక్త తుకారాం కరుణ🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


*ఈ మానవ శరీరం తోటివారి మీద ప్రేమాభిమానాలు చూపడం కోసమే భగవంతుడు సృష్టించాడు. ప్రేమ దయ లేని మనిషి కేవలం ఎముకల మీద చర్మం కప్పుకున్నట్టే అని అంటారు జ్ఞానులు.*



*తోటి మానవుల మీదనే కాక పశుపక్ష్యాదుల మీద కూడా ప్రేమ, దయ, కరుణ కలిగిన మహనీయులెందరో తమ నడవడిక ద్వారా సమాజానికి స్ఫూర్తిని కలగజేసారు. అలాటి వారిలో భక్త తుకారాం ఒకరు.*



*16 వ శతాబ్దంలో మహారాష్ట్రలో నివసించిన మహాత్ముడు. ఆయన ఒకనాటి ఉదయం పొలం గట్ల మీదుగా నడచి వెడుతున్నారు తుకారాం.*



*పక్కనున్న పంట చేలలోని ధాన్యాలను చాలా పక్షులు పొడిచి పొడిచి తినడం చూశారు తుకారాం. ఆయనని చూడగానే ఆ పక్షులన్నీ ఒక్కసారిగా రెక్కలు టప టప మనిపిస్తూ రివ్వున ఎగిరి పోయాయి. అది చూసిన తుకారాంకి ఆశ్చర్యం, వేదన కలిగింది.*



*'నన్ను చూసి ఈ పక్షులు భయపడ తున్నాయా ...అవి నన్ను చూసి భయపడు తున్నాయంటే నాలో ఏదైనా దుర్మార్గ చింతన ఉన్నదా ! ఓ భగవంతుడా! అలాటి చెడు పదార్ధమేదైనా వుంటే వెంటనే నా శరీరం నుండి తొలగించు అని ప్రార్ధిస్తూ భగవంతుని ధ్యానం లో కూర్చుండి పోయారు.*



*కొద్దిసేపట్లో ఎగిరిపోయిన పక్షులు అన్నీ తిరిగి వచ్చాయి. విశ్రాంతికై చెట్టు మీద కూర్చున్నట్లు తుకారాం దేహం మీద కూర్చున్నాయి. పక్షులు తన మీద కూర్చుని వున్న స్పృహ కూడా లేకుండా తుకారాం భగవత్ ధ్యానంలో మునిగిపోయారు.*



*ఈనాడు సర్వ జీవులను కారుణ్యంతో, స్నేహ భావంతో చూడడం మాట అలా వుండగా, తోటి మానవులనే మానవులుగా గుర్తించడం అరుదైపోతున్నది.*


🕉️🌞🌏🌙🌟🚩

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సంతాన సాఫల్యం..*


సుమారు ఆరేడు ఏళ్ల క్రిందట..నవంబరు నెల  చివరి శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం దగ్గరకి ఓ భార్యా భర్త వచ్చారు..


"ఇక్కడ ఈ రాత్రికి నిద్ర చేయాలంటే..రూము ఏదైనా ఉంటుందా ?.." అని అడిగారు..అప్పటికి శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద ఒకటి రెండు రూములు తప్ప మరేమీ లేవు..వచ్చిన భక్తులలో ఎక్కువమంది శ్రీ స్వామివారి మందిరం లోని మంటపాల లోనే కాలం గడుపుతూ వుండేవారు..ఆ వచ్చిన దంపతులు అదే మొదటిసారి శ్రీ స్వామివారి మందిరానికి రావడం..ఆ శనివారం నాడు పెద్దగా భక్తుల తాకిడి లేని కారణంగా వారి పేర్లు నమోదు చేసుకొని..ఒక గది వాళ్లకు ఇచ్చాము..


ఇద్దరూ తమ గదికి వెళ్లి..స్నానాదికాలు ముగించుకొని..మళ్లీ ఐదు గంటలకల్లా మందిరం లోకి వచ్చారు..నేరుగా నేను కూర్చుని ఉన్న చోటుకి వచ్చి.."అయ్యా!..మేము ఇదే మొదటిసారి ఈ గుడికి రావడం..ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి?..ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే..చాలా మంచి జరుగుతుందట కదా..మాకు మా ఊళ్ళో వాళ్ళు చెప్పగా విని..ఒకసారి చూసి..నిద్ర చేసిపోదామని వచ్చాము..శ్రీ స్వామివారి గురించి కూడా మాకు పెద్దగా తెలీదు.. మీరు మాకు వివరిస్తారా?.." అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలుంకురిపించారు..


ముందు వాళ్ళను స్థిమితంగా కూర్చోమని చెప్పి..క్లుప్తంగా శ్రీ స్వామివారి గురించి..ఆయన చేసిన తపోసాధన గురించి..వివరించి..ఏదైనా సమస్యలున్నవాళ్ళు..ఇక్కడ నిద్ర చేసి..ఆ స్వామివారికిి తమ సమస్య గురించి చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం ఉన్నదనీ..మీకు కూడా ఏదేని సమస్య ఉన్నట్లయితే..మీరు కూడా మొక్కుకోవచ్చనీ తెలిపాను..అంతా విన్న తరువాత..ఆ దంపతులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని.."మాకు వివాహం జరిగి దాదాపు పది సంవత్సరాలు గడిచాయండీ..సంతానం లేదు..మూడు నాలుగు సంతాన సాఫల్య కేంద్రాలలో పరీక్షలు కూడా చేయించుకున్నాము..ఏవో ట్రీట్మెంట్ అంటూ చెప్పారు గానీ..ఫలితం లేదు..డబ్బు మాత్రం ఖర్చు అయింది..ఇక్కడికొచ్చి మ్రొక్కుకుంటే...సంతానం కలుగుతుందని విన్నాము.. అందుకోసమే ఇక్కడ నిద్ర చేయాలని నిశ్చయించుకుని..వచ్చాము.." అన్నారు..


"మీరు మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి మీద విశ్వాసం ఉంచి..ఆ సమాధి ముందు మ్రొక్కుకోండి..ఆ పై మీ అదృష్టం.." అని చెప్పి.."ఇంకాసేపటిలో పల్లకీ సేవ మొదలవుతుంది..అందులో పాల్గొనండి.." అని చెప్పాను..సరే అన్నట్లు తలా ఊపారిద్దరూ..


ఆరోజు పల్లకీ సేవలో ఆ దంపతులిద్దరూ తమ పేరుతో అర్చన చేయించుకున్నారు..భర్త మాత్రం శ్రీ స్వామివారి మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు పల్లకీ మోస్తూ తిరిగాడు..రాత్రికి ఆ మంటపం లోనే పడుకున్నారు.. మళ్లీ ఉదయం లేచి..శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని..తమ ఊరికి వెళ్లిపోయారు..వెళ్లేముందు నా దగ్గరకు వచ్చి..నా ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లారు..


ఆ తరువాత వాళ్ళ గురించి వివరాలేమీ తెలియలేదు..మూడు నెలలు గడిచిపోయాయి..మళ్లీ మహాశివరాత్రి గడచిపోయిన తరువాత..ఒక శనివారం మధ్యాహ్నం నాడు..మళ్లీ మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఇద్దరి ముఖాలూ సంతోషంతో విప్పారి ఉన్నాయి..నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి.."అయ్యా..శ్రీ స్వామివారు మమ్మల్ని కరుణించారు.." అన్నారు..

నేను మాట్లాడేలోపలే.."ఆరోజు ఇక్కడ నిద్రచేసి..తెల్లవారి శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని మా ఊరికి వెళ్ళామా..ఆరోజు రాత్రి తనకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఆశీర్వదించినట్లు కనిపించింది..తాను ఉలిక్కిపడి లేచి కూర్చుని..నన్ను నిద్రలేపి..నాకు విషయం చెప్పింది..ఆ ప్రక్కరోజు నుంచి..ఇద్దరమూ అత్యంత విశ్వాసం తో శ్రీ స్వామివారి ని కొలుచుకుంటున్నాము..ప్రస్తుతం తనకు రెండో నెల!.." అని చెప్పాడు..ఆ దంపతుల విశ్వాసమే వాళ్లకు ఫలితాన్ని ఇచ్చింది..నమ్మి కొలిచిన వాళ్ల కోరికలు తీరుస్తాననీ.. తన సమాధి నుంచే తాను అందరినీ కాపాడుతాననీ..శ్రీ స్వామివారు చెప్పిన మాట మరొక్కసారి ఋజువు అయింది..


మొదటి సంతానంగా ఆడపిల్ల, ఆతరువాత మరో రెండేళ్లకు మగపిల్లవాడు పుట్టారు..అమ్మాయి కి మూడోనెల వయసు వచ్చిన తరువాత మందిరానికి వచ్చి..అన్నదానం చేసి వెళ్లారు..అలాగే పిల్లవాడు పుట్టిన మూడు నెలలకు మళ్లీ అన్నదానం చేసి వెళ్లారు..ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఆనందంగా వున్నారు..తరచూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి నిద్ర చేసి వెళుతుంటారు..


ఎందరో భక్తులు..ఒక్కొక్కరివి ఒక్కొక్క అనుభవం..తెలుసుకోవాలే గానీ..శ్రీ స్వామివారు చూపిన..చూపుతున్న మహిమలను లెక్కగట్టగలమా?..మనం గోరంత విశ్వాసాన్ని చూపితే..కొండంత ఫలితాన్ని ఇస్తాడు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

29, జులై 2021, గురువారం

Ramana Maharshi

 

Ramana Maharshi

Your own Self-realization is the greatest service you can render the world.

No one succeeds without effort... Those who succeed owe their success to perseverance.

The degree of freedom from unwanted thoughts and the degree of concentration on a single thought are the measures to gauge spiritual progress.


రమణ మహర్షి

మీ స్వంత స్వీయ-సాక్షాత్కారం మీరు ప్రపంచాన్ని అందించగల గొప్ప సేవ.

ప్రయత్నం లేకుండా ఎవరూ విజయం సాధించరు ... విజయం సాధించిన వారు పట్టుదలతో తమ విజయానికి రుణపడి ఉంటారు.

అవాంఛిత ఆలోచనల నుండి స్వేచ్ఛ యొక్క డిగ్రీ మరియు ఒకే ఆలోచనపై ఏకాగ్రత స్థాయి ఆధ్యాత్మిక పురోగతిని అంచనా వేసే చర్యలు.

ఓ కథ* శ్రమజీవులు

 ఓ కథ*

     (రచయిత/త్రి పేరు తెలియదు)

        *🌹 శ్రమజీవులు 🌹* 


"మమ్మీ ! స్కూలు బస్ వచ్చే టైమయ్యింది. నా టై కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?" అడిగింది ఆరో తరగతి చదువుతున్న కూతురు.


"వస్తున్నా తల్లీ, ఇదిగో అన్నయ్య లంచ్ బాక్స్ సర్దుతున్నా!" వంటింట్లోంచి బదులిచ్చింది సుధ.


"మమ్మీ! నా ఉతికిన సాక్స్ ఎక్కడ పెట్టావు? త్వరగా రావాలి, ఆటో వచ్చే టైమయ్యింది" అరుస్తున్నాడు ఏడో తరగతి చదువుతున్న కొడుకు.


"వస్తున్నా నాన్నా! ఇదిగో చెల్లాయ్ టై కనబడటం లేదు. వెతుకుతున్నా."


"సుధా! బాత్రూమ్ లో కొత్త సోప్ పెట్టలేదా?" పిలుస్తున్నాడు భర్త వెంకట్.


"ఆ తెస్తున్నానండీ, ఇప్పుడే పిల్లల్ని పంపించి, లోపలికి వచ్చాను" బదులిచ్చింది సుధ.


"ఇదిగో సుధా! ఈరోజు ఆఫీసుకు కొంచెం ముందుగా వెళ్లాలి. టిఫిన్, లంచ్ బాక్స్ లు సర్దేయ్. నీకు కూడా బ్యాంక్ టైం అవుతోంది కదా ! నువ్వు కూడా తయారవ్వు" అని చెప్పి, డ్రెస్ చేసుకోవడానికి లోపలికి వెళ్లాడు వెంకట్.


"అలాగేనండీ" అంటూ ఆ పనిలో మునిగి పోయింది సుధ.


వచ్చిన రెండు రోజుల నుంచీ, తన కూతురు చేస్తున్న అష్టావధానం గమనిస్తోంది, పక్క గదిలో పేపర్ చదువుకుంటున్న సుధ తల్లి సుభధ్ర.


"ఇదీ అమ్మా వరుస. ఇక్కడ ఇంటిపనీ, అక్కడ బ్యాంక్ పనితో నిజంగా ఒత్తిడి పెరిగి, టెన్షన్ వచ్చేస్తోదనుకో. పోనీ ఉద్యోగం మానేద్దామా అంటే, ఇంటికోసం తీసుకున్న అప్పు నిప్పులా భయపెడుతోంది. పోనీ పనిమనిషిని పెట్టుకుందామా అంటే, వాళ్ళు వస్తారా, రారా అని ఎదురు చూడ్డానికే కాలం సరిపోతుంది, అంతే కాదు వాళ్ల జీతాల కోసం నేను ఇంకో చోట పార్ట్ టైం జాబ్ చేయాలి. సరే ఈ గొడవలు ఎప్పడూ ఉండేవే కానీ, నాలుగు రోజులు ఉందామని వచ్చావు, హాయిగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తా" అంటూ తల్లికి చెప్పి, పక్క వీధిలోనే ఉన్న తను పని చేస్తున్న ప్రైవేటుబ్యాంక్ కి బయలుదేరింది సుధ.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


ఆ రోజు సాయంత్రం, బేంక్ నుంచి ఆలశ్యంగా రావడమే కాకుండా, మొహం వేలాడేసుకుని సోఫాలో కూలబడిన సుధని,


"అమ్మడూ, ఏమయ్యిందే తల్లీ ! అలా ఉన్నావు. ఏం జరిగిందో చెప్పవే?" కూతురు పక్కన కూర్చుని, ఆందోళనతో అడిగింది సుభధ్ర.


"ఏం లేదమ్మా! ఈరోజు బ్యాంక్ లో పని ఎక్కువగా ఉండడం వలన, ఆ ఒత్తిడిలో ఒక ఎంట్రీ తప్పు వేసాను. అది మేనేజర్ కనిపెట్టి సరిచేసి, నాకు చివాట్లు పెట్టాడు" బాధపడుతూ చెప్పింది సుధ.


"ఏంటి మమ్మీ ! ఇంత ఆలశ్యం. ఇంతవరకూ స్నాక్స్ కూడా తినలేదు" కంప్లైంట్ చేసింది, పక్క గదిలోంచి వచ్చిన కూతురు.


"బ్యాంక్ లో పనిఒత్తిడి వలన ఆలశ్యం అయ్యింది తల్లీ! అయినా అమ్మమ్మనడిగి ఏవైనా తినలేకపోయారా?"


"నువ్వు లేకుండా ఎప్పుడైనా ఏదైనా తిన్నామా?" సూటిగా అడిగాడు కొడుకు.


"అయ్యయ్యో, అలాగా! ఇప్పుడే తెస్తా ఉండండి" అంటూ లోపలికి వెళ్లింది సుధ.


ఈ సంఘటనలు చూసిన తరువాత, తను తిరిగి వెళ్లబోయే ఈ రెండు రోజుల్లో ఈ ఇంటికి చేయవలసిన ప్రక్షాళన గురించి ఆలోచనలో పడింది సుభద్ర.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


మర్నాడు సాయంత్రం, తను రాసిన ఓ కధకు తుది మెరుగులు దిద్దుతున్న సుభద్ర, ఫోన్ రింగ్ రావడంతో,


"చెప్పవే అమ్మడూ! బ్యాంక్ నుంచి బయలు దేరుతున్నావా?" అడిగింది సుధను.


"లేదమ్మా! ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నాం. ఆఫీసు అవ్వగానే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. అందుకే మేము రావడం కొంచెం ఆలశ్యం అవుతుంది. పిల్లలకి ఏం కావాలో చూడమ్మా!"


"సరేకానీ, డాక్టర్ దగ్గరకు దేనికే? " గాభరాగా అడిగింది సుభద్ర.


"కంగారు పడకు. నీకు నిన్న చెప్పానుగా! ఈ మద్యన కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని ! అందుకే ఓ సారి చూపించు కుందామని వెళ్తున్నాం" అంటూ ఫోన్ పెట్టేసింది సుధ.


ఫోన్ పెట్టేసిన సుభద్ర, ఈ రోజే తన పథకం అమలు చేయాలని ఓ నిశ్చయానికి వచ్చేసింది.


"అమ్మమ్మా! మమ్మీ ఇంకా రాలేదా, ఈ రోజు కూడా? " అడిగారు స్కూలు నుంచి వచ్చిన పిల్లలు.


"మీ మమ్మీకి ఒంట్లో బాగోలేదర్రా! పాపం పని ఒత్తిడిలో నలిగి పోతుంది కదా ? అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. మీరు కొంచెం కోపరేట్ చేస్తే మీ మమ్మీ త్వరగా కోలుకుంటుంది" బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పిల్లలతో చెప్పింది సుభద్ర.


"మేము ఏం చేయాలి అమ్మమ్మా, చెప్పు చేస్తాం!" అన్నారు ముక్తకంఠంతో.


"నాకు తెలుసుర్రా! మీరు మంచి పిల్లలని. ఏం చేయాలంటే........" అంటూ పిల్లలకు విడమరిచి చెప్పసాగింది సుభద్ర.


  **** 🌷 **** 🌷 **** 🌷 ****


పిల్లలతో కబుర్లలో మునిగిపోయిన సుభద్రకు అల్లుడు, కూతురు వచ్చిన అలికిడి వినబడడంతో హడావుడిగా గది లోంచి బయటకు వచ్చి,


"ఎలావుందే అమ్మడూ! డాక్టర్ గారు ఏమన్నారు?" ఆందోళనగా అడిగింది.


"కంగారు ఏమీ లేదు అత్తయ్య గారూ! నీరసానికి మందులు రాసారు. వీలైతే మెడిటేషన్ చేయమన్నారు" చెప్పాడు అల్లుడు.


అంతా విని, కూతురు వద్దకు వచ్చి,


"అమ్మడూ, రాత్రి పడుకునే ముందు ఓసారి నా గదిలోకి రావే, కొంచెం మాట్లాడే పని ఉంది నీతో" కూతురు భుజంమీద చెయ్యి వేసి, అనునయస్తూ చెప్పింది సుభద్ర.


"అలాగే అమ్మా! నువ్వేమీ గాభరా పడకు" అంటూ తల్లికి చెప్పి వంట గదిలోకి వెళ్లింది సుధ.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


"అమ్మా! ఇంకో వారం రోజులు ఉండవచ్చు కదా? ఎప్పుడూ చెప్పులో కాళ్ళు పెట్టుకుని మరీ వస్తావు. సరేకానీ, చెప్పు ఎందుకు రమ్మన్నావు?"తల్లి పక్కన కూర్చుని అడిగింది సుభద్ర.


"నీ గురించి చెప్పి, అల్లుడు గారు రమ్మంటే వచ్చాను గానీ, నీకు తెలియంది ఏముంది? అన్నయ్య ఆరోగ్యం సరైనది కాదు కదా? సరే అసలు విషయానికి వస్తా. ఈ ఒత్తిడి అనేది ఓ జబ్బూ కాదు, అలాగని అంటురోగమూ కాదు. ఇది మన సృష్టించుకున్నదే. అందుకే దీని నివారణ కూడా మన చేతుల్లోనే ఉంది. అలాగని, డాక్టర్ గారు ఇచ్చిన మందులు, సలహాలు మానేయమని చెప్పడంలేదు. వాటితో పాటు ఈ జపమాల అనే పద్ధతి పాటిస్తే, ఈ ఒత్తిడి, అనవసరపు ఆందోళనలు దూరమవుతాయి" చెప్పింది సుభద్ర.


"ఊరుకో అమ్మా! ఈ జపాలూ తపాలు చేసే సమయం ఎక్కడుంటుందే? దేవుడుకి ఓ నమస్కారం పెట్టడానికే సమయం దొరకడం లేదు" కొంచెం విసుగ్గా చెప్పింది సుధ.


"అయ్యో, జపమాల అంటే జపం కాదే. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడే నాలుగు పద్ధతులలోని మొదటి అక్షరాలే ఈ జ,ప,మా,ల . కిందటి సంవత్సరం మీ వదిన ఇలాగే బాధపడుతూంటే ఈ పద్ధతి చెప్పాను. వెంటనే ఆచరణలో పెట్టడంతో, ఇప్పుడు ఆ ఒత్తిడి అధిగమించి హాయిగా ఉంది."


"ఔనా ? ఆ జపమాల పద్ధతి ఏమిటో నాకూ చెప్పవే" తల్లి ఒడిలో తల ఆనించి ముద్దుగా అడిగింది సుధ.


📍"అయితే విను. ఇందులో మొదటి పద్ధతి *జ* న భాగస్వామ్యం: 

అంటే మనం చేసే పనిలో కొందరికైనా భాగస్వామ్యం కల్పించాలి. అన్నీ మనం ఒక్కరమే చేద్దాం అనుకోకూడదు. మీ ఇంట్లో చూడు, పిల్లల స్కూలు యూనీఫారాలూ, వాళ్ల టిఫిన్ బాక్సులు సర్దడం, కడగడం అన్నీ నువ్వే చేయాలా? పాపం, చిన్న పిల్లలు, వాళ్లని ఇప్పటినుంచీ కష్టపెట్టడం ఎందుకని నువ్వు అనుకోవచ్చు. కానీ, వాళ్లు ఎదుగుతున్నారు, రేపో మాపో పై చదువుల కోసం హాస్టళ్లలో ఉండవలసి రావచ్చు. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్లి చేయలేవు కదా? అందుకే వాళ్ళ పనులు వాళ్లను చేసుకోనివ్వాలి. అప్పుడు నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న ఆమె మొహంలో ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయవృత్తి చేసిన తల్లి కనపడింది, సుధకు.


ఆశ్చర్యంగా వింటున్న సుధ వైపు చూస్తూ, చెప్పసాగింది సుభద్ర.


📍"ఇక రెండో పద్ధతి 

*ప* నికి సమయనిర్ధేశం:

అంటే, ప్రతీ పనికి మనం ఓ నిర్ధిష్ట సమయం కేటాయించుకోవాలి. నీ విషయానికి వస్తే, నేను కొన్ని విషయాలు గమనించాను. పొద్దున్నే లేవగానే ఆ ఫోన్ తీసి వాట్సప్ మెసేజులు చూడడం అవసరమా ? అందులో ఏదో ఓ చెత్త మెసేజ్ ఉంటుంది. ఇంక ఆ రోజంతా దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు. అందుకే రోజుకు నాలుగు సార్లు, అంటే ఉదయం టిఫిన్ చేస్తూ, మధ్యాహ్నం లంచ్ టైములో, సాయంత్రం ఇంట్లో కాఫీ తాగుతూ, రాత్రి పడుకోబోయే ముందు.. ఇలా సమయం కేటాయించుకో. 


అలాగే, రాత్రి టీవీ చూస్తూ మర్నాడు ఉదయానికి కావలసిన కూరలు తరుక్కోవడం, రాత్రి భోజనాలు అయిన తరువాత ఆ పాత్రలు మర్నాడు ఉదయం వరకూ ఉంచకుండా రాత్రి పడుకునేముందే కడుక్కోవడం, ఇలా సమయ పాలన చేయడం వలన మర్నాడు ఉదయానికి నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న తల్లి మొహంలో ఓ మోటివేటర్ దర్శనమిచ్ఛాడు సుధకు. 


ఆశ్చర్యంగా చూస్తున్న కూతురు వైపు ఓ సారి చూసి, తిరిగి చెప్పడం మొదలెట్టింది సుభద్ర.


📍"ఇక మూడోది, అతి ముఖ్యమైనదీ

*మా* నసిక స్థైర్యం. 

ఇది ఉంటే చాలు, ఒత్తిడి ఏం ఖర్మ, మనం దేనినైనా జయించవచ్చు. మిన్ను విరిగి మీదపడినా కానీ చలించకుండా, ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, కృంగిపోకుండా, నేను దీనిని ఎదుర్కొన గలను అని గట్టిగా పిడికిలి బిగించి మనసులో అనుకో. నీలో ఆత్మ విశ్వాసం పెరిగి, ఒక విధమైన ధైర్యం వచ్చేస్తుంది.   


ఇది లేకపోవడం వల్లనే చిన్నపాటి అప్పులు చేసి, అప్పులవాళ్ల ఒత్తిడి భరించలేక మీ నాన్న మీ చిన్నతనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ధైర్యం ఉంది కాబట్టే నేను చదువుకుని, టీచర్ ఉద్యోగం తెచ్చుకుని, అన్నయ్యను, నిన్నూ చదివించి ఈ స్థితికి తెచ్చాను" అని చెబుతున్న తల్లిలో ఓ సైకాలజిస్టు దర్శనమిచ్చాడు సుధకు.


📍ఇక ఆఖరుది 

*ల* క్ష్యం మీద దృష్టి. 

అంటే మనం ఏం పని చేస్తున్నామో దాని మీదే దృష్టి కేంద్రీకరించాలి. మాటవరసకి ఒక బస్సు డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చోగానే, అతని లక్ష్యం ప్రయాణికులని క్షేమంగా గమ్యం చేర్చడం. అందుకే అతని దృష్టి రోడ్డు మీదే ఉండాలి. అలాకాక, ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచించా డనుకో, అరవై మంది ప్రాణాలు గాల్లో కలిసినట్లే. 


నిన్న బ్యాంకు లో నువ్వు చేసింది అదే, ఏదో ఆలోచిస్తూ, ఆ ఒత్తిడిలో తప్పుడు ఎంట్రీ వేసావు. అలా కాకుండా లక్ష్యం మీద దృష్టి పెట్టి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే పని మీద దృష్టి పెట్టమనేది.


అంతెందుకు, చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత, గ్యాస్ స్టవ్ ఆపామా? ఇంటి తాళం సరిగ్గా వేసామా అని అనుమాన పడి ఆ ఒత్తిడితో అసలు వెళ్లిన పని మీద దృష్టి పెట్టకుండా ఇంటికి వచ్చి చూసుకొనేవరకూ బిక్కు బిక్కు మంటూ ఉంటారు. అలా కాకుండా తాళం వేసినప్పుడు కొంచెం దృష్టి పెట్టడం కానీ లేదా ఆ సమయంలో ఏదో ఒక సంఘటన అంటే 'పాపం రామారావు కి ఎలా ఉందో' అనో లేదా 'ఆ వీధి కుక్క ఎలా అరుస్తోందో'..ఇలా ఏదో ఒకటి అనుకుని ఆ పని చేసామనుకో. అప్పుడు మనకి ఆ అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి, ఒత్తిడికి దూరం అవుతాం" చెబుతున్న అమ్మ, గీతోపదేశం చేస్తున్న గీతాచార్యుడులా కనిపించింది సుధకు.


"అమ్మా, చక్కటి విషయాలు చెప్పావు. నువ్వు చెప్పిన జపమాల పద్దతి ఇప్పటి నుంచే ఆచరిస్తాను" అంటూ తక్షణ కర్తవ్యంగా సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి, తల్లి వద్దే పడుకుండి పోయింది సుధ.


  ****🌷 ****🌷 ****🌷 ****


ఉదయమే లేచి బ్రష్ చేసుకుని, కిచెన్ లోకి వచ్చిన సుధ, అక్కడ సింక్ లో గిన్నెలు కడుగుతున్న కూతురు, డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బెండకాయలు తరుగుతున్న కొడుకు, కాఫీ పెడుతున్న భర్తను చూసి, 

"ఏమిటి షడన్ గా ఈ మార్పు" అని అడిగింది ఆశ్చర్యపోతూ.


"చూడు సుధా! అత్తయ్య గారు చెప్పిన జపమాలలోని మొదటి పథకాన్ని, మా వంతుగా మేము అమలుపరుస్తున్నాం. మిగతా మూడు పథకాలు ఫాలో అవ్వడం ఇక నీ చేతుల్లో ఉంది" చెబుతున్న భర్తని ఆశ్చర్యంగా చూస్తూ, ఒత్తిడిని జయించిన మొహంతో, పిల్లలను దగ్గరకు తీసుకుంది సుధ, మనసులో తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తనుకూడా రెడీ అయి ఉద్యోగానికి వెళ్ళింది .


  .... 🌷.... 🌷.... 🌷.... 🌷....

   

ఇప్పటికీ భర్త/తండ్రి కష్టపడి సంపాదిస్తుటే వారికి ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించకుండా టీవీల ముందు గానీ, సెల్ ఫోన్ లోగాని, భక్తి వంకతో పూజ గదిలో గాని యోగా, ధ్యానం అనిగాని... సమయం వ్రుదా చేసి కాలక్షేపం చేస్తూ ఇంటిపనికి ఒకరు, వంటపనికి ఒకరు, తోటపని ఒకరు, పాచిపనికి ఒకరు, కారు తుడిచేవాడు ఒకడు, దానిని నడపటానికి ఒకడు. అని దర్పం చుబిస్తు.. శరీరానికి వ్యాయామం లేక, కనీసం చమట కూడా పట్టే పరిస్తితి లేకుండా... వాళ్ళ ఒళ్ళు వాళ్ళే మోయలేక వాళ్ళ పిల్లలని ఎత్తుకోవటానికి పనిపిల్లలను పెట్టుకొని, వాళ్ళు మాత్రం కుక్కపిల్ల ఎత్తుకొని వాకింగ్ పేరుతో తిన్నది అరిగేవరకు రొడ్లవెంట తిరిగే వారు ఉన్న ఈ రోజుల్లో. .. 

వేడినీళ్లు చన్నీళ్ళు అన్నట్లుగా, రూపాయికి మరొక రూపాయి కుడబెట్టటానికి శ్రమించే ప్రతిఒక్క మహిళా శ్రమజీవి కి.. పాదాభివందనం🙏🙏


*(మహిళా ఉద్యోగినులకు అందరికీ అంకితం)*


   💥 సర్వేజనాః సుఖినోభవంతు

మానవాళికి ముప్పు పొంచి ఉందా

 ఇంటర్‌నెట్ డెస్క్: మానవాళికి ముప్పు పొంచి ఉందా? అతిశయోక్తి అని నాడు కొట్టిపడేసింది.. ఇప్పుడు నిజమవబోతోందా? వచ్చే పదేళ్ల కాలంలో ఏం జరగబోతోంది? శాస్త్రవేత్తల అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? జీవన నాణ్యత పడిపోతుంది! ఆహారోత్పత్తి, పారిశ్రామిక ఉత్పత్తి పతనమైపోతాయి. క్రమంగా మానవ జనాభా తగ్గిపోతోంది. మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-ఎంఐటీ పరిశోధకులు మానవాళి భవిష్యత్తు గురించి 1972లో వేసిన అంచనా ఇది. కేవలం ఆర్థిక వృద్ధిపైనే దృష్టి సారించి పర్యావరణ, సామాజిక మార్పులను పట్టించుకోకుండా ముందుకు సాగితే 21వ శతాబ్దంలో మానవ సమాజం పతనమైపోతుందని అప్పట్లో పరిశోధకులు హెచ్చరించారు. ‘లిమిట్స్‌ టు గ్రోత్‌’ పేరుతో వారు రాసిన పుస్తకం అప్పట్లో బెస్ట్‌ సెల్లర్‌గా కూడా నిలిచింది. ‘ఆ.. ఇదంతా మరీ అతిశయోక్తి’ అని చాలా మంది కొట్టిపారేశారు కూడా. కానీ.. వారి అంచనాలను ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే అవి నిజమయ్యే దిశగా పరిణామాలు సంభవిస్తున్నాయని ప్రముఖ వృత్తి సేవల సంస్థ కేపీఎంజీ ఇంటర్నేషనల్‌కు చెందిన గయా హెర్రింగ్టన్‌ అనే పరిశోధకురాలు అభిప్రాయపడ్డారు. మానవుల తీరు ఇలాగే కొనసాగితే దశాబ్దకాలంలో ఆర్థికాభివృద్ధి.. 2040 నాటికి మానవ సమాజం పూర్తిగా పతనమైపోతుందని హెచ్చరించారు. 1972లో ఎంఐటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని 1900 నుంచి 2060 దాకా మానవ సమాజ వికాసం గురించి అంచనా వేశారు. అధ్యయనంలో ప్రపంచ జనాభా, జనన, మరణాల రేటు, పారిశ్రామికోత్పత్తి, ఆహార ఉత్పత్తి, వైద్య, విద్యా సేవలు, పునరుత్పాదక ఇంధనాల వినియోగం, కాలుష్యాన్ని ఆధారంగా తీసుకున్నారు. అప్పట్లో దీనికి ‘వరల్డ్‌ 1’ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ను వినియోగించారు. ఆ ప్రోగ్రామ్‌ను రాసింది ఎంఐటీకి చెందిన జెర్రీ ఫాస్టర్‌. 1900 నుంచి జనాభా ఎలా పెరుగుతూ వచ్చింది.. జీవన నాణ్యత 1900 నుంచి 1940 దాకా ఎలా పెరిగిందీ... అక్కడి నుంచి పెరుగుదల వేగం మందగించి.. 2020కి పతాకస్థాయికి చేరి ఆ తర్వాత ఎలా పతనమయ్యేది... ఆ ప్రోగ్రామ్‌ ద్వారా గ్రాఫ్‌ల రూపంలో చూపారాయన. 1972 తర్వాత జీవన నాణ్యత ఎలా పడిపోబోయేది కూడా ఆ ప్రోగ్రామ్‌ సరిగ్గానే ఊహించగలిగింది. 2020ని మానవ నాగరికతకు శిఖరస్థాయిగా ఆ ప్రోగ్రామ్‌ ఊహించింది. ‘‘2020 నాటికి ప్రపంచం పరిస్థితి విషమంగా మారుతుంది. దాన్ని నివారించడానికి ఏమీ చేయకపోతే జీవననాణ్యత సున్నాకు పడిపోతుంది’’ అని 1973లో ఫాస్టర్‌ హెచ్చరించారు. ''కాలుష్యం మనుషుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టే స్థాయికి చేరుకుంటుంది. దానివల్ల జనాభా తగ్గిపోవడం మొదలై.. 2040-2050 నాటికి ప్రపంచ జనాభా 1900 కన్నా తక్కువకు పడిపోతుంది. నాగరిక జీవనం మనుగడ కోల్పోతుంది.’’ అని ఫాస్టర్‌ 1973లో హెచ్చరించారు. అప్పట్లో ఫాస్టర్‌ బృందం ఈ అంచనాలకు వినియోగించిన నమూనానే కేపీఎంజీ పరిశోధకురాలు హెర్రింగ్టన్‌ కూడా వాడారు. అయితే వరల్డ్‌1 ప్రోగ్రామ్‌కు బదులు.. దాని మూడో తరం వెర్షన్‌ ‘వరల్డ్‌ 3’ ప్రోగ్రామ్‌ను వినియోగించారు. అప్పట్లో వారు ప్రధానంగా తీసుకున్న జనాభా, జనన, మరణాల రేటు వంటి అంశాలకు అదనంగా ఎకలాజికల్‌ ఫుట్‌ప్రింట్‌ అంటే.. మనిషి పర్యావరణాన్ని ఎంత విచ్చలవిడిగా వాడేశాడు అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. మానవుల తీరులో ఎలాంటి మార్పులూ లేకుండా ఇదే రీతిలో కొనసాగితే పదేళ్లలోనే ఆర్థికాభివృద్ధి మందగించిపోతుందంటున్నారు హెర్రింగ్టన్‌.. 2040 నాటికి మానవ సమాజం పూర్తిగా పతనమయ్యే ముప్పు పొంచి ఉందని ఆమె హెచ్చరిస్తున్నారు. అయితే.. సాంకేతికంగా మరింత పురోగతి సాధించి, ప్రజాసేవలపై మరింత ఎక్కువ పెట్టబడి పెట్టగలిగితే మాత్రం ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయన ఫలితం యేల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఎకాలజీ ప్రచురిచింది.

ఆహారవైద్యం

 *"ఆహారవైద్యం"*


*ఇవి మీకు తెలుసా" ?*


*• 1.అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.*


*• 2.కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.*


*• 3.నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.*


*• 4.గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.*


*• 5.అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.*


*• 6.జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.*


*• 7.బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.*


*• 8.సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.*


*• 9.మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.*


*• 10.బీట్ రూట్ .. బీపీని క్రమబద్దీకరిస్తుంది.*


*• 11.మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.*


*• 12.దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.*


*• 13.ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.*


*• 14.అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది . మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.*


*• 15.కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.*


*• 16.మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.*


*• 17.ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ .. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.*


*• 18.బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.*


*• 19.క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.*


*• 20.మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.*


*• 21.ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.*


*• 22.అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.*


*• 23.పుచ్చకాయలో ఉండే లైకొపీన్ .. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.*


*• 24.సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.*


*• 25.దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.*


*• 26.ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.*


*• 27.చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.*


*• 28.కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.*


*• 29.క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.*


*• 30.యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.*


*• 31.వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.*


*• 32.పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.*


*• 33.ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.*


*• 34.ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.*


*• 35.ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ .. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.*


*• 36.జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.*


*• 37.ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.*


*• 38.నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.*


*• 39.మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.*


*• 40.మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.*

ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత

  ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత 

ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత గూర్చి వేనోళ్ల పొగిడిన తక్కువే అవుతుంది.  ఛందస్సు శృఖలాలుగా భావించే నవ్య, నూతన, గేయ, భావ కవులు ఈ నాడు మన ప్రాచీన కవుల కవిత్వాన్ని, అందులోని రసాన్ని ఆస్వాదించే స్థితిలో లేరంటే కోపం వస్తుందేమో కానీ కొందరి విషయంలో మాత్రము ఇది అక్షర సత్యం. 
యతి, గణముల ప్రాధమిక పరిజ్ఞానం లేనివారు కూడా ఈ రోజుల్లో సుకవులుగా ప్రాచుర్యం పొందటం మన తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం అనుకోవాలా అనిపిస్తుంది.  గతంలో నా దగ్గరకి ఒక కవి మిత్రుడు వచ్చి ఏదో సాహితి చర్చ చేస్తున్నాడు. ఇంతలో తానే నాకు కొంతమంది పద్య కవిత్వం వ్రాయమన్నారండి అని అని ఛందస్సు అంటే UUలు II లు పెడతారు అదేనా అన్నాడు. అంతేకాకుండా సుమతి శతకం, వేమన శతకంలోని పద్యాలూ మాములు మనం వ్రాసే గేయాల లాంటివే అని సెలవిచ్చారు.  అది విని నేను నిర్ఘాంత పోయాను. ఇక ఉరుకుంటే ఇంకా తన పాండిత్య గరిమ నా వద్ద ప్రదర్శిస్తారని తలచి  ఆర్య అవి ఆటవెలదులు, తేటగీతులు అనే దేశీయ ఛందస్సు అని వివరించటం జరిగింది. నాకు తెలిసింది చాలా చిన్ని ప్రపంచం కావచ్చు. ఈనాడు కూడా ప్రాచీన కవుల స్థాయికి తగట్టుగా ధీటుగా కవిత చెప్ప సమర్థులు  ఉండవచ్చు. కానీ చాలా మటుకు మిడి మిడి జ్ఞానంతో మన తేట తెలుగును అపభ్రంశం చేసే వారే ఉన్నట్లు తోస్తున్నది. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే నేను ఇటీవల ఒక చాటు పద్యం చదవటం తటస్తించింది.  అది చదివిన తరువాత దానిలో ఆ కవి పలికిన పలుకులు ఒక సమర్ధ కవికి ఆదర్శంగా ఉంటుందని నేననుకున్న  ఆ పద్యాన్ని మీకు పరిచయం చేసే ముందు మీకు రెండు పదాల అర్ధం చెపుతాను (మీకు తెలిసే ఉండవచ్చు కానీ తెలియని వారికోసం మాత్రమే) 
1) "గడియ" అంటే ఒక కాలం కొలమానం అది మన 24 నిముషాలకు సమానం. 
2) "గంటము" అంటే తాటాకు మీద వ్రాయటానికి ఉపయోగించే వక సాధనము అంటే మన భాషలో కలము లేక పెన్ను 
ఇక ఆ పద్యాన్ని ఆస్వాదిద్దాము.  

గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా

      దొడగితినా పఠీలు మని తూలి పడన్ కులశైల రాజముల్
      విడువకనుగ్రహించి నిరు పేద ధనాధిపు తుల్యు చేతునే
      నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే 


ఇక్కడ కవిగారు తాను  గడియకు   (24 నిముషాలకు ) నూరు పద్యాలూ రచిస్తారట అవి ఎలా వుంటాయో కూడా తెలుపుతూ తన పేరు కూడా తెలియచేసారు అది నడిదము సూరన అట 

ఇలా అనేక చాటు పద్యాలు మన తెలుగు నాట వున్నాయి కొన్ని కనుమరుగయ్యాయి. 



మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అమ్మాయి పెళ్లి..*


మొగలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద అప్పుడప్పుడూ వివాహాలు జరుగుతూ ఉంటాయి..శ్రీ స్వామివారి సన్నిధిలో వివాహం చేస్తే తమ బిడ్డల భావి జీవితం సుఖంగా సాగిపోతుందని కొందరు..శ్రీ స్వామివారి దయవల్లే తమకు సంతానం కలిగింది కనుక, ఆ సంతానం యొక్క వివాహాలు కూడా ఇక్కడే జరిపితే..వాళ్ళ మీద కూడా స్వామివారి కృపా కటాక్షణాలు వుంటాయని మరికొందరూ..శ్రీ స్వామివారి వద్దే వివాహం జరిపించుకోవాలని మొక్కుకునేవారు ఇంకొందరూ..ఇలా కారణాలు ఏవైనా..శ్రీ స్వామివారి మందిరం వద్ద వివాహాలు చేసుకుంటూ వుంటారు..


రెండు సంవత్సరాల క్రిందట ఇద్దరు పెద్దవాళ్ళు మా దగ్గరకు వచ్చి.."మా పిల్లవాడికి పెళ్లి నిశ్చయం అయింది..వచ్చే నెలలోనే ముహూర్తం.. వివాహాన్ని స్వామివారి సన్నిధిలో చేయాలని నిర్ణయం తీసుకున్నాము..ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా నిబంధనలు ఉన్నాయా?.." అని అడిగారు..వివాహం చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి ల తాలూకు వయసు ధ్రువీకరణ పత్రాలు కావాలని..ఇద్దరిలో ఏ ఒక్కరు మైనర్ అయినా ఇక్కడ వివాహం చేసుకోవడానికి అంగీకరించమనీ..చెప్పాము.."ఆ ఇబ్బందేమీ లేదు..ఇద్దరూ ఇరవై నాలుగేళ్ల పై బడిన వారే.." అని చెప్పి..ముహూర్తం రోజుకు వస్తామని చెప్పి..రెండు గదులు తమకు కేటాయించమని చెప్పి వెళ్లారు..


అనుకున్న ప్రకారమే ముహూర్తం రోజుకు ఆ పెళ్లి బృందం శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..పెళ్లికూతురు తల్లిదండ్రులిద్దరూ ముందుగా మందిరం లోనికి వచ్చి.."అయ్యా..ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటాము..ఈరోజు మా అమ్మాయి పెళ్లి జరగడానికి స్వామివారి దయ కారణం.." అన్నారు..లోపలికి వెళ్లి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు..మరి కొద్దిసేపటికల్లా.. పెళ్లి జరిగిపోయింది..వధూవరులను తీసుకొని మందిరం లోనికి వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నూతన దంపతులు నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చేసారు..


"మాకు పెళ్ళైన ఆరేళ్ళ దాకా బిడ్డలు పుట్టలేదు..మొగలిచెర్ల లో ఒక స్వామివారు సిద్ధిపొందారు..అక్కడికి వెళ్లి మొక్కుకోండి..మీకు సంతానం కలుగుతుందని మా ఊళ్ళో పెద్దలు చెపితే..ఇక్కడకు వచ్చాము..ఐదురోజుల పాటు నిద్రచేసాము..ఆ తరువాత సంవత్సరానికి ఈ అమ్మాయి పుట్టింది..స్వామివారి ప్రసాదం అనుకున్నాము..కానీ పుట్టిన తరువాత ఈ పిల్లకు ఐదేళ్ల వయసు దాకా మాటలు రాలేదు..డాక్టర్లకు చూపించాము..ఫలితం లేదు..మళ్లీ స్వామివారి వద్దకు వచ్చి వేడుకున్నాము..మా దుఃఖాన్ని ఆ స్వామి గ్రహించాడేమో..మరో మూడునెలలకు మాటలు వచ్చాయి..బడికి పంపించాము..బాగానే చదువుకున్నది..డిగ్రీ పూర్తిచేసింది..పెళ్లి చేద్దామని సంబంధాలు చూసాము..మూడేళ్ల పాటు ఒక్క సంబంధమూ కుదరలేదు..నాలుగు నెలల క్రిందట అమ్మాయిని తీసుకొని ఒక శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి నిద్ర చేసి, "స్వామీ! అమ్మాయికి పెళ్లి కుదిరితే..నీ సమక్షం లోనే వివాహం చేస్తాము.." అని మ్రొక్కుకున్నాము..పది రోజుల్లోనే ఈ సంబంధం వచ్చింది..చిత్రమేమిటంటే..అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడే వివాహం చేయాలని మొక్కుకొని ఉన్నారట..మమ్మల్ని అడిగారు..అంతకంటే కావాల్సింది ఏమున్నదని మేమూ సంతోషంగా ఒప్పుకున్నాము..అబ్బాయి బెంగుళూరు లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు..ఆ కుటుంబం కూడా స్వామివారి భక్తులే..అదే మాకు సంతోషం..మొదటినుంచీ మమ్మల్ని స్వామివారు అన్నివిధాల ఆదుకున్నారు.." అని చెప్పారు..


మరో పదిహేను నెలల తరువాత ఒక ఆదివారం నాడు ఆ దంపతులు తమ కూతురు అల్లుడు.. వాళ్లకు పుట్టిన మగ బిడ్డను తీసుకొని శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేశారు..వాళ్ల సంతోషానికి కారణం.. ఆ కారుణ్యమూర్తి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడే కదా!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).