11, జనవరి 2026, ఆదివారం

నక్షత్ర స్తోత్ర మాలిక - రోజు 11*

 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - రోజు 11*


*నక్షత్రం*_ *పుబ్బ / పూర్వఫల్గుణి*


*అధిపతి_ శుక్రుడు (Shukra)*


*ఆరాధించాల్సిన దైవం*. *మహాలక్ష్మి* / భృగుడు


*పుబ్బ నక్షత్ర జాతకులు మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కోరుకునే వారు, ఐశ్వర్య ప్రాప్తి కోసం పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.*


🙏 *శ్రీ కనకధారా స్తోత్రం* 🙏


*వందే వందారు మందార మిందిరా నందకందళమ్*।

*అమందానంద సందోహ బంధురం సింధురకన్యకామ్* ॥ 1 ॥


*అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ*

*భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్*।

*అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా*

*మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః* ॥ 2 ॥


*ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః*

*ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని* ।

*మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా*

*సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః* ॥ 3 ॥


*విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం*

*ఆనంద హేతు రధికం మురవిద్విషోఽపి* ।

*ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధం*

*ఇందీవరోదర సహోదర మిందిరాయాః*॥ 4 ॥


*దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం*

*అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే* ।

*దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం*

*నారాయణ ప్రణయినీ నయనారువాహః* ||5॥


*సంపత్కరాణి సకలేంద్రియ నందనాని*

*సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి* ।

*త్వద్వందనాని దురితాహరణోద్యతాని*

*మామేవ మాతరనిశం కలయంతు నాన్యే* ॥ 6 ॥


*కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః* ।

*అవలోకయ మామకించనం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః* ॥ 7 ॥


*స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం*

*త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్* ।

*గుణాధికా గురుతరభాగ్యభాగినో*

*భవంతీ తే భువి బుధభావితాశయాః*॥8॥


॥ *ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత శ్రీ కనకధారా స్తోత్రం సంపూర్ణమ్* ॥


*విశేషం*


*పుబ్బ నక్షత్రం రోజున ఈ స్తోత్రాన్ని పఠించి, లక్ష్మీదేవికి పాయసం లేదా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితం ఉంటుంది.*


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

నిద్రలేవకపోతే

 

*సూర్యోదయం అయినా నిద్రలేవకపోతే ఏమవుతుందో తెలుసా?*

           ➖➖➖✍️



*ఆయుర్వేద చికిత్సా విధానంలో ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా సమయాన్ని గడపాలి, దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా పాటించాలనేది ఇందులో ప్రధాన అంశాలు.*

*ప్రాతఃకాలం నిద్ర నుండి మేల్కొనాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వ్యక్తులు ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి.*


*ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్య, బలం, తేజస్సు, ధనం సమృద్ధిగా ఉంటాయి.*


*ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుంటారో వారి ఆయుష్షు క్షీణించడంతో పాటు శరీరంలోని శక్తి నశిస్తుంది.*


*ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బులతో బాధపడుతుంటారని ఆయుర్వేద వైద్యం చెబుతోంది.*

*ఉషఃపానం:*


*ప్రాతఃకాలం నిద్రలేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందు చల్లటి నీటిని సేవించాలి. రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని భద్రపరచుకోవాలి. నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత కనీసం అరలీటరు వీలైతే ఒక లీటరు నీటిని సేవిస్తే మరీ మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇలా నీటిని సేవించడం వలన శరీరంలోనున్న కఫం, వాయు, పిత్త దోషాలు నశిస్తాయి. దీంతో వ్యక్తి బలశాలి, దీర్ఘాయుష్మంతుడుగా మారుతాడు. ఉదరం పూర్తిగా శుభ్రపడుతుంది.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

సూక్తి

 *నేటి సూక్తి* 


 *ఇతరుల ఓటమిని చూసి నవ్వేవారు జీవితంలో ఏదీ సాధించలేరు, తన ఓటమిలో కూడా నవ్వేవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు.*


*క్రాంతి కిరణాలు*


 *కం.పరులోడినచో నవ్వకు* 

*పరాభవ విజయము రెండు పరిపాటేగా*

*అర నిమిషమ్మున మారును* 

*నర జీవితమందు మార్పు నడుచుచు నుండున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

గజల్

   గజల్


రమ్మనక పొమ్మనక నీ రమ్య రూపు నే చూస్తూనే ఉన్నా

కమ్మని నీ మధురోహల నీ ఊసులు నే వింటూనే ఉన్నా


విను తీగయిమ్ములొ రాలని

వాడిని పచ్చని సంపెంగలెన్నో

నిత్యం నిత్యమల్లినై నీ కోసం నే పూస్తూనే ఉన్నా 


వేడుకనిచ్చే వేకువ వేళలొ వెచ్చదనపు ముద్దుపొద్దయ్యి

సందె గుమ్మాన దివ్వెనై నీ దారి నే కాస్తూనే ఉన్నా


నా మది కోరే తోరం దారం

 మోగే మంగళ రావమునై

నులివెచ్చని ఆశల తోరణాల నెడదకు కడుతూనే ఉన్నా


చల్ల చల్లని గాలి తరగల ఉల్లము పూచే చెలిమి చలువలో

మల్లీ! ఏరై నీకై కలల తెప్పల ను మోస్తూనే ఉన్నా


రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

మట్టి వాసన పిలుస్తోంది...*

 *ఆ మట్టి వాసన పిలుస్తోంది...* 


అమ్మలాంటి పల్లె ఆప్యాయంగా పిలుస్తోంది

అలసిన హృదయాన్ని హత్తుకునేందుకు

మసి పట్టిన శరీరాన్ని కడిగేందుకు

మురికి పట్టిన మనసును శుద్ధి చేసేందుకు..


ఆ నేల పైరగాలి పలకరిస్తోంది

చిన్ననాటి చిట్టి అడుగులను గుర్తు చేసుకుంటూ

ఊరు వదిలిన యువకుడిని తలుచుకుంటూ

ఒక్కసారి హత్తుకొని సేదతీర్చాలని చూస్తోంది..


పండగొస్తోంది.. పల్లెకు నవ్వులు వచ్చాయి

ఆత్మీయ రెక్కలు విప్పి అందరినీ పలకరిస్తూ

గతపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ

తనపై వేసే అడుగులకు మడుగులొత్తుతోంది..


మనిషి ఖరీదైనవాడిగా మారిపోయాడు

తానిచ్చిన ఆత్మస్థైర్యాన్ని ఆసరాగా చేసుకొని

పట్నపు రంగులద్దమై నిలిచాడు

అందులో నా నీడ కనిపిస్తుందో లేదో..


నా బావి నీరు రంగు మారిపోయింది

వాడి బ్రతుకు విషపు కోరల్లో చిక్కుకుంది

ఆడంబరం చూపడానికే నా దగ్గరకు వచ్చాడా?

తన దర్జాను ప్రదర్శిస్తూ నా ఒడిలో వాలాడు..


సరేలే.. ఎంతైనా అమ్మలాంటి దాన్ని కదా

కన్నీళ్లు దిగమింగి ఆప్యాయతను పంచుతా

నా మట్టి పరిమళాన్ని ప్రసాదంగా పెడతా

నా వృద్ధికి సహకరిస్తే.. వాడికి దండం పెడతా!


కొప్పు ల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

జీవులు, వారి రాజ్యాంగం ప్రకారం, ఆధ్యాత్మికంగా భగవంతుని వలె మంచివి, మరియు వాటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే, భగవంతుడు ఎల్లప్పుడూ ఉన్నతంగా మరియు స్వచ్ఛంగా ఉంటాడు, భౌతిక ప్రకృతి రీతుల ద్వారా కలుషితం కాకుండా, జీవులు సత్త్వ, రజస్ మరియు తమో యొక్క భౌతిక రీతులతో కలుషితం కావడానికి తగినవి. 


భౌతిక రీతుల ద్వారా ఏర్పడిన ఈ కలుషితం జ్ఞానం, వైరాగ్యం మరియు భక్తి సేవ ద్వారా పూర్తిగా తొలగించబడుతుంది. 

భగవంతుని భక్తి సేవే అంతిమ అంశం, అందువల్ల భగవంతుని భక్తి సేవలో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉన్నవారు ఆధ్యాత్మిక శాస్త్రంలో అవసరమైన జ్ఞానాన్ని పొందడమే కాకుండా, భౌతిక సంబంధం నుండి నిర్లిప్తతను పొందుతారు మరియు భగవద్గీత (14.26) లో పేర్కొన్న విధంగా సంపూర్ణ విముక్తి ద్వారా భగవంతుని రాజ్యానికి పదోన్నతి పొందుతారు:


మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।

స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే 


విముక్తి పొందని దశలో కూడా, ఒక జీవి ప్రత్యక్షంగా భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అతీంద్రియ ప్రేమపూర్వక సేవలో లేదా రామ మరియు నరసింహ వంటి అతని స్వాంస విస్తరణలలో నిమగ్నమై ఉండవచ్చు.


ఈ విధంగా, అటువంటి అతీంద్రియ భక్తి సేవ యొక్క దామాషా మెరుగుదలతో, భక్తుడు బ్రహ్మ-గతిం లేదా ఆత్మ-గతిం వైపు ఖచ్చితమైన పురోగతిని సాధిస్తాడు మరియు చివరికి కపిలస్య గతి లేదా భగవంతుని నివాసం, కష్టం లేకుండా పొందుతాడు. 


భగవంతుని భక్తి సేవ యొక్క క్రిమినాశక శక్తి చాలా గొప్పది, ఇది భక్తుని ప్రస్తుత జీవితంలో కూడా భౌతిక సంక్రమణను తటస్థీకరిస్తుంది. 

సంపూర్ణ విముక్తి కోసం భక్తుడు తన తదుపరి జన్మ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.


(శ్రీమద్-భాగవతం, స్కందము.2

అధ్యాయం.7, వచనం.3)


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

ప్రకృతి తో సహజీవనం

 *కనుమరుగవుతున్న పెద్ద తరం..💕*


ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది. 


1. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.

2. ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. 

3. బాధ్యతల్ని ఎరిగిన తరం. 'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం. 

4. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. 

5. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. 

6. ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం.

7. కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. 

8. మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం. 

9. TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. 

10. GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం.

11. సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం.

12. ACలు, కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.

13. మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం.

14. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం.

15. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం.

16. ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. 

17. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం.

18. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం.

19. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. 

20. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం. 

21. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం.

22. ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.

23. పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం. 

24. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం.

25. ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యత నిచ్చిన తరం.

26. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.

27. భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం.

28. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. 

29. ఇతరుల మేలు కోరుకున్న తరం. 

30. నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం.

31. రాళ్లు తిన్నా అరిగించు కోగలిగిన తరం. 

32. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం.

33. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం.

34. బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం.

35. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం.

36. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. 

37. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం.

38. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం.

39. త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం.

40. కాఫీ, టిఫిన్ లు లేకుండా చద్దన్నం తిని స్కూల్ కు పరుగెత్తిన తరం.....


అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. 


వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. 


*వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!*


*🌺🌺🌺 చదివితే హృదయం తడిసి ముద్దవుతోంది. 🌺🌺🌺*


ఆ తరం నిజంగా మన సంస్కృతి, మన విలువల ప్రతిరూపం. వాళ్ల లాంటి మనసులు మళ్లీ రావు... వారిని కోల్పోవడం అంటే మన మూలాలను కోల్పోవడమే....


ఆ తరం చూపిన విలువలు, ప్రేమ, నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి...


సాంకేతికతతో ముందుకెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళ్తున్నాం… ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పింది...


లాంతర్ల కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం – కరెంట్ దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటోంది ఈ తరం.


*"వాళ్లు మనకు నేర్పింది ప్రకృతి తో సహజీవనం. మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం."* 


*ఔనా? కాదా?*

*ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న...?*


🌺🌺🌺

నీవిచ్చు శక్తిని నీకె సమర్పించు

  నీవిచ్చు శక్తిని నీకె సమర్పించు

   కథనము తెలిపెను కౌశికుండు

నిన్నుపొందుటదియె నిజమైన ముదమని 

    సీతమ్మ‌ తలచెను చిత్తమందు

నీవిడు భాగ్యము నీకె యుపకరించ

    సుగ్రీవుడందించె సూత్రమిలను

నీపైన భక్తియే నిజమగు శక్తిగా

    సాధించి చూపె కేసరిసుతుడు

 

నన్నునీకర్పించి మసలుటన్నదొకటె

తెలియవలెనను సత్యము తెలిసికొంటి 

పూర్ణ విధుభాస కోదాడు పురనివాస 

పాపనిష్కాస రఘునాథ పరమపురుష

మనలోనే ఉన్నాడు!*

 *మనలోనే ఉన్నాడు!*


పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రాతిచిత్రమైంది. సృష్టికర్త పరమాత్మ. ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినే ఓపికా, తీరికా ఉండవు. నాభిలో కస్తూరిని ఉంచుకుని, దానికోసం గడ్డిలో వెతికే లేడిలా ఎక్కడెక్కడో స్వామికోసం అన్వేషిస్తూంటాం. ఆయన మనలోనే ఉన్నాడు. 'బుద్ధి' అనే శక్తి ద్వారా హెచ్చరిస్తుంటాడు. అంతరాత్మ ప్రభోదం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్ర మత్తులం కాకపోవడం మన అవివేకం, అజ్ఞానం. లోచూపు ఉంటేనే ఆయన కనపడ తాడు. తన ఇష్టులతోనే మాట్లాడతాడు. ఇష్టులంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష వీడి, కర్మచేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు. వారినే భక్త శిఖామణులంటాం!


భగవంతుడి కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రెప్పవాల్చకుండా ఆయనలా చూస్తుంటే మనం దర్శనం కోసం వెళ్లి కళ్లు మూసుకుంటాం. ఇంకా అజ్ఞానపు చీకట్లు, ఇక్కట్ల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు దేవుడు కనిపి స్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా!' అని. శిష్యుడొకసారి అడవిలో వెళ్తుంటే ఓ ఏనుగు ఘీంకరిస్తూ అతనికెదురైంది. బెదిరిపోయి, భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు. గురువు దగ్గరికెళ్లి దేవుడంతటా ఉన్నాడన్నారు, ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారూ'! అని అడిగాడు. గురువు బదులిస్తూ 'నువ్వు మూర్ఖంగా ఎదురెళ్తుంటే అది ఘీంకరించింది. అది నీకు హెచ్చరికే. పైగా ఏనుగుపైన ఉన్న మావటివాడు నిన్ను 'తప్పుకో' అని చెబుతూనే ఉన్నాడు. ఆయనా దేవుడే, కానీ నువ్వే వినిపించుకోలేదు. అదే అజ్ఞానం' అన్నారు.


హరిని అరిగా అహంకారంతో దూషించి, కన్న కొడుకు ప్రహ్లాదుణ్ని చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు- ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకుల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలో ప్రతి అణువు నుంచీ మనకు భగవత్సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్ష్యాదులు. తనలాగా పరోపకారవ్రతం ఆచరించమంటుంది వృక్షం. నిశ్చలంగా ఉండమంటుంది పర్వతం. నిర్మలంగా జీవన ప్రవాహం కొనసాగనీ అంటుంది నది. తన దగ్గరికొచ్చి నామస్మరణంతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది ధ్యానం. 'నేను నీవాణ్నే' అంటాడు సాటి మనిషి. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలిస్తారు. సూచనలిస్తారు. వీళ్లంతా దేవుళ్లు కారా? ప్రత్యక్షమై ఎదుట అలంకారమూర్తిగా నిలుచుంటేనే నమ్మాలా? అందుకు కావాల్సిన యోగ్యత, తపన, భక్తిప్రపత్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి అనే లక్షణాలు మనలో ఉండాలి కదా! అటువంటి పరిణతి సాధించినవారితో పూర్వ యుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకలగుణనిధి సందర్శనమవుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సంస్మరణ చేసే సాధుగుణ సంపన్నులకి సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా సంప్రాప్త మవుతుంది. ఇది సర్వకాలీన సత్యం.

కేళి

 కేళి 


ఎన్ని పాలపుంతల ఆశీర్వాదాలమో? 

ఎన్ని కాంతిపుంజాల సంతకాలమో? 

ఎన్ని విస్ఫులింగ చూర్ణ శకలాలమో? 

ఎన్ని ప్రణవగర్జల పూర్ణ కలశాలమో? 


నీపై, నాపై, ఆరని నక్షత్రధూళి, 

నువ్వూ, నేనూ, ఆగని అంతరిక్షకేళి.. 


ఎన్ని ప్రకృతులను ఏకం చేశామో? 

ఎన్ని ఆకృతులను మాయం చేశామో? 

ఎన్ని లోకాల బిందురూపాలమో? 

ఎన్ని కాలాల ఇంద్రజాలాలమో? 


నీలో, నాలో, అనంత విశ్వకాహళి,  

నువ్వూ, నేనూ, అనాది జీవగేహళి.. 


ఎన్ని వర్ణాలను ప్రతిబింబించామో? , 

ఎన్ని శబ్దాలను ప్రతిధ్వనించామో? 

ఎన్ని యుగాలుగా పరిభ్రమించామో? 

ఎన్ని అనుభవాలను పరిగ్రహించామో? 


నీదీ, నాదీ, నిర్నిద్రహేలా వైకుంఠపాళి,  

నువ్వూ, నేనూ, నిత్యచైతన్య దీపావళి..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్


(రెండు వత్సరాల క్రితం వ్రాసుకొన్నది)

Panchanga పంచాంగం



  

భోజన పధ్ధతి -

 వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి -

   

  ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. ఆయన రాసినటువంటి "అష్టాంగహృదయం" అనే గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది. వారు తెలియచేసిన 

భోజనపద్ధతి గురించి మీకు వివరిస్తాను.

       

మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను . లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము , ఓజస్సు , పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.

             

    మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత,పిత్తాలను ప్రకోపింపచేయును . దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు . పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి, ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.

              

     భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు , శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను .

                  

     భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి , ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు , బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి , ఎవరిని నిందించకుండా , మాట్లాడకుండా తనకు హితమైనది , తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.

          

     ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత , ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను . నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం , ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం , వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు .

       

    పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరు పాటించినచో మంచి ఆరోగ్యవంతులు అవుతారు.

ఆయుర్వేదం నందు ఒక సామెత ఉంది. "ఏకకాల భోజనే మహాయోగి , ద్వికాల భోజనే మహాభోగి , త్రికాల భోజనే మహా రోగి " అని దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. ప్రతిఒక్కరు నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. 

  

     

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

        కాళహస్తి వేంకటేశ్వరరావు  

      

    అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  

                  9885030034

10, జనవరి 2026, శనివారం

*శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..*

 *శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..* 


​ఆంధ్ర భోజ! శ్రీకృష్ణదేవరాయా!

నీ పరిపాలన ఓ చరిత్ర, నీ వంశం రాజసానికి చిహ్నం,

విదేశీయులు సైతం కొనియాడిన అసమాన వంశం.

హంపి నగరపు సౌరభానికి నీవే నిత్య నిదర్శనం.


​కవిత్వ కథన రంగ విన్యాస చరితా!

అష్టదిగ్గజాల సరసన వెలిగే రాజమార్తాండా!

'ఆముక్తమాల్యద'తో విరిసిన సాహిత్య పారిజాతమా!

నీవు తెలుగు తల్లి ముద్దుల రాజకుమారుడవు.


​రణరంగ విన్యాస శత్రు భయంకరా!

గజపతులకు నీవు గజసింహ స్వప్నానివి.

చేతిలో కత్తి పడితే విజయం నీ చెంతనే..

రణరంగంలోనూ కవిత్వాన్ని పండించిన సాహితీ శిఖరమా!


​లాలిత్య సౌందర్య సంపద వృక్షమా!

సంస్కృతాంధ్ర భాషలలో ఆరితేరిన ప్రవీణా!

అష్టాదశ వర్ణనలలో మేటి అనుభవజ్ఞుడా!

కవన రంగంలో నీవు సాహితీ సార్వభౌముడివి.


​'మూరురాయరగండ' బిరుదాంకితుడా!

సకల ఆంధ్ర రాజ్య పరిపాలన విజేతవు నీవు.

నీ చరితం సువర్ణ హిమ శిఖరం..

దేశ చరిత్రలో నీది సుమధుర, సుస్థిర స్థానం.


​మత సామరస్య పర్యవేక్షక సార్వభౌమా!

హిందూ-ముస్లిం ఐక్యతను చాటిన బోధకుడా!

హైందవ ధర్మ రాజ్య పరిరక్షకా..

ఆంధ్ర వైభవ పరంపరలో నీ నామం చిరస్థాయి.


​శిల్ప సౌందర్య కళాపోషకా!

సకల కళా సమ్మేళనానికి నీవే రూపానివి.

విజయ నగర వైభవ సంస్కృతికి నీవే నిదర్శనం.

భావి తరాలకు నీ పరిపాలనే ఆదర్శం.


​గొప్ప ఆలయాలను నిర్మించిన నిర్మాతవు,

శైవ, వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించిన పుణ్యమూర్తివి.

కలియుగ దైవానికి మణి మాణిక్యాలర్పించిన భక్తుడివి,

సిరులను కురిపించే సువర్ణ హస్తం నీది.


​అద్భుత చెరువులెన్నో తవ్వించావు,

రైతుల ఇంట సిరులను సాక్షాత్కరించావు.

భూమిపుత్రుడిని ఆదరించి..

ధాన్యలక్ష్మిని సగర్వంగా నిలిపిన అన్నదాతవు.


​నలుదిక్కులా వ్యాపార వృద్ధిని పెంచావు,

రత్నరాసులు వీధుల్లో రాశులుగా పోయించావు.

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించి,

నేటి ఆర్థిక వ్యవస్థకు నీ పరిపాలనే అసలైన దర్పణం!


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

*నక్షత్ర స్తోత్ర మాలిక - 10 వ రోజు (విశేష స్తోత్రం)*

 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 10 వ రోజు (విశేష స్తోత్రం)* 


*నక్షత్రం*_ *మఖ* (Magha)


*అధిదేవతలు*_ *పితృదేవతలు*


👉 *మఖ నక్షత్ర జాతకులు మరియు పితృ దోష నివారణ కోరుకునే వారు పఠించాల్సిన విశేష స్తోత్రం.* 


*శ్రీ పితృ స్తోత్రం.* 


*అర్చితామమ్యుతానాం చ పితృణాం దీప్తతేజసామ్ ।* 

*నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషామ్ ॥ 1 ॥* 


*ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా ।* 

*సప్తర్షీణాం తథాన్యేషాం తాన్ నమస్యామి పితృన్ ॥ 2 ॥* 


*మనువంశప్రధానానాం మునీనాం చ తథైవ చ ।* 

*నమస్యామి పితృన్ సర్వాన్ లోకేష్వపి చ పూజితాన్ ॥ 3 ॥* 


*నక్షత్రాణాం గ్రహాణాం చ తథా చంద్రార్కయోరపి ।* 

*నమస్యామి సదా తేషాం సర్వజ్ఞానాం మహౌజసామ్ ॥ 4 ॥* 


*అగ్నేర్వాయోస్తథాన్యేషాం లోకానాం చైవ పూజితాన్ ।* 

*నమస్యామి పితృన్ సర్వాన్ కృతప్రణత మానసః ॥ 5 ॥* 


*నమస్యామి పితృన్ భక్త్యా యే లోకేష్వపి పూజితాః ।* 

*యే మే దదతు కామేశాన్ సర్వకామఫలప్రదాన్ ॥ 6 ॥* 


*నమస్యామి పితృన్ భక్త్యా యే భుక్తిముక్తి దాయినః ।* 

*యే మే దదతు కామేశాన్ సర్వకామఫలప్రదాన్ ॥ 7 ॥* 


*యేషాం స్మరణమాత్రేణ సకలార్థ ఫలప్రదమ్ ।* 

*తాన్ నమస్యామి పితృన్ సర్వాన్ ప్రసన్నా భవంతు మే ॥ 8 ॥* 


*విశేషం*


● *ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు దక్షిణాభిముఖంగా (South direction) కూర్చుని పఠించడం మరింత శుభకరం.* 


● *మఖ నక్షత్రం ఉన్న రోజున లేదా ప్రతి అమావాస్య రోజున దీనిని పఠిస్తే పితృదేవతల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.*


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

సంకష్టహర చతుర్థి*

  

          *సంకష్టహర చతుర్థి*

                 ➖➖➖✍️


*గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి* 

```

మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి.


పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. 


ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.```


 *సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:-* ```

సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.


సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. 


ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.```


*సంకట హర చతుర్ధి వ్రత కథ:*``` 

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. 

ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.


అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. 

ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ‘ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది’ అని చెప్పాడు.

అపుడు ఆ రాజు ‘అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది’అని అడిగాడు వినయంగా! 

అపుడు ఇంద్రుడు ‘ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది’ అని చెప్పాడు.


సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! 

కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. 

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. 

సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. 

చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. 

రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.


అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. 

గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. 

ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.


ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖