🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️
🪷 *శ్రీ మద్భగవద్గీత🪷*
🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 19వ శ్లోకఒ*
*య ఏనం వేత్తి హంతారం య శ్చైనం మన్యతే హతమ్l*
*ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే || 19*
*ప్రతిపదార్థం*
యః = ఎవడైతే; ఏనమ్ = దీనిని (ఈ ఆత్మను ); హంతారమ్ =చంపునట్టి దానినిగా; వేత్తి = భావించునో; చ= అట్లే; యః = ఎవడయితే ; ఏనమ్ = దీనిని (ఈ ఆత్మను )i హత మ్ = చంపబడు దానినిగా; మన్యతే = భావించు నో; తౌ, ఉభౌ = ఆ , ఉభయులును;న, విజానతః = తెలిసికొనిన వారు (జ్ఞానులు ) కారు ( ఏలనన ); అయమ్ = ఇది (ఈ ఆత్మ )వాస్తవముగా;న, హంతి = (ఎవ్వరినీ ) చంపదు;న, హన్యతే =(ఎవ్వరిచేతను ) చంపబడదు;
*తాత్పర్యము*
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది (ఆత్మ) ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎర్వం చేతను చ బాడదు.
*సర్వేజనా సుఖినోభవంతు*
*హరిః ఓం🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి