కొరకరాని కొయ్య - కొరగానివాడు
...............................................................
కొరకరాని కొయ్య > ఎవరైనా కొయ్యను కొరుకుతారా ?
కొయ్యను కొరకం కదా ! మరి ఈ జాతీయం ఎలా పుట్టిందబ్బా ?
అలాగే కొరగానివాడంటే ఏమిటి ?
గుంటూరుజిల్లా వట్టిచెరుకూరు మండలంలో ముట్లూరు అనే గ్రామముంది. ముట్టులు + ఊరు = ముట్లూరన్నమాట. ముట్టులు లేదా ముట్టు అంటే తాకడం, సృజించడం, పట్టుకోవడం లాంటి అర్థాలున్నాయి. ముట్టులు లేదా ముట్టు అనే మాటకు సాధనం, పరికరమనే అర్థం కూడా వుంది. ఉదా॥ పనిముట్లు లేదా కొరముట్లు.
మరొక అర్థంప్రకారం
సేద్యానికి పనికివచ్చే పనిముట్లు లేదా కొరముట్లు ఆ వూరిలో తయారైతాయి కనుక అక్కడ వెలసిన గ్రామానికి ముట్లురనే పేరు వచ్చింది. కొర అంటే పని అనే అర్థం.
కనుక కొరకరాని కొయ్య అంటే ఏ పనికి బహుశా వ్యవసాయానికి పనికిరాని కొయ్య, కర్ర, దుంగ, కొమ్మ అని అర్థమంతే.
మరోప్రకారం ప్రభుత్వపాలనకు అవసరమయ్యే సాధకులు ( పనిముట్లు) అనగా అధికారులు నివాసమున్న ప్రాంతాన్ని కూడా ముట్లూరంటారు.
కొర అంటే కూడా పని అనే అర్థముంది.
కొరగాని కొడుకు పుట్టినఁ
కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుఁ
జెరకు తుద వెన్నుఁపుట్టిన
జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!
పనికిరాని కొడుకు పుడితే వాడు చెడేదేకాకుండా తండ్రికి అపకీర్తి తెస్తాడని సుమతీ శతకకారుడు తెలియచేస్తున్నాడు.
............................................................... జిబి.విశ్వనాథ, Deputy Co॥ector (Rtd) 9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి