17, జనవరి 2022, సోమవారం

గుండెనొప్పి వచ్చినప్పుడు

 *గుండెనొప్పి వచ్చినప్పుడు* ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది !


       అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది !

       

       ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా, ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?......

        

       ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో Dr గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత !

     

        ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి........ మనకు ఇంకా *ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది*, మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????😱

   

       అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క *దగ్గటం* మాత్రమే ! 😊 ! *ఆశ్చర్యంగా వుంది కదూ !* ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే ! అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని 

దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !  

   

       ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది,ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి చేరు కోవటానికి తోడ్పడుతుంది ! అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటు ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !

        

        ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం !

   

   *హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు*

   

      అందువల్ల, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే పరోక్షంగానైనా ఎందరికో సహాయ పడిన వాళ్ళ మవుతాం !

 *ఏ టీవీ. ఛానెల్స్ అయినా ఎన్నికల ముందస్తు సర్వే

 రిపోర్ట్ ప్రసారం చేస్తున్నప్పుడు, ప్రాంతం వారీగా కులాల జనాభా శాతం ఈ విధంగా చెబుతున్నారు*


ఈ ప్రాంతాల్లో 

15% ముస్లింలు

1% బ్రాహ్మణులు

17 % రెడ్లు

04 % క్షత్రియులు

12 % కమ్మలు

37% బి.సి.లు

12% షెడ్యూల్ కులాలు

02 % గిరిజనులు...


👇 *వాళ్లు ఈ విధంగా ఎందుకు చెప్పరు* ? 


ఈ ప్రాంతంలో 

62% హిందువులు, 

10% క్రిస్టియన్ లు, 

మరియుముస్లిం లలో 

5% సున్నీ ముస్లింలు 

మరియు 

10% షియా ముస్లింలు ఉన్నారు. అని.??


ముస్లిం లలో 

కసాయి------------0.5 %

గహీ ------------ 0.5 %

అన్సారీ -----------01 %

హజ్జమ్ -----------0.5 %

కయంఖాని -------- 0.5%

సయ్యద్---------------01 %

పఠాన్ ------------- 01 %

షేక్ --------------- 02 %

షఫీ ----------------01 %

మణిహార్ ---------- 01 %

సల్మానీ (ధోబి) ----- 0.5 %

ఇద్రిసి (టైలర్) ------ 0.5 %

మన్సూరి ------- 0.5%

బాబర్చి ---------- 0.5 %

మిరాసి ----------0.5%

భండ ------------01 %

పింజారీ --------- 0.5%

నూర్ భాషా ---- 01%

దూదేకుల ------ 01%

ఉన్నారు. అని?


ఇలాంటి ప్రసారాలు టీవీలో ఎవరైనా చూశారా? లేక ఏ వార్తాపత్రికలోనైనా?


అలాంటప్పుడు కేవలం హిందువుల విభజన ఎందుకు?


ఎందుకంటే *హిందూజాతిని ఏకమవకుండా విభజించే కుట్రలో భాగమే* 


హిందూ ధర్మం ప్రకారం 4 కులాలు ఉంటే రాజ్యాంగంలో 7000 కులాలు ఎక్కడ నుంచి వచ్చాయి?


ఈ విధంగా *హిందువులను* 7000 *కులాలుగా విభజించి* మొఘలులు మరియు బ్రిటీష్ వారు పాలించారు.


ఇక ముస్లిం లలో మిగతా సమయంలో వారిలోని కొన్ని కులాల మీద వివక్ష ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి అంతా ఒక్కటే కులం. వారి దృష్టిలో ప్రపంచంలో రెండే రకాల ప్రజలు. 

1) *ముస్లిం లు* 

2) *కాఫిర్ లు* 


ఏ ఛానల్స్ ఐనా *ముస్లింలలోని కులాల గురించి ఎందుకు మాట్లాడవు* ..❓


*ఇక నుండి మార్పు రావాలి. హిందూ సమాజం ఐక్యం అవ్వకపోతే అంతరించిపోతుంది. తురకల చేతిలో మీ ప్రాణాలే మిగలవు, ఇక కులాలు మిగిలుంటాయా?*


🚩 *జాగో హిందూ*

 బెంగళూరును అతిచౌకగా అనగా కేవలం మూడు లక్షల రూపాయలకే అమ్మేసిన నాటి పాలకుడెవరు ?

.............................................................


(1) ప్రళయకావేరి అనగా ?


(అ) కావేరినదికి ఉపనది

(ఆ) కావేరి నదికే మరోపేరు

(ఇ) పులికాటు సరస్సు

(ఈ) చిలుకసముద్రం


(2) శ్రీకృష్ణదేవరాయలకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు.ఒక కూతురైన తిరుమళాంబను ఆళియ రామరాయలు మనువాడాడు.మరో కూతురును ఆళియరామరాయల తమ్ముడైన తిరుమలదేవరాయలు పెండ్లాడాడు. పెద్దకొడుకు పేరు తిరుమలయ్యదేవరాయలు. చిన్న కుమారుడి పేరు గురించి ఎక్కడా ప్రస్తావనలు లేవు, తెలియదు. మరి శ్రీకృష్ణదేవరాయల రెండో కూతురి పేరేమో చెప్పగలరా ?


(అ) తిమ్మాంబ

(ఆ) వెంగళాంబ

(ఇ) మంగాంబ

(ఈ) కృష్ణాంబ


(3) 1542 నుండి 1572 వరకు సదాశివరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతను పేరుకే రాజు, రాజ్యాధికారం ఆళియ రామరాజు, తిరుమలదేవరాయలుదే. సదాశివుడే తుళువవంశంలో చివరి చక్రవర్తి. ఇంతకు ఇతనేవరి కొడుకు ?


(అ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన శ్రీరంగరాయల కొడుకు.

(ఆ) శ్రీకృష్ణదేవరాయల స్వంత అన్నయైన వీరనరసింహరాయల కొడుకు.

(ఇ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన అచ్యుతరాయల కొడుకు.

(ఈ) తుళువ నరసరాజు కొడుకు.


(4) సాళువతిమ్మరాజు లేదా సాళువ తిమ్మరుసు (అప్పాజీ) తమ్ముడి పేరేమిటి ?


(అ) సాళువ గోవిందరాజులు

(ఆ) సాళువ మంగు

(ఇ) సాళువ గోపమంత్రి

(ఈ) సాళువ రామరుసు


(5) శ్రీకృష్ణదేవరాయల తండ్రైన నరసరాజు సాళువ నరసింగుని సేనాని, ఇతడు బెడందకోటపై దాడిచేసి దానినిసాధించాడు. బెడందకోట అనగా ఇప్పటి ?


(అ) ఆదోని

(ఆ) బీజాపురం

(ఇ) బీరారు

(ఈ) బీదరు


(6) శివాజీ సోదరుడైన ఏకోజి (మరోపేరు వెంకోజీ ) నుండి 3 లక్షల రుపాయలకు బెంగళూరును కొన్న మైసూరు పాలకుడెవరు ?


(అ) మొదటి కృష్ణరాజవడయార్

(ఆ) రెండోదేవరాజ వడయార్

(ఇ) మూడవ చామరాజ వడయార్

(ఈ) నాలుగవ చామరాజ వడయార్.


(7) ఒకసారి శ్రీకాళహస్తీలో మరోసారి తిరుమల శ్రీహరి సన్నిధిలో శంఖం నుండి జాలువారిన పవిత్ర జలంతో మరోసారి విజయనగరంలో ఇలా మొత్తం మూడుసార్లు పట్టాభిషక్తుడైన విజయనగర చక్రవర్తి ఎవరు ?


(అ) కంపన (కంపరాయలు)

(ఆ) మల్లికార్జున దేవరాయలు

(ఇ) విరూపాక్ష దేవరాయలు

(ఈ) అచ్యుతదేవరాయలు


(8) శివాజీ తనయుడు రాజారాం (సాహుజీ) ఔరంగజేబు చేతిలో ఓడిపారిపోయాడు. హిందూరాష్ట్ర స్థాపనకు కారకుడైన శివాజీ తనయుడు కష్టాలలో వున్నాడని ఈ రాణి విని, అతనికి తన రాజ్యంలో ఆశ్రయం కల్పించింది. దీంతో కోపించిన ఔరంగజేబు రాణిపై యుద్ధం ప్రకటించాడు. అజ్మత్ అరా నేతృత్వంలో మొగలుల భారీసేనలు దాడికి దిగాయి. ఈ రాణి ఆ సేనలను చిత్తుగా ఓడించింది.గతిలేక అజ్మత్ ఆరా ఆమెతో సంధిచేసుకొని వెనుదిరిగాడు. ఔరంగజేబునే ఎదిరించిన ఈ ధీరోద్ధాత రాణి గురించి మన పాఠ్యప్రణాళికలో లేకపోవడం దురదృష్టకరం.ఇంతకు ఆ రాణి పేరేమిటో మీకు తెలిసినట్టైతే చెప్పండి.


(అ) మహరాణి ఒనకే ఓబక్క

(ఆ) కెళదిరాణి చెన్నమాంబ

(ఇ) రాణిమంగమ్మ

(ఈ) రాణితిమ్మమాంబ


(9) వేలాపురానికి ప్రస్తుతమున్న నామధేయం ఏమిటి ?


(అ) వేల్పురము

(ఆ) వేలానగర్

(ఇ) గుడియాత్తం

(ఈ) వేలూరు (రాయవేలూరు)


(10) చావనైనా చస్తాను కాని మతం మారనని ధైర్యంగా ప్రశ్నించి ఔరంగజేబు చేతిలో చిత్రహింసలకు గురై మరణశిక్ష పొందిన ఛత్రపతి శివాజీ తనయుడెవరు ?


(అ) ఛత్రపతి సాహు

(ఆ) ఛత్రపతి రాజారాం

(ఇ) ఛత్రపతి శంభాజీ

(ఈ) ఛత్రపతి ఏకోజి

......................................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్‌ (రిటైర్డ్) 9441245857, అనంతపురం.

కలియుగం

 * కలియుగం ఎలా ఉంటుంది.


కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. 


ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  


ఆయన చెప్పనారంభించాడు.


కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.


కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.


కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం

చేస్తారు.


కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.


ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం

16, జనవరి 2022, ఆదివారం

కనుమలు అయిదు

 ❤️ *కనుమలు అయిదు*


💕 *కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం...అంటుంది శాస్త్రం.. !!*

💕 *కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చెయ్యదు...*


🌺 *మనకు ఉన్నవి ఐదు కనుమలు*


🌺 *సంప్రదాయంగా ఐదు కనుమల్లో ప్రయాణం చేయరాదని చెబుతారు.*


❤️ *"శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా*

*శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"*


❤️ *శవదహనం జరిగిన మరుసటి రోజు*

❤️ *గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు*

❤️ *సపిండీకరణమైన మరుసటి రోజు*

❤️ *గర్భస్రావం జరిగిన మరుసటి రోజు*

❤️ *సంక్రాంతి మరుసటి రోజు*

🌺 *వీటిని కనుమలు అంటారు.*


💕 *ఈ రోజుల్లో ప్రయాణించకూడదు*

సొంతింటి కల

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

   కోట జగదీశ్ గారి "సొంతింటి కల" కథనం.

                🌷🌷🌷

‘అక్కడేదో కనిపిస్తోంది. అదొక్కటీ చూసేసి ఇంటికెళిపోదాం!’ అంది సావిత్రి. అప్పటికే చాలాసేపట్నుంచీ ఊరంతా తిరుగుతున్నారు. ఎలాగైనా నెలాఖరుకల్లా ఏదో ఒక అపార్ట్‌మెంట్ బుక్ చేసెయ్యాలని నిర్ణయించుకున్నారు. 


‘ఇది డెడ్ ఎండ్‌లా ఉంది. దీని తరవాత ఇంకలేవు. పేరు కూడా ఎన్‌క్లేవ్ అనే పెట్టాడందుకే!’ చిరాకుని చిగురాకంత చిరునవ్వుతో దాచాలని ప్రయత్నిస్తున్నాడు ప్రసాద్.


బిల్డింగైతే చూడటానికి ఏదో బానే వుందనిపిస్తోంది. కింద మేనేజర్ని అడిగితే మూడో అంతస్తులో ఖాళీ ఉన్నాయని చెప్పాడు. లిఫ్టదీ ఇంకా తయారవలేదు. మెట్లెక్కి పైకి వెళ్లారు. ఇల్లంతా కలియజూసేసి కిచెన్ వైపు వచ్చారు. దక్షిణం వైపు బాల్కనీలోకి వచ్చి గోడవతల దృశ్యం చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయారు.


అప్పుడే ఫ్రెష్‌గా శవాన్ని కాలుస్తున్నారక్కడ. పక్కనే, గోడనానుకునే స్మశానం. 


‘ఇదేందివయా ఇదీ? బెడ్‌రూమ్ కిటికీలోంచి చూస్తే డైరెక్టుగా కనబడేలా ఉంది? సీ వ్యూ, లేక్ వ్యూ పేర్లు పెడతారు చూడూ, దీనికి ‘గ్రేవ్ వ్యూ’ అపార్ట్‌మెంట్స్ అని పెట్టండి పేరు. సరిపోతుంది. పద సావిత్రీ!’


‘సర్, అదేంలేద్సార్! మనకసలు ఎటువంటి డిష్టబెన్సూ ఉండదు. ఇన్నిరోజుల్నించీ కడతన్నామా, ఇప్పటివరకూ ఒక్క బాడీని కూడా కాల్చలేద్సార్! బాడ్‌లక్ మీరొచ్చినపుడే రావాలా? అయినా మన కాంపౌండ్ వాల్ చాలా హైటొస్తాద్సార్! కిటికీలకి టింటెడ్ గ్లాసేసుకుంటే కనబడే అవకాశం కూడా ఉండదు!’ 


ఎలాగోలా ఒప్పించేద్దామని చూస్తున్నాడు.


‘వద్దులే తమ్ముడూ! మాకు సెంటిమెంట్లవీ ఎక్కువ. ఇలా స్మశానాలవీ ఆక్రమించేసి రియల్ ఎస్టేట్‌ కాస్తా బరియల్ ఎస్టేట్‌లా మార్చేస్తున్నారు!’


చూసింది చాల్లే అనుకుని కిందకొచ్చి బండెక్కేశారు. ఎండ తీవ్రంగా ఉంది. ఇక ఆపేసి ఇంటికెళిపోదామని నిర్ణయించుకున్నారు దంపతులిద్దరూ.


మెయిన్‌రోడ్డు మీదకు రాగానే వెంకట్రెడ్డి కనబడ్డాడు. 


‘నమస్తే ప్రసాద్‌గారూ! ఇళ్ల వేటా? ఇంకా కొనలేదేటి?’ అన్నాడు పెద్దగొంతేసుకుని.


‘ఏవీ నప్పట్లేదు వెంకట్రెడ్డీ! మీ బావమరిదేదో కడుతున్నాడని చెప్పావు, పూర్తైందా?’


‘అయిపోవచ్చింది ప్రసాద్‌జీ! కానీ కాస్త తక్కువ రేంజ్. మీకు నచ్చుద్దోలేదో?’


‘ఒకసారి చూసేస్తే పోలా? పద వెళ్దాం!’


అక్కణ్ణుంచి మూడువీధులవతల కాస్త గోప్యంగా కట్టాడు బిల్డింగ్. చుట్టూ బోల్డన్ని చెట్లు, పొదలమధ్య దాక్కున్నట్టుంది బిల్డింగ్.


రెడ్డి చెప్పినట్టు కాస్త మీడియం రేంజే! గదులవీ బావున్నాయి కానీ బాల్కనీలు మాత్రం చిన్నవి. బెడ్‌రూమ్ కిటికీని బాగా దగ్గరగా ఆనుకుని పక్కనే మరొక అపార్ట్‌మెంట్ వాళ్ల బాల్కనీ ఉంది. ఏ పచ్చిమిరపకాయలో అయిపోతే అక్కణ్ణుంచి విసిరితే ఇటొచ్చి పడేంత దగ్గర. 


కిటికీగనక తీస్తే ఆయింట్లో ఉండేవాళ్ల డ్రాయర్లు, లంగాల కలర్సన్నీ మనకి కంఠతా వచ్చేస్తాయి. అన్నీ సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఆరేశారు. చెరుకుపల్లి టవర్స్ కాదు. ఇరుకుపల్లి టవర్సని పెట్టాల్సింది పేరు. నవ్వుకుని బయటికొచ్చాడు ప్రసాద్.


బాత్రూములోకి వెళ్లి చూశాడు. ప్లంబర్ కుర్రాడెవరో బాగా అప్రెంటిస్ అనుకుంటా! ఫ్లష్ ట్యాంకుకీ, కమోడ్‌కీ కనీసం తొంభై డిగ్రీలైనా ఉండాలికదా? పాపం, ఎనభై డిగ్రీలే పెట్టిచచ్చాడు. దాంతో బాత్‌రూముకి వెళ్లిన ప్రతిసారీ ఆ లిడ్‌ని పైకెత్తితే, అదొచ్చి సరిగ్గా ‘అక్కడే’ పడి కొట్టుకుంటుంది. రోజూ ఆ హింస భరించడం ఎంతకష్టం? పైగా పైకి చెప్పుకోవడానికి కూడా వీల్లేని కష్టమది!


అయినా అతను మాత్రం ఏంజేస్తాడు, బాత్రూములు అంత చిన్నవిగా ఉంటే? 


మళ్ళీ నవ్వొచ్చింది ప్రసాద్‌కి. ఇవన్నీ వెంకట్రెడ్డితో మాటాడ్డానికి మొహమాటపడి థాంక్స్ చెప్పేసి బయల్దేరాడు. పాపం, ముందునుంచీ అంటూనేవున్నాడుగా మీకు నప్పదని!


భోజనం కానిచ్చి మళ్ళీ సాయంత్రం బయల్దేరి మరో పాష్ ఏరియాలో అడుగుపెట్టారిద్దరూ. ఒకటేదో ‘ఫ్లాట్స్ ఫర్ సేల్’ అని బోర్డు చూసి వెళ్లారు. సెల్లార్‌లో వైటండ్ వైట్ వేసుకుని ఏవో రాసుకుంటున్న ఒకతన్ని పేరూ, ఉద్యోగ వివరాలు చెప్పి పలకరించారు ఇద్దరూ. 


‘ముందు పైకెళ్లి చూసొచ్చి అప్పుడు రేటదీ మాటాడదాం!’ అంది సావిత్రి. సరేనన్నాడు సత్యవంతుడు. ఇద్దరికీ ఆ అపార్ట్‌మెంట్ చాలా నచ్చేసింది. పైగా దేనికదే సెపరేటుగా విశాలంగా కూడా ఉన్నాయి. 


కిందకొచ్చి ఆఫీసు రూములో కూర్చున్న తరవాత అడిగాడు ప్రసాద్


‘ఉన్నాయాండీ? లేక అయిపోయాయా?’


‘చెప్పండ్సార్! మీకే ఫ్లోర్లో కావాలి?’


‘ఫస్టయితే దోమలెక్కువగా వుంటాయిట. థర్డ్, ఫోర్త్ కరెంటు లేకపోతే ఎక్కడం కష్టం. అంచేత సెకండే బెటరనిపిస్తోంది!’ 


ఇది అనేకానేక చర్చల తరవాత దంపతులిద్దరూ తీసుకున్న నిర్ణయం. 


‘సెకండా? ఉండండి చూస్తాను. మూర్తీ, ఆ డైరీ పట్రా ఓసారి!’ అంటూ ఎల్ఐసీ వాళ్ల డైరీ ఒకటి తెరిచి అన్నీ పరికించి బుర్ర అడ్డంగా ఊపాడు.


‘ఏంటి? లేవా?’ అన్నాడు నిస్పృహతో!


‘అసలెప్పుడో అయిపోయాయి సార్! మీరు చాలా లేటుగా వచ్చారు. మేవిఁక్కడ అపార్ట్‌మెంట్ కట్టాలని మనసులో అనుకున్నప్పుడే సగం ఫ్లాట్స్ బుక్కైపోయాయి. అలాంటిది మీరింత ఆలస్యంగా వచ్చి అడిగితే ఎలా?’ అంటూ మందలించాడు. 


ఎంసెట్‌కి ఆలస్యంగా వచ్చినా క్షమిస్తారేమోగాని ఇతనసలు క్షమించేలా లేడు.


కాసేపు నిశ్శబ్దం. ప్రసాద్ మొహంలో కొంతైనా పశ్చాత్తాపం కనబడుతుందేమో, ఇంకొంచెం బెట్టు చేద్దామనుకున్నాడు. 


కానీ వాళ్లిద్దరూ ‘ఆఁ! ఇది కాకపోతే వందున్నాయి. లోకం గొడ్డుపోయిందా?’ అన్నట్టు నిలబడ్డారు.


అప్పుడు అతనిలో చలనం వచ్చింది. 


‘పోనీ ఓపని చేద్దాం ప్రసాద్‌గారూ! మా బావమరిది అడిగాడని సెకండ్లో ఒకటుంచాను. అతనికి నేనేదో చెప్పుకుంటాన్లెండి. మీరు మా శ్యాంబాబుకి కావలసినవాళ్లు కాబట్టి అది మీకిచ్చేస్తాను. కాకపోతే ఎస్సెఫ్టీకి మరో యాభై ఎక్కువవుతుంది!’


ఇట్టాంటి స్ట్రాటజీలు చాలా విన్నాడు ప్రసాద్. అయినాసరే, ఆ ప్రాంతంలో ఉండాలన్న బలమైన కోరికతో ఒప్పేసుకున్నాడు. 


అది మొదలు సావిత్రికి రోజూ అందమైన కలలు రావడం మొదలయ్యాయి. ఆ విశాలమైన రోడ్లమీద చుట్టూ తురాయి చెట్ల నీడలో బొచ్చుకుక్కనొకదాన్ని తీసుకుని వాకింగులవీ చేస్తున్నట్టు, వర్షం పడుతోందని ఏ చెట్టునీడనో ఆగితే ఒక్కసారిగా గాలేసి ఆ చెట్టుపూలన్నీ తనమీద పూలవాన కురిసినట్టూ... 


‘పాలూ...!’ అని అరిస్తే అప్పుడు మెలకువొచ్చేది. 


పూలవాన నుంచి బయటపడి పాలక్యాన్ పట్టుకుని తలుపు తీసేది.


ప్రసాదుకి ఇటువంటి కలలవీ అలవాటులేదు. అతను చాలా మెటీరియలిస్టిక్. ఇల్లంటే ఇటుకలూ సిమ్మెంటనే అతని దృష్టి. అంచేత అతనెప్పుడూ ఇంటిచుట్టూ లాన్ల గురించి కాకుండా ఇంటికి కట్టాల్సిన లోన్ల గురించే ఆలోచించేవాడు.


పని చురుగ్గా సాగుతోంది. సావిత్రి ఎప్పటికప్పుడు వెళ్లి తనకెలా కావాలో మార్పులవీ చెబుతూ చేయించుకుంటోంది. పనివాళ్ళు చాలా చురుకైనవాళ్లు. చెప్పింది చెప్పినట్టు భలే మార్చేసేవారు. 


ఒకరోజు ప్రసాద్, సావిత్రి కలిసి వెళ్లారు. కింద సెల్లార్‌లో బిల్డర్ లేడు. పనివాళ్లని అడిగితే హరిద్వార్ వెళ్లాడని చెప్పారు. అతగాడి మేనమామగారు కూర్చున్నారు ఆఫీసులో. చూడ్డానికి వయసైపోయిన అరవింద్‌స్వామిలా ఉన్నాడాయన. అద్భుతమైన వర్ఛస్సు. నమస్కారాలు తెలిపి పైకి వెళ్లారు.


అక్కడ దృశ్యం చూసి మరోసారి కొయ్యబారిపోయారు.


కిచెన్‌నుంచి బయటికి వెళ్లే దారిలో పెద్ద ఫ్లోర్ విండో ఒకటి కనబడుతోంది. అది వీళ్లు చెప్పనేలేదసలు. ఒక్కసారిగా కంగారైపోయారు. బయటికొచ్చి అది సెకండ్ ఫ్లోరా కాదా అని రూఢీ చేసుకున్నారు. మళ్లీ లోపలికొచ్చి మేస్త్రీనడిగితే అతను మళ్ళీ కొయ్యబారిపోయే మాటొకటి అన్నాడు.


‘ఆచారిగారు ఆల్మోస్ట్ రోజూ వస్తన్నార్సార్! ఆయనే పెట్డమన్నారిది. మీకు చెప్పలేదా?’


‘ఆచారిగారెవరు?’ ఇద్దరూ ఒకేసారి అన్నారు. వాళ్లకి కొంకణ్ సినిమా సబ్‌టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టుంది.


అప్పుడు మేస్త్రీ కొయ్యబారిపోయాడు. మేనేజర్ని పిలిచాడు. అతను టెర్రస్ మీద వరసగా ఆరేడు సిగరెట్లు కాల్చి ఎనిమిదోది అంటించబోతోంటే కుర్రాడొచ్చి కేకేశాడు.


చిరాగ్గా కిందకొచ్చి మేస్త్రీ మీద కోప్పడ్డాడు.


‘ఇప్పుడేకదా పైకెళ్లాను? ఇంతలో ఏమైంది?’ అన్నాడు అక్కడే సిగరెట్ బయటికి తీసి. సావిత్రికి సిగరెట్ వాసన పడదని అతణ్ణి వారించాడు ప్రసాద్.


‘ఈ సార్ ఏంటడుగుతున్నారో ఆలకించండొకసారి!’ అన్నాడు మేస్త్రీ.


‘ఏంట్సార్?’ అంటూ రాష్‌గా అడిగాడు.


‘ఆచారిగారెవరు?’ అన్నాడు ప్రసాద్.


‘ఆయన షిప్‌యార్డ్‌లో పనిచేస్తారు. ఆయన్దేగా ఈ ఫ్లాటు?’ 


‘ఏం తమాషాగా ఉందా? మేస్త్రీగారూ, మేం మొదట్నుంచీ ఎన్నిసార్లు మార్పులవీ చెప్పాం? గుర్తులేదూ?’


‘అదే ఆశ్చర్యంగా ఉంద్సార్ నాక్కూడా! మీరు వెంటిలేటర్లవీ తీసీమని చెప్పారని అన్నీ మూసీసాం. ఆచారిగారొచ్చి దెబ్బలాడి మళ్లీ అన్నీ తెరిపించారు. నాకదే బోదపళ్లేదు!’ అంటూ తాపీ పడేసి తాపీగా కింద కూర్చుండిపోయాడు.


అప్పుడు మేనేజర్‌కి కంగారొచ్చింది. నాతో రండంటూ ఆఫీసురూముకి తీసుకెళ్లాడు. రాత్రింబవళ్ళు కుక్కచాకిరీ చేసి సంపాయించిన డబ్బంతా వీళ్ల మొహాన పోశాం. ఇప్పుడేమంటాడో? అన్న కంగారు ఇద్దరి మనసులోనూ.


ఆ పెద్దాయన డైరీ ఒకటి తీసి అందులో చూపుడువేలుతో సూచిస్తూ వివరాలన్నీ మూడునాలుగు సార్లు చూశాడు. అతనికి చెమటలు పట్టేశాయి.


ఆ ఫ్లాట్ ప్రసాద్ పేరునా, ఆచారి పేరునా కూడా రిజిస్ట్రేషన్ అయివున్నట్టుగా ఉందందులో! వేరే వేరే పేజీల్లో రాసుకున్నాడు బిల్డర్.


ఇక ఏడుపు మొదలెట్టింది సావిత్రి. ఆయనతో వాదనకి దిగారు. ఆయనేమో కంగారుపడొద్దని, మేనల్లుడు రాగానే సత్వరన్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపేశాడు.


ఆ బిల్డర్ చాలారోజులవరకూ రాలేదు. ఏ గంగలోనో దూకేశాడేమో అనుకున్నాడు ప్రసాద్. ఆఖరికి ఒకరోజు సిరిపురం జంక్షన్‌లో కరాచీవాలాలో ఏదో కొంటూ కనబడ్డాడు. అప్పుడు పరుగుపరుగున వెళ్లి వాణ్ణి నిలదీశాడు.


‘ఏదో పొరపాటు జరిగింది. ఆ ఆచారిగారు ఊరుకోవట్లేదు. కోర్టుకి వెళతానంటున్నాడు. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి!’ అని తిరిగి ప్రసాదునే సలహా అడిగాడు.


ఉద్యోగం చేసుకుంటూ ఏరాత్రికో ఇల్లుచేరే ప్రసాదుకి కోర్టుకి తిరిగే ఓపికా తీరికా లేవు. అంచేత ఇచ్చిన డబ్బంతా తిరిగిచ్చేస్తే చాలంటూ వేడుకున్నాడు.


తనదగ్గర అంత సొమ్ము ఎప్పుడూ ఉండదుట. అందువల్ల దఫదఫాలుగా ఇస్తానని చెప్పాడు.


ఆ తరవాత అతని వెనకాల తిరిగితిరిగి జీవితంలో అతిముఖ్యమైన ఆనందాలన్నిటినీ కోల్పోయారు ప్రసాద్ దంపతులు. లాండ్ లైన్ ఫోన్ ఎత్తడు. మొబైల్‌కి చేస్తే కట్ చేస్తాడు. బిల్డింగ్ దగ్గరకెడితే ఎప్పుడూ మేస్త్రీయే కనబడతాడు.


దాదాపు రెండేళ్లపాటు బాగా ఏడిపించి అప్పుడు మూడోవంతు సొమ్ము వాళ్లమొహాన పడేశాడు. అదే చాలనుకుని ఆరోజు స్వీట్స్ తెచ్చుకు తిన్నారు ప్రసాదు, సావిత్రి.


‘ఇక ఈ అపార్ట్‌మెంట్‌ల విషయంలో మనం ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మంచి అనుభవం వచ్చేసింది. ఇకనైనా జాగ్రత్తగా ఉందాం!’ అనుకుని ఒట్టేసుకున్నారు ఇద్దరూ!


యదార్ధగాథే! మాదే! పేర్లూ, ఉద్యోగసద్యోగాలూ మార్చానంతే!


......... *కొచ్చెర్లకోట జగదీశ్*

ఇల్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకోవడానికి పనికి వస్తుంది.

*కనుమ పండగ

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

*కనుమ పండగ “పశువుల పండుగ”*

 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.


     *🌷పశువుల పండుగ🌷*


ముఖ్యంగా చిత్తూరుజిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే, మద్ది మాను, నేరేడు మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని *"ఉప్పు చెక్క''* అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు, వన మూలికలే గదా.


ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు. పొంగలి అంటే కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని *"చిట్లా కుప్ప"* అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్ళను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని *''పొలి''* అంటారు. ఆ *"పొలి"* ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో *"పొలో.... పొలి"* అని అరుస్తూ చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే, తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటేలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది.

                  🌷🌷🌷

అయిదు కథలు*_

 _*నేడు సంక్రాంతి , సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.


1. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి , ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ , వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట ! 


2. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.

శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని , నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది ! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే , ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


3. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి *‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి , నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’* అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో *‘రోజూ ఆహారం తీసుకోవాలి , నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’* అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. *‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’* అని శపించాడు.

అప్పటి నుంచి ఎద్దులు , వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


4. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు , వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


5. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే , హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర , ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

మూడు రకాల పాపాలు

మూడు రకాల పాపాలు 

మనం సామాన్య దృష్టితో పుణ్యం, పాపం అని పేర్కొంటాం.  పాపం చేస్తే పాప ఫలం పుణ్యం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని మనం భవిస్తూవుంటాం. పాప పుణ్య విభజన మనం సామాజికంగా ప్రతివారు ధర్మపరులు కావాలని ఏర్పాటు చేసినట్లు కనపడుతుంది.  ప్రతివారు ఉత్తమమైనది మాత్రమే కోరుకుంటారు కాబట్టి పుణ్యకార్యాలు చేస్తే పుణ్యఫలంగా స్వర్గ ప్రాప్తి కలుగుతుందనే ఉద్దేశంతో పుణ్యాకార్యాలు చేస్తారు.  దీనివల్ల సమాజంలో అందరు సుఖ సంతోషాలతో ఉండగలరు. హిందూధర్మంలో ఏది చెప్పినా అది సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొనే ఉంటుంది. మన ఋషులు చాలా దూరం అలోచించి మనకు చక్కటి సాంప్రదాయాలను ఏర్పాటు చేసారు. 

ప్రతివారు తాము సద్గతులను పొందాలని పుణ్యకార్యాలను చేయటానికి పూనుకొంటారు.  వారు మరణానంతరం స్వర్గలోక నివాసం చేస్తారని మనకు శాస్త్ర ప్రమాణం. 

కానీ ముముక్షువులు మూడు రకాల పాపాలనుండి విముక్తుడు కావలి అప్పుడే మోక్షప్రాప్తి కలగదని మనకు ఉపనిషతులు తెలియచేస్తున్నాయి. 

మూడు రకాల పాపలు ఏవి. 

గృహస్థ జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి చాలా తేడా ఉంటుంది.  గృహస్తు  ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా తన జీవనానిని కొనసాగించాల్సి ఉంటుంది.  అదే ఆధ్యాత్మిక జీవనంలో సాధకుడు సదా ఆ పరబ్రహ్మ్ తత్త్వం వైపే పయనిస్తారు. నిత్యం, అనుక్షణం బ్రహ్మత్వంలోనే జీవిస్తాడు.  ఒకరకంగా చెప్పాలంటే సాధకుడు ఈ ప్రకృతితో సంబంధాన్ని సన్నగించుకొని దైవత్వం వైపు సంబంధాన్ని బలపరచుకుంటాడు.  కానీ విచిత్రం ఏమిటంటే ప్రక్రుతి యోగిని సదా వెన్నంటి ఉండి యోగికి అన్నివిధాల అనుకూలంగా మారుతుంది.  యోగి అతి చల్లని జలంతో కూడా స్నానం చేయగలడు, మండే మంటలమీద తన శరీరాన్ని ఉంచిన శరీరం కాలదు. అటువంటి అనేక అతీంద్రియ శక్తులు యోగికి కారతలామలకలం అవుతాయి.  యోగి వస్త్రధారణ చేయాల్సిన పనిలేదు రమణ మహార్షిలాంటి మహానుభావులు ఈ సమాజం కోసం కౌపీనం ధరిస్తారు కానీ నిజానికి అదికూడా వారికి అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యోగికి మన సమాజపు నియమాలు బందించవు కేవలం సదా వారి ద్రుష్టి పరబ్రహ్మ మీదనే ఉంటుంది. 

ఇక్కడ చెప్పే మూడురకాల పాపలు సమాజ జీవనము చేస్తున్న గృహస్తులకు కాదు కేవలం సంపూర్ణ సాధన చేస్తున్న యోగులకు మాత్రమే అందుకే నేను పైన అంతవివరణ ఇచ్చాను. 

ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం చేసే యోగులైన సాధకులకు మాత్రం ఉన్నటువంటి మూడు రకాల పాపలు ఏమిటో చూద్దాం. 

1) పాప పాపం: సాధారణంగా మనం పాపం అనుకునే పాపం దీనిని పాప పాపం అంటారు.  గృహస్తులు కానీ అలాగే సాధకులు కానీ పాప కర్మలు అంటే నిషిద్ధ కర్మలు చేయకూడదు. 

2) పుణ్య పాపం: ఇది వినటానికి కొంత విచిత్రంగా కనిపిస్తుంది ఎందుకంటె పుణ్యం పాపం కాదు కాదా మరి పుణ్య పాపం ఏమిటి అని మనం అనుకుంటాము. నిజానికి సాధకుడు పుణ్య కార్యాలు కూడా చేయకూడదు అంటే పుణ్యం కూడా మూటకట్టుకోకూడదు. ఎందుకంటె ఎప్పుడైతే సాధకుడు పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలాన్ని పొందుతాడో అప్పుడు ఆ పుణ్య ఫలం అనుభవించటానికి మరలా జన్మ ఎత్తవలసి వస్తుంది.  కాక పుణ్య ఫలం చాలా ఎక్కువగా ఉంటే దానిని అనుభవించటానికి పుణ్యలోకాలకు (స్వర్గం) వెళ్ళవలసి ఉంటుంది.  ఆ ఫలం పరిసమాప్తం కాగానే మళ్ళి మానవ జన్మ ఎత్తి మరల ఈ జరామృత్యు వలయంలో చిక్కుకోవలసి ఉంటుంది.  కాబట్టి సాధకుడు పుణ్యం కోసం ఏ కర్మను చేయకూడదు. 

3) అజ్ఞాన పాపం:  ఇది మనకు సాధారణ జీవన విధానంలో ఎక్కడ వినపడదు.  ఆధ్యాత్మిక జగత్తులో సంపూర్ణ జ్ఞానం పొందిన వారు అంటే బ్రహ్మ జ్ఞానం పొందిన వారు మాత్రమే మోక్షార్హులు ఎందుకంటె మోక్షం సిద్ద వస్తువు సాద్య వస్తువు కాదు.  జిజ్ఞాసి బ్రహ్మ జ్ఞ్యానాన్ని పొందితే అప్పుడు ఈ అజ్ఞాన పాపం నుండి ముక్తుడు అవుతాడు. 

కర్మలు చేయకుండా ఉండటం యెట్లా: 

ఫై మూడు చదివిన తరువాత ప్రతి వారికి ఒక సందేహం కలుగుతుంది అదేమిటంటే మనిషి చేసే కర్మలు రెండు రకాలు ఒకటి పాప కర్మ రెండు పుణ్య కర్మ కాబట్టి చేసే ప్రతి పని (కర్మ) ఏదో ఒక విభాగంలోకి వస్తుంది కాబట్టి విధిగా తానూ చేసే కర్మలు రెంటిలో ఏదో ఒక ఫలాన్నిఇస్తాయి కదా మరి అటువంటప్పుడు పలితం లేకుండా కర్మలు చేయటం ఎట్లా. దీనికి సమాధానం సాధకుడు చేసే ప్రతి కర్మని ఈశ్వరార్పణగా చేయాలి అప్పుడు తానూ చేసే కర్మల ఫలాపేక్ష ఉండదు.  అది కేవలం ఈశ్వరునికే అర్పించబడుతుంది. ఇది బాగావుంది అయితే పాపాలు చేసి ఈశ్వరార్పణం అంటే అన్ని పాపాలు తొలగిపోతాయా అని అడగవచ్చు.  ఎట్టిపరిస్థితిలో ఆ పాప ఫలం పరమేశ్వరునికి చెందదు. ఎందుకంటె నీవు చేసే ప్రతి పాపము నీ మనస్సు, బుద్ది మిళితంగా చేస్తావు అంటే ఉద్దేశ్యపూర్వకంగా చేస్తావు ఎప్పుడైతే నీ మనస్సు నీవు చేసే కర్మ మీద లగ్నం అయ్యిందో దీని ఫలితం పూర్తిగా నీ కాతా లోనే చేరుతుంది. 

మహాపురుషులు తాము ఉద్దేశ్యపూర్వకంగా ఏ పనులు చేయరు.  కేవలం మనస్సుని పెట్టకుండా మాత్రమే కర్మలు చేస్తారు అందుకే వారు ఈ ప్రపంచంలో వున్నా కూడా లేనట్లే ఎందుకంటె వారు సదా తామరాకుమీద నీటి బిందువుగా వారి జీవితాన్ని గడుపుతారు.  నాది అని వారు ఏది అనుకోరు, రాగద్వేషాలకు బానిసలు కారు నిర్లిప్తగా జీవనాన్ని గడుపుతారు. 

ఓం శాంతి శాంతి శాంతిః 

తత్వమసి 

గమనిక: విజ్ఞులైన పాఠకులారా తెలుగు టైపు చేయటంలో కొన్ని తప్పులు సహజంగా దొర్లవచ్చు దయచేసి తప్పులను ఎత్తకుండా కేవలం భావాన్ని మాత్రమే తీసుకోగలరు. అమృత తుల్యమైన పానకాన్ని గ్రోలెరప్పుడు కొన్ని పుడకలు  రావటం సహజమే కదా.

15, జనవరి 2022, శనివారం

అసిధారావ్రతం

 *అసిధారావ్రతం!*


‘అదేమీ ఆషామాషీ విషయం కాదు. అసిధారావ్రతం!’ అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఏమిటీ అసిధారావ్రతం.

 

‘అసి’ అంటే ‘కత్తి’, ‘ధార’ అంటే ‘పదునైన అంచు’ అని అర్థం. అంటే కత్తియొక్క పదునైన అంచు అని భావన.  


అర్థం వరకు బానే ఉంది గానీ ఈ జాతీయం ఏమిటి, భాషా ప్రయోగం ఎలా చేయాలి, మధ్యలో ఈ వ్రతం ఏమిటి మరి!


 ‘అసిధారావ్రతం’ అనేది నిజంగానే ఒక వ్రతం. పెళ్లైనవాళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు చేపట్టే కఠినమైన వ్రతం ఇది.

 

ఏవైనా కారణాల చేత భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒకే మంచం మీద పడుకున్న భార్యభర్తల మధ్య ఒక పదునైన కత్తి పెట్టేవారు. కత్తి ఆ భార్యాభర్తల మధ్య హద్దులా ఉంటుంది. ఉన్నచోటు నుంచి తెలిసో తెలియకో ఏ మాత్రం కదిలినా కత్తికి బలి కాక తప్పదు. అందుకే ఎంతో అంకితభావంతో ఈ దీక్ష చేసేవారు.

 

ఇప్పుడు ఈ ‘అసిధారావ్రతం’ ఎక్కడైనా ఆచరణలో ఉందా లేదా అనేది తెలియదుగానీ, కఠినమైన పని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ కఠినమైన పనిని అంతకంటే కఠినమైన దీక్షతో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం *అసిధారావ్రతం* అన్న జాతీయాన్ని వాడటం జరుగుతోంది.

 

మీకు తెలిసిన యిలాంటి జాతీయాల గురించి తెలియజేసి భాషాభివృద్ధికి తోడ్పడండి.

ఉత్తరాయణ

 ॐ ఉత్తరాయణ పుణ్యకాల సంక్రాంతి శుభాకాంక్షలు. 


      దేవతలకు పగలు ప్రారంభమైన సమయం. 


I. మన సంవత్సరం - దేవతల రోజు 


      మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు.

      సూర్యుడు 

  - మకరరాశిలోకి ప్రవేశించే "మకర సంక్రాంతి" ఉత్తరాయణ పుణ్యకాలంతో దేవతల పగలు ప్రారంభం. 

  - కర్కాటకరాశిలోకి ప్రవేశించే "కర్కాటక సంక్రాంతి" దక్షిణాయన పుణ్యకాలంతో దేవతల రాత్రి ప్రారంభం.

  - మకరరాశిలోకి ప్రవేశించేముందు ధనస్సులోకి ప్రవేశించే ధనుర్మాసం దేవతలకు తెల్లవారు ఝాము. 


నాలుగు ఏకాదశులు 


1. దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమైయ్యాక వెంటనే వచ్చే ఆషాఢమాస శుక్లఏకాదశి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. దానిని "శయన ఏకాదశీ" అంటారు. 

    స్వామి జీవులను తనతో కలుపుకునే "యోగం" ద్వారా మరింతగా అనుగ్రహించడానికి ఆలోచిస్తూంటాడు.

      (12 నెలల మన సంవత్సరం అయిన దేవతల ఒకరోజులో, మూడవవంతు అయిన నాలుగు నెలలు వారి నిద్రాకాలం. ఆ పద్ధతిలోనే, మన 24 గంటల్లో మూడోవంతు నిద్రకి కేటాయిస్తాము) 

2. మన రెండు నెలల కాలం అయ్యాక, భాద్రపద శుక్ల ఏకాదశీనాడు ఆయన అటువాడు ఇటు తిరిగి పడుకుంటాడు. దాన్ని "పరివర్తన ఏకాదశీ" అంటారు. 

 3. మరొక రెండు నెలల తరువాత కార్తీక శుక్ల ఏకాదశీ నాడు యోగనిద్రనుండీ లేస్తాడు. దానిని "ఉత్థాన ఏకాదశీ" అంటారు.

4. సౌరమానంతో చూసే ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశీ నాడు, స్వామి వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుండీ దేవతలకి దర్శనమిస్తాడు. 

    దానిని "వైకుంఠ ఏకాదశీ" అని, "ముక్కోటి ఏకాదశీ" అనీ పిలుస్తారు. 

      ఆ ఉత్తరద్వారంలో స్వామిని అందరమూ దర్శనం చేసుకుంటాం.

      మన సంవత్సరం దేవతలకి రోజు అని చెప్పుకున్నాం కదా! ఆవిధంగా, వారు ప్రతీరోజూ వారి తెల్లవారుఝామున వైకుంఠద్వారం నుండీ స్వామిని దర్శించుకుంటారు. 



                      అన్వయం 


II. సూర్యుడు    


      సూర్యుడు రెండు రకాల వెలుగులను ప్రసాదిస్తాడు. అందులో   

  - మొదటిది, కాంతి రూపంలో భౌతికంగా చూడగలిగేది, వేడిరూపంలో పొందగలిగేది. దీనిని దీపాలరూపంలోనూ, సౌరశక్తితో నడిచే కుక్కర్ల వంటివాటి రూపాలలోనూ చూస్తాం. 

      ఈ విషయాలు సూర్యునికి భూమి దగ్గరవుతూండడం మొదలై, ఉష్ణాంశం పెరిగే కాలం ప్రారంభం అనే దాన్ని ఉత్తరాయణంగా సూచిస్తుంది. 

  - రెండవది, ఆలోచనకి సంబంధించి జ్ఞానరూప వెలుగు. సౌరశక్తితో పనిచేసే Solar Calculators వంటి యంత్రాలే దీనికి నిదర్శనం. 


III. దైవ సంపద 


      మనలోని దైవశక్తులను చైతన్యవంతం చేసికొనే కాలంగా సాధనా పరంగా మరొక కోణంలో దేవతల పగలు ప్రారంభం అని చూపిస్తుంది. 


      ఈ విషయాలలో భగవద్గీతలో తెలిపిన "దివ్యగుణ సంపద" అనేదాన్ని పరిశీలిద్దాం.  


దివ్యగుణ సంపద: 


1. భయము లేకుండుట - అభయమ్, 

2. తనలోని అన్వయ వ్యతిరేక శక్తుల (positive & negative) నడుమ సామ్యము చెడిపోకుండుట - సత్త్వ సంశుద్ధి, 

3. క్రమ పద్ధతిలో జ్ఞానమాచరించి, అది తనయందు యోగము చెందునట్లు చూచుకొనుట - జ్ఞానయోగవ్యవస్థితి, 

4. ఉన్నంతలో ప్రేమపూర్వకంగా సమర్పించ గలుగుట - దానము,  

5. తనపై బాహ్యవిషయ ప్రభావం లేకుండా చూచుట - దమము, 

6. ఫలితం నశించకుండా చేసే మంచి పని - యజ్ఞము, 

7. శాస్త్రగ్రంథాల మననం, వాటి వెలుగులో జీవనం మలచుకొనుట - స్వాధ్యాయము, 

8. తనలోని జ్ఞాన, ప్రాణ, దక్షిణాగ్నులు మూడిటిని ప్రజ్వలింపజేసి, వానిని సద్వినియోగం చేయుట - తపస్సు, 

9. కపటం లేకుండడం - ఋజుత్వం, 

10. మనోవాక్కాయ కర్మలచే ఏ జీవిని బాధింపకుండటం - అహింస, 

11. సత్యము అవసరము కొఱకుగాక, తన స్వభావంగా ఉండుట - సత్యము, 

12. కోపము తనలో నిలువకయుండడం - అక్రోధము, 

13. తనది తనకావశ్యకమైనా, మంచి పనికి సమర్పణ చేయగలుగుట - త్యాగము, 

14. ఏ పరిస్థితిలోనూ చికాకు పడకుండడం - శాంతి, 

15. ఎవరియెడల దుర్బుద్ధి లేకుండడం, కొండెములు చెప్పకుండడం - అపైశునమ్, 

16. సర్వజీవులయందు దయ కలిగియుండడం - దయ, 

17. ఏ విషయమందైనా ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండుట - అలోలత్వం, 

18. మృదువుగా ప్రవర్తించుట - మార్దవము, 

19. తనయందెంత స్వల్పదోషమున్నా సిగ్గపడకుండడం, ఒదిగి ప్రవర్తించడం - ఉచిత లజ్జ - హ్రీః, 

20. అనవసరమైన కుతూహలం లేకుండడం - అచాపలం, 

21. తన చుట్టు ఉన్నవారిని ఆకర్షించి, వారికి సుఖశాంతులను ప్రసాదించే తన తేజస్సు, 

22. ఓరిమి కలిగియుండడం, సహనం - క్షమ, 

23. తనయందు తాను నిలబడుట - ధైర్యము - ధృతి, 

24. మానసిక శుభ్రత - శౌచము, 

25. మేలు జరిగినచోట కీడు తలపెట్టకుండడం - అద్రోహము, 

26. దురభిమానం లేకుండడం - నాతిమానితా. 

                    - భగవద్గీత 16 - 1,2,3 



IV. భగవంతుడు - దేవుడు 


      ఇప్పుడు "భగవంతుడు" అంటే నిర్వచనం చూద్దాం. 


                      భగవంతుడు

 

మొదటి నిర్వచనం


 భగములు ఆరు. అవి 

1. ఐశ్వర్యము, 

2. వీర్యము, 

3. యశస్సు, 

4. సంపద, 

5. జ్ఞానము, 

6. వైరాగ్యము. 


"ఐశ్వర్యస్యసమగ్రస్య వీర్యస్య యశస శ్శ్రియః I 

 వైరాగ్యస్యాథమోక్షస్య షణ్ణాం భగ ఇతీ రణా ॥"


      ఈ ఆరు గుణాలు కలవాడు "భగవంతుడు". 


రెండవ నిర్వచనం


1. భూతముల పుట్టుకను, 

2. నాశమును, 

3. రాబోయెడి సంపత్తును, 

4. రాబోయెడి ఆపత్తును, 

5. అజ్ఞానమును, 

6. జ్ఞానమును ఎఱుంగువాడు.


"ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం I 

  వేత్తి విద్యా మవిద్యాం చ సవాచ్యో భగవానితి॥" 


      ఈ ఆరూ ఎవ్వరెరుగురో, ఆయన "భగవంతుడు" అనబడతాడు. 



      ఇప్పుడు "దేవుడు" అనే దానికి నిర్వచనం చూద్దాం.


                      దేవుడు


"దేవుడు" అనే శబ్దం పది అర్థాల సమూహం గా నిర్వచింపబడింది.


1.శుధ్ధమగు జగత్తును క్రీడింప చేయువాడు.

అ)తన స్వరూపమందు తానే ఆనందంతో క్రీడించువాడు,లేక,

ఆ)పర సహాయంలేకుండా,సహజ స్వభావంతో క్రీడలాగా సమస్త జగత్తునూ చేసేవాడు,లేక,

ఇ)సమస్త క్రీడలకు ఆధారమైనవాడు.

"యో దీవ్యతి క్రీడతి స దేవః"


2.ధార్మికులు జయించాలి అనే కోరిక కలవాడు.

అందరినీ జయించేవాడు, అనగా అతనిని ఎవరూ జయించలేరు.

"విజగీషతే స దేవః"


3.అన్ని ప్రయత్నములకు సాధనోప సాధనములను ఇచ్చువాడు

న్యాయాన్యాయ రూప వ్యవహారమూలను తెలియువాడు.

"వ్యవహారయతి స దేవః"


4.స్వయం ప్రకాశ స్వరూపుడు,

అన్నిటికి చరాచర జగత్తు అంతటికి ప్రకాశకుడు.

"యశ్చరాచరం జగద్ద్యోతయతి సదేవః"


5.ఎల్లర ప్రశంసకు యోగ్యుడు.

.నిందింప దగనివాడు.

"య స్త్యూయతే స దేవః"


6.తాను స్వయమానంద స్వరూపుడు.

ఇతరులకానందము కలుగజేయువాడు,దుఃఖము లేశమూ లేనివాడు.

"యో మోదయతి స దేవః"


7.మదోన్మత్తులను తాడించేవాడు.

సదాహర్షితుడు.శోకరహితుడు.ఇతరులను హర్షింపజేయువాడు,దుఃఖమునుండి దూరము చేసేవాడు.

"యో మాద్యతి స దేవః"


8.అందరి శయనార్థము రాత్రిని,ప్రలయాన్ని చేసేవాడు.

.ప్రలయసమయమున అవ్యక్తమందు సమస్తజీవులను నిద్రింపజేయువాడు.

"యః స్వాపయతి స దేవః"


9.కామించుటకు యోగ్యుడు.

సత్యకాముడు.శిష్టులకామమునకు లక్ష్యమగువాడు.

"యః కామయతే కామ్యతే వా స దేవః"


10.జ్ఞాన స్వరూపుడు.

అన్నిటియందు వ్వాప్తుడై, తెలియుటకు యోగ్యుడు.

"యో గఛ్ఛతి గమ్యతే వా స దేవః"



దేవః - అనే శబ్దం "దివు క్రీడా విజగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు" అనే ధాతువునుండి సిధ్ధమవుతోంది.దాని నుంచీ వచ్చినవే పైన పేర్కొన్న పది అర్థాలు. 



VI. ముగింపు 


       మకర సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం 


      ఈ సమయంలో, దేవతల పగలుగా - మనలోని దైవీ శక్తులను గుర్తించి, వాటిని చైతన్యపరచుకుంటూ, దైవానుభూతి కలిగి, మనం "దైవమే" అనే అద్వైతసిద్ధి పొందుదాం. 

      సాధనలో పూర్ణత్వానికి చేరుకొని,దక్షిణాయనం అనే దేవతల "విశ్రాంతి" కాలానికి పునాది వేసుకుందాం. 



విశేష అనుబంధం 


      దీనితోపాటు ఇతర మతస్థుడైన ఒక మిత్రుడు ఈ పండగ మతాతీతమైనదనీ, విజ్ఞాన శాస్త్ర పరంగా గొప్పదనీ, ఆంగ్లంలో నాకు పంపిన విషయం కూడా దీనితో జతపరుచబడింది. 


      Makara Sankranti is not only a Hindu festival but actually a universal phenomenon because it is purely based on the science of astronomy & crop cycle which is not limited to any particular religion. 

      Basically, it is a celebration of the “revival” of sunlight (solar energy & positivity) into our lives and it coincides with the harvest season as well.

      The zodiac phases of the Sun from July to December witness decreasing sunlight, and after that, the subsequent zodiac phases witness increase in sunlight. 

      It looks like the Sun is on a downward journey between July to December and this downward journey suddenly changes to upward journey or northward movement in late December & early January. 

      Since "Uttara" means "Northward" & "Aayana" means "Movement" in Sanskrit, this phenomenon of phase reversal from Southward movement to Northward movement of the Sun is called “Uttara Ayana” or “Uttarayan” in short. 

      We have 12 Zodiacs in an year, there will be 12 Sankrantis each year. 

      But as we saw how Makara is significant due to the revival of sunlight, the “Sankranti of Makara” (or transmigration of Sun into Makara) is celebrated as “Makara Sankranti”. 


Wish you and your family happy Makara Sankranti.🌹💐🌺


                    =x=x=x=


             -- రామాయణం శర్మ

                    భద్రాచలం

కొండవీటి శాసనంలో పేర్కొన్న కూరగాయల పేర్లేమిటి ? ...............................

 శ్రీకృష్ణదేవరాయల కొండవీటి శాసనంలో పేర్కొన్న కూరగాయల పేర్లేమిటి ?

..........................................................


జామ మిరప ముల్లంగి వేరుశెనగ, పొగాకు, టీ, కాఫీ, నల్లమందు ( ఓపియం), గెనుసుగడ్డ (చిలకడదుంప),ఉల్లి (ఎర్రగడ్డ), వెల్లుల్లి ( తెల్లగడ్డ), బెండ, యాపిల్,జీడిపప్పు, అనాస (ఫైనాపిల్ ), అవకాడో, రాజ్మా, బీన్స్, క్యారట్, కాలిఫ్లవర్, గోబి, పామాయిల్, కాప్సికమ్, సొరకాయ, పుచ్చకాయ, మొదలైన కాయలు పండ్లు కూరగాయలు మనవి కాదంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు కదా!


నమ్మాలి. ఇందులో చాలావరకు కాయలుపండ్లు పోర్చుగీసు వారి రాకతో భారతదేశంలో పంటలుగా మారాయి. ఉదా॥ మిరప, పొగాకు, బొప్పాయి, వేరుశెనగ,అనాస, బంగాళాదుంప మొదలైనవి. మరికొన్నింటిని బ్రిటన్, ఫ్రెంచి, డచ్ మొదలైనదేశాల వర్తకులు మనదేశంలో ప్రవేశపెట్టారు. కొన్ని విదేశీయుల రాకతో మనవిగా మారగా మరికొన్ని జీవనానికి మనిషి వలసవెళ్ళినపుడు తనతో పట్టుకుపోవడం జరిగింది. ఉదా॥ అన్ని రకాల సొరకాయలకు జన్మస్థానం ఆఫ్రికా కాగా, అవి కొన్ని వేలసంవత్సరాల కిందటనే భారతదేశంలో ప్రవేశించాయి.


అంతకుముందు మనదేశంలో దొరికేపండ్లు కూరగాయలతోనే మనవారు వంటలలో వాడి తినేవారు. ఒకసందేహం కలగవచ్చు, పోర్చుగీసువారు మిరపకాయలను ప్రవేశపెట్టారు కదా! అంతకుముందు మనవారు కారంలేకుండానే అన్నాన్ని తినేవారా అంటే అలా తినేవారు కాదు.కారానికి ఆరోగ్యానికి రారాజు మిరియాలు. ఆ మిరియాలను కారంకొరకు ఉపయోగించేవారు.


మనదేశంలోనున్న కాయలు పండ్లు కూరగాయలు ఆకుకూరలేమిటో చూద్దాం.


మిరియాలు, ఏలకులు, లవంగాలు, పసుపు, ఆవాలు(సాసువులు) జీలకర్ర, దోస, వంకాయ, గుమ్మడి, ద్రాక్ష, చెరకు, దానిమ్మ, దోస, కొబ్బరి, అల్లం, శొంఠి, కంద, గురుగు, చెంచలి, పాలవాకు, గాదిరాకు, దిరిశాకు, అవిస, చింతాకు, పెసలు, అలసందలు (బొబ్బర్లు), ఉలవలు, బియ్యం, గోధుమలు, బార్లీ, సజ్జ, కొర్ర, సాములు, అనప( సొరకాయ కాదు, ఇదో పప్పుధాన్యం), కాకర, చింతపండు మామిడి మొదలైనవి.


మనపూర్వీకులు వుపయోగించిన కొన్నింటి కాయలను మనము పూర్తిగా వదిలేశాము. ఏవి మనవో మనవికాదో తెలుసుకోలేనంతగా కొన్ని మన ఆహారసంస్కృతిలో కలిసిపోయాయి.


క్రీడాభిరామమనే గ్రంధాన్ని వినుకొండ వల్లభరాయుడు వ్రాశాడని కాదు శ్రీనాథుడు వ్రాశాడని కొందరి వాదం. ఎవరు వ్రాస్తేనేమి అందులో మంచినశర్మ టిట్టిభసెట్టి అనేవారు ఇద్దరు మంచిమిత్రులు. ఓరుగల్లు నగరాన్ని చూడటానికి వెళ్ళి, నగర అందాలను అస్వాదించి పూటకూళ్ళ ఇంటిలో ఒకరూకకే తాము మృష్టాన్న భోజనాన్ని ఏయే పదార్థాలతో తిన్నది సవివరంగా వివరించారు.


ఇక పల్లెటూరి భోజనం ఎలావుంటుంది అందులో ఏయే ఆకుకూరలు వాడారోనన్న సంగతిని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యంలో "గురుగున్ జెంచలి లేత దిరిశాకు....." అనే పద్యంలో చక్కగా వివరించాడు.


శ్రీకృష్ణదేవరాయుడంటే గుర్తుకు వచ్చింది.


2.5.1520 నాడు శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలంలో సాళువతిమ్మరుసు (అప్పాజీ) మేనల్లుడైన నాదెండ్ల గోపర్సయ్యగారు కొండవీడు పాలకుడిగా వున్నపుడు అక్కడి, యజ్ఞవాటికా రఘునాథదేవాలయానికి శిఖరం కట్టించి, దేవాలయానికి సున్నం కొట్టించి, చుట్టూ ప్రాకారాలు కట్టించి,రాజగోపురంపై బంగారు కలశాలు ఎత్తించి, నిత్యనైవేద్యాలకు దూపదీప అమృతపడులకు దానాలు చేసి, నిత్యం దేవాలయంలో పూజలు నిర్విజ్ఞంగా జరగటానికిగాను మైదవోలు, వేంపల్లె (కడపజిల్లాలోనివి) దానంగా ఇచ్చి, 


ఇంకా నాడు కొండవీటి సంతలకు (మార్కెట్లకు) వచ్చే

మామిడికాయలు, ఉసిరికలు, వంకాయలు, మినుములు, శనగలు, గోధుమలు, ఉలవలు, కందులు, రాగులు, నువ్వులు, ఆముదాలు, అనుములు, పత్తి, చింతపండు, కరక్కాయలు, ఉసిరికెపప్పు, కంద, చామ, చిరుగడం, ఉల్లి, పసుపు, గుగ్గిలం, మెంతి, జీలకర్ర, అల్లం, నిమ్మ, టెంకాయలు, బెల్లం, నేయి, ఇప్పపూవు, శొంఠి, ఉక్కుతో చేసిన ఉలులు, ఇనుము, సీసం, తగరం, రాగి, పంచధార, నూలు, తమలపాకులు, గందం, పిప్పలి, కరాంభువు, జాజికాయ, జాపత్రి,


మొదలైన వాటిపై స్వల్పసుంకాలు విధించి గుడి నిర్వహణకు చెందాలని పేర్కొన్నాడు.


ఉల్లి వెల్లుల్లి చీనాదేశంనుండి దాదాపు రెండువేల సంవత్సరాల కిందట భారతానికి వచ్చాయి. ఉల్లివెల్లుల్లి కామక్రోధాలను ప్రేరేపించే విదేశీదినుసులు కనుక గుప్తులకాలంలో అగ్రవర్ణాలు తినేవారు కాదని చైనా యాత్రికుడైన పాహియాన్ పేర్కొన్నాడు.

..................................................................... జిబి.విశ్వనాథ, డిప్యూటి కలెక్టర్ (Rtd), 9441245857, అనంతపురం.

కొరకరాని కొయ్య

 కొరకరాని కొయ్య - కొరగానివాడు

...............................................................


కొరకరాని కొయ్య > ఎవరైనా కొయ్యను కొరుకుతారా ?

కొయ్యను కొరకం కదా ! మరి ఈ జాతీయం ఎలా పుట్టిందబ్బా ?

అలాగే కొరగానివాడంటే ఏమిటి ?


గుంటూరుజిల్లా వట్టిచెరుకూరు మండలంలో ముట్లూరు అనే గ్రామముంది. ముట్టులు + ఊరు = ముట్లూరన్నమాట. ముట్టులు లేదా ముట్టు అంటే తాకడం, సృజించడం, పట్టుకోవడం లాంటి అర్థాలున్నాయి. ముట్టులు లేదా ముట్టు అనే మాటకు సాధనం, పరికరమనే అర్థం కూడా వుంది. ఉదా॥ పనిముట్లు లేదా కొరముట్లు.

మరొక అర్థంప్రకారం 


సేద్యానికి పనికివచ్చే పనిముట్లు లేదా కొరముట్లు ఆ వూరిలో తయారైతాయి కనుక అక్కడ వెలసిన గ్రామానికి ముట్లురనే పేరు వచ్చింది. కొర అంటే పని అనే అర్థం.

కనుక కొరకరాని కొయ్య అంటే ఏ పనికి బహుశా వ్యవసాయానికి పనికిరాని కొయ్య, కర్ర, దుంగ, కొమ్మ అని అర్థమంతే.


మరోప్రకారం ప్రభుత్వపాలనకు అవసరమయ్యే సాధకులు ( పనిముట్లు) అనగా అధికారులు నివాసమున్న ప్రాంతాన్ని కూడా ముట్లూరంటారు.


కొర అంటే కూడా పని అనే అర్థముంది.


కొరగాని కొడుకు పుట్టినఁ

కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుఁ

జెరకు తుద వెన్నుఁపుట్టిన

జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ! 


పనికిరాని కొడుకు పుడితే వాడు చెడేదేకాకుండా తండ్రికి అపకీర్తి తెస్తాడని సుమతీ శతకకారుడు తెలియచేస్తున్నాడు.

............................................................... జిబి.విశ్వనాథ, Deputy Co॥ector (Rtd) 9441245857. అనంతపురం.

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగురువుగారు

 పౌరాణికసార్వభౌమ, అభినవవ్యాస , మహామహోపాధ్యాయ

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగురువుగారు ఇవాళ శివసాయుజ్యం పొందారు. ఆ మహాత్ముడికి 

వారికి సాష్టాంగప్రణామాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ


-మరుమాముల_వెంకటరమణశర్మ

సంపాదకులు , దర్శనమ్ మాసపత్రిక 


'పురాణ’ పురుషుడు: 

బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖరశాస్త్రిగారి జీవన రేఖలు


తల్లిదండ్రులు: దక్షిణామూర్తిశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ

ఎక్కువగా ప్రభావం చూపినవారు: పితామహులు (తాతగారు) రామకృష్ణ చయనులవారు

చదువు: వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, వేదాంత భాష్యం...

భార్య: సీతారామ ప్రసన్న


సంతానం: ఆరుగురు మగ పిల్లలు... రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి; ఇద్దరు ఆడపిల్లలు... ఆదిలక్ష్మి, సరస్వతి. కొడుకులందరూ వారికి నచ్చిన చదువులు చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కుమార్తెలు గృహిణులు. అల్లుళ్లు దెందుకూరి నర్సింహమూర్తి, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి. ఒకరు జేఎన్టీయూలోనూ, మరొకరు ఎల్.ఐ.సీలోనూ ఉన్నతోద్యోగులు. పెద్దబ్బాయి విజయవాడలో బ్యాంక్ ఆఫీసర్‌గా రిటైరైతే మరో అబ్బాయి రాఘవ బుల్లితెర నటుడు.


పురాణాలతోబాటు నేను జంధ్యాల పాపయ్యశాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాళ వంటి వారి పద్యకావ్యాలు, గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి వంటి ఖండకావ్యాలు చదివాను. నాటకాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ టీవీలో ఏదైనా మంచి సీరియల్ వస్తుంటే చూసి ఆనందిస్తుంటాను. ప్రతిరోజూ వేదపారాయణం చేస్తుంటాను.


ఇటీవల పత్రికలతో సహా ప్రతి ఒక్కరూ పురాణ కాలక్షేపం అనే మాటను వాడుతున్నారు. అది శుద్ధ తప్పు. పురాణప్రవచనం అనాలి తప్పితే పురాణ కాలక్షేపం అనకూడదు. కాలక్షేపం ఏమిటి? అలా అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లే!


పురాణ’ పురుషుడు:


ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!

ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!

ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!

ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారని!

ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...

మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.

ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.

మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.

తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.

నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.

ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.

నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.

దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!

కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.

స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.

ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.

వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!

బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.

అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.

నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.

నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.

ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.

ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.

అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.

భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.

ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.

అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష!

(సే)కరణ: ఫన్ డే 'పురాణ పురుషుడు':)

Vitamin D is made by the body

 Vitamin D is made by the body with sunlight.


Sesame seeds (Ellu or Til) have the highest calcium (975mg per 100g). Milk has 125mg only.


The body is capable of storing vitamin D up to a year, and use the reserves.


Lastly, the body is capable of getting its vitamin D reserves full with 3 full days of sunlight.


The best quality of sunlight is end of winter & beginning of summer.


Now join the dots, and see how wise our sages were in ancient India.


They created a festival of flying kites where by our kids get excited to go in the open, under direct sunlight, throughout the day starting from early morning. And their mothers feed them homemade TIL ladoos.


Are we not a fantastic culture 😊?


#Uttarayan

#MakaraSankranti