22, జులై 2024, సోమవారం

శ్రీ భూవరహస్వామి ఆలయం

 *🕉 మన గుడి : నెం 386,,*


⚜ *కర్నాటక  :కాలహళ్లి - మండ్యా*


⚜ శ్రీ భూవరహస్వామి ఆలయం 



💠 మీకు జీవితంలో సమస్యలు ఉన్నాయా?" "మీరు కష్టాల లోతుల్లో మునిగిపోయారా?" "జీవితంలో మీ కోసం ఏదీ పనిచేయడం లేదని మీరు విచారంగా ఉన్నారా?" - 

ఎక్కడా చూడకండి, నేరుగా భూవరాహ స్వామి ఆలయానికి వెళ్లండి. 


💠 సొంతిల్లు కల నెరవేరాలనుకునేవారు ఒక్కసారి భూవరాహా స్వామిని దర్శిస్తే చాలు అని ప్రజలు నమ్ముతారు.

భూ వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు


💠 భూవరాహస్వామి ఆలయం స్థానికులలో చాలా ప్రసిద్ధి చెందింది మరియు దేవతకి మర్మమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు.


💠 ఆలయంలో, 48 రోజులు (ఒక మండలం) స్వచ్ఛమైన హృదయంతో సేవ చేయాలని ప్రతిజ్ఞ చేసి, దానిని చేయడం ప్రారంభించండి. 100% విశ్వాసం మరియు సమర్పణతో నిర్వహిస్తే, భక్తుడు 48 రోజుల తర్వాత ఫలితాలను చూడటం ప్రారంభిస్తాడని చెప్పబడింది.


💠 భక్తులను కాపాడేందుకు శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారాలలో మూడవ అవతారమే భూవరాహ అవతారం.


💠 కర్ణాటకలోని హేమావతి నది ఒడ్డున ఈ ప్రతిష్టాత్మక దేవాలయం ఉంది.


💠 ఇక్కడ కనిపించే విగ్రహాన్ని గౌతమ మహర్షి ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ విగ్రహం చూసేందుకు భయానకంగా ఉన్న భక్తులకి అభమయిస్తుంది.


💠 ఆలయం పక్కనే హేమావతి నది ఉంది.ప్రవాహం ఎక్కువగా ఉండే నదిలో పున్యస్నానాలు అంత శ్రేయస్కరం కాదు.వర్షాకాలంలో ఈ నదిలోనీ నీరు దేవాలయం గోడను కూడా తాకుతూ వెళ్తుంది.

ప్రతి సంవత్సరం మే నాటికి నది మట్టం తగ్గుతుంది.ఆ సమయంలోనే వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.



💠 ఈ దేవాలయం దగ్గర మట్టి పూజా, ఇసుక పూజ చేస్తున్నారు.

స్వామివారి దగ్గర మట్టిని పూజించి ఇస్తారు.

దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంటి ప్రాంతంలో వాడితే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.

అక్కడ ఇటుకలను కూడా పూజ చేసి ఇస్తుంటారు.

వాటిని మనం ఉండే చోట పెడితే సొంతిల్లు ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వాసంతో ఉన్నారు.


💠 విగ్రహం 18 అడుగుల ఎత్తు & భూదేవి విగ్రహం 3.5 అడుగుల ఎత్తుతో ప్రధాన విగ్రహం కింద  హనుమాన్ విగ్రహం ఉంది.


💠 ఈ ఆలయం 2500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. పురాణాల ప్రకారం వీర బల్లాల రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు మరియు ప్రతి సంవత్సరం ప్రార్థనలు చేసేవాడు.


💠 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని రాజు వీర బల్లాలకి ఒక గొప్ప కుక్క చూపించిందని పురాణాలు చెబుతున్నాయి.


💠 పురాణాల ప్రకారం, రాజు వీర బల్లాల తన వేట యాత్రలో ఈ అడవులలో తప్పిపోయాడు. 

అతను ఒక పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా, ఒక కుందేలును వెంబడిస్తున్న వేట కుక్కను చూశాడు.  

వారు ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నప్పుడు, కుందేలు వెనక్కి తిరిగి భయంకరమైన కుక్కను వెంబడించడం ప్రారంభించింది.  

ఈ వింత పరిణామాన్ని గమనించిన రాజుకు ఆ ప్రదేశంలో కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని నమ్మాడు.

 అతను మొత్తం ప్రాంతాన్ని తవ్వి భూమి పొరల క్రింద దాగి ఉన్న ప్రళయ వరాహస్వామిని కనుగొన్నాడు.  రాజు దానిని ఆలయంలో ప్రతిష్టించి నిత్య ప్రార్థనలు చేశాడు.  


💠 ఈ రోజు మనం చూస్తున్న దేవాలయం రాజు కట్టిన దాని అవశేషాలు. ఆలయానికి ఎదురుగా దేవనాగిరి శాసనాలు ఉన్న శిలాఫలకం మనకు స్థల చరిత్రను తెలియజేస్తుంది.


💠 కలహళ్లి గ్రామం హేమావతి నదికి కుడి ఒడ్డున ఉంది.  ఈ ఆలయం ఒక కొండపైన ఉంది, దాని పాదాల వద్ద కావేరి, హేమావతి మరియు లక్ష్మణతీర్థ నదులు ఉన్నాయి.  వరాహ  ఆలయానికి సమీపంలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది, ఇది కృష్ణ రాజ సాగర డ్యాం యొక్క బ్యాక్ వాటర్స్ కింద అసలు స్థలం మునిగిపోయిన తరువాత మార్చబడింది.  

వరాహనాథ స్వామి ఆలయం ఉన్న కొండ ఎత్తు కారణంగా, సాగర్ డ్యామ్ వరద నీటి నుండి రక్షించబడింది, ఇది వరాహ భగవానుడు మళ్లీ రక్షించినట్లుగా ఉంది.


💠 వరాహనాథ స్వామి దేవాలయం తూర్పు ముఖంగా ఎత్తైన గుట్టపై ఉంది, ప్రధాన ద్వారం వరకు మెట్లు ఉన్నాయి.  ఈ ఆలయంలో గర్భగృహం, అంతర్ద్వారం మరియు నవరంగ ఉన్నాయి.  

గర్భగుడిలో వరాహదేవుడు తన ఒడిలో భూదేవితో కూర్చున్నాడు.  అతని దిగువ కుడి చేయి అభయ ముద్రలో ఉంది, అతని పై చేతులలో చక్రం మరియు శంఖంతో మరియు భూదేవి చుట్టూ అతని మిగిలిన చేయి ఉంది. 


 💠 వరాహ భగవానుడు కిరీట ముఖాన్ని ధరించగా, భూదేవి కరంద ముఖాన్ని ధరిస్తుంది మరియు ఆమె కమలాన్ని పట్టుకుంది.  భగవంతుని దంతాలు లేత రంగులో ఉంటాయి మరియు అతని కళ్ళు ఎరుపు రంగును కలిగి ఉంటాయి.  దేవత (మూలమూర్తి) సాలగ్రామ-శిల, మరియు అతని వెనుక సుదర్శన చక్రం ఉంటుంది. 


🔆 మార్గం


 👉 మైసూరు - పాండవపుర > ఆరతి ఉక్కడ > బన్నంగాడి > బల్లేనహళ్లి > మాచగోనహళ్లి > గంజిగెరె > కల్లహల్లి.

వివేకానంద సమయ స్పూర్తి*

 *🚩స్వామి వివేకానంద సమయ స్పూర్తి*


స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..

ఒక తెల్ల ప్రొఫెసర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!


ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెసర్ లంచ్ చేస్తుండగా..


వివేకానందుడు వచ్చి ప్రొఫెసర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...


ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!

" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"


దానికి వివేకానందుడు..!!

ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :

" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.

*(1st Punch👊)*


ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!

ఎలాగైనా వివేకానంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!


ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...

వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!

"వివేకానందా..!!

నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..

నీకు రెండు బాగ్ లు దొరికాయి అనుకుందాం...!!

ఒక దానిలో జ్ఞానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"


వివేకానందుడు (సందేహించకుండా)...

"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!


ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..

"అనుకున్నా...నీ సమాధానం అదేనని...!!

నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ఞానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!


దానికి వివేకానందుడు..!! 

" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"

*(2nd Punch👊)*


ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!

అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...

వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ఞపూనాడు..!!


టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!

ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!


కోపంతో రగిలిపోయి వున్న ప్రొఫెసర్..

వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!


ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...

తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది

కోపం తగ్గిన తరువాత హుందాగా.. 

ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...

గౌరవప్రదంగా...

వినమ్రమయిన శాంత స్వరంతో...

"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు....!

*(లాస్ట్ పంచ్👊)*


🙏🙏that is Swamy  Vivekananda...🙏🙏

దత్తపది

 దత్తపది 


ఇక్కడ 

అక్కడ 

ఎక్కడ 

తక్కెడ


అనె పదాలతొ కూరగాయల మార్కెటును ఇచ్హాచంధస్సులొ వర్ణించగలరు.


దత్తపది పూరణ -- నా ప్రయత్నము 


*ఇక్కడకే రండయ్యా*

*యక్కడ నాసిరకము, వెలయది యెక్కువయే!*

*యెక్కడకుఁ బోవలదయా,*

*తక్కెడ కెక్కువనె తూచి ధరపెంచనయా !*


🙏 *--వేంఉగోపాల్ యెల్లేపెద్ది*





కందము తెలిసిన కాయగూరల వ్యాపారి అందముగా ఆకర్షిస్తున్నాడు తన అంగడికే రమ్మంటూ అందరినీ 🤣


తక్కెట్లో కాసిని కూరలు అధికంగానే ఇస్తాను కానీ , ధరను పెంచి మాత్రము అమ్మను అని ..


(ఇక్కడ) దొండకాయ లవి యింపుగ నున్నవి లేతలేతగా

(నక్కడ) దోస లద్భుతపు టానపకాయలు గానుపించె నిం

(కెక్కడ) నోయి వంగ విను మీయవి నీవిక నాలసింపకే

(తక్కెడ) దూచి యిమ్మనుచు తా నొక డాడెడు నాపణంబునన్.


ఎక్కడ జూచినన్ కననదేమి విచిత్రమొ కూరలంగడిన్

అక్కడ గొట్టుకాయల నయమ్ముగనమ్మగజూతురయ్యవే

తక్కెడనున్నకూరలనిదానముగాకొనజూచుచున్న నే

నిక్కడ నిల్చి యుంటి నికనేమగునోగమనింపగావలెన్


కం॥

ఎక్కడదొరకనికూరలు  

ఇక్కడనే దొరకుమీకుహితమునుగూర్చున్ 

అక్కడనిలబడనేలా?తక్కెడమోసంబులేదు,ధరలునుచౌకే! 

 గుడ్లూరివేంకటెశ్వరరావు,కందుకూరు.


ఎక్కడపంటపండినవొ?యిక్కడకన్పడెదోస,యల్లముల్ 

ఇక్కడజూడు"వంగ"మదికింపునుగూర్చెడి"బెండ" "చిక్కుడుల్ 

అక్కడజూడగుమ్మడియునద్భుతతింత్రిణిపల్లవంబులన్ 

తక్కెడజూచి యిత్తుమయధర్మముతప్పమురండి!విల్వుడీ! 

           గుడ్లూరివేంకటేశ్వరరావు,కందుకూరు.


ఇక్కడ దొరికెడి కంద మ 

రెక్కడ మనకు దొరకదని యిల్లాలనగా 

అక్కడ నే గల పెనిమిటి 

తక్కెడ సరిరీతి తూచి తానది తెచ్చెన్ 


శనగల చంద్రశేఖర్




గురుపౌర్ణమి


 గురుపౌర్ణమి శుభాకాంక్షలు

*********************

పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి,9347537635. గానం: శ్రీ భాగి కృష్ణమూర్తి, చీరాల 


సీసం:

వ్యాసమహాముని ప్రభవమైన దినము 

     గురువులన్ పూజించు పరమదినము 

సూర్యోదయము వేళ శుచి యుపవాసము 

     నారంభమొనరించు నవ్యదినము 

చంద్రోదయము వేళ చంద్రుని వీక్షించి 

     యుపవాసమును వీడు సుఫల దినము 

శ్రద్ధగా బుద్ధిగా పెద్దలన్ పూజించి 

     యాశీస్సులన్ పొందునట్టి దినము 


తేటగీతి: 

శుభము లెన్నియొ ఆషాఢ శుద్ధ పౌర్ణ

మిచ్చు గావుత! యెల్లర కిచ్చు గాక!

పూజలొనరించు వారెల్ల పుణ్యములను

వ్యాసపూర్ణిమ దినమున బడయుగాక!

 అభ్యుదయముగోరి కురిసెనగ్నిధార 

రుద్రవీణ మీటి జనుల నిద్రలేపె

ఆశయాలోచనాలోచనంబులనిడి

దాశరథిరాక్షసులపైన దాడిజేసె

ధాటిజూపినకవి...దాశరథి

 ధాటిజూపినకవి...దాశరథి

సీ..

ఉద్యమస్ఫూర్తితోనువ్వెత్తుగనెగసి

     అక్షరాస్త్రములెల్లనాజినిలిపి

నైజాముసర్కారు బేజారు నొందంగ

     పదునైన కవితలపాఱజేసి

బంగారు తెలగాణ భద్రమై నిలువంగ

     నిగళాలతెగద్రుంప నింగినరచి

యమ్మహాంధ్రోదయమిమ్మహాధరియిత్రి

      మనసారకాంక్షించి మమతజూపి

తేగీ.

దులిపె తరతరములబూజు నలఘుమతిగ

నాదు తెలగాణ కోటిరత్నాలవీణ

యనుచు నినదించిప్రేమించె నతిశయముగ

నట్టి దాశరథి నుతింతు దిట్టకవిగ..

 ఆమహాకవి జయంతి సందర్భంగా అక్షర నివాళి..

రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి

వంటగదిని విడిచిపెట్టిన

 అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు


ఇంట్లో వంట ఆగిపోవడంతో అమెరికాలో ఏం జరిగింది?

1980ల నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు, కుటుంబంలో బయటి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతుందని అమెరికన్ ప్రజలను హెచ్చరించారు.

కుటుంబ సభ్యులకు బదులు బయటి నుంచి వచ్చే పిల్లల పెంపకానికి ఏర్పాట్లు చేస్తే పిల్లల మానసిక వికాసానికి, కుటుంబానికి కూడా ప్రాణాపాయం తప్పదని రెండో హెచ్చరికతో పాటు.

  కానీ చాలా తక్కువ మంది మాత్రమే అతని సలహాను పాటించారు. ఇంట్లో వంట చేయడం దాదాపు ఆగిపోయింది మరియు ఆర్డర్ చేయడం (ఇది ఇప్పుడు ఆచారం) అమెరికన్ కుటుంబం అంతరించిపోయేలా చేసింది, నిపుణులు హెచ్చరించారు.

ఇంట్లో వంట చేయడం అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా కనెక్ట్ అవ్వడం.

వంట అంటే కేవలం ఆహారాన్ని వండడమే కాదు. బదులుగా, కుటుంబ సంస్కృతి కేంద్ర బిందువు.

ఇంట్లో కిచెన్ లేదు, ఒకే బెడ్ రూమ్ ఉంటే అది ఇల్లు కాదు, హాస్టల్.


ఇప్పుడు తమ వంటగదిని మూసివేసి, పడకగది ఒక్కటే సరిపోతుందని భావించిన అమెరికన్ కుటుంబాలు ఎలా ఉంటాయి?

1971-72లో, దాదాపు 72% అమెరికన్ కుటుంబాలు భార్యాభర్తలు, వారి పిల్లలతో నివసిస్తున్నారు.

2020 నాటికి, ఈ సంఖ్య 22%కి తగ్గింది.

2-ఇంతకుముందు సహజీవనం చేసిన కుటుంబాలు ఇప్పుడు వృద్ధాశ్రమంలో (వృద్ధాశ్రమం) నివసిస్తున్నాయి.

3- అమెరికాలో, 15% మహిళలు అణు కుటుంబాలలో నివసిస్తున్నారు.

4-12% మంది పురుషులు కూడా న్యూక్లియర్ కుటుంబాలుగా జీవిస్తున్నారు.

USలో 5-19% కుటుంబాలు ఒకే తండ్రి లేదా తల్లికి చెందినవి.

ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6- 38% మంది పెళ్లికాని మహిళలకు జన్మించారు.వారిలో సగం మంది బాలికలు, కుటుంబ రక్షణ లేకుండా చిన్నవయసులోనే శారీరక వేధింపులకు గురవుతున్నారు.

యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 52% మొదటి వివాహాలు విడాకులతో ముగుస్తాయి.

8- 67% రెండవ వివాహాలు కూడా సమస్యాత్మకమైనవి.


  వంటగది మరియు పడకగది మాత్రమే లేకపోతే అది పూర్తి ఇల్లు కాదు.

వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి యునైటెడ్ స్టేట్స్ ఒక ఉదాహరణ.

మన ఆధునికవాదులు కూడా అమెరికాలో లాగా దుకాణాల నుండి లేదా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని కొనుగోలు చేయడాన్ని సమర్థిస్తున్నారు మరియు మేము వంట సమస్య నుండి విముక్తి పొందామని సంతోషిస్తున్నారు. దీనివల్ల భారత్‌లోని కుటుంబాలు కూడా అమెరికా కుటుంబాల మాదిరిగానే మెల్లమెల్లగా నాశనమవుతున్నాయి.

కుటుంబాలు నాశనం అయినప్పుడు, మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండూ క్షీణిస్తాయి. అనవసరమైన ఖర్చుతో పాటు, బయటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లావుగా మారి ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం చాలా అవసరం.


అందుకే బయట తిండికి దూరంగా ఉండమని మా ఇంటి పెద్దలు సలహా ఇచ్చేవారు.

అయితే ఈరోజు మనం నా కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌లో తింటాము...",

Swiggy మరియు Zomato ద్వారా తెలియని వ్యక్తులు (వివిధ రసాయనాలతో) వండిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం మరియు తినడం ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలలో కూడా ఫ్యాషన్‌గా మారుతోంది.

ఈ అలవాటు దీర్ఘకాలిక విపత్తుగా మారుతుంది.

ఈ రోజు మనం మన ఆహారాన్ని నిర్ణయించడం లేదు, దీనికి విరుద్ధంగా ఆన్‌లైన్ కంపెనీలు మనం ఏమి తినాలో మానసికంగా ప్రకటనల ద్వారా నిర్ణయిస్తాయి.

మన పూర్వీకులు ఆరోగ్యంగా మరియు దీర్ఘకాలం జీవించారు ఎందుకంటే వారు ప్రయాణానికి వెళ్ళే ముందు కూడా వండిన తాజా ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్లేవారు.

అందుకే ఇంట్లోనే తయారు చేసుకొని కలిసి తినండి. పౌష్టికాహారం కాకుండా, ప్రేమ మరియు ఆప్యాయత ఉంటుంది.


పై విషయాన్ని ఆలోచించండి నిజమే కదా 😍........ అందరికి తెలియచేయండి.

మన కవులు

 🌼🌸🌺 2. మన కవులు - పద్యములు - సాహిత్యము 🌺🌸🌼


సీ. నన్నయ తిక్కన ఎఱ్ఱన లెన్నగ ఆంధ్రభా

               రత మహాకావ్య నిర్మాత లనగ

     శ్రీకార మొనరించె శ్రీనాథ కవిరాట్టు

               బహుకావ్య నిర్మాణ ప్రవరుడగుచు

     రామునానతి మేర రచియించె భక్తితో

               బమ్మెర పోతన్న భాగవతము

     అష్టదిగ్గజకవు లాంధ్రభోజుండును

                కావ్యప్రబంధాల కర్తలనగ  


తే. కృతుల నెన్నెన్నొ వెలయించి రిటుల మున్ను

     మహిత కవివర్యు లెందరో మానితముగ

     ఆంధ్రభారతి కవ్వారు అనుగుసుతులు

     ఆలకించగ రావయ్య! ఆంధ్ర జనుడ!  1


సీ. రమ్యమౌ పద్యాల రామగాథ రచించె

              మల్లెల కవనాల మొల్లమాంబ

     రామభద్రాంబయు, రంగాజి, కృష్ణాజి

              ఛందోకళనిపుణ; చంద్రరేఖ 

     రసరమ్య కావ్యమ్ము రాధికాస్వాంతన

              మును రచియించిన ముద్దుపళని

     పోలిబోటి తరుణి, పొలతుక తంజనా

              యకి కవయిత్రులై యలరినట్టి


తే. ఆంధ్రసాహితీ రంగాన అతివలనగ!

     తెలుగుతల్లికి సింధూరతిలక మగుచు

     మాన్యతను పొందిన వనితామణులు వారు!

     ఆలకించగ రావయ్య!ఆంధ్ర జనుడ!  2


తే. అల జగన్నాథ కవివర్యు డనుపముండు

     మహిని పండితరాయ నామాంకితుండు

     ఘనుడు బహుముఖ ప్రాజ్ఞుడా కవివరుండు

     అతని నెఱుగుదువా? నీవు! ఆంధ్ర జనుడ!  3


ఆ. అచ్చతెలుగు నుడుల నాటవెలదులందు

     అందమొప్పు నటుల పొందుపరచి

     “విశ్వదాభిరామ వినుర వేమ యటంచు”

     వెలయ జేసెను గద వేమన కవి.  4


తే. ఘనుడు ఏనుగు లక్ష్మణ కవివరుండు

     తెనుగున ననువదించినా డనుపమముగ

     భర్తృహరి సుభాషిత సూక్తిపదములెల్ల

     ఆలకించగ రావయ్య! ఆంధ్ర జనుడ!  5


తే. కావ్యములు కంఠమందున్న గణపతిముని

     ఘనుడు కారణజన్ముడు కవుల యందు

     కావ్యకంఠ గణపతిగ ఖ్యాతి గాంచె

     అతని నెఱుగుదువా? నీవు! ఆంధ్ర జనుడ!  6


కం. శిక్షాస్మృతులై వెలసిన

      లక్షణవాచకము లెన్నొ లక్ష్యార్థముగా

      దీక్షగ రచించి రెందరొ!

      వీక్షించితె? ఆంధ్ర జనుడ! వీసంబైనన్?  7


ఉ. పద్యము సాహితీప్రియుల భాగ్యవిశేషము తెల్గుతల్లికిన్

     హృద్యము పూర్వసత్కవి సుహృత్సుమజన్య మరందకోశమున్

     వేద్యము సద్రసజ్ఞులకు విద్యలతల్లికి ప్రీతి గొల్పు నై

     వేద్యము సత్త్వహీనుల కభేద్యము సత్కవి చేయు సేద్యమున్. 8


కం. పద్యము ఛందోబద్ధము

      గద్యము లాక్షణికమ్ము గణుతింపంగా

      హృద్యంబుగ విలసిల్లును

      గద్యము పద్యమ్ము లాంధ్ర కావ్యములందున్. 9


కం. పద్యము రసపోషణకును

      గద్యము కథనానుగమన గంభీరతకున్

      హృద్యంబుగ విలసిల్లగ

      మధ్యగ దండకము వెలసె మానితమగుచున్. 10


కం. శతముకు పైబడి యెనిమిది

      స్థితమగు పద్యములు గల్గి చిరుమకుటముతో

      స్తుతి, సూక్తి, విమర్శలతో

      శతకము విలసిల్లె తెల్గు సాహిత్యమునన్. 11


కం. ఇటునుండియు నటువైపుకు

      అటునుండి నిటుదరికైన ననులోమముగన్

      దిటవుగ చదివిన నొకటగు

      పటుపద్యము తెలుగుఠీవి! పరికింపంగాన్.  12


కం. ఏక గుణింతము నుండియు

      నేకాక్షర పదములెల్ల నేకము కాగా

      ఏకముగ తెలుగు నందున

      ఏకాక్షరపద్య మొప్పె నెక్కటి భంగిన్.  13


కం. ఇటునుండి సంస్కృతంబును

      అటునుండి తెలుగునడకలు నలరారంగన్

      పటుపద్యము లొప్పె తెలుగున

      ఇటులొప్పెనె? ఇతరభాష నిట్టివి జూడన్. 14


కం. ఛందము లన్నిటి యందున

      కందమ్మున చిందు శోభ కమనీయముగాన్

      కందము తెల్గున కందము

      మందారమరందమందు మధురిమ వోలెన్. 15


కం. అందని ద్రాక్షాఫలముల

      పొందగ లేనట్టి నక్క పులుపను నటులన్

      సుందరమౌ పద్యమ్మును

      నిందింతురు మూఢమతులు నిష్ఫల మనుచున్. 16

జ్ఞాన సమమగు సౌఖ్యము

 లేదు కామమునకు సరి వ్యాధిలేదు 

లేదు మోహమువంటిది రిపువు లేదు 

క్రోధం సమమగు ననలము లేదు లేదు 

జ్ఞాన సమమగు సౌఖ్యము కాన గలమె.

*ఆ పూలజడ అద్వీతీయము కాక ఏమిటి ?

 *ఆ పూలజడ అద్వీతీయము కాక ఏమిటి ?*


🌹🙏🌹🙏🌹


*సుమముల !  సకలసురలు  దిగి*

*యమరిరి ఘనకేశపాశ మందె త్వరితముగా !*

*సమయము మీరిగ నీయక* 

*జమళి సిరియుభువియాయె జడగంటలుగా !!*


🌹🙏🌹🙏🌹


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 



🌺☘️🌺☘️🌺


అమ్మ రథము అలా ముందుకు సాగుతూ వెళుతుంటే   పరవశాన అలాగే ఉండిపోయాను .🙏


అయ్యో ముందుకు నేను కూడా ఎందుకు వెళ్లలేదు అని బాధపడుతున్న తరుణములో , 


అమ్మ అందమైన పూలజడ దర్శన భాగ్యము కల్పించి నది .🙏


ఇందుకేనేమో అమ్మ ముందుగా వెళ్లిపోయింది .


ఆ పూలజడను ఏమని వర్ణించగలము ! 🙏


ఆ జడకు ఉన్నవి పువ్వులా ?  కానే కాదు సకలదేవతలు , త్వరత్వరపడి , దివినుంచీ క్రిందకు దిగివచ్చి అమరిపోయారు , పువ్వులుగా ఆ పూలజడలో . 🙏


సమయము మించిపోతే తమకు అదృష్టము దక్కునో లేదో అని , భూదేవీ శ్రీదేవి కాస్త తమ సింగారములను ఆపి ఉదుటన , వచ్చి ఆ జడను మిక్కిలి ప్రకాశవంతము చేసారు జడగంటలుగా ఒదిగి ! 🙏


అట్టి దివ్యాలంకారముతో ప్రకాశించే మా *కామాక్షీ అమ్మకు* సదా మంగళములు పాడెదను !🙏

*యే వేళనైనా పున్నమే యీ కాంచీపురాన !*🙏

 *యే వేళనైనా పున్నమే యీ కాంచీపురాన !*🙏


🌹☘️🌹☘️🌹


*ఆకాశంబున పున్నమి*

*సాకారమగు నెలకొక్క సారె కనులకున్!*

*మాకిట సతతము పున్నమె ,*

*శ్రీకామాక్షమ్మ సెలవి నిడు నగవులతో !*


🌹🙏🌹🙏🌹 


✍️ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది*


🌹🙏🌹🙏🌹


పున్నమి రేయిన  మా అమ్మ  *శ్రీ కామాక్షమ్మ ,*   దయతలచి దర్శన భాగ్యమును అనుగ్రహించినది .🙏


ఆ నింగిలోని పున్నమి వెన్నలలో మరీ అంత  గొప్పతనమేమున్నది ? 


 అది నెలకొకసారే కనిపిస్తుంది మన కనులకు .



కానీ మాకు ఈ భూమిపైననే గొప్ప అదృష్టమును అనుగ్రహించినది చల్లని తల్లియైన *శ్రీ కాంచీపుర కామాక్షమ్మ !*🙏


అఖిలాండమంతా నిండి పోయే పండువెన్నెలను , 

 తన పెదవి అంచున చిరుదరహాసములతో ,

నిరంతరమూ , మనకు  అందిస్తూనే ఉన్నది నిండైన పండు వెన్నెల ! 🙏


*ఇది కదా మాయలేని వెన్నెల ! అసలైన వెన్నెల !!*🙏

పరుగున పర్గులెత్తుచు

 చం. పరుగున పర్గులెత్తుచు ప్రపంచములన్ మరి చుట్టివచ్చినన్ 

శరవణుడొందలేదకట శంకర ! సర్వగణాధిపత్యమున్

నిరతిగ నేకదంతుడును నీదు ప్రదక్షిణమున్ జరింపగన్

కరముఖునే వినాయకునిగా శివ! యెంచితివీవు కూర్మితోన్

పరముగ వేడఁ నిత్యమును భక్తులకిచ్చెదవంట యీశ్వరా ! 7 .

🙏🙏🙏

✍️ కొరిడె విశ్వనాథ శర్మ ,

 ధర్మపురి

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

ఆత్మోద్ధరణకై

 *పద్యభారతికి నమస్సులు*

          =================

               ఆత్మోద్ధరణకై

                      *గురుస్మరణ* 

               •••••••••••••••••••

       భిక్షనిచ్చినయట్టి  పేదరాలి కనక

           వర్షాన కరుణించె బాల్యమందు

       మాత గాసిలకుండ మరలించె నదిగతి

            సన్న్యసించెను తల్లి సమ్మతమున

        ఉపనిషత్తులకు వ్యాసోరు బ్రహ్మ సూ

            త్రములభాష్యములను వ్రాసె ఘనుడు

        దేశమంతయు చుట్టి శ్రీ శంకరాఖ్యుడు

               అద్వైత వాదంబు వ్యాప్తిజేసె


         నాల్గు పీఠముల్ స్థాపించి, నష్టపరచు

         భ్రష్ట వాదములకు స్వస్తి పలికె

         వివిధ స్తోత్రాలు కవచము

                                        లవిరళముగ

         భక్త లోకము తరియింప    వాసి వ్రాసె

         నాది శంకరునకు వేల వందనములు.

          --తంగిరాల నరసింహకుమార్

మలినుడవునీవు

 తేటగీతి 

మలినుడవునీవు ,రాగరమ్యాంగ యామె 

వాగెదవు నీవు , వికసిత వదన యామె 

చపల మానసుఁడవు నీవు సరస యామె 

ఏలపద్మినివిడచిపోయెదవు ? భ్రమర !

( దేవీదాస శర్మ )

మేలి పసిడికంటె

 *నేటిమేటిమాట*               *చక్రవర్తి*

ఆవె.

పట్టుఁగట్టు, మేనఁ బైడిని దిగవేయుఁ,

జదువు సున్న,చూపు మదము హెచ్చు.

కనులమోసగించు కపటపుబంగారు

పసలు రెట్లు మేలి పసిడికంటె