🕉 మన గుడి :
⚜ అరుణాచల్ ప్రదేశ్ : జైరో (సుబన్సీరి జిల్లా)
⚜ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం
💠 దేవతలు సైతం పూజించే గొప్ప దైవం ఈశ్వరుడు. ఆయన ఎంత శక్తివంతమైన దేవుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
💠 ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్సిరి జిల్లాలోని జైరో వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బయటపడింది.
2004 సంవత్సరం శ్రావణమాసంలో దట్టమైన అడవి మధ్యలో ఈ శివలింగం బయటపడింది. ఈ శివలింగం గురించి శివపురాణంలోని రుద్రకాండం 17 అధ్యాయంలో ఉంది.
💠 25 అడుగుల ఎత్తు, 22 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ సహజసిద్దమైన రాయి క్రింద నిరంతరం ప్రవహించే జలధార ఉంది.
ఆ లింగం చుట్టూ పరమశివుని పరివారమైన పార్వతీదేవి, గణేశుడు మొదలైనవారి విగ్రహాలు లింగరూపంలోనే ఉన్నాయి.
💠 రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో లభించిన దేవతా విగ్రహాలను ఆయా ప్రదేశాల్లోనే పునర్ ప్రతిష్టించడంగాని, పురావస్తు ప్రదర్శనశాలకు తరలించడంగాని చేస్తున్నారు. వందలాది సంవత్సరాలుగా ఈ ప్రదేశాలలో ప్రచారంలో ఉన్న పురాణగాథలు, విశ్వాసాలకు బలం చేకూర్చేవిధంగానే ఈ విగ్రహాలు లభ్యమవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.
💠 ఈ శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం..దీని పొడవు 25అడుగులు దీని చుట్టుకొలత 22 అడుగులు
శివుడు తల పై భాగంలో రుద్రమల మరియు వాసుకి నాగను ధరించారు.. లింగం పునాది నుండి నిరంతరం నీటి ప్రవాహాన్ని మనం స్ఫష్టంగా చూడవచ్చు..
💠 శివరాత్రి సమయంలో ప్రతి 3(మూడు)సం.. లకు ఒకసారి పాములు ఈ శివలింగాన్ని ఆరాధిస్తాయని నమ్ముతారు...
💠 శివలింగం చుట్టూ రాతితో ఏర్పడిన పాము ఆకృతిని గమనించగలరు.
శివలింగం వెనుక నిలబడి ఉన్న భంగిమలో పార్వతి, వారి కుమారులు గణేష్, ఎడమ వైపున కూర్చున్న భంగిమలో మరియు శివలింగానికి కుడి వైపున కార్తికేయుడి సహజంగా ఏర్పడిన ఆకారాలను గమనించారు.
సహజ శివలింగం దిగువన పవిత్ర నంది ఎద్దు. నంది చాలా భాగం భూగర్భంలో ఉన్నందున పాక్షికంగా కనిపిస్తుంది.
💠 మహాశివరాత్రిని ఇక్కడ గొప్పగా జరుపుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి 3 సంవత్సరాలకు శివరాత్రి సమయంలో పాములచే శివలింగాన్ని పూజిస్తారని స్థానికులు నమ్ముతారు.
💠 శివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మా మరియు విష్ణువుని పూజిస్తారు.
💠 ఉత్తరప్రదేశ్ నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ఆలయ దర్శనం చేసుకుంటారు.
మహాశివరాత్రి సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు శ్రీ సిద్ధేశ్వర్ నాథ్ మందిరాన్ని సందర్శించి సహజ శివలింగాన్ని దర్శిస్తారు .
💠 అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా మంది ట్రావెల్ ఏజెంట్లు మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళరు, కానీ ప్రత్యేకంగా అడిగితే తీసుకువెళతారు. అడగండి.
👉 ఎలా చేరుకోవాలి
💠 ఈ ఆలయం గౌహతి నుండి 435km ఇటానగర్ నుండి 114km .
అస్సాం అరుణాచాలప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నది ఈ ఆలయం..
Ziro టౌన్ కి 5km దూరంలో ఉన్నది.
ఇది సముద్ర మట్టానికి 5754 ఎత్తులో ఉన్నది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి