26, సెప్టెంబర్ 2021, ఆదివారం

శ్రీమద్భాగవతము

 *26.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2273(౨౨౭౩)*


*10.1-1394-*


*క. జననీజనకుల వృద్ధులఁ*

*దనయుల గురు విప్ర సాధు దారాదులనే*

*జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక*

*వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.* 🌺



*_భావము: భాగ్యవంతుడై యుండి కూడా, ఎవరైతే తల్లిదండ్రులను, వృద్ధులను, సంతానాన్ని, గురువులను, బ్రాహ్మణులను, సాధు పురుషులను, భార్యను ఆదుకుని పోషించక నిరాదరణ చేస్తాడో, అట్టి వాడు ఈ భూమి మీద బ్రతికియున్నా, చచ్చినవానితో సమానము._*🙏



*_Meaning: "If one who is full of resources and capable, neglects one's parents, elders, wife, offspring, Guru, Brahmins and noble persons, even if alive, is equal to a dead person._* 🙏 



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: