19, సెప్టెంబర్ 2023, మంగళవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 43*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 43*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఎలాంటి పరిస్థితులు నరేంద్రుని దృఢచిత్తం మీద ఎలాంటి ప్రభావమూ చూపలేవని శ్రీరామకృష్ణులు ఎరుగని విషయం కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, సమస్త విషయాల్లోనూ నరేంద్రునికి ప్రత్యేక స్థానం కల్పించారు ఆయన. కొన్ని సంఘటనలు పరికిద్దాం:


ఆహారం : శ్రీరామకృష్ణులు సామాన్యంగా ప్రతి ఒక్కరి నుండి ఆహారం స్వీకరించరు. ఒక గ్లాసు నీరైనా సరే, దానిని తీసుకువచ్చిన వ్యక్తి మనఃస్థితిని బట్టే ఆయన స్వీకరించేవారు; సరియైన వ్యక్తి కాకపోతే పుచ్చుకోరు. తీసుకువచ్చిన వ్యక్తి మనస్సును క్షణంలో చదవగలిగేవారు. దుశ్శీలుర నుండి ఏదీ ఆయన స్వీకరించరు. అదేవిధంగా శ్రాద్ధ ఆహారం ఆయన ససేమిరా తినరు. ఈ విషయాల్లో తమ శిష్యులకు కూడా ఇదే నియమాలను విధించారు. 


కాని నరేంద్రుడు ఎలాంటి ఆహారాన్నైనా ఎవరి నుండియైనా నిరాక్షేపణీయంగా స్వీకరించవచ్చు. "ఆతడిలో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని ఎలాంటి దోషాన్నైనా దగ్ధం చేస్తుంది" అనేవారు ఆయన. ఒకసారి ఆయన నరేంద్రునితోనే, “నువ్వు ఎలాంటి ఆహారం తిన్నా ఫరవాలేదు. అది నీకు హానికరం కాదు. గోమాంసమో, పంది మాంసమో ఏది తిన్నా సరే, ఆ తరువాత మనస్సును స్థిరంగా భగవంతుని మీద లగ్నం చేయగలిగితే, ఆ ఆహారం హవిషాన్నంతో సమానమైనది. హవిష్యాన్నం భుజించీ ఒక వ్యక్తి మనస్సు కామకాంచనాలలో పొర్లితే అతడు ముమ్మాటికీ అల్పుడే" అని చెప్పారు.🙏


 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: