శ్లోకం:
*భూప్రదక్షణ షట్కేన*
*కాశీ యాత్రాయుతేన చ |*
*సేతుస్నాన శతైర్యశ్చ*
*తత్ఫలం మాతృవందనే ||*
భావం: ఆరు సార్లు సంపూర్ణ భూప్రదక్షణము, నూరు సార్లు సముద్ర స్నానము, పదివేల సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, ఒక్క సారి తల్లికి నమస్కరించిన దానితో సమానము.🙏
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
శ్లోకం:
*భూప్రదక్షణ షట్కేన*
*కాశీ యాత్రాయుతేన చ |*
*సేతుస్నాన శతైర్యశ్చ*
*తత్ఫలం మాతృవందనే ||*
భావం: ఆరు సార్లు సంపూర్ణ భూప్రదక్షణము, నూరు సార్లు సముద్ర స్నానము, పదివేల సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, ఒక్క సారి తల్లికి నమస్కరించిన దానితో సమానము.🙏
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌷జీవితం మంచికధ🌷*
*పెద్దన్నయ్య*
"దివాకర్. మీ అన్నయ్య వస్తున్నాడు" పక్కసీట్లోని అక్కౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్.
బ్యాంకు గేటునుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి.
బ్యాంకు స్టాఫ్ కొంతమంది శివరాంను చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు. కొంతమంది పలకరిస్తున్నారు. శివరాం తన దగ్గరికి రాగానే "కూర్చో అన్నయ్యా" అన్నాడు దివాకర్.
శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతిరుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది.
"ఏమిటి.. ఇలా వచ్చావు..? బ్యాంకులో ఏమైనా పనిబడిందా?" దివాకర్ అడిగాడు.
"మీ వదిన చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతూంది. ఈరోజు స్పెషలిష్ట్ దగ్గరకు తీసుకెళ్ళాను. ఆపరేషన్ చేయాలన్నారు" అన్నాడు శివరాం దిగులుగా చూస్తూ.
"ఎంతవుతుందట..?"
"యాభైవేలు అవుతుందని చెప్పారు"
కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్. తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి "చూద్దాం అన్నయ్యా., నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మంచి సర్జన్లు కూడా. వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుంటాను" అన్నాడు.
"ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నారు"
దివాకర్ ఇబ్బందిగా చూసి "ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెబితే నాకు ఏమీ తోచదన్నయ్యా. పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు. సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడుతాను" అన్నాడు.
"అలాగే.. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు., మనం తర్వాత మాట్లాడుకుందాం.." అంటూ లేచాడు శివరాం.
అంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరాంని చూసి "నమస్తే సార్., నేను కుమార్ ని. సంతపేట హైస్కూల్ లో మీ శిష్యుణ్ణి" అన్నాడు రెండుచేతులూ జోడించి.
"నీ పేరు గుర్తులేదుగానీ నువ్వు గుర్తున్నావు.. బాగున్నావా..?" ఆప్యాయంగా అడిగాడు శివరాం.
"బాగున్నాను సార్..! ఈమధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చాను. రాగానే దివాకర్సార్ ని మీ గురించి అడిగాను., కూర్చోండి సార్.. టీ తాగి వెళుదురుగాని" అంటూ బాయ్ ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్.
"ముందు కాస్త మంచినీళ్ళు ఇప్పించు కుమార్" అభ్యర్థనగా అడిగాడు శివరాం. కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు.
టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూండిపోయాడు దివాకర్.
"టీ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి తోచిందిగానీ, తనకెందుకు తోచలేదు? ఎండనపడి వస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు?" అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు.
* * * *
ఆరోజు సాయంత్రం మారుతీ కారు షోరూం నుంచి వచ్చిన రిప్రెజెంటేటివ్ దివాకర్ ని కలిశాడు.
"రేపు మీరు డ్రాఫ్ట్ సిద్దం చేసుకున్నారంటే, ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది" అన్నాడు దివాకర్ తో.
"అదేం పెద్ద పని కాదు., బ్యాంకు లోన్ తీసుకుంటున్నాను. కాబట్టి ఓచర్లు నింపడమే నా పని. నా మార్జిన్ ఎలాగూ సిద్దంగా ఉంది" అన్నాడు దివాకర్. రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అక్కౌంటెంటు వేణు వచ్చి "ఎప్పుడు కొంటున్నావు కారు?" అని అడిగాడు, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
"రేపు లోన్ కోసం ఆప్లై చేస్తాను. ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు"
కాసేపు కారు రంగు, మోడల్, రేటు గురించి మాట్లాడుకున్నాక
"మీ అన్నయ్య ఈరోజు ఎప్పటిలా ఉత్సాహంగా కనిపించలేదు. చాలా డల్ గా కనిపించారు" అన్నాడు వేణు.
"అవును. మా వదినకు ఆపరేషన్ చేయాలట. అందుకు యాభైవేలు"
దివాకర్ మాట పూర్తికాకముందే "మీ అన్నయ్య వస్తున్నారు. నూరేళ్ళు ఆయుస్సు ఆయనకు..!" అన్నాడు వేణు గేటువైపు చూస్తూ!
దివాకర్ తలెత్తి చూశాడు. శివరాంని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది.
"నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు" అన్నాడు
వేణుతో.
"నేనెందుకు ఎత్తుతాను" అంటూ వేణు తనసీటుకు వెళ్ళిపోయాడు. అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.
దివాకర్ ని చూసి శివరాం నవ్వుతూ "ఈ రోజు పని పూర్తయిందా?" అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
"పని ఇంకా పూర్తికాలేదు. నేను ఇంటికొచ్చి మాట్లాడతానన్నాను కదా.. మళ్ళీ నువ్వు రావడం ఎందుకు..? వదిన ఆరోగ్యం గురించి నాకూ కన్సర్న్ ఉంది. కానీ, నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు?"
దివాకర్ ముఖంపై నవ్వు పులుముకుని ఆ మాటలు అన్నా, అతని మాటల్లో అసహనం, విసుగును గ్రహించాడు శివరాం..
"సారీరా..! నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం...!" శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు. వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు. అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది.
* * * *
దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి "శివరాం బావగారు ఫోన్ చేశారు" అని చెప్పింది.
"ఎన్ని గంటలకు చేశాడు" విసుగ్గా అడిగాడు దివాకర్.
"ఏడు గంటలకు చేశారు. అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు. మీరు బ్యాంకునుంచి వచ్చారా? అని అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను."
"బ్యాంకుకు వచ్చి మాట్లాడాడ్లే. వదిన ఆపరేషన్ కు యాభైవేలు కావాలని అడిగాడు.."
"మీరేమని చెప్పారు?"
"ఆలోచించి చెబుతానన్నాను"
"బాగా ఆలోచించండి. ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. కూతుర్ల దగ్గర ఆయన డబ్బులు తీసుకోరు. యాభైవేలు మరి ఆయన ఎలా తీరుస్తారు?"
"అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?"
"అయిదో, పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి.."
"కానీ మనం కారు కొంటున్నాం"
"కాబట్టే డబ్బుకు ఇబ్బందని చెప్పండి. ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే డబ్బులిచ్చేశామని చెప్పండి"
"అలాగే చెప్తా. నాకు కాస్త త్రాగడానికి మంచినీళ్ళివ్వు" అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్..
* * * *
మరుసటి రోజు బ్యాంకు లోన్ తీసుకోవడం, డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వడం, తర్వాతి రోజు కారును ఇంటికి తీసుకురావడం, గుడికి తీసుకెళ్ళి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్.
ఆరోజు ఆదివారం కావడంతో క్రొత్తకారు డ్రైవ్ చేసుకుంటూ శివరాం ఇంటికి వెళ్ళాడు. శివరాం ఇల్లు తాళంవేసి ఉండటంచూసి ఆశ్చర్యపోయాడు. శివరాం ప్రక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు.
దివాకర్ ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ. అతడు దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచిలో పనిచేస్తున్నాడు.
"చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు. నాకు చాలా అనందంగా ఉంది" అన్నాడు రామకృష్ణ.
"నాకూ అలాగే ఉంది. కొత్తకారు కొన్నాను. నీకూ, అన్నయ్యకూ చూపిద్దామని తెచ్చాను"
"అలాగా...కంగ్రాట్స్"
"అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా..?"
"నీకు తెలుసో, తెలియదో నాకు తెలియదుగానీ... మీ వదినగారికి ఈమధ్య అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు."
"ఆపరేషన్ విషయం అన్నయ్య నాతో చెప్పాడు. చెన్నైలో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు"
"ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. మీ అన్నయ్య స్టూడెంటు ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టరట. మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని, తను ఆ కేసులో స్పెషలిష్టుననీ, తన హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకోమనీ, మందులూ ఇతర ఖర్చులూ భరిస్తే ఆపరేషను తను ఫ్రీగా చేస్తాననీ చెప్పి, వాళ్ళను ఒప్పించి, తనతోపాటే కారులో చెన్నై పిలుచుకెళ్ళారు. మీ అన్నయ్య తరచూ అంటూండేవాడు "బీ గుడ్.., డూ గుడ్.., హి విల్ డూ గుడ్..," అని..! ఆ మాట ఆయన విషయంలో నిజమైంది. ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు" అన్నాడు. రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ "మీ ఆవిడ ఇంట్లో లేరా?" అని రామకృష్ణని అడిగాడు దివాకర్. "లేదు. మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను. ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందనీ, మీ వదిన బాగున్నారనీ చెప్పింది.."
"తను ఊర్లో ఉండీ వాళ్ళకు ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో..?" అనుకున్నాడు దివాకర్. ఆ తర్వాత "అన్నయ్య ఆపరేషన్ కు డబ్బు అడిగాడు. రెండురోజుల్నుంచీ రావాలని ప్రయత్నిస్తున్నా కానీ సమయం దొరకలేదు. ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను. వాళ్ళు లేరు" అన్నాడు నిరుత్సాహంగా.
"రాలేకపోయానని చెప్పు, ఒప్పుకుంటాను, కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను. రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా., స్నానం చేస్తున్నావా., భోజనం చేస్తున్నావా., కరెంట్ బిల్లు., టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా..? ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెస్తున్నావా., నీ భార్యకు, పిల్లవాడికి కావలసినవి అమర్చి పెడుతున్నావా..? మరి., వీటికి సమయం ఎక్కడనుంచి వచ్చింది నీకు..? అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది. మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడంలేదు. నీకు గుర్తుందా? మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకుచిత్తూరుకు ట్రాన్స్ ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు. అదృష్టవశాత్తూ ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను. అప్పట్నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన్ను చూస్తూంటే నాకేమనిపించేదో తెలుసా?
"మనుషులు-నా బిడ్డ ఇంజనీర్ కావాలి., డాక్టర్ కావాలి., ఇంకోటి కావాలి. అని కోరుకుంటారు కానీ.. నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలి.. అని ఎందుకు కోరుకోరు..?' అనిపించేది. మంచి పొరుగువారివల్ల ఇరుగుపొరుగు వాళ్ళకు ఎంత లాభమో మీ అన్నావదినలద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి., వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి., కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్విప్పుడు మరచిపోయినట్లున్నావు దివాకర్., ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి..? ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు. ఈ మూడేళ్ళలో ఎంత మార్పు నీలో..? దీనికి కారణం ఏమై ఉంటుంది..? నీ ప్రొమోషనా..? లేక పెరిగిన నీ ఆర్థిక స్థితా..? మీ అన్నయ్య కూడా నీలాగే "నేనూ, నా భార్యాపిల్లలూ" అని గిరిగీసుకుని ఉండుంటే, మీరంతా ఎక్కడుండేవారో అలోచించు."
దివాకర్ మౌనంగా వింటూ ఉండిపోయాడు.
ఉన్నట్టుండి రామకృష్ణ లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు. ఐదునిమిషాల తరువాత చేతిలో ఓ కవరుతో వచ్చాడు.
"నేను మీ అన్నయ్యవాళ్ళ ప్రక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోను చేసి చెప్పగానే, నువ్వు నాకు రాసిన ఉత్తరం ఇది. ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు. ఇది నీ గతాన్నీ, మీ అన్నయ్యతో నీ అనుబంధాన్నీ, ఆయన నీకు చేసిన సహాయాల్నీ గుర్తుకుతెస్తుందేమో ప్రయత్నించు."
దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు. రామకృష్ణ కారువరకూ వచ్చి "దివాకర్, డబ్బు ఎంత సంపాదించినా... అది మనకు సంతోషాన్నీ, ధైర్యాన్నీ ఇవ్వగలదేమో గానీ, తృప్తిని ఇవ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వడం, కష్టాల్లో ఉంటే సహాయపడటంవల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు. నిన్ను నొప్పించి ఉంటే సారీ.. గుడ్ నైట్" అన్నాడు..
"గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్..
* * * *
"రామకృష్ణా..
నువ్వు మా అన్నయ్య ప్రక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శుభసందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది. అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరువేసుకునే అవకాశం నాకు కూడా కలుగుతుంది.
శివరాం నా సొంత అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. నాన్నావాళ్ళు నలుగురు అన్నదమ్ములు. వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు., ఇద్దరివి చిరుద్యోగాలు. అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు. ఇది ఆడవాళ్ళకు నచ్చేది కాదు. క్రమంగా వాళ్ళ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఉమ్మడికుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది. మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు. పెద్దల మధ్య విభేదాలు, పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి.,
అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీనుండి ఇంటికి వచ్చాడు. ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు. నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే, దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది. ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కథలు, జోక్స్ చెప్పి నవ్విస్తూ.. ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు. పెద్దలమధ్య కూర్చుని, వాళ్ళు చెప్పుకునే చాడీలు వింటూ, విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదనీ, చదువు చెడితే జీవితాంతం బాధపడాలనీ మాకు చెప్పేవాడు. అందరూ బాగా చదువుకుని, ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చనీ, అందువల్ల తమ మధ్య విభేదాలు రావనీ, అందరూ ఐకమత్యంగా ఉండొచ్చనీ చెప్పాడు. మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం. ఆయన చెప్పినట్లే చేశాం., తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు. వాళ్ళు ఏ పనిచెబితే ఆ పని చేశాడు. చదువుకోని ఆడవాళ్ళకు మాటలతోనే అన్ని విషయాలు వివరంగా తెలియజేసి, వాళ్ళలో సంస్కారాన్ని పెంచాడు. త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు. పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు. అన్నయ్యను అభినందించారు. క్రమంగా పెద్దలమధ్య విభేదాలు దూరమయ్యాయి. కాపురాలు వేరైనా పండుగల్ని కలసి జరుపుకునేవారు. అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది.
"తనొక్కడు చదివి బాగుపడితే చాలు" అనుకోలేదు అన్నయ్య. మేమందరం కూడా చదువుకుని బాగుండాలని కోరుకున్నాడు. ఆయన తర్వాత మేము ఆరుగురం అన్నదమ్ములం. మాతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం. అందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం., మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని, దగ్గరుండి మరీ జరిపించాడు అన్నయ్య.
మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో నాకు తెలియదుగానీ, తర్వాత హైస్కూల్ చదువు దగ్గర్నుంచి ఎం.ఎస్.సి.వరకు, తర్వాత ఉద్యోగంకోసం ఇంటర్వ్యూలకు తనొక్కడే వెళ్లేవాడు. పెదనాన్నకు ఆఫీసు పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. తన స్నేహితులకు తోడుగా వచ్చిన తండ్రుల్నీ, సోదరుల్నీ చూసి తన తండ్రి కూడా తనతోపాటే వచ్చిఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా..! అనుకునేవాడు. ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాలకోసం పోటీపరీక్షలకు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతోపాటుగా వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు. ఒకరకంగా నాకు జీవితాన్నిచ్చింది మా అన్నయ్యే. నేను ఇంటర్ ఫస్టియర్ లో ఓ పరీక్ష తప్పాను. ఇంట్లో అందరూ బాగా తిట్టారు. నేను హర్ట్ అయి, ఇల్లు వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నాను. అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతూంటే.. ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను.
"ఎక్కడికి పోతున్నావ"ని అడిగాడు. సమాధానం చెప్పలేదు నేను.,
"పరీక్ష ఏమైందని" అడిగాడు. చెప్పాను.
"ఫరవాలేదులే., ఫస్టియరే కదా., సంవత్సరం వృధాకాదు. ఈసారి ఇంకా బాగా చదివి రాయి" అన్నాడు. నాకు ఎంతో ఆశ్చర్యంవేసింది. చదువు ప్రాముఖ్యంగురించి అంతగా చెప్పే అన్నయ్య, నా ఫెయిల్యూర్ ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు.. అన్నయ్య నా భుజంపై చెయ్యివేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు, "మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు. ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు. ఒక్కోసారి తారుమారవుతాయి కూడా. అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు."
ఆ మాట నేను ఏనాటికీ మర్చిపోలేదు. నాకు ఎంతో ఓదార్పునూ, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చిన మాట అది. తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లోనూ, డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆరోజు అన్నయ్య స్టేషన్లో కనబడకపోయి ఉంటే.. నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో..? ఏమయ్యేవాడినో..? ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నానంటే, ఇది ఆయన పెట్టిన బిక్షే...!
అన్నయ్య ఎం.ఎస్.సి. చదివినా., మమ్మల్ని విడిచి వెళ్ళడం ఇష్టంలేక చిత్తూరులోనే టీచరు పోస్టులోనే స్థిరపడిపోయాడు. పైగా టీచరు పోస్టంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్ తో చేశాడు. మా గురించి ఎలా పట్టించుకునేవాడో, తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు. తన పూర్తి సమయాన్ని వాళ్ళకోసం వెచ్చించి, వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు. మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసేది. ఇద్దరూ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లా ఉంటారు.
మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి, ఓసారి పనిఒత్తిడిలో సర్వీస్ చేయకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు., అరిచిపోయిన వాళ్ళున్నారు., కానీ, వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే., అభిమానపు పలకరింపులే., సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసుకు వెళ్ళినా...వాళ్ళ శిష్యులే కనపడతారు. కావలసిన పని చేసిపెడతారు.
అన్నయ్య మాతో, ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటూండేవాడు - "ప్రతి మనిషీ ఓ అబ్దుల్ కలాం, ఓ రెహమాన్, ఓ తెందూల్కర్ కాలేరు. కానీ, ప్రయత్నిస్తే ప్రతి మనిషీ ఓ మదర్ థెరెసా కాగలరు. ఇందుకు మేధస్సు, ప్రతిభ అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టంపట్ల స్పందించే హృదయం ఉంటే చాలు!".అని. ఈ మాట అనడమే కాదు, ఆచరించి చూపించాడు కూడా., ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు. అందుకోసం అయ్యే వ్యయప్రయాసల్ని గురించి అస్సలు పట్టించుకునేవాడు కాడు.
మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు, క్రెడిట్లు, టార్గెట్లు.. ఇవే జీవితం అనుకుంటాం., అన్నయ్యలాంటివాళ్ళను చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసినది చాలా చాలా ఉందనిపిస్తుంది. ఆయన మా అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతుంటాను. అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే. ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు. ఉంటాను.
నీ...దివాకర్.
ఉత్తరం చదవడం పూర్తిచేసిన దివాకర్ కంటిచివర నుంచి రాలిన కన్నీటిచుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి, అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనపడసాగింది.
* * * *
ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్ కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది.
"దివాకర్, మీ అన్నయ్య, వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు.." అని చెప్పాడు రామకృష్ణ.
"అలాగా.. నేను వచ్చి చూస్తాను. రామకృష్ణా..! నీవిచ్చిన నా ఉత్తరం చదివాను. 'పని ఒత్తిడి ' అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకుని, నామీద నేనే సానుభూతి చూపుకుంటూ, భార్య చెప్పిందే వేదమనుకుంటూ, ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ, అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకుప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళూ. ఆ ఉత్తరం చదివాక, అనుబంధం ఎంత తియ్యగా ఉంటుందో, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో., ఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో., మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు"
"మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు. నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు"
"తప్పకుండా. నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉంటాను.."
తర్వాత భార్యకు విషయంచెప్పి, వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్.
హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నావదినల మాటలు వినిపించి, గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు.
"మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండీ..!
నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకుగానీ, స్నేహితులకు గానీ, ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు. బాధ, భయం, కష్టం, నష్టం అన్నీ మీరే భరించి, చివరికి విజయం సాధించారు..!" జానకి శివరాంతో అంటూంది.
"ఎక్కడో ఉన్నవాళ్ళకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు. అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు. అతనూ తనవంతు సాయంచేసి తన మంచితనం నిరూపించుకున్నాడు"
"కానీ మీరు దివాకర్ దగ్గరకు వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరచింది. ఈమధ్య మన ఇంటివైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకెందుకు అనిపించింది?" "డాక్టరుగారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకు ఎంతో భయమేసింది. నా భయం నీతో చెప్పుకోలేను., నువ్వే పేషంట్ వి కాబట్టి., ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు. వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి, ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటిదగ్గర వదిలి, వెంటనే బ్యాంకుకు వెళ్ళాను. వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను. పాపం, వాడు అప్పుడూ బిజీనే!"
"అన్నయ్య బ్యాంకుకు వచ్చింది.. నన్ను డబ్బులు అడగటానికి కాదా?" అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్.
"కానీ, అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు? మీరు దివాకర్ కు ఎంత చేశారు? అతని అభివృద్ది కోసం ఎంతగా తపించారు? అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు" జానకి అంది.
"తప్పు జానకీ, అలా అనకు! నేను ఏదో ఆశించి వాళ్ళకు చెయ్యలేదు., ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలనుకున్నాను. దివాకర్ స్వతహాగా మంచివాడే., పనిఒత్తిడిలో అలా మాట్లాడాడు. ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా.. తరువాత ఆలోచిస్తే, పనిఒత్తిడివల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్ గా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి, ఎంతో ఆనందించాను" అన్నాడు శివరాం.
దివాకర్ ఇక నిలబడలేకపోయాడు. పరుగునవెళ్ళి శివరాం చేతులు పట్టుకుని, ఆ చేతుల్లో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ...!
🌷🌷🌷
*(2009 లో ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ఇంతటి హృద్యమైన, మానవ విలువలు కలిగిన కధను అందించిన రచయిత శ్రీచంద్రశేఖర్ గారు,*
నిజంగా అభినందనీయులు!
*(చివరివరకూ పూర్తిగా చదివినందుకు మీరు కూడా అభినందనీయులే!)*
*ధన్యవాదములతో!*
🙏🙏⚘🌺
*ఇది చాలా కాలం క్రితం పంపినదే ఐనా మరోసారి పంపడమైనది.
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*_ఆధునికత - అరాచకత్వం*_
తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!
పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!
వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు !
కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!
పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !
నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!
పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!
ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!
ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !
ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!
భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !
ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!
నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!
ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!
తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!
ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!
వేరేకులంవాడిని వివాహమాడిందని
సోదరిని సంహరిస్తున్న సహోదరులు!
మరోమతంవారిని మనువాడాడని
మట్టుబెడుతున్న బంధువులు !!
వెల్లువవుతున్న విడాకులు!
వీచేనా విలువల వీచికలు !!
పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!
ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!
ఆధునికత అవధులు దాటిపోతుంది!
అనుభవం పరిధులు మించిపోతుంది!!
వ్యక్తిగత స్వేచ్ఛ విశృంఖలమయ్యింది!
విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!
అన్యాయం న్యాయం చెబుతోంది!
అక్రమాలు అంబరమంటాయి!!
నేరాలు నింగిని తాకాయి!
ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!
అలుముకుంటున్న అరాచక రీతులు !
ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!
విశృంఖలత సోపానాలపై జీవనగతులు !
వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!
స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం!
సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!
ఆటవికత ఆవరిస్తోందని
అరాచకత్వం అలుముకుంటోందని
అవగతంకాని అయోమయంలో ఉన్నాం !!
- Satya Murthy Tikka
సేకరణ: వాట్సాప్ సందేశం యథాతథంగా
🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*
🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏
🏵️1.*అజీర్ణే భోజనమ్ విషమ్.*
➖➖➖➖➖➖➖➖➖
మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.
🏵️2. *అర్ధరోగహరి నిద్రా*
➖➖➖➖➖➖➖➖➖
సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.
🏵️3. _*ముద్గధాలి గధవ్యాలి*_
➖➖➖➖➖➖➖➖➖
అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,
ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.
🏵️4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా*
➖➖➖➖➖➖➖➖➖
వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.
🏵️5. *అతి సర్వత్రా వర్జయేత్*
➖➖➖➖➖➖➖➖➖
అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.
🏵️6. *నాస్తిమూలం అనౌషాధం*
➖➖➖➖➖➖➖➖
శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.
🏵️7. *నా వైద్యా ప్రభుయుయుషా*
➖➖➖➖➖➖➖➖➖
ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
🏵️8. *చింతా వ్యాధి ప్రకాషయ*
➖➖➖➖➖➖➖➖➖
చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.
🏵️9. *వ్యాయమాశ్చ సనైహి సనైహి*
➖➖➖➖➖➖➖➖➖
ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.
🏵️10. *అజవత్ చార్వనం కుర్యాత్*
➖➖➖➖➖➖➖➖➖
మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.
🏵️11. *స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*
➖➖➖➖➖➖➖➖➖
స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.
🏵️12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా.*
➖➖➖➖➖➖➖➖➖
ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.
🏵️13. *నాస్తి మేఘసమం తోయం.*
➖➖➖➖➖➖➖➖➖
స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.
🏵️14. *అజీర్నే భేజాజం వారీ*
➖➖➖➖➖➖➖➖➖
మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.
🏵️15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*
➖➖➖➖➖➖➖➖➖
తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)
🏵️16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.*
➖➖➖➖➖➖➖➖➖
ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.
🏵️17. *జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి*
➖➖➖➖➖➖➖➖➖
మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.
🏵️18. *భుక్త్వోపా విసస్థాంద్ర*
➖➖➖➖➖➖➖➖➖
ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.
🏵️19. *క్షుత్ సాధూతం జనయతి*
➖➖➖➖➖➖➖➖➖
ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)
🏵️20. *చింతా జరానామ్ మనుష్యానమ్*
➖➖➖➖➖➖➖➖
చింతించడం 😭అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.
🏵️21. *సతం విహయ భోక్తవ్యం*
➖➖➖➖➖➖➖➖➖
ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.
🏵️22. *సర్వ ధర్మేశు మధ్యమామ్.*
➖➖➖➖➖➖➖➖➖
ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం తప్పక లభిస్తాయి.
స్వస్తి.....
"Establishment of Supreme Court Bench in AP for South India is our prime aim"👍
🌹భగవద్గీత🌹
పదునాల్గవ అధ్యాయము
గుణత్రయవిభాగయోగము
నుంచి 8 వ శ్లోకము
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ౹
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ౹ (8)
తమః , తు , అజ్ఞానజం , విద్ధి ,
మోహనమ్ , సర్వదేహినామ్ ౹
ప్రమాదాలస్యనిద్రాభిః , తత్ ,
నిబధ్నాతి , భారత ౹౹ (8)
భారత ! = ఓ అర్జున !
సర్వదేహినామ్ = దేహాభిమానము గలవారినందరిని
మోహనమ్ = మోహింపజేయు
తమః , తు = తమోగుణమయితే
అజ్ఞానజమ్ = అజ్ఞానము నుండి ఉత్పన్నమైనదానినిగా
విద్ధి = తెలిసికొనుము
తత్ = అది (ఆ తమోగుణము)
(దేహినమ్) = (జీవాత్మను) ప్రమాdha
ఆలస్, నిద్రాభిః = ప్రమాదాలస్య నిద్రాదులతో
నిబధ్నాతి = బందించును
తాత్పర్యము:- అర్జున ! తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమదాలస్య నిద్రాదులతో బందించునu.(8)
ఆత్మీయులందరికి శుభ శుభోదయం
Yours Welwisher
Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi
_*నేడు ఆదిశంకరాచార్య జయంతి*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
హిందూ మత పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.
*శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*
*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*
*ఆది శంకర జయంతి*
ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం
*దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*
*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)
*కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*
*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*
శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)
జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.
ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.
☘ ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది.
☘ ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.
☘ శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి
అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు.
☘ ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.
☘ గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
☘ ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.
☘ ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.
☘ ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.
☘ ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!
ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!
☘ ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు , మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు మొదలైన వారు.
☘ వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.
☘ హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు.
☘ గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.
☘ శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి.
☘ ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.
*🌹మఠము-పీఠము🌹*
సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.
*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం చేశారు*
దేశంలో నాలుగు వైపుల నాలుగు ప్రధానమైన పీఠాల్ని నెలకొల్పి దేశ సమగ్రత ను ఆధ్యాత్మికతను కాపాడారు !!
*1 .తూర్పున పూరీ క్షేత్రంలో గోవర్ధన పీఠం రుగ్వేదం !!*
*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో శారదా పీఠం - యజుర్వేదం!!*
*3 - పశ్చిమాన ద్వారకలో ద్వారక పీఠం - సామ వేదం !!*
*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*
నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.
*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని
రోజులు పీఠాన్ని అధిరోహించి హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!
*చతుర్మఠాలు*
☘ *ద్వారకా మఠము :-*
ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు.
☘ *గోవర్ధన మఠము:-*
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో
☘ *శృంగేరీ మఠము :-*
ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది
☘ *జ్యోతిర్మఠము :-*
దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.
☘ *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.
🌳 *ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం నుప్రభోధించారు !!*
🌳 *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో వున్న వారికే ఈ సత్యం అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక దేవీ దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన చేయమన్నారు !!*
🌳 *ప్రస్థాన త్రయం అంటే భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*
*ఉపనిషత్తలు ! వీటికి భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*
🌳 *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*
☘ ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.
*శంకరులు :-*
అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి.
ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు
ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ
తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు
రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి , అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు. శ్రీ ఆదిశంకరులు
అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా
స్మరించుకోవడం కన్నా పుణ్యమేముంటుంది ?
అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.
ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల
అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
*" జయ జయ శంకర హర హర శంకర "*
ॐ శంకర జయంతి ప్రత్యేకం -8
( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )
7. వివిధ స్తోత్రాలు
ఆదిశంకరులు వివిధ దేవతలని స్తుతిస్తూ అనేక స్తోత్రాలు అనుగ్రహించారు.
ఒక్కొక్క స్తోత్రం చివరిలో ఆ స్తోత్రంద్వారా ఆ దైవాన్ని స్తుతిస్తే పొందే ఫలాన్ని కూడా ఫలశ్రుతి పేరుతో తెలిపారు.
ఉదాహరణకి "రోగదోషాలు లేకుండానూ, సత్సంతానంతో అష్టైశ్వర్యాలు పొందుతారు" అనే ఫలశ్రుతితో గణేశ పంచరత్నాలు అందించారు.
శారదా, లక్ష్మీ, పార్వతీ దేవతా స్తోత్రాలు
ఈ శక్తులకి సంబంధించి
- శ్రీ శారదాభుజంగ ప్రయాతాష్టకమ్,
కనకధారాస్తవమ్,
భ్రమరాంబాష్టకమ్,
అన్నపుర్ణాష్టకమ్,
శ్రీ త్రిపురసుందర్యష్టకమ్,
శ్రీరాజరాజేశ్వరష్టకమ్,
లలితాపంచరత్నం,
మహిషాసురమర్దనీ స్తోత్రమ్,
సౌందర్యలహరి వంటివి - వివిధ ఫలితాలు పొందేలా, స్త్రీమూర్తులను స్తుతిస్తూ స్తోత్రాలు అనుగ్రహించారు.
విష్ణు సంబంధిత స్తోత్రాలు
వివిధ అవతారాలతో సహా విష్ణు సంబంధ స్తోత్రాలు అనేకం వారు అందించారు.
- నారాయణ స్తోత్రమ్,
గోవిందాష్టకమ్,
అచ్యుతాష్టకమ్,
శ్రీకృష్ణాష్టకమ్,
పాండురంగాష్టకమ్,
శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్,
శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రమ్ అనేవి వాటికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు.
శివునికి సంబంధించిన స్తోత్రాలు
- భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలనీ పేర్కొన్న ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రమ్,
శివ పంచాక్షరీ నక్షత్రమాలా స్తోత్రమ్,
శివానందలహరి,
శివభుజంగ ప్రయాత స్తోత్రమ్,
దక్షిణామూర్తి స్తోత్రమ్,
ఆదిదంపతులకి సంబంధించి ఉమామహేశ్వర స్తోత్రమ్, అర్ధనారీశ్వర స్తోత్రమ్ మొదలైనవి.
ఇతర దేవతా స్తోత్రాలు
- ఇహపర సుఖాలకి భక్తసులభుడు ఆంజనేయస్వామిపై హనుమత్పంచరత్నాలు,
శ్రీఆంజనేయ భుజంగ స్తోత్రమ్
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగమ్ మొదలైనవ అనుగ్రహించారు.
ఏదో ఒక దేవతనిగానీ, కొంతమంది దేవతలనుగానీ, అందరు దేవతలనూగానీ జనులు వారివారి ఇష్టాలతో స్తోత్రంచేసి, అవుసరమైన ఫలితాలు పొందేలాగా శంకరులు అనేక స్తోత్రాలు అందిచ్చారు.
దీనిద్వారా మానవాళికి వారివారి ఇబ్బందులను తొలగించుకొనే అవకాశమూ, వారి కోరికలు సఫలమయ్యే మార్గము సులభంకావడమూ జరుగుతోంది.
http://www.kamakoti.org/kamakoti/stotras/Shankara%20Stotras%20nine%20scripts.html
కొనసాగింపు
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
వైశాఖ పురాణం - 07.
7వ అధ్యాయము - జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ
నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.
పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.
ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.
మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.
శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను యిరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.
శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను, సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన నది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట యిహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును?
తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు యీ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.
ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని యదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది యింద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందుచేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.
వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.
తే.గీ.పడతి నాలుగక్ష రములు పదము లోన
వనిత మొదటి వర్ణము బోవ వందన మగు
వెలది ఒకటిమూడును వేసవియగు
తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ
పి.మోహన్ రెడ్డి.
రేపు అనగా 8.5.2022 తేదీ రోజున ఆదివారం, సప్తమి, పుష్యమి నక్షత్రం కలసి ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.
"అమావాస్యేతుసోమేన సప్తమీ భానునాయుతా చతుర్థీ భౌమవారేణ సూర్యగ్రహణసన్నిభా:!స్నానందానంతథాశ్రాద్ధం సర్వంతత్రాక్షయంభవేత్!! తిథివార సమాయోగో యదాకాలేభవేదిహ/ప్రభాతేవాథ మధ్నాహ్న పుణ్యకాలన్సనాస్యదా ?
తా॥ సోమవారముతోగూడిన ఆమావాస్య, ఆదివారముతోగూడిన సప్తమి, మంగళవారముతోగూడిన చవితి, బుధవారముతోగూడిన అష్టమి,
ఈ నాలుగింటికి మహాపర్వత యోగములు అని పేరు. ఇవి సూర్యగ్రహణతుల్యములు.
ఈరోజుల్లో చేసిన గంగాస్నానము, దానం జపం ఉపాసన శ్రాద్ధము.. మొ||వి అక్షయ ఫలాన్ని ఇస్తాయి.
శ్లో॥"" సంక్రాన్తిషు వ్యతీపాతే గ్రహణే చన్ద్రసూర్య్యయోః, పుష్యే స్నాత్వాతు జాహ్నవ్యాం కులకోటి: సముద్ధరేత్.." అని బ్రహ్మాణపురాణమ్"
పుష్యమి నక్షత్ర యుక్తమైన ఈ రోజు గంగా స్నానం
చేయడం వల్ల వంశం పావనం అవుతుందని అర్థం.
"శృణు రాజన్ ! ప్రవక్ష్యామి పుష్యస్నానవిధిక్రమమ్ యేన విజ్ఞాతమాత్రేణ విఘ్నా నశ్యని సన్తతమ్.. ఖానౌ పుష్యర చ పుష్యస్నానం నరశ్చరేత్, సౌభాగ్యకల్యాణకరం దుర్భిక్షమరకాపహమ్.. గ్రహదోషాశ్చ జాయనే యది రాజ్యేషు చేతయః, తదా పుష్యర్క మాత్రే తు కుర్య్యానాసా రేవ్ తల్
అంటూ శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దాన్ని బట్టి..
ఈరోజు చేసే గంగాస్నానం వల్ల ఎంతో కాలంగా ఉన్న విఘ్నాలు, గ్రహదోషాలు, ఆర్థిక బాధలు తొలగిపోయి సౌభాగ్య కళ్యాణ కరమైన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని అర్థం.
గౌతమఋషి తపస్సువల్ల గంగాదేవియే గోదావరిగా అవతరించి కాబట్టి ఈరోజు గోదావరి స్నానం.. వీలైనంత భగవత్ ఆరాధన, దానం వంటివాటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
గమనిక ఏమిటంటే.. ఇలాంటి ప్రత్యేక యోగాలు ఉన్న రోజుల్లో చేసే పాపాలు, లేదా తప్పుడు పనుల యొక్క దోషఫలం కూడా అనేక రెట్లుగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*గాజు - వజ్రం* *కధ*
*ఒక రాజ దర్బారు నిర్వహించబడుతోంది. శీతాకాలం కావడంతో దర్బారు బహిరంగ ప్రదేశంల్లో ఏర్పాటుచేయబడింది*.
*పెద్దల సభ అంతా ఉదయపు నీరెండలో కూర్చుని ఉన్నారు. రాజు సింహాసనం ముందు ఒక రాచరికమైన బల్ల ఉంది, దాని మీద కొన్ని విలువైన వస్తువులు పెట్టి ఉంచారు*.
*పండితులు, మంత్రులు, దివానులు అందరూ అక్కడ ఉన్నారు*. *రాజ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాడు*.
*అతను లోపలికి ప్రవేశించి, రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు, " మహారాజా! నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి*, *నేను వివిధ రాజ్యాలు తిరిగి అక్కడ ప్రతీ రాజుకు వాటిని చూపించాను, కానీ ఎవరూ వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు*. *అందరూ ఓడిపోయారు, నేను విజేతగా అన్నీ చోట్లకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను*.".
" *ఏమిటవి ?", అని రాజు కుతూహలంగా అడిగాడు*.
*అతను ఆ రెండు వస్తువులను రాజగారి బల్ల మీద పెట్టాడు. అవి రెండూ సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో, ఒకే రూపురేఖలతో, ఒకేలా ప్రకాశిస్తూ, అన్నీ వైపులా నుండీ, అన్నీ రకాలుగా ఒకేలా ఉన్నాయి*.
*రాజు వెంటనే, "ఈ రెండూ వస్తువులూ ఒకటే" అన్నాడు*.
*దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "అవును, అవి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ఒకటి చాలా విలువైన వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క*.
*కానీ వాటి స్వరూపం, వాటి రంగు ఒకే విధంగా ఉంటాయి; ఇప్పటి వరకు ఏది వజ్రమో, ఏది గాజు ముక్కో ఎవరూ గుర్తించలేకపోయారు*... *ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రం అని, మరొకటి గాజు అని చెప్పవచ్చు. ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే, నేను ఓటమిని అంగీకరించి*, *ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాలో నిక్షిప్తం చేస్తాను*.
*కానీ షరతు ఏమిటంటే, ఎవరైనా దానిని గుర్తించలేకపోతే, ఈ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి. నేను చాలా రాజ్యాల నుండీ ఇప్పటికి ఇలా మొత్తాన్ని గెలుపొందాను*”.
" *నేను దానిని పరీక్షించలేను",అన్నాడు రాజు*.
*దివాన్లు కూడా, "రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నందున మేము కూడా ధైర్యం చేయలేం*."
*ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు, అంత సమస్య కాదు, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది. అయితే రాజుగారి పరువు పోతుందేమోనని అందరూ భయపడి, ఎవరూ గుర్తించదానికి ముందుకురాలేకపోయారు*
*హఠాత్తుగా, ఆ ప్రదేశానికి ఒక మూలన చిన్న అలజడి మొదలయ్యింది*.
*ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు. "నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను ఇందాకటి నుండీ ఈ విషయాలన్నీ వింటున్నాను, అలాగే ఈ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి", అన్నాడు*.
*ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకుని, రాజును ఇలా అభ్యర్థించాడు, "నేను పుట్టుకతో అంధుడిని, అయితే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తద్వారా నేను కూడా నా తెలివితేటలను ఒకసారి పరీక్షించుకోవచ్చు. బహుశా నేను విజయం సాధించవచ్చునేమో* .... *ఒకవేళ నేను విజయం సాధించలేకపోయినా, మీరు ఎలాగూ పందెం ఓడిపోతున్నారు కాబట్టి అంతకుమించి వేరే కోల్పోయేదేమి ఉండదు*."
*అతని మాటలు రాజుకి అర్ధం అయ్యి ఒక అవకాశం ఇచ్చినందువల్ల నష్టం లేదని భావించాడు. రాజు తన ఆమోదం తెలుపుతూ, “సరే” అన్నాడు*.
*ఆ తర్వాత ఆ వృద్దుడికి ఆ రెండు వస్తువులను తాకించి, వీటిలో ఏది నిజమైన వజ్రం, ఏది గాజుముక్క అని అడిగారు*.
*ఒక్క క్షణంలో, ఆ వ్యక్తి, 'ఇది విలువైన వజ్రం, ఆ రెండవది కేవలం గాజుముక్క!' అని చెప్పాడు*.
*అన్నీ రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి, "అది నిజమే, నువ్వు బాగా గుర్తించావు.. నువ్వు చాలా గొప్పవాడివి...*ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని నీ రాజ్య ఖజానాకి ఇచ్చేస్తున్నాను", అన్నాడు*.
*అందరూ చాలా సంతోషించారు*. *వచ్చిన వ్యక్తి కూడా వజ్రాల నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా ఉన్నారని చాలా సంతోషించాడు*.
*వచ్చిన వ్యక్తి , రాజు, ఇతర ప్రజలందరూ ఒకే ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఆ అంధుడిని ఇలా అడిగారు, "నీవు కనీసం చూడలేవు కదా, ఇది వజ్రం, ఇంకోటి గాజు అని ఎలా గుర్తించావు*?"
*అంధుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, "అది చాలా తేలిక, ప్రభూ, మనమంతా ఇందాకటి నుండీ ఎండలో కూర్చుని ఉన్నాం. అలాగే ఈ రెండూ కూడా చాలాసేపటి నుండి ఎండలో ఉంచబడ్డాయి. రెండింటినీ ముట్టుకున్నాను. చల్లగా ఉన్నది నిజమైన వజ్రం. .. *వేడెక్కింది గాజు... అంతే*."
*జీవితంలో కూడా, ప్రతి చిన్న విషయానికి వేడెక్కిపోయినవారు, చిక్కుబడిపోతారు*, *బంధింపబడిపోతారు* ... *ఆ వ్యక్తులు"గాజు" వంటివారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చల్లగా (శాంతంగా, స్థిరంగా) ఉండేవాడు ... ఆ వ్యక్తి మాత్రమే "విలువైన వజ్రం"లాంటివారు*.
ॐ श्री शिवानन्दलहरी
శ్రీ శివానన్దలహరీ
SREE SIVAANANDALAHAREE
(श्रीमच्छंकरभगवतः कृतौ)
(శ్రీ శంకరాచార్య విరచితమ్)
(BY SREE AADI SANKARA)
శ్లోకం : 18/100
SLOKAM : 18/100
त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीं
वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः ।
कियद्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती
कदा वा मद्रक्षां वहसि करुणापूरितदृशा ॥ १८॥
త్వమేకో లోకానాం పరమఫలదో
దివ్యపదవీం
వహంత స్త్వన్మూలాం పునరపి భజంతే
హరిముఖాః I
కియద్వా దాక్షిణ్యం తవ శివ! మదాశా చ
కియతీ
కదా వా మద్రక్షాం వహసి
కరుణాపూరితదృశా ॥ -18
శంకరా!
సమస్తమైన వారికీ, నీవు ఒక్కడివే,
పరమఫలాన్ని - అంటే మోక్షాన్ని ఇచ్చేవాడవు.
నీవు కారణంగా దివ్యమైన పదవులు అనుభవిస్తున్నవారే అయినప్పటకీ,
విష్ణువు మున్నగువారు ఇంకా నిన్ను సేవిస్తూనే యున్నారు.
నీ దాక్షిణ్యం ఎంతటిదో కదా! అంటే అది చెప్పశక్యం కానిదీ, అపరిమితమైనదీ.
నా ఆశ ఏపాటిది? స్వల్పమైనదే కదా!
చల్లని చూపుతో మఱి నన్ను ఎప్పుడు రక్షిస్తావు?
(అంటే సంసారముక్తిని ఎప్పుడు కలిగిస్తావు?)
O Shankara!
You alone grant great blessings and holy status to the common people of the world,
But carrying the holy position,
granted by thy kindness great,
Vishnu and others pray you always for getting more and more such positions great.
Your grace my Lord is immeasurable and
my desire too is immeasurable,
And so when are you taking up the job of protecting me by your merciful glance?
విశేషం
దేవతలందరిలో పరమఫలాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒక్కడే!
దాన్ని పొందడంకోసం ఎంతటివారైనా ఆయనని ఆశ్రయింపవలసిందే!
పరమేశ్వరుని అనుగ్రహంచేతనే గొప్ప పదవులలో అంటే సృష్టి - స్థితి వ్యాపారాలలో ఉంటున్నప్పటికీ, బ్రహ్మ - విష్ణువు మరల మరల ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నారు.
పదవులు ఎంత విశిష్టమైనవి అయినప్పటికీ అశాశ్వతాలే!
పుణ్యం క్షీణింపగానే పదవి కోల్పోయి,
ఎంతటివాడైనా మళ్ళీ మర్త్యలోకంలో పుట్టి సంసార యాతనలు అనుభవింపక తప్పదు.
"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అని భగవద్గీతా వాక్యం.
కాబట్టి అత్యున్నతమైన పదవిలో ఉంటున్నప్పటికీ పరమేశ్వర సాయుజ్యాన్నే కోరుకోవాలి.
దానికి ఆయనని ఆరాధింపక తప్పదు.
అనంతమైన విశ్వంలో భక్తుని స్థానం ఎంతో చిన్నది.
ఈ సంసార బంధాలనుండి ముక్తిని పొందాలన్న అతని కోరికకూడా అత్యంత అల్పమైనదే.
కాబట్టి అతడు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే,
ఆ స్వామి తప్పక కరుణార్ద్రమైన దృష్టితో భక్తుని రక్షిస్తాడు.
https://youtu.be/h8qlcoPKG5o
కొనసాగింపు..
=x=x=x=
సేకరణ, కూర్పు :
రామాయణం శర్మ
భద్రాచలం
భాష్యపాఠం చెప్పిన స్వామివారు
దాదాపు ఇరవైఅయిదు సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు సతారాలోని శ్రీ శంకర మఠంలో పదకొండు నెలల పాటు మకాం చేశారు.
అప్పుడు మా నాన్నగారు శ్రీ కాశీనాథ శాస్త్రి గారు మహాస్వామి వారి నోటి నుండి ప్రస్థానత్రయ (ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత) భాష్యం వినాలన్న తమ కోరికను స్వామివారికి విన్నవించారు.
అందుకు స్వామివారు, “అలాగే భవిష్యత్తులో చూద్దాం” అని తెలిపారు.
రెండు నెలలు గడచిన తరువాత, స్వామివారు మమ్మల్ని పిలిచి, భాష్య పుస్తకాలను తెప్పించుకుని, వాటిని వివరించడం మొదలుపెట్టారు. శ్రీ రాజగోప అయ్యర్ అనే వారొకరు ప్రతి ఉపనిషత్తు నుండి మొదటి వాక్యాన్ని మాత్రం చదివేవారు. స్వామివారు ఆ ఉపనిషత్తుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా ఎందఱో భాష్యకారుల భాష్యాన్ని ఉదహరిస్తూ తెగిన ఆనకట్ట నుండి పారే నీటిలా విస్తారంగా వివరించేవారు. ప్రతి రోజూ ఏడుగంటల పాటు ఈ భాష్యపాఠం కొనసాగేది. మాపై పరమాచార్య స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని తెలపడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?
ఈ సుదీర్ఘ ఉపన్యాసాలు పన్నెండు రోజులపాటు సాగి చివరకు పరిసమాప్తమయ్యాయి. కేవలం పరమాచార్య స్వామివారు ఒక్కరే ఏడుగంటల పాటు పాఠం చెప్పేవారు. ఆశర్యపోయే విశ్స్యం ఏంటంటే, ఏమాత్రం శ్రమ లేకుండా చెప్పడమే కాకుండా ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంతో పాఠం చెప్పేవారు.
ఈ ఉపకారానికి మేము ఎన్ని జన్మలు ఎత్తి మహాస్వామివారికి సేవ చేసుకోవాలో.
స్వామివారి దర్శనానికి ప్రతిరోజూ ఒక కళాశాల అధ్యాపకులొకరు వచ్చేవారు. కాని అతను ఎన్నడూ స్వామివారికి తనను పరిచయం చేసుకోవడం కాని, మాట్లాడడానికి ప్రయత్నించడం చేయడం కాని చేసేవాడు కాదు. బహుశా స్వామివారి దర్శనమే తనకి అపరిమిత ఆనందాన్ని కలిగించేదేమో.
అయిదారు నెలల తరువాత ఒకరోజు స్వామివారు అతణ్ణి చూసి, “నువ్వు ఇప్పుడు ఇక్కడకు వచ్చావేమిటి?” అని అడిగారు స్వామివారు.
అతను ఆశ్చర్యంతో, “నేను ఇక్కడకు రోజూ వస్తున్నాను పెరియవా” అని బదులిచ్చాడు.
మహాస్వామివారు మరలా అదే ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న పరమార్థం ఏమిటో అతనికి అర్థం కాక అయోమయంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలోకి అడుగుపెట్టగానే, నేలపై పడ్డ ఒక ఉత్తరం కంటపడింది. దాని తీసుకుని చదివాడు. “చాలా ముఖ్యమైన సమాచారం. వెంటనే ఫలానా ప్రాంతంలో ఉన్న ఫలానా కళాశాలకు వెళ్లి నీ పని మొదలుపెట్టు” అన్నది సారాంశం.
ఆ ఉత్తరంలో ఉన్న విషయం ఏమిటో మహాస్వామివారికి ముందే ఎలా తెలుసు? ఏమైతేనేమి, ఆ అధ్యాపకుడు పెట్టెబేడా సర్దుకుని ఇంకో ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.
పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోట విపరీతంగా నల్లులు చేరాయి. ఎక్కడ కాలు పెడితే అక్కడ నల్లులు ఉన్నాయి. కొన్నిసార్లు మహాస్వామి వారి శరీరంపై కూడా తెనేపట్టుని అంటుకున్న తేనెటీగల గుంపులా అధిక మొత్తంలో నల్లులు గుంపులుగుంపులుగా ఉండేవి.
వాటిని చంపడానికి ఒక భక్తుడు క్రిమిసంహారక మందును తెచ్చాడు. మహాస్వామివారికి ఈ విషయం తెలిసి ఆ భక్తుణ్ణి పిలిచారు.
“మన శరీర పోషణం కొరకు మనం ఆహారం తీసుకుంటాము. నల్లులకు మనుష్య శరీరంలో ఉన్న రక్తమే ఆహారం. నల్లులు తమకు తామే ఆహారాన్ని తీసుకుంటాయి. ఆహారం లేకపోతే అవి ఎలా బ్రతుకుతాయి? నిజమే కదా?” అని అడిగారు.
“బ్రతికున్నవాటికి జీవహింస జరగరాదు. మనకు ఏదైనా సహాయం చేసేవారిపై మనం ఇష్టం కలిగిఉండడం గొప్ప విషయమేమీ కాదు. మన పెద్దలు చెప్పినట్టు మనకు అపకారం చేసేవారిని కూడా అమనం ఇష్టపడగలిగే వారే ధర్మాత్ములు”
ఈ మాటలు విన్న తరువాత ఆ భక్తునికి పరమాచార్య స్వామివారి గదిలో ఆ క్రిమిసంహారక మందును చల్లడానికి మనస్సు ఉంటుందా?
ఆశ్చర్యపరిచేది ఇది కాదు. ఈ సంభాషణ జరిగిన ఒకట్రెండు రోజుల తరువాత ఆ గదిలో నుండి నల్లులు మాయమైపోయాయి - ఇది అద్బుతాలకే అద్భుతం అంటే.
--- బ్రహ్మశ్రీ కృష్ణ శాస్త్రి జోషి, శ్రీ శంకర మఠం, సతారా. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
ॐ శంకరజయంతి శుభాకాంక్షలు
శంకర జయంతి ప్రత్యేకం - 7
( ఈరోజు వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )
శంకరుల అవతారం
6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు
ఇతర మతాలలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్కటే గ్రంథం. సాధనలో ఏ స్థాయివారికైనా ఒకటే పద్ధతి తప్పని సరి.
కానీ హిందూత్వం - వివిధస్థితులలో, స్థాయిలలో ఉన్నవారికి సాధనలో వారిస్థాయి ఎరిగి, ఆ పైస్థితికి చేరుకునేందుకు సాహిత్యం వివిధ రకాలుగా ఉంటుంది.
జగద్గురువులు ఈ విషయానికి సంబంధించి, గ్రంథాలను మూడు రకాలుగా వర్గీకరించి అందించారు. అందులో
అ) స్తోత్రాలు:— సామాన్యులకు కూడా ఇహలోక సుఖంతోనూ, మోక్షము సులభంగా పొందేలాగానూ వివిధ దేవతలని స్తుతిస్తూండేవి స్తోత్రాలు.
శంకరులు అందించిన అనేక దేవుళ్ళమీద అనేక స్తోత్రాలతోపాటు శివానందలహరి, సౌందర్యలహరి వంటివి ఈ కోవలోకి వస్తాయి.
ఆ) ప్రకరణ గ్రంథాలు:— విశేషమైన శాస్త్ర జ్ఞానంలేక, కొద్ది అవగాహనగల మధ్యస్థాయి వారికోసం ఉద్దేశింపబడినవి.
పైస్థాయికి చెందిన జ్ఞాన సంబంధ విషయసారాన్ని గ్రహించి మరింత ఉన్నత స్థాయికి చేర్చే - ఆత్మబోధ,అపరోక్షానుభూతి, వివేకచూడామణి మొదలైనవి జగద్గురువులందించిన రెండవ కోవకు చెందినవి.
ఇ) భాష్యాలు:— మూడవ భాగంగా, శాస్త్ర పండితులకు మాత్రమే అధ్యయనం చేయడానికి సాధ్యమయ్యే వ్యాఖ్యాన గ్రంథాలు భాష్యాలు.
వివిధ శాస్త్ర సంప్రదాయాలతో సమన్వయిస్తూ శ్రుతి స్మృతులలోని వాక్యాలనుదహరిస్తూ, అద్వైత సిద్ధాన్తాన్ని బలపరుస్తూ శంకరభగవత్పాదులు భాష్యాలు రచించారు.
బ్రహ్మసూత్రాలుగా పిలువబడే శారీరక మీమాంసా, ఉపనిషత్తులు,భగవద్గీతపై వ్రాసిన భాష్యాలని ప్రస్థానత్రయంగా పిలుస్తారు. ఆ భాష్యాలను శంకరులు అనుగ్రహించారు. ఇవి గొప్ప శాస్త్రజ్ఞానంగల పండితుల స్థాయికి అవుసరమైనవి.
ఇట్లా సాధారణ, మధ్య, పాండిత్య స్థాయిలలో మూడు రకాల సాహిత్యాన్ని అనుగ్రహించారు శంకరులు.
తద్వారా ఏ స్థాయిలవారైనా, మూడంచెల మార్గం ద్వారా మూడుమెట్లు ఎక్కి ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం కల్పించారు.
కొనసాగింపు
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
ॐ శంకర జయంతి ప్రత్యేకం - 6
( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )
శంకరుల అవతారం
5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం
ఈ రోజుల్లో, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్చన/ప్రార్థన/ఆరాధన విధానాన్ని ఒక్కొక్కరు తీసికొనివస్తున్నారు. అనేక సందర్భాలలో ఇతర దేవతారాధనలని నిరసించడం కూడా చూస్తూన్నాం.
మిగతా విధానాలపై కనీస అవగాహనలైనాలేక, తమదే సర్వస్వమనుకునే అనేక వర్గాలు తయారవుతున్నాయి.
యాంత్రిక జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో, శాస్త్రంపై సరియైన అవగాహనలేకుండానూ,
వారివారి పద్ధతులు మాత్రమే సరియైనవి అనినమ్మే ఆధునిక గురువుల విధానాలపై అందరూ ఆధారపడుతున్నారు.
పూర్వపురోజుల్లో ఏ యతి వచ్చినా,
చాతుర్మాస దీక్షకై, సంచారము ఆపి, ఆయా ప్రదేశాలలో ఆగిపోయినా,
ఆ ప్రాంతాలవారు సాంప్రదాయ భేదాలేవీలేకుండా, అందరూ ఆ యతిని దర్శించుకోవడం, వారిచ్చే సందేశం వినడం, పాదపూజలు చేయడం జరిగేవి.
దీనికి సరియైన కారణం జగద్గురువుల దృక్పథం.
వివిధ ఆరాధనలు - పంచాయతనం
ఆదిశంకరులు ఆ రోజులలోనే వివిధ ఆరాధనా విధానాలని సమన్వయపరచి, పంచాయతన పూజావిధానం ద్వారా అన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చారు.
దాని ద్వారా తత్త్వాన్ని తెలుపుతూ సమైక్య ఆరాధనా విధానాన్ని పటిష్ఠవంతంగా స్థిరపరిచారు.
పంచశీర్షాలు
గణపతి అథర్వశీర్షం,
సూర్య అథర్వశీర్షం,
నారాయణ అథర్వశీర్షం,
శివ అథర్వశీర్షం,
దేవీ అథర్వశీర్షం
- అనే ఐదు ప్రామాణికాలలో,
మొదటి నాల్గిటిలో "సృష్టి స్థితిలయా"లకి సంబంధించి ఒకే లక్షణాలు వర్ణించబడ్డాయి.
నాల్గవదైన దేవీ అథర్వశీర్షంలో మరింత ప్రత్యేకత కనిపిస్తుంది.
ఈ ఐదు దైవాలకి సంబందించి, దేశంలో ప్రధానంగా ఐదు ఆరాధనలు ఉన్నాయి.
అవి, గాణాపత్య, సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ అనే ఐదు మతాలకి చెందినవి.
పంచభూతాలు - ఐదుగురు దేవుళ్ళు
పంచభూతాలతోనే ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ఐదు శక్తులూ ఐదు దేవతలకి సణబంధించినవిగా ప్రతిపాదింపబడ్డాయి.
అవి
* శక్తి(పృథ్వి - భూ),
* గణపతి(ఆపః - నీరు),
* సూర్యుడు(తేజః - అగ్ని),
* విష్ణువు(వాయుః - గాలి),
* శివుడు(ఆకాశః)గా పంచభూతాలతో అన్వయించబడ్డాయి.
పరమాత్మ ఒక్కొక్క కల్పంలో పంచభూతాలలో ఒక్కొక్కదానిని ఆధారంగా చేసికొని, ఒక్కొక్క రూపాన్ని ధరిస్తాడు.
ఒక కల్పంలో వ్యాపకుడుగాయున్న విష్ణువై అవతరించాడు. ఆ కల్పంలో పరబ్రహ్మను నారాయణుగా స్తుతించారు. ఆ రూపంలో ఆయననర్చించిన ఉపాసకులు వైష్ణవులయ్యారు. నారయణ సూక్తం వంటివి ఆయనని స్తుతిస్తాయి.
అలాగే మరొక కల్పంలో సూర్యుడు అరుణంవంటివాటితో స్తుతించబడ్డాడు.
మరొక కల్పంలో అమ్మవారు శక్తిగా ఆరాధింపబడుతుంటే, మేధాసూక్తం,శ్రీసూక్తం వంటివి అమ్మవారిని కీర్తించాయి.
శివుని రుద్రంతో ఒక కల్పంలోనూ,
గణపతిని గణపతి సూక్తంవంటివాటితో మరొక కల్పంలోనూ స్తుతించారు.
పరమాత్మ వివిధ కాలాలలో వివిధ రూపాలుగా అవతరించినా, అన్నిరూపాలనీ ఎల్లప్పుడూ మనం ఉపాసించడం విశేషం.
ఐదు మూర్తులనీ ఒకేచోట చేర్చి, తాను ప్రధానంగా ఉపాసించే దేవతని మధ్యలోనూ,
మిగిలిన నలుగురినీ నలుమూలలానూ ఉంచి, ఆరాధించే పంచాయతనాన్ని శంకరులు ఎంతగొప్పగా సమన్వయపరిచారో కదా!
ఈ విధంగా ఐదు రకాల ఆరాధనలలో, ఐదురకాల కేంద్రాలతో (Vishnu centric, Siva centric, Devi centric, Sun centric and Ganesh centric), ఐదుగురు దేవతలనూ కొలవడం అత్యంత ఆవశ్యకం.
పంచభూతాలు - ప్రపంచము - పాంచభౌతిక దేహము
పంచభూతాలూ ఒక్కొక్కదానిలో సగభాగం (1/2), మిగిలిన నాలుగూ కలిసి (1/8+1/8+1/8+1/8=1/2) సగంగా ఉంటాయి. దానిని పంచీకరణము అంటారు.
ఆ ఐదూ కలిస్తేనే ప్రపంచం.
పాంచభౌతిక దేహం కూడా ఆ ఐదిటి కలయికే!
ఐదూ కలిస్తేనే దేహం, ప్ర-పంచమూ కూడా కదా!
వేదప్రతిపాదిత ఈ విధానాన్ని వెలికితీసి, ఆనాడే మనకి అందించిన శంకరుల అవతారం ఎంత విశిష్టమైనదో కదా!
కొనసాగింపు
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం