*శ్రీకృష్ణప్రార్థనా* రచన-కంచినాథం సూరిబాబు.
1.హేకృష్ణ!నారాయణ!దీనబన్ధో!,
గోవిన్ద!దామోదర!లోకబన్ధో!।
హేచక్రపాణే!వసుధాప్రియేశ!,
తుభ్యం నమో దేవ!హి విశ్వమూర్తే!।।
భావం=ఓకృష్ణ!ఓనారాయణ!,ఓదీనబంధూ!,ఓగోవిందుడా!ఓదామోదరుడా!,ఓలోకబంధూ!,ఓచక్రపాణి!ఓభూమిప్రభువా!,ఓవిశ్వమూర్తీ!ఓదేవా!నీకు నమస్కారము.
2.మన్దారగన్ధేన విరాజమానం,
ప్రఫుల్లపద్మాయతలోచనాభమ్।
గోవర్ధనోద్ధారమహానుభావం,
వన్దే ముకున్దం నవనీరదాభమ్।।
భావం=మందారపుష్పగంధముతో విరాజిల్లేటటువంటి,వికసించినపద్మమువంటి నేత్రములు కలిగినటువంటి,గోవర్ధనగిరిని ఉద్ధరించినటువంటి,మహానుభావుడైనటువంటి,కొత్తగావచ్చిన మేఘమువంటి కాంతికలిగినటువంటి,ముకుందుని నమస్కరించుచున్నాను.
3.గోపాలబాలం నవనీతచోరం,
శ్రీవాసుదేవం యదువంశధీరమ్।
గోపీజనానన్దకరం చ కృష్ణం,
వన్దే ముకున్దం నవనీరదాభమ్।।
భావం=గోపాలబాలుని,నవనీతచోరుని,శ్రీవాసుదేవుని,యదువంశధీరుని,గోపీజనానందకరుని,కొత్తమేఘమువంటికాంతికలిగినవానిని,కృష్ణుని,ముకుందుని నమస్కరించుచున్నాను.
4.కృష్ణాయ వాసుదేవాయ,
దామోదరాయ విష్ణవే।
గోపాలకాయ గోపాయ,
గోవిన్దాయ నమో నమః।।
భావం=కృష్ణునికొరకు,వాసుదేవుని కొరకు దామోదరునికొరకు,విష్ణువుకొరకు,గోవులను పాలించువానికొరకు,గోవులను రక్షించువానికొరకు,వేదమంత్రములచే తెలియబడేవానికొరకు నమస్కారము,నమస్కారము.
5.గోధూళియుక్తపద్మాంఘ్రిం,
శైత్యపావనసంయుతమ్।
అవాచ్యానన్దదాతారం,
బాలకృష్ణం నమామ్యహమ్ ।।
భావం=గోధూళితోకూడినపాదపద్మముకలిగినటువంటి,చల్లదనముతోను పవిత్రతతోను కూడియున్నటువంటి,చెప్పలేని ఆనందమును కలుగజేసేటటువంటి,బాలకృష్ణను నమస్కరించుచున్నాను.
*ఇట్లు శ్రీకృష్ణాష్టమిశుభాకాంక్షలతో మీ కంచినాథం సూరిబాబు*🪷💐🌸🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి