సాధకుడు-శరీర సంరక్షణ
సాధకునికి మనస్సు నియంత్రణ ఉండాలి "చిత్తవృత్తి నిరోధమే" యోగం అన్నది నిజమే కానీ ప్రతి సాధకుడు తన మనోవృత్తులను నిరోధించుకోవటానికి ప్రయత్నించే ముందు తన శరీరానికి సంబందించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లా అని దేహ మోహంలో ఉండకూడదు. మరి శరీరంగూర్చి ఎలాంటి శ్రార్ధ తీసుకోవాలి అనేది ముఖ్యమైన విషయం.
ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి వున్నది. శరీరానికన్నా బిన్నంగా ఉంటూనే ఆత్మ శరీరంలో ఉండి ఇంద్రియాలతో జీవన వ్యాపారాలను సాగిస్తుంది. నిజానికి ఇంద్రియ జ్ఞ్యానం పూర్తిగా ఆత్మేకలిగి ఉంటుంది. కేనోపనిషత్ ఈ విషయంలో స్పష్టమైన వివరం ఇచ్చింది.
కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షుః శ్రోత్రం క ఉ దేవో యునక్తి
ఈ మంత్రార్ధము ఏమిటంటే ఎవరిచేత కోరబడి పంపబడినదియై మనస్సు వస్తు ప్రపంచము పైకి నడచుచున్నది. ఎవరి ఆజ్ఞకు లోబడి ముఖ్య ప్రాణము చరించుచున్నది. ఎవరి వలన వాక్కు నడచుచున్నది. ఏ జ్ఞానము ఛక్షుశ్శ్రోత్రములను నడిపించుచున్నది అంటే ఈ జ్ఞ్యానాలు ఎవరి ఆధీనంలో వున్నాయి, ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నది. తదుపరి మంత్రంలో
శ్రోత్రస్య శ్రోతం మనసో మనో య
ద్వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః
చక్షుష శ్చక్షు రతిముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి
ఈ మంత్రంలో ఏదైతే చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా ఉన్నదో అదియే ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా ఉన్నది అని గ్రహించిన ధీర పురుషులు విముక్తినొందినవారై ఈ లోకము నుండి విడిపడి అమృతతత్వమును పొందుచున్నారు.అనగా మనస్సు మనస్సుగా పనిచేస్తున్నది ఎవరి నియంత్రణలో అదే విధంగా వాక్కు, ప్రాణము, నేత్రాలు ఎవరి ఆధీనంలో వున్నదో దానినిని తెలుసుకొనవలెనని పేర్కొనుచున్నది. తదుపరి మంత్రంలో
న తత్ర చక్షుర్గచ్ఛతి
న వాక్ గచ్ఛతి నో మనో
న విద్మః న విజానీమః
యథా ఏతత్ అనుశిష్యాత్
అన్యదేవ తత్ విదితాత్
అథః అవిదితా దధి
ఇతి శుశ్రుమ పూర్వేషాం
ఈ మంత్రంలో ఆత్మస్వరూపాన్ని గూర్చి ఇలా చెప్తున్నారు. దానిని నేత్రములు చూడలేవు. వాక్కు దానినిగూర్చి పలుకలేదు. దానినిగూర్చి ఎలా తెలుపవలెనో మాకు తెలియదు. తెలిసినదాని కంటెను, తెలియనిదాని కంటెను అది అతీతమైనది. దానినిగూర్చి మాకు భోధించిన మా పూర్వీకుల నుండి మేము అలాగే విన్నాము.మహర్షులు అత్యంత జ్ఞ్యానం కలిగినవారు. వారు వారి జ్ఞ్యానంతో మనకు ఆత్మజ్ఞ్యానాని ఆవిష్కరించారు. ఒక సామాన్యు సామాజిక ఉదాహరణతో దీనిని వివరించే ప్రయత్నం చేద్దాం. సెల్పోనులో సింకార్డు ఉండి పోను పనులన్నీ చేయిస్తున్నది. ఒక ఫోను పనిచేస్తున్నది అంటే దానికి సింకార్డే మూలం. దానికి ఒక నెంబరు వుంది ఇతర నెంబరులతో అనుసందానం కలగటానికి ఫోను పరికరం ఉపకరిస్తుంది. కానీ అదే నెంబరుకు మనం ఫోను చేయలేము. అదేవిధంగా ఆత్మ తన శక్తితో ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది తత్ద్వారా ఇతర ప్రపంచం మొత్తం తెలుసుకోగలుగుతున్నది. కానీ అది తనకు తానుగా ఇంద్రియాలద్వారా తెలియబడదు. ఇది అర్ధం చేసుకోవటమే జ్ఞ్యానం కేవలం జ్ఞ్యని తన అనుభూతులతో, అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు. దానికి చేయుయవలసిం కృషే నిత్యయోగ సాధన.
సాధనకు శరీరం ముఖ్యం, కాబట్టి శరీరాన్ని సదా జాగ్రత్తగా చూసుకోవలెను. శరీరాన్ని సదా ఆరోగ్యంగా ఉండేవిధంగా చూసుకోవాలి. శరీరం సదా సాధకుని సాధనకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి.
ఆహారానియమాలు. మనం తీసుకునే ఆహరం మన శరీరం మీద, మనస్సు మీద ప్రభావితం కలిగి ఉంటాయి. కాబట్టి సాధకుడు ఎల్లప్పుడూ సాత్వికమైన మితాహారం మాత్రమే తీసుకోవాలి. భగవతి గీత ఆహార నియమాలు
ఆయుః సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।। 8 ।।
BG 17.8: సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు - ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి. సాధకుడు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని వృద్ధి చేసే ఆహరం మాత్రమే తీసుకోవాలి. ఆ ఆహరం ఎలావుంటుందో కూడా భగవానులు మనకు తెలిపారు. సాధకుడు ఆహరం తీసుకున్న తరువాత వెంటనే దాహం కాకుండా వుండే ఆహరం తీసుకోవాలి. అది ఏ ఆహారంలో భగవానులు మనకు తెలుపలేదు. కానీ సాధకుడి తెలుసుకోవాలి.
శరీరం మీద శ్రర్ధ . సాధకునికి ఎల్లప్పుడూ శరీరం మీద శ్రర్ధ కలిగి ఉండాలి. సమయానికి, కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానాదులు చేయటం. పరిశుబ్రమైన దుస్తులు ధరించటం. కేశ సంరక్షణ అంటే సమయానికి క్షౌరం చేయించుకోవటం. శరీరం, మీద మొహాన్ని పెంచేది శరీర అందం. ఒక మనిషి ఎప్పుడైతే తాను అందంగా వున్నానని భావన కలుగుతుందో అప్పుడు శరీరం మీద మొహం కలుగుతుంది. ఇంకొక విషయం ముఖం అందంగా కనబటాటానికి కేశాలు ఒక కారణం. ఎప్పుడైతే సాధకుడు ముండనం చేయించుకుంటాడో అప్పుడు శరీర మొహం కొంతవరకు తగ్గుతుంది. శరీరాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి.
అంటే బద్ధకం అసలు ఉండకూడదు.ఒకే ఆసనంమీద ఎక్కువ సేపు ఉండగల్గటం ఇత్యాదులు నియంత్రణలో ఉంచుకోవాలి.
పతంగాలి మహర్షి మనకు యోగసూత్రాలను తెలియచేసారు. ఆయనకూడా శరీరం ఎలా స్వాదీనం చేసుకోవాలో కొన్ని నియమాలను చెప్పారు అవి పతంజలి మహర్షి యోగ సూత్రములు వ్రాశాడు. యోగను అష్టాంగ యోగం అన్నాడు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాభ్యాసం చేయించే యోగ గురువులు ఆసనం నుంచి మొదలు పెడ్తారు. మొదటి రెండు సూత్రాలైన యమ నియమాలు కేవలం కొంత సమయం పాటు చేసేందుకు పరిమితమైనవి కావు. ఇవి జీవితకాలం పాటు సాధన చేయాలి.
కాబట్టి ప్రతి సాధకుడు తన శరీరం సాధనకు పనికి వచ్చే విధంగా మలచుకోవాలి. తత్ద్వారా దీర్ఘ ఆయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం పొంది సాధన చేసి బ్రహ్మజ్ఞాని కాగలడు. ఇంకొక పర్యాయం సాధకుడు మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుందాం.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి