30, జూన్ 2023, శుక్రవారం

ఈ రోజు పదము

 206వ రోజు: (భృగు వారము) 30-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

కొడుకు: అంగజుడు, అంగభవుడు, అబ్బాయి, అర్భకుడు, ఆత్మజుడు, ఆత్మసంభవుడు, ఔరసుడు, కొమరుడు, కుమారుడు, తనయుడు, తనూభవుడు, దేహజుడు, నందనుడు, నందివర్ధనుడు, పుత్రుడు, బాలుడు, బిడ్డడు, సుతుడు, మగబిడ్డ.


 ఈ రోజు పద్యము:


 సిరిగల వాని కెయ్యడల చేసిన మేలది నిష్పలం బగున్/

నెఱి గుఱిగాడు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగున్/

వఱపున వచ్చి మేఘు డొక వర్షము వాడినచేలమీదటన్/

కురిసిన గాక అంబుధుల కర్వగ నేమి ఫలంబు భాస్కరా!


ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం. పేదవానికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది.  వానలు లేనప్పుడు ఎండిపోతున్న చేల మీద మేఘుడు వాన కురిస్తే ఫలితం ఉంటుంది కాని, సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా!

కామెంట్‌లు లేవు: