26, సెప్టెంబర్ 2021, ఆదివారం

నేర్చుకుందాం

 *గద్ద నుండి నేర్చుకుందాం*


       *గద్ద జీవితం! గ్రద్ద అనగానే మనకు ఎప్పుడూ కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను భయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు.*


 *ఇంకా గద్ద మనుషుల కళేబరాలని పీక్కు తింటాయని తెలుసు. 


 *కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుంది.*


 *గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని కాళ్ళ గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.*


 *పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి మరణించడం, లేదా బాధాకరమైన సరే తనను తాను మార్చుకోవడం.*


 *ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బతకాలనే అనుకుంటుంది. అలాగే గద్ద కూడా. మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుందో ఒక్కసారి చూద్దాం!*


 *గద్దకు ఈ మార్పు చాలా బాధాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో వున్న ఒక ఎతైన కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడకి వెళ్ళి పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాద కలిగినా నెమ్మదిగా వొలిచేసుకుంటుంది.*


 *ఇలా వదిలించుకున్న ముక్కు కాస్తా మళ్ళీ కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది.* 


*అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది.*


*ఇలా 5నెలలు బాధాకరమైన కృషితో సాధించుకున్న పునరుజ్జీవనం, పునరుత్తేజంతో మరో 30ఏళ్ళు హాయిగా బతుకుతుంది.* 


*ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం. అలాగే కొత్తగా ఆలోచించడం, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవితం నుంచి నేర్చుకుందాం.


*ఇలానే ప్రతీ మానవునికి కూడా జీవించాలనే ఉంటుంది. కాని జీవితాన్నే మార్చే వ్యాయామం మాత్రం 1 గంట చేయలేము. మంచి జీవితం మాత్రం కావాలి.*


*ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయస్సు పెంచుకుంది.* 


*పాత సామెత ఒకటి ఉంది…"కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి, అబ్బాయి మాత్రం బొద్దుగా ఉండాలి అని"*


*అలానే మనం మన శరీరాన్ని అసలు కష్టపెట్టం, ఎండతగలనీయం, వ్యాయామం చేయము కాని ఆరోగ్యం, ఆనందం మనకు కావాలి....!* 

*ఎలా వస్తుంది... ? ఎక్కడ నుంచి వస్తుంది....?*


*ఒక పక్షి సాధన చేత మరో పునర్జీవనం తెచ్చుకున్నట్టుగా ....*


*మనమూ శారీరక వ్యాయామం చేద్జాం...ఆరోగ్యమైన మనుషులుగా మారి ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాసంపద*

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

కామెంట్‌లు లేవు: