6, సెప్టెంబర్ 2023, బుధవారం

రామాయణమ్ ..316

 రామాయణమ్ ..316

...

"వీడిని వధించండి " రావణుడి నోటివెంట వచ్చిన కఠినమైన ఆజ్ఞ అది .

.

ఇక్కడ దూతవధ జరగనున్నది ,దానిని ఎటులైనా సరే ఆపవలెను అది అకార్యము ,అధర్మముకూడా! అని అనుకొని విభీషణుడు అన్నతో ఇలా పలికాడు.

.

మహారాజా ! నన్ను క్షమించండి ! కొంచెము రోషము విడిచి పెట్టండి. రాజశ్రేష్ఠులు దూతను వధించరు !

.

ఓ వీరుడా ఈ వానరుని చంపుట రాజధర్మానికి విరుద్ధము .అది లోకమర్యాద కాదు ,పైగా నీవంటి వాడు చేయదగిన పని కానే కాదు.నీకు సకల ధర్మాలు తెలుసు .రాజధర్మములు పాటించుటలో నేర్పగలవాడవు !

.

రాజా ! నీ వంటి పండితులు కూడా రోషమునకు లొంగి పోయినచో శాస్త్రాలలో పాండిత్యము సంపాదించుట ఉత్త శ్రమగానే మిగిలి పోవును కదా !

.

(శాస్త్రాలు చదివినవాడు ఆ శాస్త్రాలుచెప్పిన విధంగా ప్రవర్తించాలి ! లేకపోతే చదివినవాడికి చదవని వాడికి తేడా ఏముంటుంది ?).

.

శత్రు సంహారకుడవు ,శత్రువులలో  నిన్ను తేరిపారచూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ? .....అందువలన ప్రసన్నుడవు కమ్ము ఈ దూతకు శాస్త్రప్రకారము తగిన దండన విధింపుము....అని విభీషణుడు రాజైన రావణుని చూసి హితవు పలికాడు.

.

అది విన్న రావణుడు ,విభీషణా ! వీడు పాపాత్ముడు ,పాపాత్ములను వధించినా పాపము అంటదు కావున వీనికి మరణదండనయే సరి అయిన శిక్ష ...అనుచూ పలికెను.

.

అందుకు విభీషణుడు రాజైన రావణునితో ,నిజమే ఈతడు చేసిన కార్యము దండనార్హమైనదే ఇతడు మితిమీరి ప్రవర్తించినాడు అను మాట అక్షర సత్యము....కానీ ఏ దేశములో నైనా ,ఏ కాలములో నైనా సత్పురుషులు దూతన వధించినట్లుగా మనమెరుగుదుమా ? 

.

దూతకు విధించదగిన అనేక దండనలు శాస్త్రములు చెప్పినవి కదా ! 

.

ధర్మార్ధములను బాగుగా తెలిసికొని మంచిచెడ్డల విషయములో సునిశితప్రజ్ఞ కలిగినవాడు చేయవలసిన పనికాదు, నీ వంటి బుద్ధిమంతుడు ఇంత శీఘ్రముగా కోపమునకు వశుడెట్లు అయినాడు? ఆశ్చర్యము ! .

.

ధర్మమును తెలిసికొన్న వారిలోసురాసురులలో నీ వంటి ఉత్తముడు ఇంకొకడులేడు కదా !

.

ఈ వానరుని చంపుట వలన ఏమి ప్రయోజనము లభించును? ఈతనిని చంపిన ఇతనిని పంపిన వారిని మనపై యుద్ధానికి తీసుకొని రాగలవాడు ఎవ్వడు ?.

.

అప్పుడు రావణుడు తమ్ముని మాటలు బాగుగా ఆలకించి ఇట్లు పలికినాడు.

.NB

.

విభీషణుడు అన్నతోమాటలాడిన విధము గమనించగలరు ... Transaction analysis లో దీనిని salesmen techniques అని అంటారు...tickling the EGO..

.

కొనటానికి వచ్చిన customers ను చూసి ఇది మీకు బాగుంటుంది కానీcost చాలా ఎక్కువ అని పక్కన పెట్టాడు అనుకోండి ...మన మనస్సు దానిమీదనే లగ్నమయి అది కొనేదాకా నిద్రపోము...

.

అలాగే ఇక్కడ రాజశ్రేష్ఠులు దూతను వధించరు అని అనగానే ...ఒక వేళ వధిస్తే !తనుఅందరు సభికుల దృష్టిలో శ్రేష్ఠుడుకాని వాడుగా మిగిలి పోతాడు....కాబట్టి విడిచి పెట్టి తీరాల్సిందే!!!

.

ఇది Today's Salesman technique!!!....Tickling the EGO...


.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: