17, ఆగస్టు 2023, గురువారం

32 గణపతుల మూర్తులు*

 *32 గణపతుల మూర్తులు* 



1.బాలగణపతి, 

2.తరుణ గణపతి, 

3.భక్తిగణపతి, 

4.వీరగణపతి, 

5.శక్తిగణపతి, 

6.ద్విజగణపతి, 

7.సిద్ధగణపతి, 

8.ఉచ్చిష్టగణపతి, 

9. విఘ్నగణపతి, 

10.క్షిప్రగణపతి, 

11.హేరంబగణపతి, 

12.లక్ష్మీగణపతి, 

13.మహాగణపతి, 

14. విజయగణపతి, 

15.నృత్తగణపతి, 

16.ఊర్ధ్వగణపతి, 

17.ఏకాక్షరగణపతి, 

18.వరగణపతి, 

19.త్య్రక్షరగణపతి, 

20.క్షిప్రదాయకగణపతి, 

21.హరిద్రాగణపతి, 

22.ఏకదంతగణపతి, 

23.సృష్టిగణపతి, 

24.ఉద్దండ గణపతి, 

25.ఋణవిమోచక గణపతి, 

26.డుంఢి గణపతి, 

27.ద్విముఖ గణపతి, 

28.త్రిముఖగణపతి, 

29.సింహగణపతి, 

30.యోగ గణపతి, 

31.దుర్గాగణపతి, 

32.సంకటహరగణపతి.(ముద్గల పురాణం ప్రకారం )


*శుభ శుభోదయం*


🙏🙏🐀🙏🙏🐀🙏🙏

సంగమేశ్వర-శివాలయం

 



శ్రీశైలం ఆనకట్ట బ్యాక్-వాటర్సవద్ద కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశలోని కర్నూలు-జిల్లాలో సంగమేశ్వర-శివాలయం గలదు౹ ప్రతి-సంవత్సరం వర్షాకాలంలో (జూలై 2వ-వారం) ఆలయం దాదాపు 6నెలలపాటు బ్యాక్-వాటర్లో పూర్తిగా మునిగిపోతుంది మరియు జనవరి-ఫిబ్రవరి నుండి నీటిలోనే ఉంటుంది. (ఈ ఏడాది జులై 20న మునక)౹

ఈ వీడియోలో ఆలయం-మునగకముందు ఆలయ-పూజారి తుదిసారిగా శివలింగానికి అభిషేకం-చేస్తున్నారు. క్షణక్షణం నీటిమట్టం పెరుగుతున్నప్పటికీని శివలింగం పూర్తిగా-మునిగిపోయేలోపు పూజారి భక్తుల-సమక్షంలో భక్తిశ్రద్ధలతో పూజలు-హారతి-అభిషేకాదులు నిర్వహించారు౹ తరుఫరి పూజారిని భక్తులు తాము సిద్ధంచేసిన-పడవలో అవతలి-ఒడ్డుకు చేరుకుంటారు౹ భక్తిపూరిత సుందర-దృశ్యం॥🙏🏽🙏🏽

బొట్టు" లేకుండా హిందువు

 🛑 "బొట్టు" లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు స్మశానం లా ఉండకుండా చూసుకో! నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి Fashion అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని అర్థం.

🛑 చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది పూర్ణత్వానికి చిహ్నం!


🔴 విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో!        అది   ఐశ్వర్యానికి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!

🩸నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను ఉన్నతస్థితికి చేరుకోమనీ అంటోంది!

🔴 కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది సౌభాగ్యానికి సోపానం!

🔴 సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. 

🔴 కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు!  బొట్టుపెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టుపెట్టుకున్న నీముఖం

చూసినవారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని నువ్వు అడగకపోయినా  చేసిపెడతారు. కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో!🙏🙏

జీవితంలో కృతార్థులు అయినట్టే.*

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 ll *శ్లోకం* ll


*వాణీ రసవతీ యస్య,*

*యస్య శ్రమవతీ క్రియ౹*

*లక్ష్మీ ః దానవతీ యస్య,*

*సఫలం తస్య జీవితం౹౹*


# *భావం* #


 *ఎవరి మాట మనసుకు ఆనందాన్నిస్తుందో, ఎవరైతే కష్టం విలువ తెలిసి పైకి వస్తారో, ఎదుటి వారి కష్టాన్ని గుర్తిస్తారో, ఎవరి ధనం దాన ధర్మాలకు, మంచి కార్యాలకు ఉపయోగపడుతుందో, వారు జీవితంలో కృతార్థులు అయినట్టే.* 


🧘‍♂️🙏🪷 ✍️🙏

చిత్తము చంచలమ్ము

 ఉ.

చిత్తము చంచలమ్ము సరసీరుహలోచనలందు సంచరిం 

చత్తఱి గీర్తి గోరు నిక నందల మెక్కగ జూచు చెచ్చెరన్ 

విత్తము గూడబెట్ట పెనుబేహరముల్ నడుపంగ నోపు నిం 

కెత్తఱి నిన్ను దల్చును మహేశ్వరి బ్రోవగదమ్మ ప్రేముడిన్ 

*~శ్రీశర్మద*

గురువులు

 *ఎంతమంది - గురువులు...???*

💅💅💅💅💅💅💅💅💅


*1. సూచక గురువు :


బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో. 

నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. 

వీరిని సూచక గురువు అంటారు, వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.


*2. వాచక గురువు :


ధర్మా ధర్మ విచక్షణ, మంచి చెడు విశ్లేషణ, చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు.

(భ్రహ్మచర్యము, గృహస్త్దము, వానప్రస్దానం, సన్యాసం). 

వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తావు.


*3. భోధక గురువు :


మహా మంత్రాలను ఉపదేశిస్తారు. 

లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని, అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని. 

వీరిని భోధక గురువు అంటారు, లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు...ఆదిత్యయోగీ..


*4. నిషిద్ద గురువులు :

మారణ ప్రయోగాలు, వశికరణాలు, వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు.

ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది.

చిత్తాన్ని శుద్ధి చేయరు, విత్తాన్ని హరిస్తారు. 

పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.


*5. విహిత గురువు :


మన హితము కోరి సూచనలు సలహాలు ఇస్తారు, నశించి పోయే విషయ భోగాలు

పై ఆశక్తి తగ్గించి, సత్యమైన శాస్వితమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు. 

ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ తో జివింపచేస్తారు.ఆదిత్యయోగీ.


*6. కారణ గురువు :


ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. 

ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు.

నిత్యం ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటారు.ఆదిత్యయోగీ..


*7. పరమ గురువు :


ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు, శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు. 

వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. 

నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. 

నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదల కు మార్గం చూపేవారు పరమ గురువు...


*ఏ ఒక్కటీ అడక్కు!*


బాల్యం నుంచీ మనిషి ఎదిగిన కొద్దీ కోరికలు పెరుగుతుంటాయి. వాటిలో మంచివీ ఉంటాయి. చెడువీ ఉంటాయి. కొన్ని ధర్మ బద్ధమైనవి. కొన్ని అశైలికమైనవి. ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని పదకాలు వేస్తాడో, ఎన్ని దారుల్లో వెడుతూంటాడో చెప్పలేం. 


ప్రతి కోరికా సుఖమిస్తుందని భ్రమ పడతాడు. శ్రమపడకుండా కోరికలు తీరాలని తాపత్రయ పడుతుంటాడు. ఎవరివల్లా కోరికలు తీరకపోతే ఇక దేవుడి వెంటపడతాడు. కోరికల విలువను బట్టి మొక్కులు చెల్లిస్తుంటాడు. ఒక కోరిక తీరగానే మరొకటి పుట్టుకొస్తుంది. దాని కోసం వ మొక్కుతాడు. కోరికలు తీరడంకోసమే తీర్ధయాత్రలు చేస్తాడు. టెంకాయలు కొడతాడు. అర్చనలు, అభిషేకాలు, యాగాలు, ప్రదక్షిణలు, దక్షిణలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు... ఇలా ఎన్నెన్నో.. చేస్తూనే ఉంటాడు.ఆదిత్యయోగీ..


 కోరికల్లో ఏ ఒక్కటి తీరకపోయినా విపరీతమైన ఆవేదన, అశాంతి, దుఃఖం, దిగులు వీటితో కుంగిపోతూంటాడు. ఎదుటి మనిషిని ఏదైనా అడిగినవాడు సగం చనిపోయిన వాడితో సమానమని, ఎవరైనా తన ముందు చేయిచాచితే 'లేదు' అన్నవాడు పూర్తిగా O చనిపోయిన వాడితో సమానమని అంటాడు హింద్ కవి రహీమ్. అడిగినవాడి లక్షణమూ చెప్పాడు. లేదు పొమ్మని అనేవాడి లక్షణమూ చెప్పాడు. 


- ధార్మిక నిష్టతో కూడిన మన కోరికలు తీర్చేవాడు సర్వాంతర్యామి ఒక్కడే. అది తెలిసికూడా స్వామిని కోరికలు తీర్చమని వేడుకోవడం అవివేకం. మనకు యోగం ఉంటే భగవత్ కృపాప్రసాదం లభిస్తుంది. దేనివల్ల చెడిపోతామో అది దేవుడు ఇవ్వడు. బుద్ధి చాంచల్యం కలిగినప్పుడు వినాశకాలం దాపురించినట్లే! ప్రారబ్ధ దుఃఖాలు అనుభవిస్తూ దేవుణ్ని నిందించి ప్రయోజనం లేదు.


జ్ఞాని అయినవాడు తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరిస్తాడు. సుఖాలకు పొంగిపోడు, దుఃఖాలకు కుంగిపోదు. సంతృప్తితో జీవిస్తున్నవాడికి కోరికలు కలగవు. సాటి మనిషినే కాదు, పరమాత్మను కూడా ఏమీ అడగడు. భగవన్నామస్మరణ తన ధర్మం అనుకుంటాడు. భక్తి బాందవ్యమే తన జీవన కావ్యంగా భావిస్తాడు. దైవసన్నిధే తనకున్న పెన్నిది. అని ఆనందిస్తాడు.


'భగవద్భజనకు తావులేని మోక్షం నాకెందుకు

స్వామీ?' అని అడిగిన రామదాసు భక్తి పారవశా వి

భాష్యం చెప్పగలమా! అది నిష్కామ భక్తి,


ఆనందాశ్రువులతో తడిసిన భక్తి. అడగకుండానే అమ్మ అన్నం పెడుతుంది. అడగకుండానే నాన్న హితవు. నడత చెబుతాడు. అడగకుండానే గురువు బోధిస్తాడు. మానవ జన్మకు ఇంతకుమించి కావలసిందేముంది! 

దారి కనబడింది.. ప్రయాణం చేయడం, గమ్యం చేరడం మన బాధ్యత. 

లక్ష్యం అందుకోవడం మన చేతిలోని పని. 

మన కృషి మీద ఆధారపడి ఉంది. 

ఇంకా ఏమిటో, ఎవరినో అడగమేమిటి? 

అది అజ్ఞానం, అలసత్వ అవివేకం.

 ఎవరినీ ఏమీ అడగవద్దు. 

అందులోనూఅందదగింది అందుతుంది. 

అందకూడనిది అందదు!..


*మన దృష్టి కోణమే మన జీవితం*

~~~~~~


నీవు దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి లలో దేనిని కలిగి ఉన్నావు?


ఒక్కో మనిషి దృష్టి కోణం, వ్యక్త పరచిన భావాల వల్ల ఆవ్యక్తి ఏ స్థాయిలో ఉన్నడో  పెద్దలు పసిగడుతుంటారు.


ముఖ్యంగా గురువులు / ఆచార్యులు తమ శిష్యులను తమ దగ్గర ఉంచుకొని విద్య బోధించేటప్పుడు ఈ విషయాన్ని వారి శిష్యులకి తెలీకుండా పరీక్ష చేసి తగు విధంగా వారికి శిక్షణని ఇచ్చేవారు.


ఇది దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని మూడు రకాలు. ఇందులో ఆత్మదృష్టి అత్యుత్తమమైనదీ, దేహదృష్టి అథమము / కనిష్టమైనది.


ఒక వ్యక్తి అలా మన ముందు నుంచి వెళ్తుంటే అబ్బా భలే ఉన్నాడురా ఒడ్డూ, పొడుగూ, ఆ వంటి రంగూ, వేసుకున్న చక్కని బట్టలూ అని ఆనందించే వారుంటారు. వారికి ఆ దృష్టి ద్వారా కట్టు, బొట్టు, జుట్టు, బట్ట, కులం, రంగు, సౌందర్యం, ఇవి మాత్రమే వారి దృష్టికి అందుతాయి. ఉదాహరణకి ప్రవచనాలు వినడానికి వచ్చి ప్రవచనకర్త భౌతికాకారాన్ని చూసి పొగిడేవారు కొందరు. ఆయన ఏం చెప్పారు అన్నదాంతో సంబంధం ఉండదు.

ఏం విన్నారో ప్రవచనం అయ్యాక గుర్తు ఉంటుందా అంటే పూర్తిగా ఉండదు. వీరిది స్థూల / భౌతిక / దేహదృష్టి. వీరి దృష్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూనే ఏది లేదా అని వెతుకుతూ ఉంటారు.


ఇంకొకరు ఒక వ్యక్తిని చూస్తూనే ఈయన పండితుడిలాగా ఉన్నాడు అని తలచి ఆ వేపున కాస్త పరిశీలించి అబ్బా గొప్ప పండితుడు అని సర్టిఫికేట్లిస్తారు.


చూసావా ఆ పంచె కట్టు ఆ వీబూధి బొట్టు, ఆ గడ్డం అదీనూ బహుశా ఈయన కవి ఏమో, లేదా ఉపాసకుడేమో అని వారికి వారే పరి పరివిధాలా పరిశీలించుకొని ఆ వ్యక్తిని ఏదో ఒక పాండిత్యానికి అంటగడతారు.


ఇలా చెప్పే వారు బోలెడు మంది. అబ్బా ఏం గుర్తు పెట్టుకుంటారండీ అనో, భలే చెప్తారండీ అనో, అబ్బా పద్యాలు ఏం చెప్పారండీ అనో, అన్ని పురాణేతిహాసాలు అన్నీ ఆయనకి కంఠతా అనో, అలా ఏదో ఒక సర్టిఫికేట్లిచ్చేవారుంటారు. వారు రెండవ కోవకి చెందినవారు. అలానే వీరూ అంతే అన్నీ బాగున్నాయంటూనే అదిగో చూసారా అక్కడ సరిగ్గా చెప్పలేదు అదీ ఇదీ అని లెక్కలు కడతారు.


ఇక అతి కొద్ది మంది ఉంటారు, ఓ వ్యక్తికి దగ్గరనుంచి అలా వెళుతుంటేనే అవతల వ్యక్తిలోని పరబ్రహ్మాన్ని చూసి నమస్కరిస్తారు. ఆ వ్యక్తిని చూడగానే అసంకల్పితంగా వారి రెండు చేతులూ ముకుళించుకుంటాయి. మరో మాట ఉండదు, ప్రశ్నా ఉండదు, అక్కడ ఉండేది ఆనందం ఆత్మానందం. ఆ ఆత్మదృష్టి అలవడాలనే ప్రతి ఒక్కరూ సాధన చేసేది..


రాధాదేవి ప్రాధాన్యత గురించి తెలుసా!


రాధాదేవి ప్రాధాన్యత గురించి తెలుసా! అమ్మవారిని ఆశ్రయిస్తే చాలు. సర్వులూ సులభంగా ముక్తిని పొందగలరు. భక్తిలో సర్వులూ అర్హులే. అమ్మ యొక్క ఏ నామాన్నైనా, ఏ రూపాన్నైనా, ఏ స్తోత్రాలనైనా జపించి, తపించి, స్తోత్రించి తరించవచ్చు.   ఆదిత్యయోగీ..


ఇందులో ఒకటి రాధాదేవి స్వరూపం. రాధాదేవి ఉపాసన దక్షిణాపథంలో అంత వ్యాప్తిలో లేదు. కేరళ రాష్ట్రంలోని గురువాయూరు క్షేత్రంలో నారాయణుణ్ణి ఉపాసించిన నారాయణ భట్టాద్రి 'నారాయణీయం' గ్రంథంలో రాధాదేవి రహస్యాలు వ్రాశారు. అందువల్ల దక్షిణాపథంలో ఇది లేదని అనలేం.


కానీ విస్తృతంగా వ్యాపించింది ఉత్తరాదిలో! కారణం - "బృందావనం.' అనారాధ్య రాధా పదాంభోజ యుగ్మం అనాశృత్వ బృందావనం తత్ పదాంకం.... కథం శ్యామసింధౌ కృత్స్న రస శ్యామ గాహః - రాధాదేవిని ఆరాధించకుండా, బృందావనాన్ని ఆశ్రయించకుండా, కృష్ణ కథను చదవకుండా ఆ కృష్ణ సముద్రంలో ఎవరు మునగగలరు!...


రాధానుగ్రహం లేనిదే కృష్ణానుగ్రహం లేదు. దుర్గ అనగానే శివుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మి అనగానే విష్ణువు. సరస్వతి అనగానే బ్రహ్మ.


గాయత్రికి బ్రహ్మ అని చెబుతారు (వేదస్వరూపిణి కనుక చతుర్ముఖాలలో నుంచీ బ్రహ్మ చతుర్వేదాలూ పలుకుతాడు). రాధా అనేటప్పుడు కృష్ణుడు గుర్తుకు వస్తాడు. ఈ ఐదూ పరమాత్మ యొక్క శక్తులు. పరమాత్మ, పరమేశ్వరుడు అని రెండు పేర్లున్నాయి.


సృష్టి స్థితి లయలు చెయ్యాలి అని సంకల్పించుకున్న దగ్గర నుంచీ ఆ పరమాత్మ పేరు పరమేశ్వరుడయింది. అప్పుడు తనలోని ఐశ్వరాన్ని బయట పెడుతున్నాడు. సంకల్పంతో మొదలై, ఇచ్ఛా జ్ఞాన క్రియ... మొదలైన శక్తులతో జగత్తుగా వచ్చింది.


"ఏకోహం బహుస్యాం' అన్నారు. 'ఏకః' అనే స్థితిలో పరమాత్మ, 'అహం బహుస్యాం' అన్నప్పుడు పరమేశ్వరుడయ్యాడు. లోకంలో మనం ఒక పని చెయ్యాలంటే ముందు దానికి తగిన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులుండాలి. దాన్ని ఎలా చెయ్యాలి అనే పరిజ్ఞానం ఉండాలి.


దాన్ని వ్యక్తం చెయ్యగలిగే శక్తి ఉండాలి. దానికి కావలసిన సంపద ఉండాలి. ఒక పనికి ఇలా మనకు ఎన్ని కావాలో పరమాత్మకీ అవన్నీ కావాలి. అయితే ఆయన తన నుంచే అన్నీ తెచ్చుకుంటాడు.


ఎందుకంటే ఆయనకు భిన్నంగా ఏదీ లేదు కనుక! పరమాత్మ తన నుంచి తెచ్చుకున్న ఇచ్చా జ్ఞాన క్రియాత్మక శక్తి పేరు 'దుర్గ'. ఆయన వాక్ బుద్ధి, జ్ఞానశక్తి పేరు సరస్వతి. ఆయన సంపత్ శక్తి, ఐశ్వర్య శక్తి పేరు లక్ష్మి.


ఆయన వేదశక్తి స్వరూపమే గాయత్రి. ఆయన ఆనందశక్తి స్వరూపం, హృదయశక్తి స్వరూపం, హ్లాదినీ శక్తి రాధ. రాధ అంటే ఆయన యొక్క హృదయమట! రాధ అనే పేరుకు చాలా విశేషమైన అర్థం ఉంది.ఆదిత్యయోగీ..


జగత్తులో మనకు 'ఆరాధన' అనే ప్రసిద్ధమైన శబ్దం ఉంది. ఇక్కడ 'ఆ' అనేది ఉపసర్గం. ప్రధానం 'రాధనం'. రాధ అంటే అర్చన, పూజ అని చెబుతున్నారు.


అర్చన (పూజ) అంటే భగవంతుడితో మనస్సును అనుసంధానం చెయ్యడమే. కనుక రాధ అంటే ఆ భగవంతునితో అనుసంధానం చేయించే శక్తి. భగవంతుడు చేయూత నిచ్చి లాగితే కానీ మనం ఉద్దరణకు గురికాము. 'చెయ్యెత్తి కరావలంబం ఇయ్యవయ్యా' అనడం పురుష ఆ ప్రయత్నం.


ఆ పరమాత్మ కృప చూపించి (చెయ్యి పట్టుకుని) పైకి లాగడం భగవదనుగ్రహం. ఈ రెండూ కలిస్తేనే సిద్ధి. అందుకు మన నుంచి ప్రవహించే ధార (భక్తి ధార ఒకటి, ఆయన నుండి ప్రవహించే ధార కృపాధార ఒకటి) రెండు ధారలూ కలిస్తే 'ధారా... ధారా...


ధారా... ధా.... రాధా.... రాధా....


రాధా అవుతున్నది. ఈ ధారల్ని ఆధారం చేసుకున్న మహాశక్తే రాధ. అది పరమాత్మ వైపు నుండి ఆలోచిస్తే ఆయన యొక్క కృపాస్వరూపిణి రాధ. మన వైపు నుండి ఆలోచిస్తే భక్తి స్వరూపిణి అంటే రాధా దేవి అనుగ్రహం లేకపోతే భగవంతుణ్ణి ఆరాధించాలనే బుద్ధి పుట్టదట!.....

దేవాలయముల యందు

 _*దేవాలయముల యందు భక్తులు చేయకూడని పనులు*_

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️

                                                                                                        ఆలయాల్లో ఇతరులకు నమస్కారము చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు- అందరూ సమానులే అని భావించాలి.


*దేవాలయాలు ఐదు రకములుగా ఉంటాయి.*


*స్వయంవ్యక్త స్థలాలు*-

 భగవంతుడే స్వయంగా వెలసినవి.. 


*దివ్యస్థలాలు*- దేవతలచేప్రతిష్టిం పబడినవి..


*సిద్ధ స్థలాలు* - మహర్షులు, తప స్సుచేసి సిద్ధి పొందినవి, స్వాములు ప్రతిష్టించినవి.


*పౌరాణిక స్థలాలు*-పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి..


*మానుష స్థలాలు*- రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉం టాయి.


*దేవాలయ గోపురాలు..*

హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం,వైకుం ఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల తదిత ర విభాగాలు ఉంటాయి.


*ఈ పనులు చేయకండి..*


దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకా రము పూజారులు, భక్తులు, అధికా రులుఏవిధంగావ్యవహరించకూడదంటే.. ముఖ్యంగా ఆలయంలోపలి కి ఎవ్వరూ కూడా వాహనాలలో రా వడం..చెప్పులు,బూట్లు,పాదరక్షలు వంటి వాటితో తిరగడంచేయరాదు.


*దేవాలయమునకుప్రదక్షణలుచేసేఅప్పుడేలోపలికిప్రవేశించాలి..*

ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ త ర్వాతే గుడి లోపలికిప్రవేశించాలి. ఆలయంలో లోపలికి తలపాగా, టోపి ధరిం చివెళ్లకూడదు.అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించ కూడదు.


మనముతినే,తినుబండారాలను తీ సుకునివేళ్ళరాదు. ఆలయంలో దైవసన్నిధికి ఒట్టి చేతు లతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణంచేస్తూగాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.


*దేవాలయము తీసి ఉన్న సమయమున నిద్రపోరాదు..*


దేవాలయంలో అడుగుపెట్టినతర్వా త పగలు,నిద్రపోవడం, కాళ్లు చాపు కుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన, ఉమ్మివేయుట,వంటి పనులు చేయ కూడదు.


*దేవాలయమునదైవసన్నిధిలోనవివాదాలు పెట్టుకోరాదు..*


ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటి కీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏజీ వికీ హాని కలిగించడం లేదా హింసిం చడం వంటివి అస్సలు చేయరాదు.


*ఇతరులతోదేవాలయముపైవిమర్శలు,దైవదూషణ,పరనింద చేయకూడదు..*


దేవాలయప్రాంగణంలోఅహంకారం, గర్వంతో, అధికారదర్పంతోఅస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పర స్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు.    


ఒకే చేతితోనమస్కారంచేయరాదు.      అధికార గర్వంతో దేవాలయమున కూడనిసమయానఅకాలమందునదైవప్రాకారంలో ప్రవేశించి అకాల సే వలను చేయించరాదు.అలాగే,దేవు ని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూ ర్చోకూడదు.       

                                     అధికాదర్పముచూపించి తనఉనికి మరచి ప్రవర్తించరాదు.    


తనకుభక్తి శ్రద్దలేకుండా తనద్రవ్యం మ్మునుకాని,తానుసంపాదించనిపూ జాద్రవ్యములతోపూజలుచేయించు కొనరాదు.దాన,దక్షణలులేని పూజ లునిరర్దకములు.ఫలితమునివ్వజాలవు.అశుభహేతువులు.                     


దేవాలయములందుఆగమవిధులనుఅనుసరించి నడచుకొనవలెను దేవాలయపరిపాలనకు సహకరించి దేవాలయనిత్యసేవాదులునడచుటకై ధనమునుదానమిచ్చుట.దేముని కిధనము(హుండిలో)దానపాత్రలో నిక్షిప్తముచేయుట,(వేయుట) ఆర్జి త సేవలయందు దేవాలయమున సహస్రనామ,అష్టోత్తరశతనామ,హారతి,అభిషేకము,హోమములకు,వివిధపూజాసేవలకై,తప్పనిసరిగాఅం దరుటిక్కేట్టు తీసుకొనుట,విధిగా చే యవలసినపనియని,టిక్కేట్టును తీసుకొనుట అవమానమని భావించి టిక్కేట్టునుతీసుకొనక చేయించుకొ నుపూజలు దైవాపరాధములు,దైవ ద్రోహముగా ఆగమమునచెప్ప బడినది. అట్టిపుాజ ఫలసూన్యము.అశు భము.గాతెలియనగును.                   


పత్రం,పుష్పం,ఫలం,తోయం,

యో మేభక్త్యా ప్రయచ్చతి,అని శాస్ర్తవచనము. కావున మనము భక్తి శ్రద్దతోదేవాల యమందు మెలగ వలసి ఆ దేవాలయ నియమానుసార విధు లను అనుసరించి దైవదర్శనము అ ర్చనలు,సేవలు,కైంకర్యములుచేయవలసిన అవుసరం ఉన్నది, అన్నవిషయముఅందరముగ్రహించి పాటించి భగవదనుగ్రహము పొందవలసి ఉన్నది.

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 14*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 14*


నరేంద్రుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థులకు -బహుమతి ప్రదానోత్సవమూ, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయునికి వీడ్కోలు సభా ఏర్పాటు చేశారు. జాతీయ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ఆయన మహావక్త. ఆయన ముందు ప్రసంగించడానికి విద్యార్థులెవరూ సాహసించలేదు. 


అందువలన నరేంద్రుణ్ణి ప్రసంగించమని కోరారు. అందుకు అతడు సమ్మతించాడు. పదవీ విరమణ చేస్తూన్న ఉపాధ్యా యుణ్ణి వేనోళ్ల శ్లాఘిస్తూ, ఆయన విరమణ లోటు వలన తామెంత దిగులుపడు తున్నామో దాదాపు అరగంటసేపు అనర్గళంగా, ప్రేక్షకులు స్పందించే రీతిలో ప్రసంగించాడు.  ఆ ప్రసంగాన్ని విని సురేంద్రనాథ్ బెనర్జీ అతణ్ణి మనఃస్పూర్తిగా అభినందించాడు.


నరేంద్రుడు పదిహేడో ఏట ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు ఆంగ్లం, చరిత్ర, గణితం, న్యాయశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, తత్త్వ శాస్త్రం బి.ఏ.లో అతడి పాఠ్యాంశాలు. న్యాయశాస్త్రం, తత్త్వశాస్త్రం, ఉన్నత గణితం - వీటిలో అతడికి ఎంతో ఆసక్తి. ఆంగ్లంలో చక్కని పాండిత్యం గడించడానికి అతడు ఎంతో కృషి చేశాడు. మరీముఖ్యంగా ఆంగ్లంలో సంభాషించడం లోను, వాదించడంలోను అతడు చక్కని శిక్షణ పొందాడు.


విశ్వనాథుడు నరేంద్రుడిని న్యాయశాస్త్ర శాఖలో  చేర్పించి, నియామ్ చరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా ఉంచాడు.

భవిష్యత్తులో తనలా నరేంద్రుడు ప్రఖ్యాత న్యాయవాదిగా రాణించాలని విశ్వనాథుడు అభిలషించాడు. తండ్రితోపాటు ఉన్నత న్యాయస్థానానికి కూడా నరేంద్రుడు తరచు వెళ్లివచ్చేవాడు. అతణ్ణి పై చదువులకోసం ఇంగ్లండుకు పంపాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండేది.


ఈ రోజుల్లో నరేంద్రుని పెళ్లి మాటలు మొదలయ్యాయి. కొందరు బోలెడంత కట్నం ఇవ్వడానికి ముందుకువచ్చారు. మరికొందరు నరేంద్రుడు పై చదవుకు ఇంగ్లండు వెళ్లడానికి అవసరమైన డబ్బు ఇస్తామన్నారు. కాని ఏ ప్రలోభాల మనస్సులో చోటివ్వని నరేంద్రుడు వివాహానికి సమ్మతించలేదు.🙏.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-21🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-21🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందిస్తూ ‘‘మాతా! ఈనాడు నీకొక రహస్యము చెప్పగలవాడను వినుము. పూర్వకాలములో నేను శ్రీరామావతారము ధరించినప్పుడు నేను లేని సమయము చూసి, రావణుడు సీతను యెత్తుకుపోయాడు. 


మార్గ మధ్యములో అగ్నిదేవుడు రావణునకు అడ్డుపడినాడట. అడ్డుపడి నేను అసలు సీతను అగ్నిచెంత దాచి, ఆశ్రమమున మాయ సీతను వుంచితిననియూ, అతడు తీసుకుపోతున్న సీత మాయసీతే ననియు నమ్మించాడు. మాయసీత నాకేలనని రావణుడు అగ్నిదేవునకిచ్చి వేసినాడు. ‘అసలు సీత యిదిగో ఈమె’ యని చెప్పి, తనవద్దనున్న వేదవతినిరావణున కిచ్చినాడట. 


నాకు యీ విషయము తెలియదు, రావణుని నేను సంహరించిన అనంతరం సీతను ఒకవేళ లోకము శంకిస్తుందేమో యని అగ్నిప్రవేశము చేయించాను.



 అప్పుడు అగ్నిదేవుడు వచ్చి విషయము చెప్పి వేదవతినీ కూడా సీతాదేవితో పాటు ఏలుకోవలసినదని కోరాడు. అప్పుడతనితో నేను వేదవతినికలియుగములో వివాహమాడెదనని మాట నిచ్చివేయుటము జరిగినది. ఆ వేదవతియే యీ పద్మావతి. కనుకనే పద్మావతిని నేను వివాహమాడవలసి యున్నది. అన్ని వకుళతో వివరముగా చెప్పినాడు.


శృంగార వనములో ఎప్పుడైతే పద్మావతి వేటగాని రూపములో వున్న శ్రీనివాసుని చూచినదో అప్పటినుంచీ యామెకు ఆ పురుషుని గూర్చిన ఆలోచనలే మనసులోమెదలడము ప్రారంభించినాయి. 


కన్ను మూసినా, తెరచినా అతడే కనిపిస్తున్నాడు. అతడు తన హృదయముపై చెరగని ముద్రవేసినాడు. అతనిని వివాహము చేసుకొన్న బాగుండునని పద్మావతి భావించినది. అయితే తల్లికికానీ, తండ్రికి కానీ విషయము చెప్పలేదు, చెలికత్తెలకి చెప్పడానికి గూడా సిగ్గేసింది. 


‘బోయవాడు, బికిరివాడు నీకు భర్తగా రావడమేమిటి?’ అని తల్లిదండ్రులు తనను చీవాట్లు పెట్టవచ్చు. అందువలన ఆమె సరిగా తినడము సరిగా నిద్రపోవడము మానేసి చాలా కాలమైనది. సింగారించుకోవడము మానినది.

 వనవిహారము మానినది, చివరకు చెలికత్తెలతో సరిగా మాట్లాడడము కూడా మానివేసినది. ప్రేమ జ్వరము ఆమెను క్రుంగదీయడము ప్రారంభించినది. 

పద్మావతి వనోవ్యాధితో మంచమెక్కినది, ఆకాశరాజు, ధరణీదేవి విప్రవర్యులచే పద్మావతి ఆరోగ్యమునకై పూజలూ, అభిషేకములూ జరిపించారు. రాజవైద్యులు కూడా వైద్యము చేశారు. ఏమి చేయించినా ఆమె వ్యాధి కుదటపడదని ప్రారంభించనే లేదు పైగా ఆ వ్యాధి ఆ రోజు కారోజు పెరిగిపోసాగినది. ఇక్కడ పద్మావతియిలా వుంటేఅక్కడ శ్రీనివాసుడు కూడా నిద్రాహారాలు మాని కాల పరిణామము తెలియకుండా అదే పనిగా పద్మావతిని గూర్చి ఆలోచించసాగాడు.

శ్రీనివాసుని దిగులు వకుళాదేవికి విచార కారణమయినది. వకుళ పరిష్కారమును గూర్చి ఆలోచించసాగినది.


 శ్రీనివాసునితో ఆమె ’’నాయనా! నీ దిగులు చూస్తే నాకు మతిపోతోంది. బాధపడకు, ఆకాశరాజుగారి వద్దకు ఇంక నేనే స్వయముగా వెళతాను వెళ్ళి అన్నీ మాట్లాడుతాను మాట్లాడి, ఈ నీ వివాహము ఎలాగైనా జరిపించాలని అర్ధిస్తాను. శాయశక్తులా కృషిచేసి రాయబారము సాగించి వస్తాను


నీవు బాధపడడము మాత్రము మానుకో! అని నారాయణపురానికి బయలుదేరినది. పాపం వకుళాదేవి శ్రమపడి వెళుతోంది కానీ, ఆకాశరాజా వాళ్ళూ అంగీకరిస్తారో లేదో? అందుచేత ఈ లోపున దానికి బలముగా ఒక పధకం వేయవలసి వుంది అని అనుకున్నాడు శ్రీనివాసుడు.


వజ్ర కవచ ధర గోవిందా, వసుదేవ తనయ గోవిందా, వైజయంతి ధర గోవిందా, వేంకట నాయక గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||21||


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం .

 *ఓం నమో వెంకటేశాయ*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అంతరంగం

 🤘🏻"ఏమే....ఈ పూట కంది పచ్చడి చెయ్యకూడదూ" అన్నాన్నేను ...


"ఆఁ.....కంది పచ్చడితో పాటు మామిడి కాయ ముక్కల పచ్చడి కూడా చేసాను..." మా ఆవిడ రెస్పాన్స్. 


"మరి పప్పు ఏం చేస్తున్నావ్?....నిన్న దోసకాయలు తెచ్చానుగా.....పప్పులోకి దోసకాయ బాగుంటుంది" అని నేను ...


"దాంతోపాటు, నిన్న బెండకాయలు కూడా తెచ్చారుగా..కాస్త మజ్జిగ పులుసు కూడా చేస్తున్నాను", మా ఆవిడ కన్ఫర్మేషన్.


 "అట్టాగే కాసిని గుమ్మడి కాయ ఒడియాలూ, ఓ నాలుగు గారె ముక్కలూ,  ఇంగువ అప్పడాలు కూడా ఉంటాయిలెండి" మా ఆవిడ మరో వరం.


ఇదేదో "ఒకటి కొంటే ఒకటి ఫ్రీ" స్కీం లాగా, ఒకటికి రెండు ఉన్నాయని నేను మహదానందపడిపోయాను.


"ఇంత కష్టపడి పోతున్నావు.....నీకు ఏమైనా సహాయం కావాలా.....?",ఆనందాతిశయుడై అన్నాన్నేను ...


"అలా ఓ సారి మార్కెట్ దాకా వెళ్ళి నాలుగు అరిటాకులు తీసుకుని రండి......ఈ రోజు మా అమ్మ , నాన్న , అన్నయ్య , చెల్లి భోజనానికి వస్తున్నారుగా......", అంతరంగం బయటపెట్టింది మా ఆవిడ ...


నేను : 😳😳😳🤘🏻


సేకరణ .

తథాస్తు దేవతలు

 తథాస్తు దేవతలు అంటూ పెద్దలు ఉపయోగిస్తారు కదా! తధాస్తు దేవతలు ఎవరు? వారి ప్రస్తావన ఎక్కడైనా ఉన్నదా?

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు అని చెప్పగా విన్నా.

దీనిమీద కొంచెం శోధించా ..వివరాలు ఇవి.. మీ ప్రశ్న ద్వారా నూతన విషయాలు తెలుసుకున్నా. ధన్యవాదాలు.

వేదాలలో 'అనుమతి' అనే ఒక దేవత ఉన్నారట. శుభ కార్యాలు యజ్ఞ యాగాదులలో ఈ దేవతని స్మరిస్తే కార్య ఫలం లభిస్తుందంట.

ఆ అనుమతి దేవతలనే తధాస్తు దేవతలు అని అంటారంట. శుభ కార్యాలు జరిగే ప్రదేశం వారి నివాసస్థానం.

ముఖ్యంగా సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. అందుకే స్వగతంగా చెడు మాటలు పదే పదే అనుకోవద్దని పెద్దలు చెబుతారు.

మధ్యాన్న వేళకి ముందుగా అనికూడా ఎవరో ఎప్పుడో అంటే విన్నట్టు గుర్తు.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. పదే పదే చెడు మాటలు అంటూ ఉంటే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వ విషయంలోనే వర్తిస్తుంది. పరులకి కాదు.

తెలుసుకున్న పురాణ వర్ణన:

వీరి ప్రస్తావన ఋగ్వేదము 1 వ మండలంలోని 16వ అనువాకము 112 మొదలు 117 వరకు గల సూక్తములలో ఉన్నదట.

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కవల కుమారులు..

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు.

ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు.

వీరి సోదరి ఉష. ఆమె ప్రతి రోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని, మూడు చక్రాలు వుండి, అద్వరాశ్వాలనే మూడు శ్వేత అశ్వాలు నడిపే, వేయి పతాకాలుండే హిరణ్య రధాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు హిరణ్యయానమనే దారిలో వాయువేగ మనోవేగాలతో ఈ దేవతలు సంచరిస్తుంటారు.

ఆ రథంలో ఒకవైపుధనం మరొకవైపు తేనె మరియూ సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి, వారి కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది , వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.

ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.

వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారు. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.

ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు

గోవిందరాజు సుబ్బారావు

 గోవిందరాజు సుబ్బారావు (1895 -1959 )



తెర మీద అయన కనబడితే అయన కనబడరు  అయన పాత్ర తప్ప . సహజ సంభాషణలు , అర్థవంతమైన అభినయం వాచికం ఆయన సొంతం. 


అయన సినిమాల్లో అడుగు పెట్టేనాటికి ఆయన నడివయసులో ఉన్నా అయన ప్రజ్ఞ చూసి చాలా ప్రధాన పాత్రలే వచ్చాయి. అయన వృత్తి రీత్యా వైద్యుడు . ఇటు హోమియోపతి  లో కూడా అందెవేసిన చేయి . 


ఆంగ్లం , సంగీతములో కేవలం సప లు మాత్రమే కాక అనేక రాగాల మీద ఆయనకు మంచి పట్టుంది . సంగీతం, సాహిత్యం, సైన్స్ ఇలా ఏది పట్టుకున్నా ఆయనకు అన్ని విషయాలు కరతలామలకాలే  .  


ఐన్ స్టీన్ కి   ఉత్తరాలు వ్రాసి  అణుశాస్త్రం, ఆర్గానిక్ శాస్త్రం మీద  చర్చలు జరిపినంత పట్టు ఆయనకు ఉంది . కానీ ఆయనకు వీటన్నింటిని మించి నాటకాలు సంగీతం సాహిత్యం ఇవే అమిత ఇష్టం . తొలినాళ్లలో నాటకాలు ఆ తరువాత సినిమాలు మరో వైపు వైద్యం . అటు సాత్విక పాత్రలు ఇటు క్రూర పాత్రలు ఏవైనా వేయగల దిట్ట . 


గోవిందరాజు సుబ్బారావు గారి ప్రతిభ చూసే మొదట మాలపిల్ల 1939  లో ఛాందసుడిగా ఉండే సుందర రామ  శాస్త్రి పాత్రకు ఆయన్ని  ఎంపిక చేసారు గూడవల్లి  రామబ్రహ్మం  గారు. ఆయనకు   వీరు సముద్రాల గారి ద్వారా  పరిచయం. 


మాలపిల్ల చిత్రంలో సుందర రామ శాస్త్రిగా ఆ చిత్రములో వేసినందుకు ఆయన సంఘం నుండి కొన్నాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన పట్టించుకోలేదు. అది కేవలం పాత్ర .. నేనూ సదాచార బ్రాహ్మణుణ్ణి .. ఎక్కడ ఏ రోజు ఆచారం తప్పలేదు . అది కేవలం ప్రవృత్తి అని చెప్పుకునేవారు . 


మాలపిల్ల  తరువాత ఆయన గృహలక్ష్మి లో నటించినా ఆయనకు పెద్ద పేరు తెచ్చిన చిత్రం జెమినీ వారి బాల నాగమ్మ . అందులో మంత్రాల మరాఠీ గా ఆయన చూపిన హావ భావాలూ చూసి ఆనాటి పిల్లలూ, పెద్దలూ జడుసుకున్నారట . అందుకని కన్నాంబ గారిని ఆయన్ని బూచాడు అని పిలిచేవారు . 


బాలనాగమ్మ  1942  తరువాత ఆయనకు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిన చిత్రాలు శారదా వారి పల్నాటియుద్ధము లో బ్రహ్మనాయడు పాత్రలో, ఆ తరువాత వచ్చిన గుణసుందరి 1949   కథలో మహారాజు పాత్ర, షావుకారు 1950   చిత్రములో     షావుకారు చంగయ్య పాత్ర , 1955  లో వచ్చిన వినోదా వారి  కన్యాశుల్కములో లుబ్దావధానులు పాత్ర . 


ఆయన చివరిగా కనబడిన చిత్రాల్లో చిరంజీవులు, చరణదాసి, భాగ్యరేఖ , పాండురంగ మహాత్మ్యం. ఆయన నాగయ్య గారి భక్త రామదాసులో నటించేప్పుడు మరణించారు. ప్రఖ్యాత నర్తకుడు ఉదయశంకర్ తీసిన  చిత్రము కల్పన 1948 లో ఆయన కూడా ఉన్నారు.


ఆయన అనేవారు నాటకములో ఒన్స్  మోర్ అన్నట్టు జీవితములో కూడా జరిగే మధుర స్మృతులను ఎవరన్నా ఒన్స్ మోర్ అంటే బాగుంటుంది . కానీ దైవం అనేవాడు దీనికి వీలు లేకుండా చేసాడు . భగవంతుని సృష్టి విలాసాలు ఎవరు అర్థం చేసుకోలేరు . ఆయన విశ్వ నిర్మాణమే కడుంగడు విచిత్రం . మనలో మనం ఎంత తన్నుకున్న తిట్టుకున్నా మళ్ళీ ఏదో రోజు ఒరేయ్ చలపాయ్ , ఒరేయ్ నరసింహులు , ఒరేయ్ రాముడూ, కుటుంబరావు అని ఆప్యాయంగా పిలుచుకునే రోజులు . ఉప్పిండి చేశాను కాస్త అయినా నోటిలో వేసుకోరా అని   మా వెంకమ్మత్తయ్య   అంటుండే వారు . ఆరోజులు మళ్ళీ  వస్తాయా అసలు . 


అందరూ అంటారు మీరు చేసిన సుందరరామయ్య పాత్ర, షావుకారు  చంగయ్య పాత్ర  మాకు బాగా నచ్చాయని . నాకు మాత్రం ఇంకెవరైనా తల పండిన వారు ఆ పాత్రల్లో ఉండి ఇంకా భేషుగ్గా చేసేవారని అనిపిస్తుంది . ఒక వేళ ప్రేక్షకులు బాగుందన్నా నేనూ సంతోషముతో ఎగిరిపోను .. బాగో లేదన్నా కృంగిపోను. 

నటుడుని కాబట్టి ఒక్కోసారి ఆ పాత్రలో ఇలా చేసి ఉంటే ఇంకాస్త బాగుండేమో అనిపిస్తుంది నాకు .   


నాకు సినిమా , నాటకం , మరో పక్క వైద్యకం .. మాత్రమే కాక రేడియో లో చేయడం కూడా ఇష్టమే . ఇక్కడ కనబడకుండా కేవలం మాటతోనే మన హావ భావాలూ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ముందు మూడింటి కన్నా ఇది కత్తి మీద సాము వంటిది .మొదట్లో నాటకం కంటే సినిమా నటనం కష్టం అని భయపెట్టారు. కానీ అవి రెండూ నాకు  పెద్ద గొప్పగా అనిపించలేదు గానీ .. ఈ రేడియో మాత్రం నాకు చాల సరదా ని  తెచ్చి పెట్టింది. 


మాలపిల్ల సినిమా లో చేసేప్పుడు ఓ సన్నివేశములో ఇల్లు తగలబడేప్పుడు ఆ తగులపెట్టిన పెట్రోల్ కిరోసిన్ వాసనా మరియు ఆ సెగకు , రెండూ మూడు మార్లు రి టేక్  వల్ల నా ఆరోగ్యం బాగా దెబ్బ  తింది . ఆ వాసనకు వేడికి నా ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయి . సారథి వారు దయ తలచి వాళ్ల మేడ మీద నాకు బస ఏర్పాటు చేసారు.  మహానుభావుడు డాక్టర్ కేశవ పాయి గారి హస్తవాసి వల్ల బ్రతికి బయటపడ్డాను. ఆరోజుల్లో నేను పోయాను అని పేపర్ లో కూడా వచ్చిందిట . 


ఎవరో రామ బ్రహ్మం గారికి ఫోన్ చేసి ఎందరికో రోగాలు కుదిర్చిన మహానుభావుడికి ఈ రోగం వచ్చి పోవడం ఏమిటి అని  అడిగితే మా ఇంటిలో మేడ మీద గదిలో భేషుగ్గా ఉంటేనూ అని చెబితే గానీ లోకానికి తెలియరాలేదు .అందుకే  ఏదో వచ్చిన పాత్రలన్నీ చేసేయాలని నాకు లేదు . పాత్ర పది కాలాలు నిలబడగలుగుతుందా అని అనిపిస్తే మాత్రమే చేశాను. పిన్న వయసులోనే వృద్ధుడను అయిపోయాను అనిపిస్తుంది కానీ అంతా భగవంతుని లీల కదా అనిపించినపుడల్లా మనసు కుదుటపడుతుంది   .

శిష్యురాలిగా

 



ఆరోజుల్లో గోదావరి ప్రాంతములో చాటపర్తి సుందరమ్మ అనే భోగం మేళం నాయకురాలు ఉండేదిట. మహా అందగత్తె .. గాయని, మరియు నాట్యములో అందెవేసిన చేయి. నా అంతవారు లేరు అని ఆమెకు మహా గర్వం. నా వాలు చూపులతో, అభినయం తో ఎంతటివారినైనా కట్టి పడేయగలను అని ధీమాగా పాడుతూ నాట్యం చేసేదిట.


ఓ సారి ఓ పేరు మోసిన వైశ్యుని కుమారుడి వివాహములో తన బృందముతో గజ్జె కట్టింది. ఆమె సంస్కృతాంధ్ర భాషల్లో పట్టున్న ఘనురాలు. "కాంతో యాసతి దూరదేశ మితి చింతా పరం జాయతే, లోకానంద కరోపి చంద్రవదనే, వైరాయాతే చంద్రమాః" అనే శ్లోకం చదువుతూ .. అభినయం చేస్తూ .. "అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా, నీలోత్పలంచ పంచైతే పంచ బాణస్యసాయకాః" అంటూ అయిదు బాణాలను ప్రేక్షకుల మీద వేసింది. 


వెంటనే సభలో ఓ ఇద్దరు వ్యక్తులు సభ మైలపడింది అంటూ గొడవ చేయసాగారు.. జనాలందరూ తికమక పడుతూ అల్లరి చేయగానే సుందరమ్మ ఎవరో పండితులు సభలో ఉన్నారని గ్రహించివారిని గుర్తు పట్టి వారి కాళ్ళ మీద పడింది .. అయ్యా నేను అభినయములో ఏమైనా తప్పు చేసానా అని అడిగింది సవినయంగా .


దానికి వారు  పంచ బాణాలు చెబుతారు కానీ అభినయములో మాత్రం వేసేది నాలుగు బాణాలే.. అయిదవది వేస్తే నాయిక మృతి పొందుతుంది.. తద్వారా 'మృతాశౌచం' అనగానే తన తప్పు గ్రహించి సంస్కృత ఆంధ్ర భాషల్లో నిపుణురాలైన ఆమె తనను శిష్యురాలిగా అంగీకరించి తనకు విద్యాదానం చేయమని కోరిందిట. ఆ పండితులెవరనుకున్నారు.. చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి, మరొకరు కూచి పూడి నాట్య ప్రముఖులు వేదాంతం లక్ష్మీనారాయణ శర్మ గారు

శ్లోకం:☝️ *కార్యమద్యతనీయం యత్* *తదద్యైవ విధీయతామ్ |* *విపరీతా గతిర్యస్య* *స కష్టం లభతే ధృవమ్ ||* అన్వయం: _యత్ కార్యమ్ అద్యతనీయమ్ (అస్తి) తత్ అద్య ఏవ విధీయతామ్ | యస్య గతిః విపరీతా (అస్తి) సః (మనుష్యః) ధృవం కష్టం లభతే |_ భావం: ఈ రోజున చెయ్యాల్సిన పనిని ఈ రోజే చేయాలి. అలా చెయ్యకుండా వాయిదాలు వేసిన వ్యక్తికి కచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది.

 శ్లోకం:☝️

*కార్యమద్యతనీయం యత్*

  *తదద్యైవ విధీయతామ్ |*

*విపరీతా గతిర్యస్య*

  *స కష్టం లభతే ధృవమ్ ||*


అన్వయం: _యత్ కార్యమ్ అద్యతనీయమ్ (అస్తి) తత్ అద్య ఏవ విధీయతామ్ | యస్య గతిః విపరీతా (అస్తి) సః (మనుష్యః) ధృవం కష్టం లభతే |_


భావం: ఈ రోజున చెయ్యాల్సిన పనిని ఈ రోజే చేయాలి. అలా చెయ్యకుండా వాయిదాలు వేసిన వ్యక్తికి కచ్చితంగా శ్లోకం:☝️

*కార్యమద్యతనీయం యత్*

  *తదద్యైవ విధీయతామ్ |*

*విపరీతా గతిర్యస్య*

  *స కష్టం లభతే ధృవమ్ ||*


అన్వయం: _యత్ కార్యమ్ అద్యతనీయమ్ (అస్తి) తత్ అద్య ఏవ విధీయతామ్ | యస్య గతిః విపరీతా (అస్తి) సః (మనుష్యః) ధృవం కష్టం లభతే |_


భావం: ఈ రోజున చెయ్యాల్సిన పనిని ఈ రోజే చేయాలి. అలా చెయ్యకుండా వాయిదాలు వేసిన వ్యక్తికి కచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది.

పంచాంగం 17.08.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 17.08.2023 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: ప్రతిపత్తి తిధి బృహస్పతి  వాసర: మఘా నక్షత్రం పరిఘ  యోగ: బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పాడ్యమి సాయంత్రం 05:35 వరకు.

మఘ రాత్రి 07:57 వరకు.

సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:38

వర్జ్యం :  ఉదయం 06:27 నుండి ఉదయం 08:15 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:15 నుండి 11:05 వరకు తిరిగి మధ్యాహ్నం 03:17 నుండి 04:07 వరకు.


రాహుకాలం : మద్యాహ్నము  

01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార: