26, సెప్టెంబర్ 2023, మంగళవారం

నిజమైన హిందువు

 నిజమైన హిందువు హిందువుగా పుడితే హిందువు కాదు హిందూ ధర్మాలను పద్ధతులను కాలరాసేవారు పార్టీ ప్రముఖులైన బంధుమిత్రులైన నిలదీయాలి అప్పుడే నీవు నిజమైన హిందువు అవుతావు ఈనాడు పార్టీ పిచ్చితో అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు కానీ అన్ని పార్టీలు ముస్లింలకు వత్తాసు పలుకుతూ హిందువులను హిందూ దేవి దేవతలను గుళ్ళు గోపురాలను బలవంతంగా కూల్చివేస్తున్నారు అయినను ఆయా పార్టీలలో ఉన్నవారు మానవత్వాన్ని చంపుకొని ధర్మాన్ని విడనాడి  హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్లు హిందూ దేశాన్ని కాపాడాల్సిన వాళ్లు హిందూ మతానికి హిందూ ధర్మానికి హిందూ దేశానికి తీరని ద్రోహం చేసుకుంటూ ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ పార్టీ  పిచ్చితో హిందూ ధర్మాన్ని కాళరాస్తున్నారు తప్పు ఎవరు చేసినా నిలదీసే దమ్ము లేని వాడు హిందువే కాదు ఈ చిన్న అమ్మాయి ఏం చెబుతున్నదో ఇకనైనా విని బుద్ధి తెచ్చుకొని నీవు ఇష్టపడ్డ పార్టీలో నీకు నీ కులానికి నీ మతానికి విలువ ఇవ్వనిచో అలాంటి పార్టీని కాలితో తన్నుకుంటూ వదిలేసి బయటికి రా నీ కులానికి నీ మతానికి నీ దేశానికి విలువ ఇచ్చే పార్టీని ఎంచుకో నిజమైన హిందువుగా బ్రతుకు లేనిచో చావు అంతేకానీ హిందువు అని చెప్పుకుంటూ హిందూ మతానికి ద్రోహం చేస్తూ బ్రతుకకు

భక్తి -ముక్తి..అంటే

 భక్తి -ముక్తి..అంటే

శంకర భగవత్పాదులు ఇలా అంటారు. “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” అంటే మోక్షానికి కార​ణాలైన వాటిల్లో “భక్తి” ​గొప్పది​ అని ​. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది. భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర ​ఉన్నాడని ​అనుకొంటే దగ్గరే ​ఉంటాడని ​అని చెప్తారు! అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది​,​ అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. 

చిత్త వృత్తులు పరమేశ్వరుని ​చేరి చేరి ఎల్లప్పుడూ ఉండట​మే భక్తి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్త-వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి ​చెప్పాడు . అదే భక్తి ​అని శంకరుల వివరణ.

ఇలాంటి భక్తి వలనే మానవుడు తరిస్తాడు.​ ఒక్క మాటలో చెప్పాలంటే ​భగవంతుని పట్ల ప్రేమనే భక్తి ​అనొచ్చు. అటువంటి​ ​​భక్తుల పట్ల పరమేశ్వరుడు ​సంతృప్తిగా ఉండి ,వారి బాధ్యతలను తానే భరిస్తాడు.

 “అనన్యాశ్చింతయంతోమాం​ ​ యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం” ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ​హామీ!

ఇంతకన్నా మనకు ఏమి కావాలి? ఈ భక్తి ఎప్పుడైతే ​ఏమీ ఆశించదో అప్పుడే దానిని శరణాగతి అంటారు.

చాలా మంది భక్తి భావాన్ని వివిధ కారణాల చేత ఏర్పరుచుకుంటుంటారు.​ ​కొంత మంది పుణ్యం కోసం భక్తిని పెంచుకుంటే,​ ​కొందరు పాప ​భయంతో , మరికొందరు మన అవసరాలను భగవంతుడు తీరుస్తాడ​ని భక్తిని అలవరుచుకుం​టున్నారు. భక్తులలో నాలుగు రకాల

వారుంటారని ,ఈ నాలుగు రకాల వారు భగవంతుడితో సంబంధం పెట్టుకుంటారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు.

ఆ​ ​నాలుగు రకాలవాళ్ళు–​కష్టాల్లో ఉన్నవాడు, కోరికలున్నవాడు​, జిజ్ఞాసువు (అంటే జ్ఞానం పొందాలనే ఆసక్తి ఉన్నవాడు​)​​, జ్ఞాని.​ 

నేటి ప్రపంచంలో మొదటి రెండు కోవలకు చెందినవాళ్లనే మనం ​ఎక్కువగా ​​చూస్తున్నాం!

భక్తి అనేది ఒక యోగం.​

దీన్ని గురించి రెండు ఉదాహరణలు చెప్పారు.

మొదటిది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇది తన తల్లి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగిరేటప్పుడు తల్లి కడుపును జాగ్రత్తగా పట్టుకునే ఉంటుంది. ఇది కష్టమైన పని. వేదాంత మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.

రెండవది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోరమంటే పిల్లిపిల్ల. దీన్ని దాని తల్లే నోటితో పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంది. భక్తి మార్గంలో ​నడిచేవాడు దీన్ని అనుసరిస్తాడు.

ఎవరైతే మనసా, వాచా, కర్మణా భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో ,వారి యోగక్షేమాన్ని ​భగవంతుడే భరిస్తాడనేదానికి ​ఒక యదార్ధ సంఘటనకు ఉదాహరణ.

కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్ర​శేఖర​ ​సరస్వతుల​ ​వారికి ముందు పీఠాధిపతులుగా ​అదే పేరుతో ఇంకో స్వామి వారుండేవారు. వారు అమ్మవారి​కి​ ​గొప్ప ఉపాసకులు.

 వారితో వాదభిక్ష (వాదించాలని కోరుకోవడం) కావాలని ఒకసారి కొందరు వచ్చారు.

వారిని వాదం మొదలెట్టమన్నారు స్వామి వారు.

అందుకు ​వారన్నారు “స్వామీ మీ ఒళ్ళో కూర్చున్న ఆ అందమైన పాపను చూస్తుంటే మా నోట మాట ​రావటం లేదు. ఆ పాపను ​ మాకు కనిపించకుండా చేస్తే మేము మాట్లా​డగలం ” అన్నారు.

అప్పుడు స్వామి వారన్నారు “నేనొక సన్యాసిని. నా ఒళ్ళో పాప ఆడుకోవడం ఏంటి? మీరేదో పొరబడుతున్నారు” అన్నారు.

అప్పుడు వారన్నారు “కాదు స్వామీ! మీ ఒళ్ళో పాపను ​ప్రత్యక్షంగా ​మేం చూస్తున్నాం. ​అందువల్లే మేము మాట్లాడలేకపోతున్నాం! “

అప్పుడు ​ఆ ​స్వామి ​వారు ”ఆ పాప మరెవరో కాదు. నేను ఉపాసిస్తున్న కామాక్షి అమ్మవారే​! ఆమె​కు నామీద కల ​​దయ వలనే మీరు వాదించలేక పోతున్నారు.” అన్నారు.

శరణాగతి స్థితికి చేరుకున్న భక్తులతో ,భగవంతుడు ఇలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాడు​.​ భక్తి భావా​నికి అంతిమ ​లక్ష్యం ​ఏమిటంటే-జన్మరాహిత్యం.

దీనికోసం​ నిరంతరం ​భగవంతుడిపై భక్తిని ​కలిగివుండాలి . ఆ భగవత్ స్వరూపాన్ని మనలో నిక్షిప్తం ​చేసుకుంటే ​ఏదో ఒకరోజు ​ఈ జీవు​డు పరమాత్ముడితో అనుసంధానం ​అవుతాడు. దాన్నే ఆత్మ సాక్షాత్కారమని అంటారు.

భగవంతుడికి కావలసింది భక్తి మాత్రమే.

మనకు ఎంత సంపద ఉందన్నది అనవసరం.​ ​భక్తితో​ ​ఎంత సమర్పించా​మన్నది మాత్రమే ​ప్రధానం.

విజయమాల్యా లాంటి వాళ్ళు దేవునికి సమర్పించిన కొన్ని వేల కోట్ల కంటే​,​ బడుగుజీవి కష్టపడి కూలీనాలీ చేసుకొని సంపాదించి భక్తితో ఇచ్చిన ఒక్క రూపాయే భగవంతుడికి ప్రీతి.

కొన్ని బారువుల ​బంగారంతో సత్యభామ శ్రీ కృష్ణుడిని తూచలేకపోయింది. రుక్మిణీ దేవి అదే శ్రీ కృష్ణుడిని భక్తితో ఒక తులసీద​ళంతో ​తూచి దక్కించుకుంది. యశోద కృష్ణుడిని ఏకంగా భక్తి , ప్రేమ, అనురాగాలతో కట్టి పడేసింది!

                 స్వస్తి!

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-57*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-57*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు:*

వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. 

అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.

*సుప్రభాతం:* నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.

*శుద్ధి:*

సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.

*• అర్చన*: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

*• తోమాలసేవ:* తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.

*• కొలువు:* తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

*• సహస్రనామార్చన*: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసిదళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

*మొదటిగంట, నైవేద్యం:* మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని  గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి) కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.

*• అష్టోత్తర శతనామార్చన:* ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.

*రెండో గంట, నైవేద్యం:* అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.

*• రాత్రి కైంకర్యాలు:* ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.

*• ఏకాంతసేవ:* రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండల వాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

*గుడిమూసే ప్రక్రియ*: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

*• ప్రత్యేక సేవలు*

రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.

*• సడలింపు*: గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.

*పూలంగిసేవ:* ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.

*• తిరుప్పావడ*: భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.

*• అభిషేకం*: శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది. గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.

*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *36వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *36వ అధ్యాయం*

*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *శుక్రగ్రహ జననం - 3*

*''బుద్ధికి బృహస్పతి' అనే మాటను త్వరలో మనం వింటాం ! అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా !"* నారదుడు అన్నాడు.

*“ఊ... చూస్తుంటే - ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది. నారదా !"* వృషపర్వుడు వాలుగా చూస్తూ అన్నాడు.

*“నారాయణ ! పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల తరువాతే సుమా !"* నారదుడు

నవ్వాడు. 

*"నువ్వు సురపక్షపాతివి కాకపోతే , ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి వుండే వాడివి నారదా ?”* వృషపర్వుడు ఉక్రోషంతో అన్నాడు.

*"నారాయణ ! నువ్వెవరు ? నేనెవరు ? వీరి తండ్రి కశ్యప ప్రజాపతి. ఆయన తండ్రి మరీచి మహర్షి. ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు. నీకు తాతగారు. నేనెవరు ! బ్రహ్మగారి మరొక మానసపుత్రుడ్ని , నీ పితామహుడు మరీచికి సోదరుణ్ని. ఆ  సుర బృందమూ , మీ అసుర బృందమూ అక్కచెళ్లెళ్ల బిడ్డలు , సోదరులు. కాకపోతే దాయాదులు. నాకు మీరూ , మీరూ అందరూ ఒక్కటే ! ఈ నారదుడికి పక్షమూ లేదు ; పాతమూ లేదు !"* 

"మాటలలో , పాటలలో నీ నైపుణ్యం చాలా గొప్పది నారదా !"* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు.

*“సరే ! నేను సురపక్షపాతిని కాను , అని నిరూపించడానికే వచ్చాను. అక్కడ ఒక గురువు వున్నట్లు ఇక్కడ ఒక 'సద్గురువు' వుండాలన్న ఆలోచన నాది..."*

*"అందుకేగా ఆ బృహస్పతిని ముందుగా ఆ ఇంద్రుడి పరం చేశావు !"* వృషపర్వుడు కసిగా అన్నాడు.

*“నారాయణ ! ఆ బృహస్పతిని మరిచిపో , వృషపర్వా ! ఆలోచనలో , ఆచరణలో , వ్యూహ రచనలో - ఆ బృహస్పతిని మించిన మహామేధావిని మీ కోసం ప్రత్యేకించి వుంచాను. అంకుశం లాంటి నిశితమైన బుద్ధి ! నిరంకుశమైన వైఖరి ! ముఖ్యంగా జాగ్రత్తగా విను - ముఖ్యంగా అసుర సంతతి పట్ల సానుభూతి. ఇన్ని అద్భుత లక్షణాలున్న...”*

*“ఎవరావ్యక్తి !"*

వృషపర్వుడు నారదుడి వాక్ ప్రవాహానికి ప్రశ్నతో అడ్డుకట్ట వేశాడు.

*"బ్రహ్మ మానస పుత్రశ్రేష్ఠుడు భృగుమహర్షి తెలుసు కదా ! ఆయన మీ అసుర సంతతికి చెందిన పులోమను పత్నిగా స్వీకరించాడు...."*

*"ఈ విషయాలు మాకు ఎరుకేలే , నారదా !"* వృషపర్వుడు అడ్డు తగిలాడు.

*"ఆ దంపతుల పంచమ పుత్రుడు - 'ఉశనుడు'... మహామేధావి. ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు. ముఖ్యంగా ఉశనడు , ఆ బృహస్పతికి దీటైన వాడు. సమ ఉజ్జీ ! నిజం చెప్పుకోవాలంటే - బృహస్పతి కంటే - రెండాకులు ఎక్కువే చదివాడు. ప్రధానంగా మనకు అనుకూలించే అంశమేమిటంటే - తల్లి పులోమ ఉశనుడికి ఆ సుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. ఆ ఉశనుడు ఏ తపో దీక్షలోనో పూర్తిగా మునిగిపోక ముందే... పట్టుకోవడం మంచిదని నా సూచన !"*

*"మా సూత్రధారిగా వ్యవహరించి , కార్యం సానుకూలం చేయవచ్చు కదా , నారదా !"* వృషపర్వుడు ఆశగా అడిగాడు.

*“నారాయణ ! అందుకేగా వచ్చాను ! ఇంద్రుడికి ఒక గురువును సూచించాను. నీకు ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి మీకు తెలిసి వస్తుంది ! ఎంత త్వరగా భృగుదర్శనం చేసుకుంటే అంత మంచిది.”*

*"ఇంతకాలం నారదుడు 'సురపక్షపాతి' అని అనుకునే వాణ్ని ! వాస్తవానికి నువ్వు 'అసురపక్షపాతి' అని ఇప్పుడు అర్థమవుతోంది నారదా !"* వృషపర్వుడు చిరునవ్వుతో అన్నాడు.

*“నారాయణ ! అసురులకు ఆవేశం అధికం అని ఊరికే అన్నారా”* నారదుడు నవ్వుతూ అన్నాడు. 

*"భృగుమహర్షి ఆశ్రమానికి..."*

*“ఉగ్రా ! రథం సిద్ధం చెయ్ !”* నారదుడికి అడ్డు తగుల్తూ ఆవేశంగా అన్నాడు. వృషపర్వుడు.

*"అసుర గురువుగానా?”* భృగుమహర్షి సాలోచనగా అన్నాడు.

*"ఔను ! మాకు మార్గ నిర్దేశకులు కరువయ్యారు. విద్యాదానం చేసే ఆధ్యాపకులు లేరు. ఉశనుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్తున్నారు. మీరు అంగీకరించాలి , మా కులాన్ని ఆశీర్వదించాలి !"* వృషపర్వుడు వినయంగా అన్నాడు.

*"సరే అనండి , భృగుమహర్షీ ! దైత్య దానవ బాలకులూ , యువకులూ విద్యా గంధం లేకుండా వున్నారు. పాపం !"* నారదుడు అందుకుని అన్నాడు..

*“ప్రసాదించండి"* పులోమ కల్పించుకుని అంది.

భృగుమహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పులోమ చిరునవ్వు నవ్వింది. *"ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉశనుడిలాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని అడిగాను.”*

*"నాన్నగారూ !”* అంత వరకూ మౌనంగా ఉన్న ఉశనుడు అన్నాడు. *"అమ్మ సంకల్పాన్ని ఆచరణలో పెడదాం. నాన్నగారూ !"*

భృగుమహర్షి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు.

*"మీ అందరి అంగీకారాన్ని ఆమెదించకుండా ఎలా ఉంటాను ! ఉశనా ! అసుర గురువుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలి సుమా !”*

*"మీరు అనుగ్రహించిన విద్య నాకు ఆ కీర్తిని తెచ్చి ఇస్తుంది. నాన్నగారూ !"* ఉశనుడు వినయంగా , సగర్వంగా అన్నాడు..

*"అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా ఋణపడి ఉంటుంది , మహాత్మా !"* వృషపర్వుడు భృగుడికి పాదాభివందనం చేశాడు.

*"మాతా ! దీవించండి !"* అంటూ పులోమ పాదాలు స్పృశించాడు.

*"వృషపర్వా ! ఉశనుడిని రాక్షస గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం..."* నారదుడు హెచ్చరించాడు.

*"శుభస్య శీఘ్రం ! వృషా ! నారదుల వారు చెప్పినట్టు రేపే ఆ శుభకార్యం ముగించు"* భృగుమహర్షి అన్నాడు.

*“అంగరంగ వైభవంగా , ఆ దేవతలను మించి , మా గురుదేవులను పట్టాభిషిక్తుల్ని చేస్తాను !"* వృషపర్వుడు ఆవేశంగా అన్నాడు.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 48*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 48*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

యుక్తవయసులో నరేంద్రుడు భగవంతునికి రూపం లేదు, విగ్రహారాధన తప్పు అని

భావించసాగాడు.తాను నిజమని నమ్మే దానిని ఎవరితోనైనా సంకోచించక చెప్పడం నరేంద్రుని నైజం. ఒక రోజు శ్రీరామకృష్ణుల సమక్షంలోనే గిరీశ్ ప్రభృతులతో అతడు ఈ విషయం గురించి వాదన చేశాడు. 

నరేంద్రుడు: భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఋజువు లేకుండా ఎలా విశ్వసించగలను?

గిరీశ్: విశ్వాసం అన్నదే దానికి ఋజువు. 

భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే, నువ్వు ఆయనను విశ్వసించవు. 'నేనే భగవంతుణ్ణి. మానవరూపంలో వచ్చాను' అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనవచ్చు.

నరేంద్రుడు  : మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట, 'బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది' అని ఉంది. అందులోనే మళ్లీ మరొక చోట, 'పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు' అని ఉంది. మనుస్మృతిలో మనుపు తన గురించే వ్రాశాడు. మోజెస్ పెంట్యాట్యూక్లో తన మరణం గురించే వర్ణిం చాడు.

సాంఖ్యశాస్త్రం ప్రకారం 'ఈశ్వరా సిద్ధేః' - అంటే 'భగవంతుడు ఉన్నాడు' అనే దానికి ఋజువు లేదు. మళ్లీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి. వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది.

కాని ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చేయండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరిం చాలి? శ్వేతవర్ణ కాంతి ఎర్రటి యానకం ద్వారా వస్తే ఎర్రగానూ, పచ్చని యానకం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను కనిపిస్తుంది.

 శ్రీరామకృష్ణులు : గీత సకలశాస్త్రాల సారం. సన్న్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది. 

ఒక భక్తుడు : శ్రీకృష్ణుడే (భగవంతుడే) గీతోపదేశం చేశాడు.

నరేంద్రుడు : శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరయినా చేశారో? నరేంద్రుని పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరబోయారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹సౌందర్యలహరి🌹* *శ్లోకం - 32*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 32*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*శివః శక్తిః కామః క్షితి రథ రవిశ్శీతకిరణః*

*స్మరో హంస శ్శక్ర స్తదనుచ పరా మార హరయః |*

 *అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితాః*

           *భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ‖*  

ఇంతకు ముందు శ్లోకంలో శ్రీవిద్యా తంత్రమును గురించి చెప్పిన శంకరులు ఈ శ్లోకంలోనూ తరువాతి శ్లోకంలోనూ శ్రీవిద్యా మంత్రమును గురించి చెప్తున్నారు. 

ఇందులో కొన్ని బీజాక్షర సంకేతాలను నిక్షిప్తం చేశారు. రహస్య మంత్రములను అర్హత లేనివారికి ఉపదేశించరు. కానీ సామాన్యులైన ప్రతివారు తరించటానికి ఇలా చేశారు. ఇందులో పంచదశీ మంత్రమును చెప్పారు. 

శ్రీవిద్య మూడు కూటములతో కూడిన విద్య. అవి 'క'  'హ'  'స'  విద్యలు. ఈ మంత్ర బీజాక్షరాల సంపుటములైన 'హా'ది విద్య 'కా'ది విద్యలను గురించి  తరువాతి శ్లోకంలో వివరంగా చెప్పారు. ఈ సంకేతములు కూడా గురుబోధ లేని వారికి అర్ధం కావటం సులభం కాదు.

శివః శక్తిః కామః = ఈ మూడూ ఒక కూటమి. 

కామః అనగా సంకల్ప శక్తి (ఇచ్చా శక్తి ). ఒక్కడుగా వున్న పరమేశ్వరుడు  తాను అనేకుడుగా కావాలనుకోవడం. ఈ మూడూ 'హ' కారమును సూచిస్తాయి.

తరువాత క్షితిః 'ల'కారం  

అథః తరువాత

రవిః శీతకిరణః స్మరః  హంసః శక్రః ఇవన్నీ ఒక కూటమి.

 క్షితి = భూమి 

రవిః = సూర్య సంబంధమైన బీజం 'హ'కారం

శీతకిరణః = చంద్ర సంబంధమైన బీజం 'స'కారం

స్మరః =మన్మధుడు 

హంసః = సూర్యుడు 'హ'కారం

శక్రః = ఇంద్రుడు 'ల'కారం వీరి సంకేతములైన వర్ణములు

తదనుచ = వీటిని అనుసరించి 

పరా (శక్తి), మార (మన్మధుడు) హరుడు (శివుడు) వీరి సంకేతాలైన వర్ణాలు (అక్షరాలు)  

హృల్లేఖాభిః = హ్రీoకారం(బీజాక్షరం)

 అవసానేషు ఘటితా = చివరిలో కలిపితే హాది విద్యా మంత్రము అవుతుంది. మంత్రాధిదేవతలను ఈ విధంగా రహస్య మంత్రములుగా నిక్షిప్తం చేశారు. 

తవ జనని = తల్లీ నీ రూపాలైన  

భజంతే వర్ణాస్తే = ఈ వర్ణములను ధ్యానిస్తే

 నామావయవతామ్ = నీ నామమే అవుతుంది. 

అనగా మంత్ర శబ్దాకృతి దేవత యొక్క అవయవములుగా, రూపముగా, నామముగా, పరిణమిస్తుంది.

         🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భక్తిసుధ

 🕉️  *_-|¦¦||¦¦|-_* 🕉️

              _*భక్తిసుధ*_

𝕝𝕝శ్లోకం𝕝𝕝 

*సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం*

*దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం*

*కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం*

*మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం*

                                 ~గణేశ పంచరత్నమ్- 3

𝕝𝕝తా𝕝𝕝

సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.

------------------------------------------------

𝕝𝕝శ్లోకం𝕝𝕝 

*అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం*

*పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం*

*ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం*

*కపోల దాన వారణం భజే పురాణ వారణం*

                               ~గణేశ పంచరత్నమ్- 4

𝕝𝕝తా𝕝𝕝

కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా నమస్సులు.

⚜ శ్రీ ఖల్లారి మాత మందిర్

 🕉 మన గుడి : నెం 189

⚜ ఛత్తీస్‌గఢ్ : మహాసముండ్

⚜ శ్రీ ఖల్లారి మాత మందిర్.

💠 భారతదేశంలోని అనేక దేవాలయాలు మరియు  నగరాలు రామాయణం మరియు మహాభారతంతో ముడిపడి ఉన్నాయి. 

ఈ దేవాలయాలలో ఒకటి ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఉన్న మాతా ఖల్లారి దేవి ఆలయం. 

మహాబలి భీముడు మరియు రాక్షసి హిడింబ వివాహం ఇక్కడే జరిగిందని ఈ ఆలయం గురించి చెబుతారు. ఆ తర్వాత ఇక్కడ మాతా ఖల్లారి ఆలయాన్ని నిర్మించారు.

రామాయణం మరియు మహాభారతాలలో వర్ణించిన ప్రదేశాలలో ఒకటి ఖల్వాటిక, దీనిని ఇప్పుడు ఖల్లారి అని పిలుస్తారు.

💠ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంది.  పాండవులు ఒకప్పుడు ఇక్కడ నివసించినట్లు తెలిపే అనేక ఆధారాలు ఈ ప్రదేశం చుట్టూ ఉన్నాయి.

ఖల్లారి పేరు ఒకప్పుడు ఖల్వాటిక అని నమ్ముతారు.  

ఖల్లారి యొక్క ఒక అర్థం ఖల్ + అరి అంటే చెడును నాశనం చేసేవారు.  

బహుశా ఈ కారణంగానే మాతాదేవి పేరు ఖల్లారిగా మారింది.  

ఇక్కడ కొండపైన ఉన్న ఖల్లారి మాత ఆలయం ఉంది, ఇక్కడకు చేరుకోవడానికి దాదాపు 850 మెట్లు ఎక్కాలి.  ఇక్కడ ఛోటీ ఖల్లారి మాత మరియు బడి ఖల్లారి మాత యొక్క దివ్య ఆలయాలు ఉన్నాయి.

💠 ఖల్లారి మాత ఆలయం మహాసముంద్‌కు దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖల్లారి గ్రామం కొండపై ఉంది.

⚜ స్థల పురాణం ⚜

💠 పాండవులను చంపడానికి శకుని ఒక అందమైన లక్క రాజభవనాన్ని నిర్మించిన ప్రదేశం ఇది.  దీనిలో పాండవులు నిద్రించిన తర్వాత నిప్పంటించారు, అయితే పాండవులు ఈ మోసపూరిత పథకం గురించి తెలుసుకుని ఇక్కడ నుండి రహస్య సొరంగం ద్వారా వెళ్లిపోయారు. ఖల్లారిలో ఇప్పటికీ ఆ లక్క కోట అవశేషాలు కనిపిస్తాయి.  మరియు అనేక చెక్కిన రాతి స్తంభాలు కూడా కనిపించాయి.  ఖల్లారిలో లక్షగృహానికి సంబంధించిన పురాతన మంటపం లాంటి శిథిలావస్థ ఉంది, దీనిని లఖేసరి గుడి అని పిలుస్తారు, ప్రస్తుతం ఈ ప్రదేశం నిర్లక్ష్యం కారణంగా తన ప్రాచీనతను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.

💠 అజ్ఞాతవాస కాలంలో 5 పాండవులు మరియు వారి తల్లి ఈ ప్రాంతానికి చేరుకున్నారు, సాయంత్రం తరువాత వారు ఈ ప్రదేశం విశ్రాంతికి అనువైనదిగా భావించి విశ్రాంతి తీసుకున్నారు, అప్పుడు రాక్షస రాజు హిడింబాసురుడు మానవుల రాకను గ్రహించి తన సోదరి హిడింబని పిలిచి అందరినీ గుహలోకి  తీసుకురావాలని కోరగా, హిడింబ నిరాకరించినప్పటికీ, అతను అంగీకరించలేదు మరియు పాండవులందరినీ చంపడానికి బలవంతంగా బయటకు వెళ్ళవలసి వచ్చింది.

ఆ సమయంలో 7 సోదరులు మరియు వారి తల్లి కుంతి నిద్రిస్తున్నారు మరియు భీమసేనుడు వారికి కాపలాగా ఉన్నాడు.

💠 భీముని అందాన్ని చూసి హిడింబ మైమరచిపోయి తన మనసులో అతడ్ని తన వరుడిగా ఎంచుకుని, అందమైన అమ్మాయి వేషంలో భీముని దగ్గరకు వెళ్లి, ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోమని, లేకపోతే నా అన్న మీ అందరినీ చంపేస్తాడని  వేడుకుంది.

మరోవైపు, ఆకలితో విలవిలలాడిన హిడింబాసురుడు  పాండవుల వద్దకు చేరుకుని తన సోదరి తన హృదయాన్ని భీముడికి ఇచ్చిందని తెలుసుకున్నాడు.

 భీముడు మరియు హిడింబాసురుడు మధ్య  భీకర యుద్ధం ప్రారంభమైంది, 

ఈ యుద్ధంలో హిడింబాసురుడిని  భీముడు సంహరించాడు.

💠 కుంతిదేవి తన పుత్రుడు అయిన భీముడికి హిడింబకి ఖల్లారిమాత ఆలయం దగ్గర గంధర్వ వివాహం చేసింది.

వివాహం తర్వాత, భీమ మరియు హిడింబ ధెల్వా డోగ్రీలో నివసించారు అంటారు.

ఒక సంవత్సరం తర్వాత హిడింబకి, భీముడికి ఒక కొడుకు పుట్టాడు.

పుట్టిన తర్వాత తలపై చిన్న వెంట్రుకలు ఉన్నందున అతనికి  ఘటోత్కచుడు అని పేరు పెట్టారు.

💠 పాండుపుత్ర భీముడుతో వివాహం తరువాత, హిడింబ రాక్షసత్వం మానేసింది, ఆమె మానవురాలిగా మారింది మరియు తరువాత వనదేవతగా మారింది మరియు ఆమె దైవీకరణ తరువాత, ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని  మనాలికి వెళ్ళింది.  

ఆమె ఇప్పటికీ మనాలి ప్రధాన దేవతగా పూజించబడుతోంది.

మనాలిలో హిడింబా మందిరం చాలా ప్రముఖ ఆలయం.

⚜ ఆలయ చరిత్ర ⚜

💠 1985లో, మొదటి సారిగా నవరాత్రుల సమయంలో జ్యోతి కలశాన్ని వెలిగించడం ప్రారంభమైంది, దీని సంఖ్య 11. 

క్రమేణా దీని సంఖ్య పెరిగి నేడు వేలాది మంది ఇక్కడ దీపాలను వెలిగిస్తున్నారు.

💠 కొండపై కూర్చున్న తల్లి కథ ఆసక్తికరంగా ఉంటుంది.  పురాతన కాలంలో, ఖల్లారి మాత మహాసముంద్‌లోని డెంచ గ్రామంలో నివసించేవారు. 

ఖల్లారిలోని బజారుకు అమ్మవారు ఆడపిల్ల రూపంలో వచ్చేది. ఒకసారి ఆడపిల్ల రూపంలో ఉన్న మాతృమూర్తిని చూసి ఒక సంచార జాతివాడు పరవశించిపోయి కామంతో కొండ వరకు ఆమెను అనుసరించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఖల్లారీ మాత ఆ సంచార వ్యక్తిని శపించి రాయిగా మార్చేసి ఆమె అక్కడే కొండపై కూర్చుంది.

💠 కల్చూరి రాజవంశం యొక్క లహరి శాఖ రాయ్‌పూర్‌లో స్థాపించబడినప్పుడు, వారి ప్రారంభ రాజధాని ఖల్లారి. 

1409లో, బ్రహ్మదేవ రాయ్ కాలంలో, రాజధాని ఖల్లారి నుండి రాయ్‌పూర్‌కు మార్చబడింది. 

💠 ఈ ఆలయం మహాసముండ్ నుండి 24, రాయ్‌పూర్ నుండి 79 కి.మీ దూరంలో ఉంది.

నవగ్రహా పురాణం🪐* . *36వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *36వ అధ్యాయం*

*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *శుక్రగ్రహ జననం - 3*

*''బుద్ధికి బృహస్పతి' అనే మాటను త్వరలో మనం వింటాం ! అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా !"* నారదుడు అన్నాడు.

*“ఊ... చూస్తుంటే - ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది. నారదా !"* వృషపర్వుడు వాలుగా చూస్తూ అన్నాడు.

*“నారాయణ ! పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల తరువాతే సుమా !"* నారదుడు

నవ్వాడు. 

*"నువ్వు సురపక్షపాతివి కాకపోతే , ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి వుండే వాడివి నారదా ?”* వృషపర్వుడు ఉక్రోషంతో అన్నాడు.

*"నారాయణ ! నువ్వెవరు ? నేనెవరు ? వీరి తండ్రి కశ్యప ప్రజాపతి. ఆయన తండ్రి మరీచి మహర్షి. ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు. నీకు తాతగారు. నేనెవరు ! బ్రహ్మగారి మరొక మానసపుత్రుడ్ని , నీ పితామహుడు మరీచికి సోదరుణ్ని. ఆ  సుర బృందమూ , మీ అసుర బృందమూ అక్కచెళ్లెళ్ల బిడ్డలు , సోదరులు. కాకపోతే దాయాదులు. నాకు మీరూ , మీరూ అందరూ ఒక్కటే ! ఈ నారదుడికి పక్షమూ లేదు ; పాతమూ లేదు !"* 

"మాటలలో , పాటలలో నీ నైపుణ్యం చాలా గొప్పది నారదా !"* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు.

*“సరే ! నేను సురపక్షపాతిని కాను , అని నిరూపించడానికే వచ్చాను. అక్కడ ఒక గురువు వున్నట్లు ఇక్కడ ఒక 'సద్గురువు' వుండాలన్న ఆలోచన నాది..."*

*"అందుకేగా ఆ బృహస్పతిని ముందుగా ఆ ఇంద్రుడి పరం చేశావు !"* వృషపర్వుడు కసిగా అన్నాడు.

*“నారాయణ ! ఆ బృహస్పతిని మరిచిపో , వృషపర్వా ! ఆలోచనలో , ఆచరణలో , వ్యూహ రచనలో - ఆ బృహస్పతిని మించిన మహామేధావిని మీ కోసం ప్రత్యేకించి వుంచాను. అంకుశం లాంటి నిశితమైన బుద్ధి ! నిరంకుశమైన వైఖరి ! ముఖ్యంగా జాగ్రత్తగా విను - ముఖ్యంగా అసుర సంతతి పట్ల సానుభూతి. ఇన్ని అద్భుత లక్షణాలున్న...”*

*“ఎవరావ్యక్తి !"*

వృషపర్వుడు నారదుడి వాక్ ప్రవాహానికి ప్రశ్నతో అడ్డుకట్ట వేశాడు.

*"బ్రహ్మ మానస పుత్రశ్రేష్ఠుడు భృగుమహర్షి తెలుసు కదా ! ఆయన మీ అసుర సంతతికి చెందిన పులోమను పత్నిగా స్వీకరించాడు...."*

*"ఈ విషయాలు మాకు ఎరుకేలే , నారదా !"* వృషపర్వుడు అడ్డు తగిలాడు.

*"ఆ దంపతుల పంచమ పుత్రుడు - 'ఉశనుడు'... మహామేధావి. ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు. ముఖ్యంగా ఉశనడు , ఆ బృహస్పతికి దీటైన వాడు. సమ ఉజ్జీ ! నిజం చెప్పుకోవాలంటే - బృహస్పతి కంటే - రెండాకులు ఎక్కువే చదివాడు. ప్రధానంగా మనకు అనుకూలించే అంశమేమిటంటే - తల్లి పులోమ ఉశనుడికి ఆ సుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. ఆ ఉశనుడు ఏ తపో దీక్షలోనో పూర్తిగా మునిగిపోక ముందే... పట్టుకోవడం మంచిదని నా సూచన !"*

*"మా సూత్రధారిగా వ్యవహరించి , కార్యం సానుకూలం చేయవచ్చు కదా , నారదా !"* వృషపర్వుడు ఆశగా అడిగాడు.

*“నారాయణ ! అందుకేగా వచ్చాను ! ఇంద్రుడికి ఒక గురువును సూచించాను. నీకు ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి మీకు తెలిసి వస్తుంది ! ఎంత త్వరగా భృగుదర్శనం చేసుకుంటే అంత మంచిది.”*

*"ఇంతకాలం నారదుడు 'సురపక్షపాతి' అని అనుకునే వాణ్ని ! వాస్తవానికి నువ్వు 'అసురపక్షపాతి' అని ఇప్పుడు అర్థమవుతోంది నారదా !"* వృషపర్వుడు చిరునవ్వుతో అన్నాడు.

*“నారాయణ ! అసురులకు ఆవేశం అధికం అని ఊరికే అన్నారా”* నారదుడు నవ్వుతూ అన్నాడు. 

*"భృగుమహర్షి ఆశ్రమానికి..."*

*“ఉగ్రా ! రథం సిద్ధం చెయ్ !”* నారదుడికి అడ్డు తగుల్తూ ఆవేశంగా అన్నాడు. వృషపర్వుడు.

*"అసుర గురువుగానా?”* భృగుమహర్షి సాలోచనగా అన్నాడు.

*"ఔను ! మాకు మార్గ నిర్దేశకులు కరువయ్యారు. విద్యాదానం చేసే ఆధ్యాపకులు లేరు. ఉశనుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్తున్నారు. మీరు అంగీకరించాలి , మా కులాన్ని ఆశీర్వదించాలి !"* వృషపర్వుడు వినయంగా అన్నాడు.

*"సరే అనండి , భృగుమహర్షీ ! దైత్య దానవ బాలకులూ , యువకులూ విద్యా గంధం లేకుండా వున్నారు. పాపం !"* నారదుడు అందుకుని అన్నాడు..

*“ప్రసాదించండి"* పులోమ కల్పించుకుని అంది.

భృగుమహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పులోమ చిరునవ్వు నవ్వింది. *"ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉశనుడిలాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని అడిగాను.”*

*"నాన్నగారూ !”* అంత వరకూ మౌనంగా ఉన్న ఉశనుడు అన్నాడు. *"అమ్మ సంకల్పాన్ని ఆచరణలో పెడదాం. నాన్నగారూ !"*

భృగుమహర్షి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు.

*"మీ అందరి అంగీకారాన్ని ఆమెదించకుండా ఎలా ఉంటాను ! ఉశనా ! అసుర గురువుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలి సుమా !”*

*"మీరు అనుగ్రహించిన విద్య నాకు ఆ కీర్తిని తెచ్చి ఇస్తుంది. నాన్నగారూ !"* ఉశనుడు వినయంగా , సగర్వంగా అన్నాడు..

*"అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా ఋణపడి ఉంటుంది , మహాత్మా !"* వృషపర్వుడు భృగుడికి పాదాభివందనం చేశాడు.

*"మాతా ! దీవించండి !"* అంటూ పులోమ పాదాలు స్పృశించాడు.

*"వృషపర్వా ! ఉశనుడిని రాక్షస గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం..."* నారదుడు హెచ్చరించాడు.

*"శుభస్య శీఘ్రం ! వృషా ! నారదుల వారు చెప్పినట్టు రేపే ఆ శుభకార్యం ముగించు"* భృగుమహర్షి అన్నాడు.

*“అంగరంగ వైభవంగా , ఆ దేవతలను మించి , మా గురుదేవులను పట్టాభిషిక్తుల్ని చేస్తాను !"* వృషపర్వుడు ఆవేశంగా అన్నాడు.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 48*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 48*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

యుక్తవయసులో నరేంద్రుడు భగవంతునికి రూపం లేదు, విగ్రహారాధన తప్పు అని

భావించసాగాడు.తాను నిజమని నమ్మే దానిని ఎవరితోనైనా సంకోచించక చెప్పడం నరేంద్రుని నైజం. ఒక రోజు శ్రీరామకృష్ణుల సమక్షంలోనే గిరీశ్ ప్రభృతులతో అతడు ఈ విషయం గురించి వాదన చేశాడు. 

నరేంద్రుడు: భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఋజువు లేకుండా ఎలా విశ్వసించగలను?

గిరీశ్: విశ్వాసం అన్నదే దానికి ఋజువు. 

భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే, నువ్వు ఆయనను విశ్వసించవు. 'నేనే భగవంతుణ్ణి. మానవరూపంలో వచ్చాను' అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనవచ్చు.

నరేంద్రుడు  : మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట, 'బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది' అని ఉంది. అందులోనే మళ్లీ మరొక చోట, 'పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు' అని ఉంది. మనుస్మృతిలో మనుపు తన గురించే వ్రాశాడు. మోజెస్ పెంట్యాట్యూక్లో తన మరణం గురించే వర్ణిం చాడు.

సాంఖ్యశాస్త్రం ప్రకారం 'ఈశ్వరా సిద్ధేః' - అంటే 'భగవంతుడు ఉన్నాడు' అనే దానికి ఋజువు లేదు. మళ్లీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి. వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది.

కాని ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చేయండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరిం చాలి? శ్వేతవర్ణ కాంతి ఎర్రటి యానకం ద్వారా వస్తే ఎర్రగానూ, పచ్చని యానకం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను కనిపిస్తుంది.

 శ్రీరామకృష్ణులు : గీత సకలశాస్త్రాల సారం. సన్న్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది. 

ఒక భక్తుడు : శ్రీకృష్ణుడే (భగవంతుడే) గీతోపదేశం చేశాడు.

నరేంద్రుడు : శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరయినా చేశారో? నరేంద్రుని పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరబోయారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 32*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 32*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*శివః శక్తిః కామః క్షితి రథ రవిశ్శీతకిరణః*

*స్మరో హంస శ్శక్ర స్తదనుచ పరా మార హరయః |*

 *అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితాః*

           *భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ‖*  

ఇంతకు ముందు శ్లోకంలో శ్రీవిద్యా తంత్రమును గురించి చెప్పిన శంకరులు ఈ శ్లోకంలోనూ తరువాతి శ్లోకంలోనూ శ్రీవిద్యా మంత్రమును గురించి చెప్తున్నారు. 

ఇందులో కొన్ని బీజాక్షర సంకేతాలను నిక్షిప్తం చేశారు. రహస్య మంత్రములను అర్హత లేనివారికి ఉపదేశించరు. కానీ సామాన్యులైన ప్రతివారు తరించటానికి ఇలా చేశారు. ఇందులో పంచదశీ మంత్రమును చెప్పారు. 

శ్రీవిద్య మూడు కూటములతో కూడిన విద్య. అవి 'క'  'హ'  'స'  విద్యలు. ఈ మంత్ర బీజాక్షరాల సంపుటములైన 'హా'ది విద్య 'కా'ది విద్యలను గురించి  తరువాతి శ్లోకంలో వివరంగా చెప్పారు. ఈ సంకేతములు కూడా గురుబోధ లేని వారికి అర్ధం కావటం సులభం కాదు.

శివః శక్తిః కామః = ఈ మూడూ ఒక కూటమి. 

కామః అనగా సంకల్ప శక్తి (ఇచ్చా శక్తి ). ఒక్కడుగా వున్న పరమేశ్వరుడు  తాను అనేకుడుగా కావాలనుకోవడం. ఈ మూడూ 'హ' కారమును సూచిస్తాయి.

తరువాత క్షితిః 'ల'కారం  

అథః తరువాత

రవిః శీతకిరణః స్మరః  హంసః శక్రః ఇవన్నీ ఒక కూటమి.

 క్షితి = భూమి 

రవిః = సూర్య సంబంధమైన బీజం 'హ'కారం

శీతకిరణః = చంద్ర సంబంధమైన బీజం 'స'కారం

స్మరః =మన్మధుడు 

హంసః = సూర్యుడు 'హ'కారం

శక్రః = ఇంద్రుడు 'ల'కారం వీరి సంకేతములైన వర్ణములు

తదనుచ = వీటిని అనుసరించి 

పరా (శక్తి), మార (మన్మధుడు) హరుడు (శివుడు) వీరి సంకేతాలైన వర్ణాలు (అక్షరాలు)  

హృల్లేఖాభిః = హ్రీoకారం(బీజాక్షరం)

 అవసానేషు ఘటితా = చివరిలో కలిపితే హాది విద్యా మంత్రము అవుతుంది. మంత్రాధిదేవతలను ఈ విధంగా రహస్య మంత్రములుగా నిక్షిప్తం చేశారు. 

తవ జనని = తల్లీ నీ రూపాలైన  

భజంతే వర్ణాస్తే = ఈ వర్ణములను ధ్యానిస్తే

 నామావయవతామ్ = నీ నామమే అవుతుంది. 

అనగా మంత్ర శబ్దాకృతి దేవత యొక్క అవయవములుగా, రూపముగా, నామముగా, పరిణమిస్తుంది.

         🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 48*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 48*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

యుక్తవయసులో నరేంద్రుడు భగవంతునికి రూపం లేదు, విగ్రహారాధన తప్పు అని

భావించసాగాడు.తాను నిజమని నమ్మే దానిని ఎవరితోనైనా సంకోచించక చెప్పడం నరేంద్రుని నైజం. ఒక రోజు శ్రీరామకృష్ణుల సమక్షంలోనే గిరీశ్ ప్రభృతులతో అతడు ఈ విషయం గురించి వాదన చేశాడు. 

నరేంద్రుడు: భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఋజువు లేకుండా ఎలా విశ్వసించగలను?

గిరీశ్: విశ్వాసం అన్నదే దానికి ఋజువు. 

భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే, నువ్వు ఆయనను విశ్వసించవు. 'నేనే భగవంతుణ్ణి. మానవరూపంలో వచ్చాను' అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనవచ్చు.

నరేంద్రుడు  : మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట, 'బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది' అని ఉంది. అందులోనే మళ్లీ మరొక చోట, 'పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు' అని ఉంది. మనుస్మృతిలో మనుపు తన గురించే వ్రాశాడు. మోజెస్ పెంట్యాట్యూక్లో తన మరణం గురించే వర్ణిం చాడు.

సాంఖ్యశాస్త్రం ప్రకారం 'ఈశ్వరా సిద్ధేః' - అంటే 'భగవంతుడు ఉన్నాడు' అనే దానికి ఋజువు లేదు. మళ్లీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి. వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది.

కాని ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చేయండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరిం చాలి? శ్వేతవర్ణ కాంతి ఎర్రటి యానకం ద్వారా వస్తే ఎర్రగానూ, పచ్చని యానకం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను కనిపిస్తుంది.

 శ్రీరామకృష్ణులు : గీత సకలశాస్త్రాల సారం. సన్న్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది. 

ఒక భక్తుడు : శ్రీకృష్ణుడే (భగవంతుడే) గీతోపదేశం చేశాడు.

నరేంద్రుడు : శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరయినా చేశారో? నరేంద్రుని పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరబోయారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సూర్యోదయ వర్ణనం!*

*పోతనగారి  సూర్యోదయ వర్ణనం!* 

  కం:  అరుణహరి నఖర  విదళిత

గురు తిమిరేంద్ర  కుంభకూట  వినిర్ము

      క్త  రుధిర మౌక్తికముల  క్రియ

సురపతి దిశఁ   గెంపు తోడఁ  జుక్కలు  మెఱసెన్;  

         భాగ-  దశ-స్కం;  1302  పద్యము-  పోతన  మహాకవి;

సీ:   పౌలోమి  తన బాలు  పాన్పుపైఁ  గనుపట్టఁ

బన్నిన  బవడంపు  బంతియనఁగ;

    నాయురర్ధముల  వ్యయంబు  లొత్తిలి  చాటు

  కాల జాంఘకు  చేతి  గంట  యనఁగ :

ఘనజంతు  జీవిత   కాలరాసులు  విధిఁ గొల్వ                                            నెత్తిన  ఘన  హేమకుంభమనఁగ;

పశ్చిమ దిక్కాంతఁ  బరగఁ  గైసేయుచో

                                             ముందర  నిడుకొన్న  ముకురమనఁగ; 

     గీ:  కోక తాపోప శమన  దివ్య  ఘుటిక  యనఁగ,

           పద్మినీకాంత  నోముల  ఫలమనంగ ,

           మూడు మూర్తుల  సాకారంపు  ముద్దయనఁగ

      మిహిర  మండల  ముదయాద్రి  మీద  నొప్పె!  

         భాగ-  దశ-స్కం;  1303  పద్యం ;  బమ్మెఱ పోతన మహాకవి!

      ఎందరో కవులు  తమకావ్యాల్లో  సందర్భాను సారంగా  సూర్యోదయ  సూర్యాస్తమయ  దృశ్యాలను  వర్ణించారు.

ఒక్కొక్క కవిది  ఒక్కొక్కబాణి.  పోతన వర్ణించిన  సూర్యోదయ దృశ్యమిది.

   బలరామ  కృష్ణులు  మేనమామ  పిలుపున  మధురలో   విడిసిన  సందర్భమున  నీవర్ణనమున్నది.

రెండు  పద్యాలుగా  మనమిప్పుడు  చెప్పుకో బోతున్నాం.  మొదటిది కందపద్యం!

*మొదటి పద్యభావం:*  అరుణోదయం  సిహంలా  ఉన్నదట. అది  రాత్రియనే మదపుటేనుగు  కుంభస్ధలం  బ్రద్దలుకొడుతున్నదట. ఆసందర్భంలో  ఆకుంభస్ధలం  నుండిరాలే ముత్యాలవలె తారకలు సంధ్యారాగంలో  చూపరులకు

కాననౌతున్నవట! 

రాత్రి అనేఏనుగు, అరుణోదయమనే సింహము, నక్షత్రములనే  ముత్యములు, ఇవీపోలికలు:

           రాత్రియనే  మత్తేభంమీద అపుణోదయ  సింహంలఘించింది  కుంభస్థలం ఛేదించింది.  అంతే అందులో ఉన్న ముత్యాలు రాలిపడుతున్నాయి. ఆదృశ్యాన్ని తలపిస్తోంది. తొలివెలుగురేఖలు తూర్పున ఉదయిస్తుంటే.

    (సముద్రం, మొసలినోరు, ఏనుగు కుంభస్థలం,  ముత్యాలకు  నెలవులని  కవిసమయం )

      ఇఁక  రెండవ పద్యానికి వద్దాం!   ముందు భావం  చెప్పుకుందాం!

"తూరుపు దిక్కున   కనబడుతున్న  అరుణకాంతి  శచీదేవి (పౌలోమి) తనకొమరుడాడుకునుటకు  వేలాడదీసిన పగడాల  బంతియా, యనునట్లుగను,

    ఆయుః పరిమాణముల  లెక్కలు  వినిపించుటకు కాలమనే  గణకుడు వాయించే  చేతిలోనిగంటయా, యనునట్లును,

ప్రాణుల  ఆయుఃప్రమాణమును  కొలుచుటకై  బ్రహ్మగారు  యెత్తిపట్టుకొన్న   బంగరు కుండయా, యనునట్లుగను,

      పశ్చిమ  దిక్కనే వనిత  యలంకరణమునకై  తనయెదుట  నిలుపుకొన్న  నిలువు  టద్దమా, యనునట్లుగను,

చక్రవాకముల  విరహతాపమును దీర్ప కాలవైద్యుడిచ్చిన  మందుమాత్రయా, యనునట్లును,

పద్మినీ కాంత(తామరపూవు)  నోచిన  నోముల  ఫలమా, యనునట్లుగను,

లోకాలనేలు  ముగ్గురు  మూర్తుల  ఆకారపు  మద్దయా, యనునటులను               సూర్యమండలము  ఉదయాద్రిపై  ఒప్పారెను.

*విశేషాంశములు:-* 

 ముందు కంస వధ జరుగ నున్నది. తత్ సూచనలను  యీపద్యమున కవి నిపుణముగా  ప్రవేశపెట్టి

నాడు. గణకుడు గంటలు మ్రోగించుట  మనలోకొందరికి పరిచయమే. ఆస్తుల వేలంపాటలలో అమీనా  పాట పూర్తయిందని చెప్పటం

కోసం ఒకటోసారి (గంట ) రెండోసారి (గంట)  యీవిధంగా హెచ్చరస్తాడు.అదిగో ఆగంటమాదిరి అరుణుడున్నాడట!

        పల్లెలలో  ధాన్యకొలవటానికి  లోహాలతో  చేసిన పాత్రలుంటాయి. ప్రాణుల ఆయువునుకొలిచే కొలపాత్రలా అరుణోదయమున్నదట.  

       చంటి పిల్లలు ఆడుకుంటానికి  ఉయ్యాలపైన రంగురంగుల  బంతులు కడుతూ ఉండేవారుగదా  ఆమాదిరిగా శచీ

దేవి తన కొమారునకు ఆటల నిమిత్తం కట్టిన పగడాల బంతిలా అరుణుడున్నాడట.

       పశ్చమ దిగంగన  అలంకారం   చేసికోవటానికి   ముందు నిలుపుకొన్న  అద్దంలా ఉన్నాడట.

సూర్యోదయం జరిగేది తూర్పుననే , కానీ  అది  పశ్చిమ దిశాభి ముఖంగానేకదా! చక్కగాఉందివర్ణన.

         చక్రవాకములని  ఒకరకం పక్షులున్నవట. వాటికి రాత్రి వియోగం  పగలు  సమాగమం.  రాత్రంతా  పడిన విరహ తాపం తగ్గటంకోసం అవివేసుకునే  ఔషధ గుళిక లాగ అరుణుడున్నాడట. 

ఆడవారు సౌభాగ్యంకోసం  యెన్నో నోములు నోచుతూ ఉంటారు.    పద్మినిచేసిన నోములఫలమా  యనేవిధంగాఅరుణోదయమైనదట.

        త్రిమూర్త్యాత్మక  స్వరూపం  సూర్యభగవానుడు. బ్రహ్మ  విష్ణు  మహేశ్వరులకు  ప్రతిరూపమని వేదములుఘోషిస్తున్నాయి. 

ఆవిధంగా  సూర్యోదయమైనదంటారు  పోతనగారు!                                               *స్వస్తి!* 

*సేకరణ:- శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

నాలుగవదైన ముక్తి

 శ్లోకం:

*తథా చైత్రమాసస్య రాకాదినే వాఽథ*

  *భద్రే చ రాధాష్టమి సద్దినే వా ।*

*పఠేద్భక్తియుక్తస్త్విదం పూజయిత్వా*

 *చతుర్ధా సుముక్తిం తనోతి ప్రశస్తః ॥*

భావం: చైత్రమాస పౌర్ణమినాడు లేదా భాద్రపదమాసం రాధాష్టమి నాడు ఇష్టదేవతను భక్తితో పూజించి, పారాయణ చేసిన వ్యక్తి నాలుగవదైన ముక్తిని పొందుతాడు.

ముక్తి నాలుగు విధాలని - అవి సారూప్య, సాలోక్య , సామీప్య మరియు సాయుజ్య ముక్తి అని శ్రీమన్మధ్వాచార్యులు వివరించారు.

*సారూప్యం*: భగవంతుని రూపం పొంది ఆయనకి సేవ చేయడం

*సాలోక్యం*: భగవంతుని దివ్య ధామంలో ఉంటు ఆయన సేవ చేయడం

*సామీప్యం*: భగవంతునికి అతి చేరువలో సమీపంగా ఉంటూ సేవించడం

*సాయుజ్యం*: భగవంతునిలో ఐక్యమవ్వడం. (ఇది అద్వైతములో చెప్పబడిన ముక్తి.)

పంచాంగం 26.09.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 26.09.2023 Tuesday,

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: ద్వాదశి తిధి భౌమ వాసర: శ్రవణా నక్షత్రం సుకర్మ యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.

ద్వాదశి రాత్రి 01:44 వరకు.

శ్రవణం పగలు 09:39 వరకు .

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:05

వర్జ్యం : మధ్యాహ్నం 01:14 నుండి 02:40 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:20 వరకు తిరిగి రాత్రి 10:55 నుండి 11:43 వరకు.

రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

శుభోదయ:, నమస్కార: