30, ఆగస్టు 2021, సోమవారం

శ్రీకృష్ణ జననం

 శ్లోకం:☝️ శ్రీకృష్ణ జననం

    *నిశీథే తమ ఉద్భూతే*

        *జాయమానే జనర్దనే |*

    *దేవక్యాం దేవరూపిణ్యాం*

        *విష్ణుః సర్వగుహాశయః |*

    *ఆవిరాసీద్యథా ప్రాచ్యాం*

        *దిశీందురివ పుష్కలః ||*


  *తమద్భుతం బాలకమమ్బుజేక్షణం*

*చతుర్భుజం శంఖగదార్యుదాయుధమ్ |*

  *శ్రీవత్సలక్షం గలశోభి కౌస్తుభం*

*పీతామ్బరం సాంద్రపయోదసౌభగమ్ ||*

  - శ్రీమద్భాగవతం - దశమ స్కంధము


భావం: జననమరణ చక్రమునుండి సకల ప్రాణులను ఉద్ధరించెడి శ్రీహరి అవతరింపనున్న ఆ అర్ధరాత్రివేళ నలుదెసలయందు చీకట్లు అలముకొనియుండెను. అంతట సకల జీవరాసులలో అంతర్యామియై వెలుగొందుచుండెడి శ్రీమహావిష్ణువు దివ్యాంశశోభితయైన దేవకీదేవి గర్భమున, తూర్పుదిశయందు పరిపూర్ణ కళలతో తేజరిల్లిచుండెడి నిండుపున్నమి చంద్రునివలె ఆవిర్భవించెను. అప్పుడు ఆ పరమపురుషుడు అద్భుత బాలకుడై విరాజిల్లుచుండెను. ఆ స్వామి నేత్రములు కమలములవలె శోభిల్లుచుండెను. ఆ ప్రభువు చతుర్భుజములయందును శంఖ చక్రములు, గదా పద్మములను ధరించియుండెను. ఆయన వక్షస్థలమునందలి శ్రీవత్స చిహ్నము పరమరమణీయముగా నుండెను. కంఠమునగల కౌస్తుభమణి మిలమిల మెఱయుచుండెను. దట్టముగానున్న మేఘమువలె ఒప్పుచున్న ఆ శ్యామసుందరుడు ధరించియున్న పీతాంబర కాంతులు మనోజ్ఞముగా ఉండెను.

*అందరికీ శ్రీకృష్ణాష్టమీ శుభాకాంక్షలు* 🙏

కామెంట్‌లు లేవు: