30, జూన్ 2023, శుక్రవారం

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ: 


*లార్డ్ వేంకటేశ్వర విగ్రహము మీద వుండే సింహం బొమ్మ కు అర్థము ఏమిటి ?*



నిజానికి దీన్ని సింహం బొమ్మ అనరు అండి…..దానిని మకర తోరణం అంటారు… ఇది ఒక్క వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మీదే కాదు…హిందూ దేవి దేవతల విగ్రహాలు అన్నింటి మీద వుంటుంది. ఇది ఇలా పెట్టడం వెనుక వృత్తాంతం స్కాంద పురాణంలో చెప్పబడింది.


కీర్తి ముఖుడు అనే రాక్షసుడు అమరుడిగా పొందిన వర గర్వంతో ముల్లోకాలు జయించి, దేవతలను పీడిస్తూ, కన్ను మిన్ను కానక జగన్మాత ను కూడా పొందడానికి ప్రయత్నించగా మహా దేవుడు ఆగ్రహోదగ్రుడై మహా భీకర ప్రళయాగ్నిను ఆ రక్కసుని పైకి ప్రయోగించగ….వరము పొందినా కూడా భయ కంపితుడై నలు దిక్కులు పరుగెడుతూ చివరికి మళ్ళీ కైలాసం చేరి మహాదేవుని కాళ్ళ మీద పడి ప్రార్థించగా ఆ అగ్నిని తన మూడవ నేత్రంలో బంధించి తనను కాపాడగా…ఆ రాక్షసుడు ఆకలి గొని ఆ విషయం మహాదేవుని చెప్తే తనను తనే తినమని పరమ శివుడు ఆజ్ఞపించగ…ముందుగా ఆ రాక్షసుడు మకర ముఖుడు అయి తోక నుండి తినడం మొదలెట్టి దేహం అంత తిని చివరికి తల దగ్గరకు వచి అది తినడం సాధ్యం కాకపోగా మహాదేవుని అర్ధించాడు….తనకు ఇంకా ఆకలి తీరలేదు ఏం చేసేదని వేడుకొనగా మహాదేవుడు తనను అప్పటినుండి దేవతల విగ్రహాలకు వెనుక తోరణ భాగంగా వుంటూ వారిని దర్శనం చేసుకునే భక్తుల అహంకారం, అరిషడ్వర్గాల ను భుజిస్తూ వుండమని, తద్వారా పుణ్యము పొందగలవు అని చెప్పగా ఆ క్షణమునే మకర ముఖుడుగా వున్న ఆ రాక్షసుడు తోరణం లో కలిసిపోతాడు. ఆ రాక్షసుని తలయే మకరతోరణములోని తల.

కామెంట్‌లు లేవు: