వారణాసియందలి ఛప్పన్న గణపతులు:
౧. అసీ సంగమమున అర్క వినాయకుడు
౨. క్షేత్రానికి దక్షిణమున దుర్గావినాయకుడు
౩. భీమచండి సమీపమున భీమచండి వినాయకుడు
౪. క్షేత్రమునకు పశ్చిమమున దేహలీ వినాయకుడు
౫. వాయవ్యమున ఉద్దండ వినాయకుడు
౬. ఉత్తరమున పాశ పాణి వినాయకుడు
౭. వరణా సంగమమున ఖర్వ వినాయకుడు
౮. క్షేత్రమునకు తూర్పున సిద్ధి వినాయకుడు
౯. అర్క వినాయకున కుత్తరమున లంబోదర వినాయకుడు
౧౦. దుర్గావినాయకున కుత్తరమున కూటదంత వినాయకుడు
౧౧. భీమచండి వినాయకున కీశాన్యమున శూలటంక వినాయకుడు
౧౨. దేహలీ వినాయకునకు తూర్పున కూష్మాండ వినాయకుడు
౧౩. ఉద్దండ వినాయకునకు ఆగ్నేయమందు ముండవినాయకుడు
౧౪. పాశ పాణికి దక్షిణమున వికట ద్విజ వినాయకుడు
౧౫. ఖర్వునకు నైరుతి యందు రాజపుత్ర వినాయకుడు
౧౬. ఆతనికి దక్షిణమున ప్రణవ వినాయకుడు
౧౭. గంగాతీరమున లంబోదర గణేశునకు ఉత్తరమున వక్రతుండ వినాయకుడు
౧౮. కూటదంత వినాయకునకు ఉత్తరమున ఏకదంత వినాయకుడు
౧౯. శూలకంటునకు ఈశాన్యమునందు త్రిముఖ వినాయకుడు
౨౦.కూష్మాండ గణేశునకు తూర్పునందు పంచముఖ వినాయకుడు
౨౧. ముండవినాయకునకు ఆగ్నేయాన హేరంబగణేశుడు
౨౨. వికటదమ్త వినాయకునకు పడమటి భాగాన విఘ్నరాజగణపతి
౨౩. రాజపుత్ర గణపతికి నిర్రుతి దిశయందు వరదవినాయకుడు.
౨౪. ప్రణవ వినాయకునకు దక్షిణాన మోదకప్రియ వినాయకుడు
౨౫. వక్రతుండ గణపతికి ఉత్తరమున అభయప్రద గణపతి
౨౬. ఏకదంత గణపతికి ఉత్తరమున సింహతుండ గణపతి
౨౭. త్రిముఖ గణపతికి ఈశాన్యమున కూణితాక్ష గణపతి
౨౮. పంచముఖ గణపతికి తూర్పున క్షిప్రప్రసాదన గణపతి
౨౯. హేరంబగణపతికి ఆగ్నేయదిశయందు చింతామణి గణపతి
౩౦. విఘ్నరాజ వినాయకునకు దక్షిణమున దంతహస్త వినాయకుడు
౩౧. వరద వినాయకునకు నైరుతిమూలయందు పిచండిల గణేశుడు
౩౨. పిలపిలా తీర్థమునందు (త్రిలోచన మందిరం) ఉద్దండముండ వినాయకుడు
౩౩. అభయప్రద గణేశునకు స్థూలదంత వినాయకుడు
౩౪. సిద్ధతుండ వినాయకునకు ఉత్తరమున కలిప్రియ వినాయకుడు
౩౫. కూణితాక్ష గణపతికి ఈశాన్యమున చతుర్దంత వినాయకుడు
౩౬. క్షిప్రప్రసాదన గణపతికి తూర్పున ద్విముఖ వినాయకుడు
౩౭. చింతామణి వినాయకునకు ఆగ్నేయమున జ్యేష్ఠా వినాయకుడు
౩౮. దంతహస్త వినాయకునకు దక్షిణమున గజవినాయకుడు
౩౯. పించడిల గణేశునకు దక్షిణమున కాల వినాయకుడు
౪౦. ఉద్దండముండ గణపతికి దక్షిణమున నాగేశ వినాయకుడు
౪౧. తూర్పున మణికర్ణ వినాయకుడు
౪౨. ఆగ్నేయమున ఆశావినాయకుడు
౪౩. దక్షిణమున సృష్టి వినాయకుడు
౪౪. నైరుతియందు యక్ష వినాయకుడు
౪౫. పడమట గజకర్ణ వినాయకుడు
౪౬. వాయవ్యమున చిత్రఘంట వినాయకుడు
౪౭. ఉత్తరమున స్థూలజంఘ వినాయకుడు
౪౮. ఈశాన్యమున మంగళ వినాయకుడు
౪౯. యమతీర్థమునకు ఉత్తరమున మిత్ర వినాయకుడు
మోదాది పంచ వినాయకులు అనగా
౫౦. మోద వినాయకుడు
౫౧. ప్రమోద వినాయకుడు
౫౨. సుముఖ వినాయకుడు
౫౩. దుర్ముఖ వినాయకుడు
౫౪. గణనాథ వినాయకుడు
౫౫. జ్ఞాన వినాయకుడు, ద్వారవినాయకుడు
౫౬. అవిముక్తవినాయకుడు
ఈ యేబది యారు గణపతులను స్మరించు వారు దూరదేశమునందు మృతులైనను జ్ఞానమును పొందుదురు. పఠించు వారు పుణ్యాత్ములై సిద్ధిని పొందుదురు. విఘ్నములు బాధింపవు, పాపములు సమీపింపవు, ఆపదలనుండి బయట పడుదురు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి